పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు..
తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీ సందర్బంగా పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది హైదరాబాద్ ముక్తి దివాస్ నిర్వహిస్తాం. తెలంగాణ చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నిజాం చెరిపేసే ప్రయత్నం చేశారు. ఉద్దేశపూర్వకంగా చరిత్రను తొక్కి పెట్టారు. స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలు, బలిదానాలు దాచడం దుర్మార్గం. ప్రధాని ఆదేశాలతో 2022 నుంచి వేడుకలు చేస్తున్నాం. భవిష్యత్‌లో కూడా ఇదే వేదికగా తెలంగాణ లిబరేషన్ డే నిర్వహిస్తాం.
పనిముట్లనే ఆయుధాలుగా చేసుకొని ప్రజలు నిజాంపై పోరాటం చేశారు. రజాకార్ల ఆగడలతో ఇక్కడి ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవించారు. నిజాం హయాంలో బలవంతపు మత మార్పిడికి పాల్పడ్డారు. హిందూ మహిళలను బలవంతంగా ఎత్తుకెళ్లి అఘాయిత్యాలు చేశారు. పాకిస్తాన్‌లో హైదరాబాద్ సంస్థానాన్ని కలపాలని నిజాం భావించాడు. పాకిస్తాన్‌తో చర్చలు కూడా జరిపారు. సర్దార్ పటేల్ నిజాంతో ముందుగా శాంతి చర్చలు జరిపారు. తమ సంస్థానం జోలికి వస్తే హైదరాబాద్‌లో ఉన్న కోటిన్నర హిందువులను చంపేస్తామని ఖాసిం రజ్వీ బెదిరించారు.
అందుకే ఆపరేషన్ పోలోతో హైదరాబాదు సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. ఈ గడ్డకు స్వాతంత్ర్యం వచ్చిన రోజును జరపకుండా పాలకులు అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక విమోచన వేడుకలపై మాట మార్చారు. విమోచన దినోత్సవం జరపకుండా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేస్తున్నాయి. మేము నిర్వహించే ఈ ఉత్సవాలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. మనకు వాస్తవ చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది.
చరిత్ర గాడి తప్పితే భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడతాయి. పథకం ప్రకారం చరిత్రను పక్కదారి పట్టిస్తున్నారు. ఆగస్ట్ 15 ఎంత ముఖ్యమో.. సెప్టెంబర్ 15 కూడా అంతే ముఖ్యం. చరిత్రను పట్టించుకోని పార్టీలను తరిమికొడదాం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు సహకరించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేశారు.
👉పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన కిషన్ రెడ్డి.
👉తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
👉పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కిషన్ రెడ్డి.
👉నేడు తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా విమోచన దినోత్సవ వేడుకలను స్థానిక బీజేపీ నేతలు నిర్వహించనున్నారు.
👉బీజేపీ ఆఫీసులో జాతీయ జెండాను ఎగురవేసిన కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీ నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజు. వేలాది మంది తెలంగాణ ప్రజలు విరోచిత పోరాటం చేశారు. అనేక బలిదానాలు, అనేక త్యాగాల అనంతరం తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది. నిజాం రాజాకార్ల మెడలు వంచి తెలంగాణ సాధించడంలో పటేల్ పాత్ర సాహసోపేతమైనది.
లిబరేషన్ డే ఉత్సవాలు, విశ్వకర్మ జయంతి ఉత్సవాలు, వినాయక శోభాయాత్ర ఉత్సవాలు, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు.. నేడు నాలుగు ప్రధాన ఘట్టాలు ఒకేసారి రావడం సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. గత మూడేళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తుంది
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ, అడుగులకు మడుగులోత్తుతూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయి. తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలి.
👉ఇక, ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, పారా మిలటరీ, రక్షణ దళాల కవాతు జరుగుతుంది.
𝗛𝗼𝗻𝗼𝗿𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝘂𝗻𝘀𝘂𝗻𝗴 𝗵𝗲𝗿𝗼𝗲𝘀 𝘄𝗵𝗼 𝗳𝗼𝘂𝗴𝗵𝘁 𝗳𝗼𝗿 𝘁𝗵𝗲 𝗹𝗶𝗯𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻 𝗼𝗳 𝗛𝘆𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱!
Join the #HyderabadLiberationDay celebrations tomorrow, 17th September 2024, at Parade Grounds, Secunderabad, from 8:00 AM onwards. pic.twitter.com/9IjbadoyrS— G Kishan Reddy (@kishanreddybjp) September 16, 2024
ఇది కూడా చదవండి: తెలంగాణ తల్లికి నేడు పాలాభిషేకాలు: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment