telangana liberation day Celebrations
-
ఆగస్టు 15 ఎంత ముఖ్యమో సెప్టెంబర్ 17 కూడా అంతే: కిషన్‌రెడ్డి
పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు..తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీ సందర్బంగా పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది హైదరాబాద్ ముక్తి దివాస్ నిర్వహిస్తాం. తెలంగాణ చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నిజాం చెరిపేసే ప్రయత్నం చేశారు. ఉద్దేశపూర్వకంగా చరిత్రను తొక్కి పెట్టారు. స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలు, బలిదానాలు దాచడం దుర్మార్గం. ప్రధాని ఆదేశాలతో 2022 నుంచి వేడుకలు చేస్తున్నాం. భవిష్యత్‌లో కూడా ఇదే వేదికగా తెలంగాణ లిబరేషన్ డే నిర్వహిస్తాం.పనిముట్లనే ఆయుధాలుగా చేసుకొని ప్రజలు నిజాంపై పోరాటం చేశారు. రజాకార్ల ఆగడలతో ఇక్కడి ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవించారు. నిజాం హయాంలో బలవంతపు మత మార్పిడికి పాల్పడ్డారు. హిందూ మహిళలను బలవంతంగా ఎత్తుకెళ్లి అఘాయిత్యాలు చేశారు. పాకిస్తాన్లో హైదరాబాద్ సంస్థానాన్ని కలపాలని నిజాం భావించాడు. పాకిస్తాన్‌తో చర్చలు కూడా జరిపారు. సర్దార్ పటేల్ నిజాంతో ముందుగా శాంతి చర్చలు జరిపారు. తమ సంస్థానం జోలికి వస్తే హైదరాబాద్‌లో ఉన్న కోటిన్నర హిందువులను చంపేస్తామని ఖాసిం రజ్వీ బెదిరించారు. అందుకే ఆపరేషన్ పోలోతో హైదరాబాదు సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. ఈ గడ్డకు స్వాతంత్ర్యం వచ్చిన రోజును జరపకుండా పాలకులు అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక విమోచన వేడుకలపై మాట మార్చారు. విమోచన దినోత్సవం జరపకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తున్నాయి. మేము నిర్వహించే ఈ ఉత్సవాలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. మనకు వాస్తవ చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది. చరిత్ర గాడి తప్పితే భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడతాయి. పథకం ప్రకారం చరిత్రను పక్కదారి పట్టిస్తున్నారు. ఆగస్ట్ 15 ఎంత ముఖ్యమో.. సెప్టెంబర్ 15 కూడా అంతే ముఖ్యం. చరిత్రను పట్టించుకోని పార్టీలను తరిమికొడదాం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు సహకరించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేశారు. 👉పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన కిషన్ రెడ్డి.👉తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి👉పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కిషన్ రెడ్డి. 👉నేడు తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా విమోచన దినోత్సవ వేడుకలను స్థానిక బీజేపీ నేతలు నిర్వహించనున్నారు.👉బీజేపీ ఆఫీసులో జాతీయ జెండాను ఎగురవేసిన కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీ నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజు. వేలాది మంది తెలంగాణ ప్రజలు విరోచిత పోరాటం చేశారు. అనేక బలిదానాలు, అనేక త్యాగాల అనంతరం తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది. నిజాం రాజాకార్ల మెడలు వంచి తెలంగాణ సాధించడంలో పటేల్ పాత్ర సాహసోపేతమైనది.లిబరేషన్ డే ఉత్సవాలు, విశ్వకర్మ జయంతి ఉత్సవాలు, వినాయక శోభాయాత్ర ఉత్సవాలు, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు.. నేడు నాలుగు ప్రధాన ఘట్టాలు ఒకేసారి రావడం సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. గత మూడేళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తుందికాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ, అడుగులకు మడుగులోత్తుతూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయి. తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలి.👉ఇక, ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, పారా మిలటరీ, రక్షణ దళాల కవాతు జరుగుతుంది. 𝗛𝗼𝗻𝗼𝗿𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝘂𝗻𝘀𝘂𝗻𝗴 𝗵𝗲𝗿𝗼𝗲𝘀 𝘄𝗵𝗼 𝗳𝗼𝘂𝗴𝗵𝘁 𝗳𝗼𝗿 𝘁𝗵𝗲 𝗹𝗶𝗯𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻 𝗼𝗳 𝗛𝘆𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱!Join the #HyderabadLiberationDay celebrations tomorrow, 17th September 2024, at Parade Grounds, Secunderabad, from 8:00 AM onwards. pic.twitter.com/9IjbadoyrS— G Kishan Reddy (@kishanreddybjp) September 16, 2024ఇది కూడా చదవండి: తెలంగాణ తల్లికి నేడు పాలాభిషేకాలు: కేటీఆర్ -
జాతీయ జెండా ఆవిష్కరించిన కేసీఆర్
-
పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన అమిత్ షా
-
బీజేపీ ఆఫీస్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
-
తెలంగాణ విమోచన అమృతోత్సవాలు ఘనంగా నిర్వహించనున్న బిజెపి
-
అమిత్ షాతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ భేటీ
Updates.. ► తెలంగాణలో పార్టీ కార్యవర్గంపై అమిత్ షా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీలో కోఆర్డినేషన్‌పై పలు అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో అమిత్ షా చర్చించినట్లు సమాచారం. అందరినీ కలుపుకుని పోవాలని నాయకులకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు. ► కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు బండి సంజయ్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొన్ని రోజుల క్రితం వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు తెలంగాణ నియోజకవర్గాల్లో పర్యటించి సమర్పించిన నివేదికలపై ప్రస్తుతం జరిగిన భేటీలో చర్చించారు. తెలంగాణ నియోజకవర్గాల్లో పార్టీ బలబలాలపై వివిధ రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు గతంలో సంచరించి ఓ నివేదికను రాష్ట్ర అధిష్ఠానానికి సమర్పించిన విషయం తెలిసిందే. ► అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు వందనాలు. ఉస్మానియాలో వందేమాతం పేరుతో ఆందోళనలు జరిగాయి. పటేల్ లేకుంటే తెలంగాణకు విమోచనం కలిగేది కాదు. తెలంగాణ ప్రజలపై జనరల్ డయ్యర్ బుల్లెట్ల వర్షం కురిపించారు. రజాకార్ల అరాచకాలకు పరకాల సజీవసాక్ష్యంగా నిలుస్తుంది. పరకాలలో అనేక మంది అమరులయ్యారు. తెలంగాణ చరిత్రను 75ఏళ్ల పాటు వక్రీకరించారు. ► చంద్రయాన్-3 విజయంతో భారత్‌కు అంతర్జాతీయ కీర్తి. డిజిటల్ రంగంలో భారత్ దూసుకుపోతోంది. స్వాతంత్ర్య పోరాటాన్ని కూడా కాంగ్రెస్ వక్రీకరించింది. మోదీ ప్రధాని అయ్యాక ఆ పొరపాటును సవరించాం. ఈరోజు మోదీ పుట్టినరోజు సేవాదివస్గా జరుపుకుంటున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేదు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసమే విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు. విమోచనంపై రాజకీయం చేసేవారిని ప్రజలు క్షమించరు. సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవం జరిపించడానికి కారణాలున్నాయి. భవిష్యత్ తరాలకు నాటి పోరాటయోధులను గుర్తుచేయడం, పోరాట యోధులను సన్మానించడమే అని అన్నారు. ► పారామిలటరీ బలగాల గౌరవవందనం స్వీకరించిన అమిత్ షా. ► సర్ధార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించిన అమిత్ షా. ► జాతీయ జెండా ఎగురవేసిన అమిత్ షా. ► వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన అమిత్ షా. ► తెలంగాణ సాయుధ పోరాట వీరులకు అమిత్ షా నివాళులు అర్పించారు. అనంతరం, గౌరవ వందనం స్వీకరించారు. ► కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. ► పరేడ్ గ్రౌండ్ చుట్టూ సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి. ► తెలంగాణ బీజేపీ ఆఫీసులో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి.. ఆదివారం ఉదయం పార్టీ ఆఫీసులో జాతీయ జెండాను ఎగురవేశారు. ► ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు రాష్ట్ర విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ.. ప్రతీ ఏడాది పార్టీ ఆఫీసుల్లో వేడుకలను నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నిజాం సైన్యం అనేక మందిని ఊచకోత కోసింది. తెలంగాణకు 13 నెలలు స్వాతంత్ర్యం ఆలస్యంగా వచ్చింది. ఎంతో మంది బలిదానంతో తెలంగాణకు స్వేచ్చ లభించింది. ► తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ► ఆదివారం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో పోలీసు విభాగం గతానికి భిన్నంగా పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ► ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అటు పరేడ్ గ్రౌండ్, ఇటు పబ్లిక్ గార్డెన్స్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న చర్యలను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్, నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌ను శనివారం నాటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ► ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నాయి. మొత్తమ్మీద దాదాపు 2500 మంది సిబ్బందిని రెండు చోట్ల మోహరిస్తున్నారు. -
‘విమోచన’ నిర్వహణకు భయమెందుకు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విమోచన పేరిట ఉత్సవాలు నిర్వహించేందుకు భయమెందుకని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి విమోచన దినోత్సవ నిర్వహణకు సిగ్గు, మొహమాటం ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల్లో, ఉద్యమంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక రజాకార్ల భయంతో వెనక్కు తగ్గారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించి 75 ఏళ్లు కావొస్తున్నా ఓటుబ్యాంక్ రాజకీయాలతో రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అధికారికంగా నిర్వహించే సాహసం చేయలేదని దుయ్యబట్టారు. కేంద్రం ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభకు ముఖ్యఅతిథిగా హాజరై అమిత్‌షా ప్రసంగించారు. ‘ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్ణయించగానే అందరూ దీనిని నిర్వహించేందుకు సిద్ధపడినా విమోచన పేరుతో జరిపేందుకు భయపడుతున్నారు. రజాకార్లు ఇంకా దేశానికి సంబంధించిన నిర్ణయాలేవీ తీసుకోలేరు. అందువల్ల వారంతా తమ మనస్సు ల్లోని భయాన్ని తొలగించాలి. ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాల నేది ఇక్కడి ప్రజల చిరకాల ఆకాంక్ష. దీన్ని సాకారం చేసే లక్ష్యంతోనే కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎవరు నిర్వహించినా నిర్వహించకపోయినా కేంద్రం అధికారికంగా ప్రతి ఏటా ఘనంగా ఈ దినోత్సవాలను నిర్వహిస్తుంది’ అని అమిత్‌షా చెప్పారు. శనివారం పరేడ్ గ్రౌండ్లో కేంద్ర సాయుధ బలగాలనుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా. నవతరానికి స్ఫూర్తినిచ్చేందుకే... హైదరాబాద్ విమోచన కోసం త్యాగం చేసిన యోధులు, అమరు లను ప్రజల్లో పునరుజ్జీవులుగా ఉంచడంతోపాటు నవ, యువ తరానికి స్ఫూర్తి కలిగించడానికే ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నా మని అమిత్‌షా చెప్పారు. ఎందరో వీరులు నిజాం అరాచకా లను, అత్యాచారాలను సహించిన విషయాన్ని నేటి తరం మరిచి పోవద్దన్నారు. పాత హైదరాబాద్ స్టేట్ (3 రాష్ట్రాల పరిధిలో) లోని విశ్వవిద్యాలయాల్లో ఈ అంశంపై లోతైన పరిశోధనలు, అధ్యయనాలు జరగాలన్నారు. ఆ వీరుల గాథను దేశం నలు మూలలా చేరవేసి నివాళులు అర్పించాలని చెప్పారు. తెలంగాణ విమోచనం చెందిన 74 ఏళ్ల తర్వాత అధికారికంగా ఈసారి కార్య క్రమాలు నిర్వహించడంపై అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. పటేల్‌దే నిర్ణయాత్మక పాత్ర.. తెలంగాణకు స్వాతంత్య్రం తీసుకురావడంలో సర్దార్ వల్ల భాయ్ పటేల్ పోషించిన పాత్రను అమిత్ షా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘హైదరాబాద్ స్టేట్‌లో నిజాం నవాబును, రజాకార్లను ఓడించకపోతే అఖండ భారత్ స్వప్నం నిజం కాదని పటేల్ గ్రహించారు. దేశం మధ్యలోని కొంత భాగంలో అకృత్యాలు, అత్యాచారాలు, హింస కొనసాగుతుంటే మహాత్మాగాంధీ స్వతంత్ర భారత స్వప్నం పూర్తి కాదనే పటేల్ పోలీస్ యాక్షన్ ద్వారా విజయం సాధించారు. పటేల్ లేకపోతే ఈ ప్రాంతం మరిన్ని రోజులు చీకట్లోనే ఉండేది’ అని చెప్పారు. ఈ సందర్భంగా కొమురం భీం, రాంజీ గొండు, స్వామి రామానంద తీర్థ, విద్యాధర్ గురూజీ, పండిత్ కేశవరావ్ కోరట్ కర్, ఎం.చెన్నారెడ్డి, పీవీ నరసింహారావు, వందేమాతరం రామచంద్రరావు, నారాయణ్ రావ్ పవార్ మొదలైన వారిని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలోని హైదరాబాద్ స్టేట్‌లో నిజాం, రజాకార్ల నికృష్టచర్యలను ఉద్యమకారులు గట్టిగా ఎదుర్కొన్నారని చెప్పారు. గుండ్రాంపల్లిలో తన పర్యటన సందర్భంగా స్థానికులు అక్కడ నిజాం సమయంలో జరిగిన ఆకత్యాల గురించి చెప్పడం, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆ ఘటనను దక్షిణ భారత జలియన్ వాలాబాగ్‌గా అభివర్ణించిన విషయాన్నీ అమిత్ షా గుర్తుచేశారు. ఈ కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా జరుపుకునే వాతావరణాన్ని కల్పించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని అభినందించారు. కంటోన్మెంట్లో జరిగిన కార్యక్రమంలో మానసిక దివ్యాంగురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న అమిత్ షా. ఘనంగా విమోచన దినోత్సవం కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, కర్ణాటక మంత్రి శ్రీరాములు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉద్విగ్న వాతావరణంలో సాగింది. అమిత్‌షా తొలుత జాతీయ పతాకాన్ని ఎగరవేసి, కేంద్ర సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. పరేడ్‌గ్రౌండ్స్‌లో 1948 సెప్టెంబర్ 17 తరువాత 75 ఏళ్లకు అదే రోజు తిరిగి జాతీయ జెండా ఎగిరిందంటూ అమిత్‌షాను అభినవ వల్లభాయి పటేల్‌గా కీర్తించారు. కాగా, అమిత్ షా బేగంపేటలోని హరితప్లాజాకు వచ్చే ముందు అక్కడి ప్రవేశద్వారంలో ఓ కారు అకస్మాత్తుగా ఆగడంతో కలకలం రేగింది. సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన గోసుల శ్రీనివాస్ యాదవ్ ఆ ప్లాజాలోని రెస్టారెంట్‌కు వచ్చే క్రమంలో ఆయన కారు నిలిచిపోయింది. అమిత్‌షా కోసం రూట్ క్లియరెన్స్ చేస్తున్న పోలీసులు కారును ముందుకు నెట్టే ప్రయత్నంలో కారు అద్దాలు పగిలాయి. కారు ఆగడం వెనుక ఎలాంటి దురేద్దేశాలు లేవని తేలడంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అమిత్ షాకు పటేల్ ప్రతిమను బహూకరిస్తున్న బండి ఇదీ చదవండి: ‘10 శాతం కోటా’.. వారంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు -
అబుదాబిలో తెలంగాణ దినోత్సవ వేడుకలు
సాక్షి, రాయికల్: అబుదాబిలోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలను ఎగురవేశారు. తెలంగాణ విమోచన ప్రాముఖ్యత గురించి పలువురు వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు రాజ శ్రీనివాస్‌రావు, వంశీక్రిష్ణ, గంగారెడ్డి, గోపాల్, సన్ని, సంతోష్, బాబు, జగదీశ్, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్, రంజిత్, చరణ్ పాల్గొన్నారు. -
ఏడాది పాటు విమోచన దినోత్సవాలు
రసూల్‌పుర : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూరైన సందర్భంగా ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అందులోభాగంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలను సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. శుక్రవారం పరేడ్ మైదానంలో విమోచన దినోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కిషన్‌రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...