యు ముంబా టాప్ | U Mumba Top | Sakshi
Sakshi News home page

యు ముంబా టాప్

Published Thu, Mar 3 2016 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

U Mumba Top

ముంబై:  ప్రొ కబడ్డీ లీగ్‌లో యు ముంబా (60 పాయింట్లు) లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబా 36-20తో దబాంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. ముంబా మొత్తం 14 లీగ్ మ్యాచ్‌లకు గాను 12 గెలవడం విశేషం. మరో మ్యాచ్‌లో పుణేరి పల్టన్ జట్టు 43-19తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. లీగ్ దశలో పట్నా పైరేట్స్ (58) రెండో స్థానంలో, పుణేరి పల్టన్ (48) మూడో స్థానంలో, బెంగాల్ వారియర్స్ (47) నాలుగో స్థానంలో నిలిచాయి. శనివారం ఢిల్లీలో జరిగే సెమీఫైనల్స్‌లో బెంగాల్ వారియర్స్‌తో యు ముంబా; పట్నా పైరేట్స్‌తో పుణేరి పల్టన్ తలపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement