కాంగ్రెస్‌ హామీలన్నీ అబద్ధాలే: ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ హామీలన్నీ అబద్ధాలే: ప్రధాని మోదీ

Published Fri, May 10 2024 4:25 PM

Pm Modi Comments At Narayanapet Election Meeting

సాక్షి,నారాయణపేట: మోదీ గ్యారెంటీ అంటే అభివృద్ధికి గ్యారెంటీ అని కాంగ్రెస్‌ అన్నీ అబద్ధపు హామీలిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం(మే10) నారాయణపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలివి. రాబోయే ఐదేళ్లలో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి మోదీ గ్యారెంటీ. పదేళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. 

తెలంగాణకు లక్షల కోట్లు పంపించాం. ఆ డబ్బును బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ లూఠీ చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ ఎన్నో అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. తెలంగాణప్రజలు డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ గురించి ఆలోచించాలని నేను చెప్పాను. అందులో ఎవరి పేరు చెప్పలేదు. కానీ ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌పై మాట్లాడాడు. 

అంటే డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో మీరు అర్థం చేసుకోండి. కాంగ్రెస్‌ దేశానికి ఇప్పటివరకు చేసిందొక్కటే నమ్మకద్రోహం.  కాంగ్రెస్‌ నేతలు ఎన్నికలు వచ్చాక దేశాన్ని విభజించేలా మాట్లాడుతున్నారు. యువరాజు గురువు దక్షిణాది వారిని ఆఫ్రికన్లలా ఉన్నారంటాడు. యువరాజు ఎన్నికల ముందు ప్రేమ దుకాణం తెరుస్తాడు. 

కాంగ్రెస్‌ హిందువులను సొంత దేశంలోనే హిందువులను రెండవ తరగతి పౌరులను చేస్తోంది. నేను గుడికి వెళ్లడాన్ని కూడా తప్పు పడుతున్నారు. రామనవమికి మీరు గుడికి వెళ్లరా.  పసిపిల్లలు నాపై చూపే ప్రేము కూడా కాంగ్రెస్‌ నేతలకు ఇబ్బంది కలిగిస్తోంది.

 కాంగ్రెస్‌కు దేశంలోని హిందువుల పట్ల ప్రేమ లేదు. కాంగ్రెస్‌ది హిందువుల పట్ల వ్యతిరేక భావన. 2014లో కేసీఆర్‌ను మీరు ఎన్నుకుంటే ఆయన మిమ్మల్ని మరిచిపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే చేస్తోంది’అని మోదీ విమర్శించారు. 

Advertisement
 
Advertisement