బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో డిఫెండింగ్ చాంపియన్ యు ముంబా స్థాయికి తగ్గ ఆటతీరుతో రాణించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీపై 30-17 స్కోరుతో ఘన విజయం సాధించింది. ముంబై తరఫున రిశాంక్ ఎనిమిది, కెప్టెన్ అనూప్ కుమార్ ఆరు పాయింట్లతో రాణించారు. ఢిల్లీ జట్టులో స్టార్ ఆటగాడు కాశీలింగ్ సహా అందరూ విఫలమయ్యారు. మరో మ్యాచ్‌లో ఆతిథ్య బెంగళూరు బుల్స్ జట్టు 36-26 స్కోరుతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలిచింది.