నాటి, నేటి తరాలకు సరికొత్త డిజైన్లు
ఫ్యాషన్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి.. దేశవ్యాప్తంగా విక్రయాలు
పట్టు, కాటన్ చీరలకు నారాయణపేట ప్రసిద్ధి. మారుతున్న డిజైన్లు, ఫ్యాషన్‌కు అనుగుణంగా చీరలను నేయడం పేట కార్మికుల ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా పేట పట్టుచీరలు గుర్తింపు పొందాయి. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సైతం ‘పేట’చీరను ధరించారంటే ఇక్కడి పట్టు ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతానికి వచ్చే అధికారులు, ప్రజాప్రతినిధులు, వీఐపీలు పేట పట్టు, కాటన్ చీరలు తీసుకెళ్లడంపరిపాటిగా మారింది.
– నారాయణపేట
124 ఏళ్ల చరిత్ర..
నారాయణపేట చీరలకు పట్టణ ప్రాంతాల్లో ఎంతో ఆదరణ ఉంది. 124 ఏళ్లకు పైగా ఈ చీరలకు చరిత్ర ఉంది. 1900 నుంచే నారాయణపేటలో చేనేత కార్మికులు మగ్గాలపై కళ్లు చెదిరే పట్టు చీరలు నేసి, తమ నైపుణ్యాన్ని చాటుతూ వస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితం పెటెంట్ హక్కును కూడా సాధించుకున్నారు. పూణె, ముంబయి, సాంగ్లీ, షోలాపూర్, గుల్బార్గా, యాద్గీర్, నాగ్‌పూర్, ఏపీ, తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ చీరలకు ఆర్డర్లు చేసేవారు ఉన్నారు.
కర్ణాటక ప్రాంత వాసులు సైతం ఇక్కడకు వచ్చి చీరలు కొనుగోలు వస్తారు. నారాయణపేట పట్టుచీరకు రుద్రాక్ష, కోటకొమ్మతో బార్డర్ ఉంటుంది. అదే ఐకాన్‌తో పేట పట్టుచీరలను గుర్తించాలని వ్యాపారస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం పట్టు చీరల్లో నారాయణపేట పట్టు, నివాళి ధనçవతి, ప్లెన్, నివాళి ధనవతికడ్డి, నివాళి శంభుప్లేన్, నివాళి శివశంభుకడ్డి, నిపాణి ప్లేన్‌బార్డర్, టెంపల్ డిజైన్ వంటివి ముఖ్యమైనవి. నేటి యువత అభిరుచులకు తగ్గట్టు చీరలను ఆర్డర్‌పై నేస్తుంటారు.
మాది ఆరవ జనరేషన్
మా ముత్తాతల నుంచి పట్టు, కాటన్ చీరలను నేసి విక్రయిస్తున్నాం. మా తాతలు తుకారాం, మోనప్ప, నాగూరావుల వారసత్వంగా మాది ఆరవ జనరేషన్. ఇక్కడ తయారు చేసిన పట్టు, కాటన్ చీరలను దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో వ్యాపారుల ద్వారా విక్రయిస్తాం.
– విజయ్‌కుమార్ బసూదే, చేనేత వస్త్రాల వ్యాపారి
Comments
Please login to add a commentAdd a comment