chloral hydrate
-
రెండు కేజీల ‘సీహెచ్’ పట్టివేత
- ఇద్దరి అరెస్టు, రిమాండు షాబాద్ : అక్రమంగా తరలిస్తున్న రెండు కిలోల క్లోరల్ హైడ్రేట్(సీహెచ్)ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని ఇద్దరిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. చేవెళ్ల ఎక్సైజ్ సీఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మాచన్‌పల్లికి చెందిన కలాల్ ఆంజనేయులుగౌడ్, మహేందర్‌గౌడ్‌లు మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నాగరగూడ నుంచి బైకుపై చేవెళ్ల వైపు వెళ్తున్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న ఎక్సైజ్ పోలీసులు వారిని పట్టుకున్నారు. తనిఖీ చేసి రెండు కిలోల క్లోరల్ హైడ్రేట్ స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ వివరించారు. తనిఖీల్లో ఎస్ఐ అరుణ్‌కుమార్, సిబ్బంది సత్తార్, వెంకటేష్, అమీన్, యూసుఫ్, కవిత ఉన్నారు. -
1450 కిలోల క్లోరల్ హైడ్రేట్ స్వాధీనం
నారాయణపేట్ (మహబూబ్‌నగర్) : మత్తు కలిగించేందుకు కల్లులో కలిపే రసాయనం క్లోరల్ హైడ్రేట్ పెద్ద మొత్తంలో పట్టుబడింది. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ సమీపంలోని సింగారం చౌరస్తాలోని ఓ ఇంట్లో బస్తాల్లో దాచి ఉంచిన 1450 కిలోల క్లోరల్ హైడ్రేట్‌ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కూరగాయల శశికాంత్ అనే వ్యక్తికి చెందిన ఆ ఇంట్లో ఓ బడా కాంట్రాక్టర్ దానిని దాచి ఉంచాడని సమాచారం. ఇంటి యజమానిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
బీబీపేటలో ఎక్సైజ్ దాడులు
నారాయణఖేడ్ రూరల్, న్యూస్‌లైన్ : ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి అక్రమంగా క్లోరల్ హైడ్రేట్‌ను తరలిస్తున్న వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శశిధర్‌రెడ్డి వివరాలను మంగళ వారం విలేకరులకు వెల్లడించారు. కల్హేర్ మండలం బీబీ పేటకు చెందిన సార ఎల్లాగౌడ్ అదే గ్రామంలో 8 కిలోల క్లోరల్ హైడ్రేట్‌తో సంచరిస్తుండగా నమ్మదగిన సమాచారంతో దాడులు చేశామన్నారు. క్లోరల్ హైడ్రేట్‌ను స్వాధీనం చేసుకొని ఎల్లాగౌడ్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడు ఎల్లాగౌడ్ నిజామాబాద్ జిల్లా బోధన్‌లో క్లోరల్ హైడ్రేట్‌ను కొనుగోలు చేసి కల్హేర్ మండలంలోని కల్లు దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. దుకాణాల్లోని కల్లులో మత్తు రావడానికి వాడే క్లోరల్ హైడ్రేట్‌ను వాడరాదని హెచ్చరించారు. కల్తీ కల్లును విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడిలో ఎన్ఫోర్స్మెంట్ సీఐ రజాక్, ఎస్ఐ ఎల్లాగౌడ్, సిబ్బంది అశ్వాక్, రియాజ్‌లు పాల్గొన్నారు.