రాజ్‌ పాకాల ఇంట్లో పార్టీపై పోలీసుల దాడి | Cyberabad police raid KTR brother in laws farmhouse: Telangana | Sakshi
Sakshi News home page

రాజ్‌ పాకాల ఇంట్లో పార్టీపై పోలీసుల దాడి

Published Mon, Oct 28 2024 5:21 AM | Last Updated on Mon, Oct 28 2024 5:27 AM

Cyberabad police raid KTR brother in laws farmhouse: Telangana

కేటీఆర్‌ బావమరిదికి చెందిన ఇంట్లో అనుమతి లేకుండా లిక్కర్‌ పార్టీ

శనివారం రాత్రి దాడి చేసిన ఎస్‌ఓటీ, ఎక్సైజ్‌ పోలీసులు

డ్యూటీ ఫ్రీ విదేశీ మద్యంతోపాటు స్థానిక లిక్కర్‌ స్వాధీనం

శంకర్‌పల్లి: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్‌ అలియాస్‌ రాజ్‌ పాకాలకు చెందిన ఇంట్లో నిర్వహించిన పార్టీ పై ఎక్సైజ్, ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. అను మతి లేకుండా లిక్కర్‌ పార్టీ నిర్వహించారని, డ్యూ టీ ఫ్రీ విదేశీ మద్యం వినియోగించారని గుర్తించా రు. పార్టీలో పాల్గొన్నవారిలో ఒకరు కొకైన్‌ వినియో గించి ఉన్నట్టుగా తేల్చారు. ఈ మేరకు రాజ్‌ పాకాల, మద్దూరి విజయ్‌పై మోకిలాా పోలీసులు, రాజ్‌ పాకాలపై శంషాబాద్‌ ఎక్సైజ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. 

మోకిలా ఠాణాలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. ‘‘రాజ్‌ పా కాల నానక్‌రామ్‌గూడలో ఈటీజీ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వహిస్తున్నారు. అందులో సీఈఓగా పనిచేస్తున్న జూబ్లీహిల్స్‌ వాసి మద్దూరి విజయ్‌కు ఫ్యూజన్‌ యాక్స్‌ పేరుతో మరో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉంది. రాజ్‌ పాకాల హైదరాబాద్‌ శివార్లలోని జన్వాడలో ఉన్న షీర్‌మాథే ప్రాపర్టీస్‌లో కొన్నాళ్ల క్రితం ఓ ఇంటిని నిర్మించారు. అందులో తరచుగా వీకెండ్‌ పార్టీలు ఇస్తూ.. స్నేహితులు, తమ సంస్థల్లోని ఉద్యోగులతో కలిసి పేకాట ఆడుతున్నారు. ఐదేళ్లుగా తనతో సన్నిహితంగా ఉన్న విజయ్‌ను శనివారం రాత్రి తన ఇంట్లో నిర్వహిస్తున్న దీపావళి పార్టీకి రావాలంటూ రాజ్‌ పాకాల ఆహ్వానించారు. ఈ పార్టీలో వీరిద్దరితో సహా 38 మంది పాల్గొన్నారు.’’ అని పోలీసులు పేర్కొన్నారు. 

విశ్వసనీయ సమాచారంతో దాడి.. 
‘‘రాజ్‌ పాకాల ఇంట్లో పార్టీపై మోకిలా పోలీసులకు శనివారం రాత్రి సమాచారం అందింది. ఠాణాలోని జనరల్‌ డైరీలో ఎంట్రీ నమోదు చేసిన అధికారులు.. నార్సింగి ఏసీపీ నుంచి సెర్చ్‌ ప్రొసీడింగ్స్‌ తీసుకున్నారు. ఆపై ఎస్‌వోటీ (స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌), ఎక్సైజ్‌ పోలీసులతో కలసి శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో రాజ్‌ పాకాల ఇంటిపై దాడి చేశారు. ఎలాంటి ఈవెంట్‌ పరి్మషన్‌ లేకుండా పార్టీలో స్థానిక లిక్కర్‌ను, డ్యూటీ ఫ్రీ విదేశీ మద్యాన్ని వినియోగిస్తున్నట్టు గుర్తించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి హాజరైన పురుషులకు డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా మద్దూరి విజయ్‌ కొకైన్‌ తీసుకున్నట్టు తేలింది.

మహిళా పోలీసుల సాయంతో ఆ ఇంట్లో ఉన్న మహిళలకు డ్రగ్స్‌ పరీక్షలు చేయడానికి పోలీసులు ప్రయతి్నంచగా.. వారి నుంచి విముఖత ఎదురైంది. ఇక ఆ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు విదేశీ మద్యం, పేకాటకు సంబంధించిన వస్తువులు, పేక ముక్కలను స్వా«దీనం చేసుకున్నారు. 16 మంది మహిళలు సహా 38 మందిని అదుపులోకి తీసుకున్నారు.’’ అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. పేకాట నిర్వహణ, ఒకరు డ్రగ్స్‌ తీసుకున్నట్టు తేలడంపై మోకిలా పోలీసులు కేసు నమోదు చేసి, అందులో రాజ్‌ పాకాల, విజయ్‌లను నిందితులుగా చేర్చారు. ఇక అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహణ, విదేశీ మద్యం వినియోగంపై శంషాబాద్‌ ఎక్సైజ్‌ పోలీసులు రాజ్‌ పాకాలపై కేసు నమోదు చేశారు. 

రాజ్‌ పాకాల, ఆయన సోదరుడి నివాసాల్లో సోదాలు
గచ్చిబౌలి, బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌):  జన్వాడలోని రాజ్‌ పాకాల ఇంట్లో పారీ్టపై శనివారం రాత్రి దాడి చేసిన పోలీసులు.. ఆదివారం రాయదుర్గంలోని ఓరియన్‌ విల్లాస్‌లో ఉన్న రాజ్‌ పాకాల, ఆయన సోదరుడు శైలేంద్ర నివాసాల్లో సోదాలు చేపట్టారు. ఎక్సైజ్‌ జాయింట్‌ కమిషనర్‌ ఖురేషీ, తమ సిబ్బందితో, భారీ పోలీసు బందోబస్తుతో ఈ తనిఖీలు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు శైలేంద్ర నివాసంలో సోదాలు చేశారు. షో కేస్‌లు తాళాలు వేసి ఉండటం, తాళంచెవులు లేకపోవడంతో వాటిని పగలగొట్టి తనిఖీ చేశారు. రాత్రి 7 గంటల నుంచి రాజ్‌ పాకాల విల్లాలో సోదాలు చేశారు. రాత్రి 9 గంటల నుంచి రాజ్‌ పాకాల బంధువులకు మరో విల్లాలో తనిఖీలు చేపట్టారు. 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతల నిరసన 
సోదాల విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులు ఒరియన్‌ విల్లాస్‌ వద్దకు చేరుకున్నారు. అధికారులను అడ్డుకునేందుకు ప్రయతి్నంచారు. ఫామ్‌హౌస్‌లో పార్టీ చేసుకుంటే ఇళ్లలో సోదాలు చేయడం ఏమిటని నిలదీశారు. అయితే అక్కడే ఉన్న రాయదుర్గం పోలీ సులు కల్పించుకుని సోదాలకు సహకరించాలని కోరారు. ఈ సమయంలో పోలీసులు, బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య తోపులాట జరిగింది. దీనితో పోలీసులు ఎమ్మెల్యేలు వివేకానంద, మాగంటి గోపీనాథ్, డాక్టర్‌ సంజయ్‌కుమార్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, నేతలు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, మన్నె క్రిశాంక్, జయసింహ తదితరులను అదుపులోకి తీసుకుని, పోలీస్‌స్టేషన్లకు తరలించారు. 

కేటీఆర్‌ నివాసం వద్ద హడావుడి 
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇంట్లోనూ సోదాలు జరపబోతున్నారన్న ప్రచారం జరగడంతో ఆదివారం.. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు బంజారాహిల్స్‌ లోని కేటీఆర్‌ నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ భారీగా మోహరించిన పోలీసులు.. వారి ని కేటీఆర్‌ ఇంట్లోకి అనుమతించలేదు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు. 

ముమ్మరంగా దర్యాప్తు.. 
రాజ్‌ పాకాల ఇంట్లో జరిగిన పార్టీ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. డ్రగ్స్‌ టెస్టులో పాజిటివ్‌గా తేలిన మద్దూరి విజయ్‌ను విచారిస్తున్నారు. ఆ డ్రగ్‌ను తనకు రాజ్‌ పాకాల ఇచ్చారని విజయ్‌ చెప్పారని.. ఈ క్రమంలో రాజ్‌ పాకాలకు కొకైన్‌ ఎలా వచి్చంది? ఎవరు విక్రయించారు? ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనే వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. విజయ్‌ను పార్టీ జరిగిన ప్రాంతంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రాజ్‌ పాకాలను ఆదివారం ఉదయం 10 గంటలకు శంషాబాద్‌ ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌.. మధ్యాహ్నం 2 గంటలకు మోకిలాా పోలీస్‌స్టేషన్‌కు విచారణ కోసం రావాలని ఆదేశించారు. కానీ రాజ్‌ పాకాల ఈ విచారణలకు హాజరుకాలేదు. ఆయన మొబైల్‌ స్విచాఫ్‌ వస్తోందని, గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement