తెలంగాణ చరిత్రను మరుగుపరిచారు | Kishan Reddy to unfurl national flag at Culture Ministry Hyderabad Liberation Day event at Parade Grounds | Sakshi
Sakshi News home page

తెలంగాణ చరిత్రను మరుగుపరిచారు

Published Wed, Sep 18 2024 3:40 AM | Last Updated on Wed, Sep 18 2024 3:40 AM

Kishan Reddy to unfurl national flag at Culture Ministry Hyderabad Liberation Day event at Parade Grounds

హైదరాబాద్‌ సంస్థానానికి స్వాతంత్య్రం వచి్చన రోజును చెప్పుకోలేని దుస్థితి 

మూడేళ్లుగా కేంద్రమే తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతోంది 

అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం విమోచనదినం నిర్వహించాలి 

పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన విమోచన దిన వేడుకల్లో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్వాతంత్య్ర దినాన్ని మరుగునపరిచి.. ఈనాటి తరానికి తెలియకుండా పాలకులు తొక్కిపెట్టారని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చన 13 నెలల తర్వాత తెలంగాణలో మువ్వన్నెల జెండా ఎగిరిందన్న విషయం తెలియకుండా చేశారంటూ ధ్వజమెత్తారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసిన 1948 సెపె్టంబర్‌ 17ను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకున్నా, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వమే అధికారిక వేడుకలు జరుపుతుందని చెప్పారు.

నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటం దేశంలోనేకాక ప్రపంచ పోరాటాల్లోనే మహోన్నతమని, అపురూప ఘట్టమన్నారు. భారత సైన్యం ముందు 17 సెపె్టంబర్‌ 1948లో నిజాం రాజు, సైన్యం, రజాకార్లు లొంగిపోయారన్నారు. ఇంతటి గొప్ప పోరాటచరిత్ర నేటి తరానికి తెలియకుండా తొక్కిపెట్టారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం సెపె్టంబర్‌ 17న ‘విమోచన’దినోత్సవం అధికారికంగా నిర్వహించలేదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం మజ్లిస్‌కు సలాం కొడుతూ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారని చెప్పారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో ‘విమోచన దినోత్సవం’అధికారికంగా నిర్వహించాలని ఆనాటి పాలకులను నిలదీసిన కేసీఆర్‌ సీఎం అయ్యాక స్వరం మార్చారన్నారు. విమోచన దినంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు వక్రభాష్యాలు చెప్పి మోసం చేశాయని తెలిపారు.17 సెపె్టంబర్‌ను బీఆర్‌ఎస్‌ ‘జాతీయ సమైక్య దినం’అనడం, కాంగ్రెస్‌ ‘ప్రజాపాలన దినోత్సవం’అనడం ముమ్మాటికీ ఇక్కడి చరిత్రను తొక్కిపెట్టడమేనని చెప్పారు.  

రజాకార్ల వారసుల కోసమే: బండి సంజయ్‌ 
పిడికెడు రజాకార్ల వారసుల కోసమే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. దేశ విచి్ఛన్నకర శక్తులతో అధికార పారీ్టలు అంటకాగే పరిస్థితి తెలంగాణలో ఉండడం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రజాకార్లపై పోరాడిన చరిత్ర ఉందని, అదే రజాకార్ల వారసులను సంతృప్తిపరిచే చర్యలను ప్రభుత్వాలు విడనాడాలని కోరారు.

వచ్చే ఏడాది నుంచైనా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా సీఆర్‌పీఎఫ్‌ వంటి కేంద్ర భద్రతా బలగాలు నిర్వహించిన పరేడ్‌ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే ప్రదర్శనలు సాగాయి. ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించారు. రజాకార్‌ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డిని కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్‌ కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, సాంస్కృతిక శాఖ జాయింట్‌ సెక్రటరీ ఉమా నండూరి, సీఐఎస్‌ఎఫ్‌ డీజీ ఆర్‌ఎస్‌. భాటియా  పాల్గొన్నారు.  

బీజేపీ కార్యాలయంలో.... 
బీజేపీ కార్యాలయంలో హైదరాబాద్‌ విమోచన దిన వేడుకల్లో భాగంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేసి, అమరవీరులకు నివాళు లర్పించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ...‘ప్రస్తుత సెప్టెంబర్‌ 17 చాలా ప్రత్యేకమైనది. విశ్వకర్మ జయంతి, వినాయక నిమజ్జన మహోత్సవం, ప్రధాని మోదీ జన్మదినం. అందుకే ఇది చాలా పవిత్రమైన రోజు’అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శానంపూడి సైదిరెడ్డి, బంగారు శ్రుతి, మనోహర్‌రెడ్డి,  మురళీధర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement