సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న కేంద్ర సాంస్కృతికశాఖ
ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహిస్తోంది. ఉదయం 7.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కళాకారుల ప్రదర్శనలు నిర్వహిస్తారు. ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ద్వారా ‘సెప్టెంబర్ 17–హైదరాబాద్ విమోచన దినం’ప్రాధాన్యత వివరించేలా సంక్షిప్త ప్రదర్శన ఉంటుంది. ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు పోలీసు బలగాలు, సైనికదళాల పరేడ్ ఉంటుంది. 9 గంటలకు కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, గజేంద్రసింగ్ చౌహాన్, బండి సంజయ్ పరేడ్ గ్రౌండ్స్‌లోని యుద్ధస్మారకం వద్ద నివాళులరి్పస్తారు. ఉదయం 9.15 గంటలకు జి.కిషన్‌రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేస్తారు.
కేంద్ర మంత్రులు సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తారు. 9.20 గంటలకు కేంద్ర సాయుధ బలగాల నుంచి కిషన్‌రెడ్డి గౌరవవందనం స్వీకరిస్తారు. అనంతరం 700 మందికిపైగా కళాకారులు మంగళవాద్యం, బతుకమ్మ, కొమ్ముకోయ, బోనాలు–పోతరాజు, డప్పులు, కోలాటం, లంబాడీ, గుస్సాడి, ఒగ్గు కథ తదితరాలను ప్రదర్శిస్తారు. చివరగా ‘హైద రాబాద్ విమోచన దినం శకటం ప్రదర్శన ఉంటుంది. 10.10 గంటలకు కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి ఉమా నండూరి స్వాగతోపన్యాసం చేస్తారు. తర్వాత బండి సంజయ్ ప్రసంగిస్తారు. రాష్ట్రం నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన ఆరుగురిని సన్మానిస్తారు. 10.30 గంటలకు కిషన్‌రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం కేంద్ర సమాచార శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జి బిషన్‌ను కేంద్రమంత్రులు తిలకిస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment