జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో కడపలోని ఆ శాఖ పరెడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న క్రీడలు రెండో రోజైన శనివారం కూడా కొనసాగాయి. ఎస్పీ అశోక్‌కుమార్ పర్యవేక్షణలో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, పోలీస్ సిబ్బంది ఆరు జట్లుగా పోటీల్లో పాల్గొన్నారు. అథ్లెటిక్స్ సహా వాలీబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ క్రీడాంశాల్లో పోలీసులు పోటీ పడ్డారు.
ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్‌లోనూ తమ సత్తా చాటారు. మున్సిపల్ స్టేడియంలో బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహించారు. మొత్తమ్మీద ఈ పోటీలు పోలీసుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
- న్యూస్‌లైన్, కడప అర్బన్