1450 కిలోల క్లోరల్ హైడ్రేట్ స్వాధీనం | 1450 kgs of Chloral hydrate seized | Sakshi
Sakshi News home page

1450 కిలోల క్లోరల్ హైడ్రేట్ స్వాధీనం

Published Thu, Oct 15 2015 4:15 PM | Last Updated on Sun, Sep 3 2017 11:01 AM

1450 kgs of Chloral hydrate seized

నారాయణపేట్ (మహబూబ్‌నగర్) : మత్తు కలిగించేందుకు కల్లులో కలిపే రసాయనం క్లోరల్ హైడ్రేట్ పెద్ద మొత్తంలో పట్టుబడింది. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ సమీపంలోని సింగారం చౌరస్తాలోని ఓ ఇంట్లో బస్తాల్లో దాచి ఉంచిన 1450 కిలోల క్లోరల్ హైడ్రేట్‌ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కూరగాయల శశికాంత్ అనే వ్యక్తికి చెందిన ఆ ఇంట్లో ఓ బడా కాంట్రాక్టర్ దానిని దాచి ఉంచాడని సమాచారం. ఇంటి యజమానిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement