నారాయణఖేడ్ రూరల్, న్యూస్‌లైన్ : ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి అక్రమంగా క్లోరల్ హైడ్రేట్‌ను తరలిస్తున్న వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శశిధర్‌రెడ్డి వివరాలను మంగళ వారం విలేకరులకు వెల్లడించారు. కల్హేర్ మండలం బీబీ పేటకు చెందిన సార ఎల్లాగౌడ్ అదే గ్రామంలో 8 కిలోల క్లోరల్ హైడ్రేట్‌తో సంచరిస్తుండగా నమ్మదగిన సమాచారంతో దాడులు చేశామన్నారు.
క్లోరల్ హైడ్రేట్‌ను స్వాధీనం చేసుకొని ఎల్లాగౌడ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడు ఎల్లాగౌడ్ నిజామాబాద్ జిల్లా బోధన్‌లో క్లోరల్ హైడ్రేట్‌ను కొనుగోలు చేసి కల్హేర్ మండలంలోని కల్లు దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. దుకాణాల్లోని కల్లులో మత్తు రావడానికి వాడే క్లోరల్ హైడ్రేట్‌ను వాడరాదని హెచ్చరించారు. కల్తీ కల్లును విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రజాక్, ఎస్‌ఐ ఎల్లాగౌడ్, సిబ్బంది అశ్వాక్, రియాజ్‌లు పాల్గొన్నారు.
బీబీపేటలో ఎక్సైజ్ దాడులు
Published Wed, Jan 22 2014 1:01 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM
Advertisement
Advertisement