తెలంగాణపై కాంగ్రెస్ వెనక్కి తగ్గదు
Published Thu, Sep 19 2013 1:26 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గదని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తథ్యమని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.శశిధర్‌రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డిలో ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీడబ్ల్యూసీ ఏ అంశంపై తీర్మానం చేసినా తప్పకుండా కట్టుబడి, అమలు చేస్తుందన్నారు. తీర్మానం మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు కావడం ఖాయమన్నారు.
జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 20న సంగారెడ్డిలో నిర్వహించతలపెట్టిన కాంగ్రెస్ సర్పంచ్‌లు, సొసైటీ చైర్మన్ల సన్మాన కార్యక్రమం, సభ కార్యక్రమాన్ని ఈనెల 21వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు. 20వ తేదీన రాష్ట్ర మంత్రివర్గ భేటీ ఉన్న నేపథ్యంలో సభ నిర్వహణ తేదీని 21వ తేదీకి మార్చినట్లు వివరించారు. 21న సంగారెడ్డిలోని బాలాజీ గార్డెన్స్‌లో ఉదయం 11గంటలకు సభ జరుగుతుందన్నారు. సభకు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి సహా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు. 21న నిర్వహించే సభకు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గసభ్యులు, బ్లాక్, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు విధిగా హాజరు కావాలన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముద్రించిన తెలంగాణ జెండాలను శశిధర్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు విడుదల చేశారు.
Advertisement