విమోచన దినోత్సవాలు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, హోంశాఖ ఆధ్వర్యంలో నేడు జరగనున్న కార్యక్రమానికి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మహరాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే హాజరవుతారని చెప్పారు. సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్‌ఏఎఫ్‌లతో పాటు మొత్తం 12 సైనికదళాలు (రెండు మహిళా బృందాలతో సహా) ఈ ఉత్సవాల్లో పాల్గొంటాయని చెప్పారు. శనివారం ప్రధాని మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో అమిత్‌షా పాల్గొని దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు, టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్, చక్రాల కుర్చీలు, కృత్రిమ తయారీ పరికరాలు పంపిణీ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, డా, ప్రకాశ్‌రెడ్డి, రాకేశ్, శ్రీవర్ధన్, రాముయాదవ్, చింతల రాం చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ‘విమోచనం’తో బలపడేందుకు బీజేపీ వ్యూహాలు -
తెలంగాణ విమోచన దినోత్సవాలు.. సీఎం కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం
సాక్షి,హైదరాబాద్: సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్‌ను గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా రావాలని ఆహ్వానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈ కార్యక్రమానికి వస్తున్నారని కిషన్ రెడ్డి వివరించారు. ఏడాది పాటు రాష్ట్రమంతా తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలని, ఇందులో కేంద్ర ప్రభుత్వం సైతం భాగస్వామ్యం అవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తోతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే , కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి సైతం ఆహ్వానం పంపుతున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ విమోచనం తర్వాత కొన్ని జిల్లాలు కర్ణాటక, మహారాష్ట్రలో కలిశాయని, అందుకే మూడు రాష్ట్రాలకు దీనితో సంబంధం ఉందని వివరించారు. సెప్టెంబర్ 17.. నిజాం నవాబు నుంచి తెలంగాణ స్వాతంత్య్రం పొందిన రోజు. ఇప్పుడదే రోజున రాష్ట్రంలో హైవోల్టేజీ రాజకీయానికి రంగం సిద్ధమవుతోంది. టీఆర్ఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ఈ నెల 17న ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి పోటీ పడుతున్నాయి. ఆ రోజు నాటికి తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమై 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ ఏట అడుగిడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆ రోజు నుంచి ఏడాది పాటు తెలంగాణ విలీన వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చదవండి: స్టేట్.. సెంటర్.. సెప్టెంబర్ 17.. తెలంగాణలో హైవోల్టేజీ పాలిటిక్స్ -
అధికారికంగా ‘విమోచన’!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని తాము 22 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ వచ్చాక అధికారికంగా నిర్వహిస్తామన్న కేసీఆర్ కూడా విస్మరించారన్నారు. కేసీఆర్ సర్కార్.. మజ్లిస్‌పై ప్రేమతో తెలంగాణ అమరవీరుల త్యాగాలను విస్మరిస్తోందన్నారు. ఈనెల 17న అధికారికంగా కార్యక్రమం నిర్వహించాలని లేకుంటే.. బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామన్నారు. ఈనెల 7 నుంచి 17 వరకు పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఆదుకోవాలన్న సోయిలేదా?.. ఉపాధ్యాయుల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతుందని సంజయ్ పేర్కొ న్నారు. వారిని ఆదుకోవాలన్న సోయి ప్రభు త్వానికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. -
అధికారికంగా విమోచన దినోత్సవం జరపాలి
సాక్షి, పటాన్చెరు: అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని బీజేపీ కొన్నేళ్లుగా పోరాటం చేస్తోందని వక్తలు గుర్తు చేశారు. మంగళవారం పటాన్చెరు శివారులోని ఎస్వీఆర్ గార్డెన్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ సభను బీజేపీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల కోరిక మేరకు తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మజ్లిస్ కారణంగా కేసీఆర్ తెలంగాణ విమోచనోత్సవాలను అధికారికంగా చేపట్టడం లేదన్నారు. సభకు అధ్యక్షత వహించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు మాట్లాడుతూ పటాన్చెరులో తెలంగాణ విమోచన ఉత్సవాల సభ నిర్వహణకు ప్రత్యేక కారణం ఉందన్నారు. తెలంగాణ విమోచనానికి సర్ధార్ వల్లభాబాయ్ పటేల్ సేనలు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో పటాన్చెరు చేరుకోగానే నిజాం రాజు తన సంస్థానాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ లొంగిపోయారని నాటి ఘటనలను వివరించారు. ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతి ఇస్తామంటోందని, కానీ తాము కోరుకుంటున్నది అది కాదన్నారు. అధికారికంగా అన్ని కార్యాలయాల్లో తెలంగాణా విమోచన దినోత్సవాలు నిర్వహించాలన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరవీరుల గౌరవం కోసం, తెలంగాణ ప్రజల కోరికను గుర్తిస్తూ విమోచన దినోత్సవాలను నిర్వహించేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష పార్టీగా కూడా అర్హత లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పాలన సాగిస్తోందని ఆయన విమర్శించారు. అవినీతికి మారు పేరుగా టీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోయిందన్నారు. బీజేపీయే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు గుర్తించారని, అందుకే అనేక మంది బీజేపీలో చేరుతున్నారని ఆయన గుర్తు చేవారు. టీఆర్ఎస్లో లుకలుకలు ప్రారంభమయ్యాయని మరళీధర్‌రావు అన్నారు. గ్రౌండ్ లెవల్లో ఆ పార్టీ షేక్ అవుతోందిని, ఎన్ని మంత్రివర్గ విస్తరణలు చేపట్టినా ఆ పార్టీని కాపాడలేరని ఆయన విశ్లేషించారు. అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ నాయకుడు గడీల శ్రీకాంత్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తోనే పటాన్చెరులో తమ పార్టీ రాష్ట్ర కమిటీ సభను ఏర్పాటు చేసిందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పటాన్చెరులో బీజేపీకి టిక్కెట్ వచ్చి ఉంటే ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందే వాడినని ఆయన వివరించారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రానుందన్నారు. ‘తమ ఇంట్లోని కుక్కపిల్లను కాపాడుకోలే ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక రాష్ట్రాన్ని ఏం పాలిస్తుంది’అని శ్రీకాంత్‌గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణకు నిజాం నుంచి విముక్తి వచ్చినట్లే కేసీఆర్ పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి లభించనుందన్నారు. బీజేపీ నాయకుడు గరికపాటి రామ్మోహాన్‌రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినంపై అధికారంలోకి రాగానే ఆ మాటను విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా విమోచన కమిటీ అధ్యక్షుడు శ్రీవర్ధన్‌రెడ్డి సభకు అధ్యక్షత వహించారు. ఇందులో ఎంపీ సోయం బాబూరావు, మాజీ ఎమ్మెల్సీలు మోహన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి (మెదక్), విజయపాల్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, నాయకుడు వివేక్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, అనంత్‌రావు కులకర్ణి, ఆదెల్లి రవీందర్, అంకగల్ల సహాదేవ్ పాల్గొన్నారు. -
‘17 సెప్టెంబర్ ప్రాధాన్యత తెలియని వారు ఉండరు’
సాక్షి, జగిత్యాల : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి ప్రసంగిస్తూ.. ఈ రోజు(సెప్టెంబర్ 17) ప్రాధాన్యత గురించి తెలియని వారంటూ ఉండరు అని అన్నారు. ఆగష్టు 15, 1947 తర్వాత హైదరాబాద్ రాజరిక పాలనలో ఉండేదని గుర్తుచేశారు. అలాగే నాడు భారతదేశాన్ని అస్థిరత చేసే విధంగా బ్రిటీషు వాళ్లు కుట్రలు ఉండేవని అన్నారు. హైదరాబాద్‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడానిక చేసిన సాయుధ పోరాటాలు, ఏ కులానికో, మతానికో వ్యతిరేకం కాదని, కావాలనే కొన్ని రాజకీయ శక్తులు దీన్ని కులాల ప్రాతిపదికన విభజన చేసే కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. ఆనాడు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సర్ధార్ వల్లాభాయ్ పటేల్ సైనిక చర్య ద్వారా హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో కలిపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమం చివర్లో అమరులకు ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు. -
ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద పూజలు
సాక్షి, పెద్దపల్లి : తెలంగాణ విమోచన దినోత్సవం(సెప్టెంబర్ 17) సందర్భంగా మంథని ఆర్డీవో కార్యాలయంలో బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగరవేశారు. అలాగే ఆర్టీసీ మాజీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ కూడా తెలంగాణ విమోచన దినోత్పవం సందర్భంగా గోదావరిఖనిలో జాతియ జెండాను ఎగురవేశారు. కాగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ప్రధాని నరేంద్రమెదీ జన్మదినం పురస్కరించుకొని స్థానిక వేణుగోపాలస్వామి గుడిలో బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
‘టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల సమితి’
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుందామన్న ఆపద్దర్మ సీఎం కేసీఆర్ ఎందుకు మాట తప్పారంటూ బీజేపీ మాజీ రాష్ట్ర ఆధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ కుటుంబంపై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజల ఆకాంక్షలను మట్టిలో కలిపిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయిందన్నారు. మజ్లీస్‌ల మద్దతు కోసం తెలంగాణ యోధుల బలిదానాలను మరిచిన కేసీఆర్ ప్రజలను ఓట్లు ఎలా అడుతారంటూ ప్రశ్నించారు. గత కాంగ్రెస్ సీఎంలకు.. నేటి కేసీఆర్‌కు పెద్ద తేడా ఏమీ లేదని విమర్శించారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. తెలంగాణ అమరవీరులకు ద్రోహం చేయకండి ‘సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం జరపడం లేదు కాబట్టి.. రజాకార్లపై పోరాటం చేసిన యోధులకు ఇచ్చే పెన్షన్స్ రద్దు చేస్తారా? రజాకార్లకు సర్టిఫికెట్ ఇస్తారా? అసెంబ్లీ ఎదురుగా సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహం తీసేసి కాసిం రజ్వీ విగ్రహం పెడతారా?. నిజాం మీద పోరాటం చేసిన పవార్, గంగారాం, ఐలమ్మ, కొమురం భీంలను రాజద్రోహులుగా, దేశ ద్రోహులుగా ముద్ర వేస్తారా? రాజకీయ లాభాల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్ బాటలో మజ్లీస్‌తో స్నేహం చేస్తూ తెలంగాణ అమరవీరులకు ద్రోహం చేయకండి. దివాలకోరుతనంతో వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ను ప్రశ్నించి ఓడించాల్సిందిగా ప్రజలను కోరుతున్నా. కేసీఆర్ కుటుంబం రజాకర్లతో కుమ్మక్కై మతోన్మాదాన్ని, గుండాయిజాన్ని పెంచుతోంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల సమితి. మీ నాన్న సీఎం కాకపోతే నువ్వు ఎక్కడుండేవాడివి బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రజల సమస్యలను, కేంద్రం ఇచ్చిన సహకారం మాత్రమే చెప్పారు. షా అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేని కేసీఆర్ రాజకీయ అపరిపక్వతను, రాజకీయ దిగజారుడు తనానకి నిదర్శనం. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న కేసీఆర్ కుమారుడు ప్రధాని నరేంద్ర మోదీని, అమిత్ షాను విమర్శించే అర్హత లేదు. కేటీఆర్ సీఎం కొడుకు కాబట్టే మంత్రి అయ్యి పెత్తనం చేస్తున్నాడు.. లేకపోతే అమెరికాలో ఉద్యోగం చేసేవారు’అంటూ కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
‘వాళ్లు ముస్లింను మోసం చేస్తున్నారు’
సాక్షి, హైదరబాద్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావులు కలిసి ముస్లిం ప్రజలను మోసం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సోమవారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్లో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ స్టేట్ నిజాం పాలనలోనే కొనసాగిందని తెలిపారు. జవహర్ లాల్ నెహ్రు ,సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్ల నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని అన్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాల్సిన ప్రభుత్వం మోసపూరితంగా నిర్వహించటం లేదని విమర్శించారు. అమరవీరుల ఆత్మగోసించే విధంగా కేసీఆర్ పాలన ఉందని అన్నారు. ఇచ్చిన మాటలు తప్పినందుకు కేసీఆర్‌ను గద్దె దించేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకు మధ్య జరగబోతున్నాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయని, వాటిని సవరణ చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడుదామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 10 రోజుల్లో ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఏక కాలంలో 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని ఆయన అన్నారు. -
‘విమోచనాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి’
బీజేపీ నేత సునీతారెడ్డి డిమాండ్ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు కార్యక్రమాలు హన్మకొండ : నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిన సందర్భాన్ని రాష్ట్రప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపీ మహిళ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొంతం సునీతారెడ్డి డిమాండ్ చేశారు. హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మహిళా మోర్చా జిల్లా కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో సునీతారెడ్డి ముఖ్య అతిథిగా మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 7 నుంచి 14వ తేదీ వరకు మహిళా అధ్యాపకులు, ఉపాధ్యాయులతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటుచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇంకా ఆగస్టు 16 నుంచి 21 వరకు మహిళా కాలేజీల్లో వ్యాసరచన పోటీలు, సంతకాల సేకరణ నిర్వహించాలని,22 నుంచీ 28వ తేదీ వరకు జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటుచేయాలన్నారు. అంతేకాకుండా రక్షా బంధన్‌లో భాగంగా అధికారులకు వినతి పత్రాలు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, మహిళా మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూచన రవళి, జిల్లా అధ్యక్షురాలు ఏదునూరి భవాని, నాయకులు పి.రాజేశ్వరి, రాణి, పారం అనిత, గుజ్జుల సరోజన, వనపాక రాధ, కందుగుల స్వరూప, సోమయ్య, ధశరథం, కుమార్ పాల్గొన్నారు. -
'రజాకార్లు కావాలో... తెలంగాణ ప్రజలు కావాలో... తేల్చుకో'
హైదరాబాద్: రజాకార్లు కావాలో, తెలంగాణ ప్రజలు కావాలో తేల్చుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఘనం జరిగాయి. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ సీఎంగా కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై కిషన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రా దినోత్సవాలను అధికారికంగా జరుపుతున్నా... ఇక్కడ ఎందుకు జరపడం లేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఎందుకు ఈరోజుని అధికారికంగా జరపడం లేదో తెలపాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎవరు వద్దన్నా... కాదన్నా... గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17వ తేదీ ... తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాపు ఘాట్ వద్ద... అనంతరం బాపు ఘాట్ వద్దకు కిషన్‌రెడ్డితో పాటు ఇతర నేతలు చేరుకున్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... సెప్టెంబర్ 17వ తేదీని విమోచన దినంగా అధికారిక ప్రకటన చేసేంతవరకూ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని కిషన్‌రెడ్డి స్ఫష్టం చేశారు. వారంతా మరికాసేపట్లో బాపు ఘాట్ నుంచి గోల్కొండ కోటకు ర్యాలీగా బీజేపీ నేతలు వెళ్లనున్నారు.