Shashidhar Reddy
-
కోదాడ టికెట్ శశిధర్‌రెడ్డికి ఇవ్వాలి
అనంతగిరి: కోదాడ బీఆర్ఎస్ టికెట్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డికి ఇవ్వాలని, లేకపోతే తాము సహకరించమని బీఆర్ఎస్ అసమ్మతివర్గం స్పష్టం చేసింది. ఆదివారం సూర్యాపేటజిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ శివారులోని వ్యవసాయక్షేత్రంలో శశిధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన అసమ్మతి నేతల ఆత్మీయ సమ్మేళనంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావుతోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో కోదాడ నుంచి తమ సహకారంతోనే మల్లయ్యయాదవ్ ఎమ్మెల్యేగా గెలిచారని, ఈసారి తమ సహకారం లేకుండా గెలుపు అసాధ్యమన్నారు. ఒకవేళ శశిధర్‌రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే, పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సమ్మేళనంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నంబాబు, బీఆర్ఎస్ మైనార్టీ నేత మహబూబ్ జాని, నల్లగొండ డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం. పాండురంగారావు, కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, జెడ్పీటీసీలు బొలిశెట్టి నాగేంద్రబాబు, కొణతం ఉమాశ్రీనివాసరెడ్డి, పందిళ్లపల్లి పుల్లారావు, మోతె ఎంపీపీ ముప్పాళ్ల ఆశాశ్రీకాంత్రెడ్డి, చిలుకూరు ఎంపీపీ బండ్ల ప్రశాంతి, బడేటి వెంకటేశ్వర్లు, సామినేని ప్రమీలారమేశ్, తిపిరిశెట్టి సుశీలారాజు, కాసాని వెంకటేశ్వర్లు, రామయ్య, గురవారెడ్డి, రాయపూడి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఆశలు నెరవేరేనా!
మెదక్ టికెట్‌పై కాంగ్రెస్ నేతల ఆశలు ఇంకా సడలడం లేదు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నాయకుల్లో ఒక్కరికైనా బీ ఫాం దక్కకపోతుందా అనే ఆశతో ఉన్నారు. పొత్తులున్నప్పటికీ మెదక్‌లో స్నేహపూర్వక పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే శనివారం మెదక్ సీటుపై స్పష్టత రానుంది. కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థుల తుది జాబితాను శనివారం ప్రకటించనుంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించే జాబితాలో మెదక్ స్థానం ఉంటుందని స్థానిక కాంగ్రెస్ నేతలు నమ్మకంగా ఉన్నారు. కాంగ్రెస్ బీఫాం దక్కుతుందని ఆశావహులంతా వరుసగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. సాక్షి, మెదక్ : మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, జిల్లా నాయకుడు మ్యాడం బాలకృష్ణలు కాంగ్రెస్ పార్టీ పేరిట నామినేషన్లు వేశారు. శుక్రవారం శశిధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా మరో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ బీసీ నేత బట్టి జగపతి కాంగ్రెస్ పార్టీ పేరిట నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న సుప్రభాతరావు, తిరుపతిరెడ్డిలు సైతం శనివారం ఉదయం నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ ఆశావహులంతా నామినేషన్లు వేస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం మెదక్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ఆశావహులు బట్టి జగపతి, సుప్రభాతరావు, తిరుపతిరెడ్డి, బాలకృష్ణ, చంద్రపాల్ సమావేశమయ్యారు. పొత్తులో భాగంగా మెదక్ స్థానాన్ని తెలంగాణ జన సమితికి ప్రకటించినప్పటికీ స్నేహపూర్వక పోటీ కోసం అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలని ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్నేహపూర్వక పోటీకి అధిష్టానం అంగీకరించి ఆశావహుల్లో ఎవరికి బీఫాం దక్కినా మిగతా వారంతా నామినేషన్లు ఉపసహరించుకుని బీఫాం వచ్చిన నాయకుడి విజయం కోసం పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శనివారం పార్టీ తుది జాబితాను ప్రకటించనున్న నేపథ్యంలో ఆశావహులంతా శుక్రవారం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతితో సమావేశమయ్యారు. విజయశాంతి సైతం స్నేహపూర్వక పోటీకోసం కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా ప్రకటన అనంతరం స్నేహపూర్వక పోటీపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. మహాకూటమిలో భాగంగా టీజేఎస్‌కు 8 సీట్లు ఇస్తే 12 స్థానాలను ప్రకటించుకుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏకపక్షంగా టీజేఎస్ సీట్లు ప్రకటించినందున స్నేహపూర్వక పోటీ అంశాన్ని ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే టీజేఎస్ 8 సీట్లకు అంగీకరించిన పక్షంలో స్నేహపూర్వక పోటీ ఉంటుందా లేదా అన్న శంక కాంగ్రెస్ నేతలను కలవరపెడుతోంది. దీంతో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న నాయకులంతా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల్లో పోటీకి శశిధర్‌రెడ్డి మొగ్గు కాంగ్రెస్ అధిష్టానం తనకు బీఫాం ఇస్తుందని మాజీ ఎ మ్మెల్యే శశిధర్‌రెడ్డి ధీమాగా ఉన్నారు. ఇది వరకే నామినేషన్ వేసిన ఆయన శుక్రవారం స్వతంత్ర అభ్యర్థిగా మ రోసెట్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫాం ఇవ్వ ని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయ న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే స్వతం త్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచా రం. ఇదిలా ఉంటే శశిధర్‌రెడ్డి ఎన్సీపీ పార్టీ నుంచి పోటీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
దక్షిణాఫ్రికాలో పాలమూరువాసి మృతి
తిమ్మాజీపేట: నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చెందిన చర్లకోల శశిధర్ రెడ్డి సోమవారం దక్షిణాఫ్రికాలో జరిగిన రోడ్డు ప్రమా దంలో మృతి చెందాడు. టాంజానియా రాష్ట్రంలోని ఓ కంపెనీలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శశిధర్‌రెడ్డి.. క్రిస్మస్ సెలవులు రావడంతో భార్య అశ్వినితో కలసి ఓ ప్రైవేటు క్యాబ్‌లో విహార యాత్రకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో క్యాబ్ డ్రైవర్‌తోపాటు శశిధర్‌రెడ్డి మరణించారు. అతని భార్య అశ్వనికి సైతం తీవ్ర గాయాలైనట్లు తెలి సింది. ఆవంచ గ్రామానికి చెందిన చర్లకోల రాంరెడ్డి, వనజ దంపతులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. శశిధర్‌రెడ్డి మృతదేహం బుధవారం హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. -
గర్ల్ ఫ్రెండ్స్‌తో చాటింగ్...
ప్రస్తుతం కుర్రకారు 24 గంటలూ మెసేజ్‌లు, ఫేస్బుక్లో స్టేటస్లు, చాటింగ్‌లతో చాలా బిజీగా ఉంటున్నారు. రాత్రుళ్లు నిద్ర నటిస్తూ, దుప్పట్లు ముసుగేసుకుని అందులో నుంచే మెసేజ్‌లు పంపిస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్స్‌తో చాటింగ్ అయితే ఇక ప్రపంచాన్నే కాదు తమ గురించి తామే మర్చిపోయేంత బిజీగా ప్రవర్తిస్తారు. యూత్‌లో కామన్‌గా కనిపించే ఇటువంటి కాన్సెప్ట్‌తో తీసినదే 'now a days' షార్ట్ ఫిల్మ్. ఇంజనీరింగ్ చదివిన నెల్లూరువాసి శశిధర్‌రెడ్డి పర్లపల్లి ప్రస్తుతం బెంగళూరు ఐబీఎంలో పనిచేస్తున్నాడు. ‘మోరల్ వాల్యూస్‌కి విలువిచ్చే అక్కినేని నాగేశ్వరరావుకి ఈ చిత్రాన్ని డెడికేట్ చేశా. లైఫ్‌లో నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని ఎవరో ఈ-మెయిల్ చేస్తే, దానిని డెవలప్ చేసి తీసిందీ చిత్రం. ఏడాది కష్టపడ్డా. రేణూదేశాయ్, ఆది, నరేష్ తదితర సినీ ప్రముఖులు ఈ చిత్రం బాగుందంటూ ట్వీట్ చేశారు’ అని శశిధర్ చెప్పారు. స్టోరీ: శ్రుతికి అరుణ్ మెసేజ్ పంపడంతో ఈ చిత్రం కథ మొదలవుతుంది. వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసు కోకుండానే రోజూ మెసేజెస్ ఇచ్చుకుంటూనే ఉంటారు. అరుణ్ మాటలను బట్టి అతను ఐఐటీ చదువుతున్నాడనుకుంటుంది శ్రుతి. కొన్ని రోజులకు తాను చేస్తోంది తప్పేమో అనుకుంటాడు. తాను అరుణ్ కాదని, ఐఐటీ చదవడం లేదని శ్రుతికి వాస్తవం వివరిస్తాడు. దానికి.. ‘నేను శ్రుతి కాదు. నీ ఫ్రెండ్ రాముని’ అంటూ రిప్లై వస్తుంది. కోపంతో ఊగిపోతున్న అరుణ్.. పక్క రూమ్‌లోనే ఉన్న రాముని కొట్టడానికి వెళతాడు. డోర్ తియ్యగానే.. రూమ్‌లో ఉన్నవాళ్లంతా హ్యాపీ బర్త్‌డే అంటూ విష్ చేస్తారు. ‘ఏరా.. గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే నీ బర్త్‌డే కూడా మర్చిపోతావా’ అంటూ అంతా కలసి హాయిగా నవ్వేసుకొంటారు. కామెంట్: యూత్ చాలావరకు మొబైల్ ఫోన్ మాయలో పడి ఏది వాస్తవమో కూడా గ్రహించకుండా విలువైన సమయం వృథా చేస్తున్నారు. టెక్నాలజీని అవసరానికి మించి వాడితే నష్టపోయేది లైఫే అనే మెసేజ్ ఈ చిత్రం ద్వారా ఇచ్చారు. ఈ ఫిల్మ్ అవార్డులు కూడా అందుకుంది. డా. వైజయంతి -
మెదక్ కాంగ్రెస్‌లో గ్రూపుల గోల
మెదక్, న్యూస్‌లైన్ : ‘‘అది 1967వ సంవత్సరం. మెదక్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా పాపన్నపేట సంస్థానాధీశులు రాజా రాంచంద్రారెడ్డి నామినేషన్ వేసేందుకు మెదక్ పయనమయ్యారు. పాపన్నపేట మండలానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు అదే జీపులో అతనికి మద్దతుదారుగా మెదక్‌కు వచ్చారు. తీరా ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లగానే సీను మారింది. మద్దతుదారునిగా వచ్చిన వ్యక్తి జీపు దిగి నేరుగా కార్యాలయానికి వెళ్లి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. ఇది ఆనాటి కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలకు నిలువుటద్దంగా చెప్పవచ్చు. సీన్ కట్‌చేస్తే... ఈ నెల 14వ తేదీన మెదక్ జీకేఆర్ గార్డెన్స్‌లో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం.. రాములమ్మ తన గొంతు విప్పారు. ‘‘మెదక్ కాంగ్రెస్ నాయకుల మధ్య సఖ్యతలేదు. ఒకరితో మాట్లాడితే మరొకరికి కోపం. ఎవరివైపు చూసినా ఇబ్బందులే. కలిసి ఉంటేనే విజయం సాధిస్తాం...’’ అంటూ పరోక్షంగా గ్రూపు రాజకీయాలకు చురకలంటించారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో విజయశాంతి తన చూపును మెదక్ అసెంబ్లీ సీటుపై నిలిపారు. సాక్షాత్తు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మద్దతుతో టిక్కెట్ సాధించారు. దీంతో అదే సీటుపై నమ్మకంతో ఉన్న మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. భారీ కార్యకర్తల ర్యాలీతో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అధిష్టానం జోక్యంతో టికెట్ వివాదం టీ కప్పులో తుపాన్‌లా మిగిలింది. ఆపై బుజ్జగింపులు మొదలయ్యాయి. ఈ నెల 12న కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి శ్రవణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించారు. తిరిగి ఈ నెల 14న అదే సీను రిపీట్ అయ్యింది. ఎమ్మెల్యే అభ్యర్థి విజయశాంతి యూసుఫ్‌పేటలోని శశిధర్‌రెడ్డి ఇంటికి వెళ్లి స్వయంగా కార్యకర్తల సమావేశానికి తన కారులోనే తీసుకొచ్చారు. అయినా ఏ మూలనో దాక్కొని ఉన్న అసంతృప్త భావనలు ముఖంలో చెప్పకనే చెప్పాయి. అదే సమయంలో కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. పాపన్నపేట మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు విజయశాంతి వర్గీయుడైన ఓ నాయకుడిని పట్టుకుని నిలదీశారు. మాకు తెలియకుండా మండలానికొస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాగే సమావేశంలో సైతం రెండు గ్రూప్‌ల మధ్య ఉన్న విభేదాలు అంతర్లీనంగా వారి ఉపన్యాసాల్లోనే బయట పడ్డాయి. ఏ గ్రూప్‌వారు ఆ గ్రూప్ నాయకుల జపం చేస్తూ...ప్రసంగించారు. ఇలా గ్రూప్ రాజకీయాలు ఏ పరిణామానికి దారి తీస్తాయోనన్న ఆందోళన కాంగ్రెస్‌వాదుల్లో వ్యక్తమవుతోంది. అయితే రాములమ్మ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకప్పుడు నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి స్థానిక గ్రూప్ రాజకీయాల ప్రభావంతో స్తబ్దుగా ఉన్న నాయకులను మళ్లీ తెరపైకి తేచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పార్టీల్లో సీనియర్ నాయకులందరితో రాములమ్మ ఫోన్లో మాట్లాడుతూ కాంగ్రెస్పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు కొంతమంది నియోజకవర్గస్థాయి టీడీపీ నాయకులు రెండు రోజుల్లో కాంగ్రెస్‌లోకి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా...గ్రూప్ రాజకీయాలు రాములమ్మకు తలనొప్పిగా మారాయి. -
మెదక్ కాంగ్రెస్‌లో అసమ్మతి
మెదక్, న్యూస్‌లైన్: మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకుంది. పార్టీ టిక్కెట్‌ను విజయశాంతికి ఖరారు చేస్తూ సోమవారం కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దీంతో టికెట్‌ను ఆశించిన పట్లోళ్ల శశిధర్‌రెడ్డి గుర్రుగా ఉన్నారు. అయినా కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగానే మంగళవారం నామినేషన్ వేసేందుకు ముహూర్తం నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో విజయశాంతి, శశిధర్‌రెడ్డి వర్గీయులు వేర్వేరుగా కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. దీంతో కొంతమంది కార్యకర్తలు శశిధర్‌రెడ్డి వైపు, మరికొంతమంది విజయశాంతి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంకొంతమంది కార్యకర్తలు మాత్రం ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడుతున్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అయిన శశిధర్‌రెడ్డి చాలా కాలంగా ఎమ్మెల్యే టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఫలితాలు వెలువడిన మరునాడే యూసుఫ్‌పేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్యకర్తలను పట్టు జారిపోకుండా చూసుకున్నారు. ఓటమిభారం తనను కుంగదీయలేదన్న సంకేతాలను కార్యకర్తలకు పంపి, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. సుమారు ఐదేళ్లుగా జిల్లా ఇన్చార్జి మంత్రి డి.కె.అరుణ, ప్రభుత్వ సహకారంతో నిధులు మంజూరు చేయించుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ తనదేనన్న ధీమాతో ఉన్నారు. ఇదే సమయంలో ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరడం, ఆపై మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టిక్కెట్ ఆశించడం జరిగింది. ఈమేరకు టిక్కెట్ ఆమెకే ఖరారు చేస్తూ అధిష్టానం జాబితా జారీ చేసింది. దీంతో ఈనెల 9న నామినేషన్ వేసేందుకు కూడా ఆమె ముహూర్తం నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శశిధర్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి పార్టీ టిక్కెట్కోసం చివరి యత్నాలు చేశారు. ఒకవేళ పార్టీ నుంచి టిక్కెట్ వచ్చినా..రాకున్నా కాంగ్రెస్ పార్టీ నుంచే నామినేషన్ వేసేందుకు నిశ్చయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన స్వగ్రామమైన యూసుఫ్‌పేటలో భారీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కార్యకర్తలంతా పోటీలో ఉండాలని సూచించడంతో మంగళవారం శ్రీరామ నవమి రోజున నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా మరోవైపు మెదక్ మండలానికి చెందిన సుమారు 12 మంది సర్పంచ్‌లు సోమవారం హైదరాబాద్‌కు తరలివెళ్లి విజయశాంతికి తమ మద్దతు ప్రకటించినట్లు తెలిసింది. మాజీ కౌన్సిలర్, జిల్లా కాంగ్రెస్ మహిళా కార్యదర్శి తోటహరిణి, డీసీసీ కార్యదర్శి తోట అశోక్, మెదక్ మాజీ ఏఎంసీ చైర్మన్ మధుసూదన్‌రావులు కూడా పార్టీ నిర్ణయించిన అభ్యర్థినే గెలిపిస్తామని ఇప్పటికే ప్రకటించారు. మెదక్ ఎంపీగా పనిచేసి రైల్వేలైన్ మంజూరులో క్రియాశీలక పాత్ర పోషించినందున తనకు మెదక్ ప్రజలు పట్టం కడతారనే ఆశతో విజయశాంతి ఉన్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ఏ ఎంపీ చేయలేని విధంగా తాను కృషి చేశానన్న ధీమాతో ఉన్నారు. పోటాపోటీగా సాగుతున్న ఎన్నికల రేసు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. -
మెదక్ అసెంబ్లీ నుంచి రాములమ్మ?
మెదక్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్న వారి జాబితాలో రాములమ్మ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుండడంతో ఆ పార్టీలో టిక్కెట్ కలకలం చెలరేగుతోంది. పార్టీ టిక్కెట్‌పై ఆశతో ఉన్న జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి వర్గీయులు స్థానిక వాదనకు తెరలేపుతున్నారు. టిక్కెట్ దక్కని పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఉం దన్న సంకేతాలను పంపుతున్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం నోటిఫికేషన్ జారీ కానుంది. ఇదే సందర్భంలో ఈనెల 5 లోగా కాంగ్రెస్ జాబి తాను విడుదల చేస్తామని అధిష్టానం ప్రకటిం చింది. దీంతో మెదక్ సీటు ఎవరికి దక్కుతుం దన్నది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నెలరోజులుగా సాగుతున్న లాబీయింగ్ కాంగ్రెస్ తరఫున మెదక్ అసెంబ్లీ సీటుకోసం మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, డీసీసీ కార్యదర్శి పొతేదార్ మల్లన్న, రామాయంపేట మండల పార్టీ అధ్యక్షుడు పల్లె రాంచంద్రాగౌడ్లు పోటీపడుతున్నారు. వీరంతా నెలరోజులుగా ఎవరికి వారు లాబీయింగ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డిల ద్వారా శశిధర్‌రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఇక మెదక్ సీటు ఆశిస్తున్న పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు కూడా మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి, వి. హన్మంతరావుల ద్వారా టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. డీసీసీ కార్యదర్శి పోతేదార్ మల్లన్న, రామాయంపేట మ ండల కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లె రాంచంద్రాగౌడ్లు బీసీ కార్డుతో ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో ఎంపీ విజయశాంతి కాంగ్రెస్పార్టీలోకి చేరారు. అయితే మెదక్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పోటీచేస్తారన్న ప్రచారం జరుగుతున్న సందర్భంలో విజయశాంతి మెదక్ ఎమ్మెల్యే స్థానాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెదక్ ఎంపీ సీటా? లేదా ఎమ్మెల్యే సీటా? తేల్చుకోవాలంటూ అధిష్టానం కోరగా, ఆమె అసెం బ్లీకి వెళ్లేందుకే మొగ్గు చూపినట్లు సమాచారం. దీంతో ఎ మ్మెల్యే టికెట్ ఆశించిన సుప్రభాతరావు కూ డా విజయశాంతి అభ్యర్థిత్వానికి అనుకూలం గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి వర్గీయులు మంగళవారం స్థానిక వాదనను తెరపైకి తెచ్చారు. ఇంత వరకు మెదక్ నియోజకవర్గం నుంచి స్థానికేతరులెవరూ గెలవలేదని, ఒకవేళ వారికి టికెట్ ఇస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే శశిధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే సంకేతాలను పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే శశి ధర్‌రెడ్డి మంగళవారం ఢిల్లీవెళ్లి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మెదక్‌లోని ఎంపీ విజయశాంతి వర్గీయులు మాత్రం సీటు తమకే వస్తుందనే ధీమాతో ఎన్నికల ఏర్పాట్లకు నిమగ్నమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మెదక్ సీటు ఎవరికిస్తుందన్న టాపిక్ ఇప్పుడు మెదక్‌లో చర్చనీయాంశమైంది. -
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా
పరిగి, న్యూస్‌లైన్: సమస్యాత్మక, అతి సమస్యాత్మకంగా గుర్తించిన గ్రామాల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ రేంజ్ డీఐజీ శశిధర్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ రాజకుమారితో కలిసి పరిగి మండల పరిధిలోని అతి సమస్యాత్మక గ్రామమైన రంగంపల్లిలో పోలింగ్ బూత్‌ను. అనంతరం పరిగిలోని నంబర్-1 ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్‌లను ఆయన పరిశీలించి ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటికే అన్ని చోట్లా సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించామని చెప్పారు. ఆయా చోట్ల ప్రచారం నుంచి పోలింగ్ రోజు వరకూ వీడియో చిత్రీకరణ జరపనున్నట్టు, నిఘా బృందాల సేవలు కూడా వినియోగించుకోనున్నట్టు తెలిపారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. తర్వాత ఎస్పీ రాజకుమారి ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్‌రూంను పరిశీలించారు. అందులో లైట్లు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ విజయకుమార్ రెడ్డి, సీఐ వేణుగోపాల్‌రెడ్డిలకు సూచించారు. ఓటర్లు ఎక్కువగా ఉండే పోలింగ్ కేంద్రాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎస్పీ వెంట చేవెళ్ల డీఎస్పీ శ్రీధర్, సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్ఐలు లింగయ్య, శంషోద్దీన్, హెచ్ఎం గోపాల్ ఉన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలి తాండూరు రూరల్: స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని హైదరాబాద్ రేంజ్ డీఐజీ శశిధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను ఆయన తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్‌తో కలిసి పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల ఓట్లు భద్రపర్చే స్టాంగ్‌రూంల వద్ద ఆయన వివరాలు సేకరించారు. సమస్యాత్మకమైన పాత తాండూరు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాండూరు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ శశిధర్‌రెడ్డి సూచించారు. చెక్‌పోస్టుల వద్ద పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. ప్రజలు ఎన్నికలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. డీఐజీతో పాటు ఎస్పీ రాజకుమారి, రూరల్ సీఐ రవి, పట్టణ ఎస్ఐ ప్రణయ్‌లు ఉన్నారు. -
ఫైనల్లో కాంటినెంటల్
ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: శశిధర్ రెడ్డి (104) సెంచరీతో కదంతొక్కడంతో కాంటినెంటల్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో కాంటినెంటల్ క్రికెట్ క్లబ్ (సీసీ) నాలుగు వికెట్ల తేడాతో చార్మినార్ సీసీపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన చార్మినార్ సీసీ 8 వికెట్లకు 261 పరుగులు చేసింది. ప్రసాద్ (70), సమీ అన్సారి (62) అర్ధసెంచరీలతో రాణించారు. మీర్ ఒబేద్ అలీ 48 పరుగులు చేశాడు. కాంటినెంటల్ బౌలర్లు శ్రవణ్, ప్రణీత్‌లు చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత కాంటినెంటల్ సీసీ 6 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ రెడ్డి (69) అర్ధసెంచరీతో శశిధర్‌కు అండగా నిలిచాడు. చార్మినార్ సీసీ బౌలర్ అసద్ అలీ 3 వికెట్లు తీశాడు. ఎ-డివిజన్ వన్డే లీగ్ స్కోర్లు హెచ్‌యూసీసీ: 176 (బిలాల్ అహ్మద్ 69, ఆరిఫ్ 32; గౌస్ 5/25), అగర్వాల్ సీనియర్స్: 177/7 (హబీబ్ 53, మహబూబ్ అహ్మద్ 32; ఇమ్రాన్ 3/27, రాందాస్ 3/25). రాయల్ సీసీ: 277/7 (సల్మాన్ 41, ఉధమ్ 46, అబ్రార్ 37), శాంతి ఎలెవన్: 278/3 (రమేశ్ 112, చైతన్య 61; నగ్మాన్ 3/30). సన్‌షైన్: 240 (రతన్ 98, భరద్వాజ్ 31; కెవిన్ 3/50, వృతిక్ 3/55), పికెట్: 150 (నిఖిల్ 36 నాటౌట్; జైదేవ్ 3/45). కాకతీయ: 209 (సాయి 68, సుబ్బు 35; విజయ్ 6/35), ఆర్కే పురం: 210/4 (పుష్కర్ 52; రాము 3/77). స్పోర్టీవ్: 144 (గణేశ్ 36, రాము 30; నవజ్యోత్ 5/20, బంటి 4/40), రోహిత్ సీసీ: 113 (రంజిత్ 51; జయేశ్ 5/35). -
బీబీపేటలో ఎక్సైజ్ దాడులు
నారాయణఖేడ్ రూరల్, న్యూస్‌లైన్ : ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి అక్రమంగా క్లోరల్ హైడ్రేట్‌ను తరలిస్తున్న వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ శశిధర్‌రెడ్డి వివరాలను మంగళ వారం విలేకరులకు వెల్లడించారు. కల్హేర్ మండలం బీబీ పేటకు చెందిన సార ఎల్లాగౌడ్ అదే గ్రామంలో 8 కిలోల క్లోరల్ హైడ్రేట్‌తో సంచరిస్తుండగా నమ్మదగిన సమాచారంతో దాడులు చేశామన్నారు. క్లోరల్ హైడ్రేట్‌ను స్వాధీనం చేసుకొని ఎల్లాగౌడ్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడు ఎల్లాగౌడ్ నిజామాబాద్ జిల్లా బోధన్‌లో క్లోరల్ హైడ్రేట్‌ను కొనుగోలు చేసి కల్హేర్ మండలంలోని కల్లు దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. దుకాణాల్లోని కల్లులో మత్తు రావడానికి వాడే క్లోరల్ హైడ్రేట్‌ను వాడరాదని హెచ్చరించారు. కల్తీ కల్లును విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడిలో ఎన్ఫోర్స్మెంట్ సీఐ రజాక్, ఎస్ఐ ఎల్లాగౌడ్, సిబ్బంది అశ్వాక్, రియాజ్‌లు పాల్గొన్నారు. -
రచ్చ రచ్చ
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జిల్లా కాంగ్రెస్‌లో గ్రూపు తగదాలు రచ్చకెక్కాయి. రానున్న ఎన్నికల్లో పార్టీ టికెట్ తమకే ఇవ్వాలంటూ ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్ ఎదుటే కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం బాహాబాహీకి దిగారు. మెదక్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి సుప్రభాతరావు మద్దతుదారులైతే ఏఐసీసీ పరిశీలకుని ఎదుటే గొడవకు దిగారు. శశిధర్‌రెడ్డి, సుప్రభాతరావు మద్దతుదారులు కూడా తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ పరస్పరం దాడులకు దిగారు. దీంతో ఏఐసీసీ పరిశీలకుడు బస చేసిన సంగారెడ్డి ప్రభుత్వ అతిథి గృహంలోని ఫర్నీచర్ ధ్వంసమైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డి గొడవకు దిగిన వారిని శాంతిపజేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పరిస్థితిని అర్థం చేసుకున్న ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్ స్వయంగా గది నుంచి బయటకు వచ్చి శశిధర్‌రెడ్డి, సుప్రభాతరావు మద్దతుదారులతో మాట్లాడి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే ఏఐసీసీ పరిశీలకుడు మాట్లాడినంత సేపు శాంతంగా ఉన్న శశిధర్‌రెడ్డి, సుప్రభాతరావు మద్దతుదారులు ఆ తర్వాత నినాదాలు చేస్తూ పరస్పరం రెచ్చగొట్టుకోసాగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని ప్రభుత్వ అతిథి గృహం నుంచి బయటకు పంపించి వేశారు. ఇదిలాఉంటే దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డి, దుబ్బాక నియోజకవర్గ నేత మనోహరావు మద్దతుదారుల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ దశ లో రెండువర్గాల నాయకులు గొడవకు దిగారు. వెంటనే అప్రమత్తమైన సంగారెడ్డి సీఐ శివశంకర్ గొడవకు దిగిన నాయకులను అక్కడి నుంచి పంపించివేశారు. ఈ సందర్భంలోనే సంగారెడ్డి సీఐకి ఎమ్మెల్యే ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డికి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకుముందు సంగారెడ్డికి వచ్చిన ఏఐసీసీ పరిశీలకులు బస్వరాజ్‌పాటిల్ సిద్దిపేట, మెదక్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల నాయకులతో సమావేశమయ్యారు. మెదక్ ఎంపీ అభ్యర్థులతోపాటు నాలుగు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా ఎవరిని బరిలోకి దించాలనే విషయంపై స్థానిక నేతలతో మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే నర్సారెడ్డి ఒక్కరే తన మద్దతుదారులతో కలిసి ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి మరోమారు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎంపీ స్థానానికి రాహుల్, భూపాల్‌రెడ్డి పేర్ల ప్రతిపాదన మెదక్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని బరిలో దింపాల్సిందిగా ఏఐసీసీ పరిశీలకున్ని పలువురు నాయకులు కోరారు. అయితే మెజార్టీ మంది మాత్రం డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుందని సూచించారు. మెదక్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు రాహుల్‌ను మెదక్ నుంచి పోటీ పెడితే పార్టీకి లాభిస్తుందని తెలిపారు. దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, మెదక్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పలువురు ఎంపీ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు భూపాల్‌రెడ్డికి టికెట్ కేటాయించాల్సిందిగా ఏఐసీసీ పరిశీలకున్ని కోరినట్లు సమాచారం. మెదక్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని చెబుతున్న ఎంపీ విజయశాంతి గురించి ఏ నాయకుడు ఏఐసీసీ పరిశీలకుని వద్ద ప్రస్తావించకపోవడం గమనార్హం. మెదక్ నేతల బలప్రదర్శన మెదక్ ఎమ్మెల్యే టి కెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, పీసీసీ సంయుక్త కార్యదర్శి సుప్రభాతరావు ఏఐసీసీ పరిశీలకుని ఎదుట బలప్రదర్శనకు దిగారు. తమ మద్దతుదారులను పెద్ద సంఖ్యలో సంగారెడ్డికి తరలించి ఏఐసీసీ పరిశీలకుని ఎదుట ఇరువురు నేతలూ తమ సత్తా చాటే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో శశిధర్‌రెడ్డి, సుప్రభాతరావు మద్దతుదారులు బాహాబాహీకి దిగారు. శశిధర్‌రెడ్డి వర్గీయులు ఏఐసీసీ పరిశీలకున్ని కలిసి తమ నేతకు మెదక్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరగా, సుప్రభాతరావు తనకు టికెట్ ఇవ్వాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తమ్ముడు ఉపేందర్‌రెడ్డి సైతం తనకు మెదక్ టికెట్ ఇవ్వాలని కోరారు. టికెట్ ఇవ్వండి... సిద్దిపేటను హస్తగతం చేస్తాం తమకు పార్టీ అవకాశం ఇస్తే సిద్దిపేటను హస్తగతం చేస్తామని సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేతలు గంప మహేందర్, గూడూరి శ్రీనివాస్, తాడూరి శ్రీనివాస్, చంద్రశేఖర్, వహీద్ఖాన్లు ఏఐసీసీ పరిశీలకుడు బస్వరాజ్‌పాటిల్‌ను కోరారు. ఏడుగురు నాయకులు ఎవరికివారే తమ మద్దతుదారులతో కలిసి ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు వినతి పత్రాలు అందించారు. సిద్దిపేట నాయకులు ఎంపీ అభ్యర్థిగా భూపాల్‌రెడ్డి పేరు సూచించినట్లు తెలిసింది. దుబ్బాక కోసం హేమాహేమీలు దుబ్బాక ఎమ్మెల్యే టికెట్ కోసం హేమాహేమీలు ఏఐసీసీ పరిశీలకుని ఎదుట క్యూ కట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్యంరెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, సీనియర్ నాయకులు బండి నర్సాగౌడ్, సోమేశ్వర్రెడ్డిలు దుబ్బాక టికెట్ తమకివ్వాల్సిందిగా ఏఐసీసీ పరిశీలకుడిని కోరారు. వీరితోపాటు ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన రఘునందన్‌రావు, డీసీసీబీ ైడె రెక్టర్ గాల్‌రెడ్డి సైతం ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరారు. ముత్యంరెడ్డి పక్షాన ఆయన తనయుడు శ్రీనివాస్‌రెడ్డి ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి తన తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలకు సిద్ధం
మెదక్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్‌పార్టీ సిద్ధంగా ఉందని జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2014 మార్చిలో జరుగుతాయని భావిస్తున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు తమ సర్వే ప్రారంభించారని తెలిపారు. మొత్తం ఐదువిడతల్లో ఇప్పటికీ మూడు విడతల సర్వే పూర్తయినట్లు చెప్పారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, మేధావులను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్‌పార్టీ విజయవకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, అమలు తీరుతెన్నులను తెలుసుకున్నారన్నారు. అలాగే ఎన్నికల్లో పోటీచేసేందుకు ఉత్సాహ పడుతున్న అభ్యర్థుల పనితీరు, వారికి ప్రజలతో ఉన్న సత్సంబంధాలు, సేవా భావం తదితర అంశాలను పరిశీలించారని తెలిపారు. కాంగ్రెస్‌పార్టీకి అనుబంధంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళ, విద్యార్థి విభాగాలను చైతన్యవంతం చేసేందుకు బృహత్ ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ హ వా కొనసాగుతుందన్నారు. పార్టీ టికెట్ ఎవరికొచ్చినా నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తారన్నారు. సోనియా, రాహుల్ నాయకత్వంలో ఎన్నికల యుద్ధం కొనసాగుతుందన్నారు. ప్రజాదర్బార్‌కు భారీ స్పందన మెదక్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రజాదర్బార్‌కు భారీ స్పందన లభించింది. ఈసందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ శశిధర్‌రెడ్డికి విన్నవించారు. సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పవన్‌శ్రీకర్, దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కోదండ రామాలయంలో భారీ చోరీ
మెదక్ టౌన్, న్యూస్‌లైన్ : పట్టణంలోని పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో గల కోదండ రామాలయంలో దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటనలో రెండు పంచలోహ విగ్రహాలు, వెండి, తులాల బంగారు పుస్తెల తాడును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటనను నిరసిస్తూ.. ఆగ్రహించిన స్థానికులు, అఖిల పక్ష నేతలు ఆలయం ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. వివరాల్లోకి వెళితే.. కోదండ రామాలయంలో ధనుర్మాసోత్సవాలు జరుగుతున్నాయి. అయితే శుక్రవారం రాత్రి దొంగలు గుడి తాళాలు, గర్భ గుడి షట్టర్‌తో పాటు తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. పంచలోహ విగ్రహాలైన సీతమ్మ తల్లి, శ్రీకృష్ణుడు విగ్రహాలతో పాటు రెండు కిలోల వెండి ఆభరణాలు, రెండు తులాల బంగారు పుస్తెలు చోరీ చేశారు. అయితే ఈ భారీ చోరీని తెలుసుకున్న వీహెచ్‌పీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ నేతలు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో పాటు కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ నేతలు మాట్లాడుతూ పోలీసుల వైఫల్యంతోనే ఈ సంఘటన జరిగిందని ఆరోపించారు. ఇప్పటికే ఇదే ఆలయంలో నాలుగుసార్లు చోరీ జరిగినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూ ఆలయాల వద్ద పోలీసు రక్షణ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఓ వనజాదేవి, డీఎస్పీ గోద్రూ, మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్, పట్టణ సీఐ విజయ్‌కుమార్‌లు వచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. స్పందించిన ఆర్డీఓ, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. కాగా ఆలయం చోరీ దృష్ట్యా స్థానికులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి, దుకాణాలు మూసివేయించారు. ఆలయంలో క్లూస్‌టీం బృందం పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యా సంస్థలను ఏబీవీపీ నేతలు మూసివేయించారు. సాయంత్రం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో వనపర్తి వెంకటేశం, గడ్డం శ్రీనివాస్, టీ చంద్రపాల్, దుర్గ ప్రసాద్, కృష్ణారెడ్డి, మల్లికార్జున్‌గౌడ్, సంజీవ్, మల్కాజి సత్యనారాయణ, కొండశ్రీను, మ్యాడం బాలకృష్ణ, మధు, కాశీనాథ్, ఆలయ కమిటీ చైర్మన్ నరేందర్, ఆలయ ప్రధాన అర్చకులు భాష్యం మధుసూచార్యులు, బ్రాహ్మణ సంఘం నేతలు వైద్య శ్రీనివాస్, కృష్ణమూర్తి, రాజు పంతులు, కృష్ణమూర్తి పంతులు, ప్రసాద్ పంతులు, కృష్ణ పంతులు, కొల్చారం మండలం కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డితో పాటు పట్టణ ప్రజలు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
తెలంగాణపై కాంగ్రెస్ వెనక్కి తగ్గదు
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గదని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తథ్యమని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.శశిధర్‌రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డిలో ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీడబ్ల్యూసీ ఏ అంశంపై తీర్మానం చేసినా తప్పకుండా కట్టుబడి, అమలు చేస్తుందన్నారు. తీర్మానం మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కావడం ఖాయమన్నారు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 20న సంగారెడ్డిలో నిర్వహించతలపెట్టిన కాంగ్రెస్ సర్పంచ్‌లు, సొసైటీ చైర్మన్ల సన్మాన కార్యక్రమం, సభ కార్యక్రమాన్ని ఈనెల 21వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు. 20వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ భేటీ ఉన్న నేపథ్యంలో సభ నిర్వహణ తేదీని 21వ తేదీకి మార్చినట్లు వివరించారు. 21న సంగారెడ్డిలోని బాలాజీ గార్డెన్స్‌లో ఉదయం 11గంటలకు సభ జరుగుతుందన్నారు. సభకు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి సహా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు. 21న నిర్వహించే సభకు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గసభ్యులు, బ్లాక్, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు విధిగా హాజరు కావాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముద్రించిన తెలంగాణ జెండాలను శశిధర్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు విడుదల చేశారు.