తెలుగు టైటాన్స్ విజయం | Telugu Titans win | Sakshi
Sakshi News home page

తెలుగు టైటాన్స్ విజయం

Published Thu, Feb 25 2016 12:33 AM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

Telugu Titans win

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు మరోసారి స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆకట్టుకుంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టైటాన్స్ 44-36తో ఆతిథ్య దబాంగ్ ఢిల్లీ జట్టుపై నెగ్గింది. టైటాన్స్ స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి విశేషంగా రాణించి ఏకంగా 17 పాయింట్లతో జట్టు విజయం లో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ బలియాన్ 10 పాయింట్లు తెచ్చాడు. ఢిల్లీ జట్టులో సుర్జీత్ సింగ్ 13, కాశీలింగ్ 10 పాయింట్లు సాధించారు. లీగ్‌లో ఇప్పటివరకూ 11 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ ఆరు విజయాలతో 33 పాయింట్లు సాధించి పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.

 భారత్‌కు మరో విజయం
స్టెలన్‌బోస్క్ (దక్షిణాఫ్రికా): భారత అండర్-21 మహిళల హాకీ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో మరో విజయం సాధించింది. బుధవారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 8-0తో నెగ్గింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లోనూ భారత్ జట్టు గెలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement