సాక్షి, హైదరాబాద్: మహమ్మద్ ప్రవక్త అల్లుడు హజ్రత్ ఆలీ అలైహీ సలాం వర్ధంతిని పురస్కరించుకొని పాతబస్తీలో మంగళవారం నిర్వహించిననున్న సంస్మరణ ర్యాలీ సందర్భంగా నగర ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. చార్మినార్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ చార్కమన్, గుల్జార్ హౌస్, పతర్ గట్టి, మదీనా, టిప్సు ఖానా, చత్తా బజార్, లక్కడ్ కొటే, సలామా స్కూల్ పురానా హవేలి, నుంచి ఏపీఎట్ క్రాస్ రోడ్స్ నుంచి నుంచి కుడివైపునకు మళ్లి దారుషిఫా గ్రౌండ్స్, ఎస్‌జే రోటరీ, అబిద్ ఆలీఖాన్ ఐ హాస్పిటల్, మసీద్ ఇ ఇమామియా నుంచి కలికాబర్ ఎంజీబీఎస్ వద్ద ముగియనుంది. ఈ ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ అనిల్ కుమార్ కోరారు. ఆర్‌టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు కూడా ఇతర మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు.
మళ్లింపులు ఇలా
ఈతబర్ చౌక్ నుంచి గుల్జార్ హౌస్‌కు వచ్చే వాహనాలను ఇరానీ గల్లీలోని అర్మన్ కేఫ్ మీదుగా మళ్లించి కోట్ల ఆలీజా/హఫీజ్ దంక మసీదు వైపునకు అనుమతించనున్నారు. గాన్సి బజార్, మిట్టి కి షేర్ నుంచి వచ్చే వాహనాలను మిట్టి కా షేర్ జంక్షన్ వద్ద మళ్లించి గాన్సిబజార్, హైకోర్టు రోడ్డువైపు అనుమతించనున్నారు. చత్తాబజార్ వరకు సంస్మరణ ర్యాలీ వచ్చే వరకు నయాపూల్ వద్ద వాహనాలను నిలిపివేయనున్నారు. ఆ తర్వాత ఏపీఎట్ జంక్షన్ వెళ్లేవరకు చత్తాబజార్‌లో ట్రాఫిక్ ఆపనున్నారు.
పురానా హవేలి నుంచి చత్తా బజార్ వెళ్లేవాహనాలను పీలిగేట్, బైతుల్ కయ్యంలోని ఏపీఎట్, మండి మీర్ ఆలం వద్ద మళ్లించనున్నారు. సంస్మరణ ర్యాలీ లక్కడ్ కొటేకు చేరుకోగానే సలామా స్కూల్ వైపునకు వెళుతున్న క్రమంలో ఏపీఏటీ నుంచి చత్తాబజార్ వెళ్లే వాహనాలను ఎస్‌జే రోటరీ, మండీ మీర్‌ఆలం, ప్రిన్సెస్ దురేశ్వర్ హాస్పిటల్ వద్ద మళ్లించనున్నారు. ఎస్‌జే రోటరీ నుంచి ఏపీఏటీ జంక్షన్ వెళ్లే వాహనాలను శివాజీ బ్రిఇడ్జ్, సలార్ జంగ్ మ్యూజియం, నూర్కాన్ బజార్‌ల మీదుగా అనుమతించనున్నారు. సంస్మరణ ర్యాలీ దారుషిఫా మైదానానికి చేరుకోగానే చాదర్‌ఘాట్ నుంచి వచ్చే వాహనాలను చాదర్‌ఘాట్ రోటరీ వద్ద మళ్లించి విక్టోరియా ప్లే గ్రౌండ్ జంక్షన్ వైపు అనుమతించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment