ఫైనల్లో కాంటినెంటల్ | continental team entered in finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో కాంటినెంటల్

Published Wed, Feb 26 2014 12:32 AM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM

continental team entered in finals

ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్
 సాక్షి, హైదరాబాద్: శశిధర్ రెడ్డి (104) సెంచరీతో కదంతొక్కడంతో కాంటినెంటల్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో మంగళవారం జరిగిన సెమీఫైనల్లో కాంటినెంటల్ క్రికెట్ క్లబ్ (సీసీ) నాలుగు వికెట్ల తేడాతో చార్మినార్ సీసీపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన చార్మినార్ సీసీ 8 వికెట్లకు 261 పరుగులు చేసింది. ప్రసాద్ (70), సమీ అన్సారి (62) అర్ధసెంచరీలతో రాణించారు. మీర్ ఒబేద్ అలీ 48 పరుగులు చేశాడు. కాంటినెంటల్ బౌలర్లు శ్రవణ్, ప్రణీత్‌లు చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత కాంటినెంటల్ సీసీ 6 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ రెడ్డి (69) అర్ధసెంచరీతో శశిధర్‌కు అండగా నిలిచాడు. చార్మినార్ సీసీ బౌలర్ అసద్ అలీ 3 వికెట్లు తీశాడు.
 
 ఎ-డివిజన్ వన్డే లీగ్ స్కోర్లు
 హెచ్‌యూసీసీ: 176 (బిలాల్ అహ్మద్ 69, ఆరిఫ్ 32; గౌస్ 5/25), అగర్వాల్ సీనియర్స్: 177/7 (హబీబ్ 53, మహబూబ్ అహ్మద్ 32; ఇమ్రాన్ 3/27, రాందాస్ 3/25).
 
 రాయల్ సీసీ: 277/7 (సల్మాన్ 41, ఉధమ్ 46, అబ్రార్ 37), శాంతి ఎలెవన్: 278/3 (రమేశ్ 112, చైతన్య 61; నగ్మాన్ 3/30).
 
 సన్‌షైన్: 240 (రతన్ 98, భరద్వాజ్ 31; కెవిన్ 3/50, వృతిక్ 3/55), పికెట్: 150 (నిఖిల్ 36 నాటౌట్; జైదేవ్ 3/45).
 
 కాకతీయ: 209 (సాయి 68, సుబ్బు 35; విజయ్ 6/35), ఆర్‌కే పురం: 210/4 (పుష్కర్ 52; రాము 3/77).
 
 స్పోర్టీవ్: 144 (గణేశ్ 36, రాము 30; నవజ్యోత్ 5/20, బంటి 4/40), రోహిత్ సీసీ: 113 (రంజిత్ 51; జయేశ్ 5/35).
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement