మెదక్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్న వారి జాబితాలో రాములమ్మ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుండడంతో ఆ పార్టీలో టిక్కెట్ కలకలం చెలరేగుతోంది. పార్టీ టిక్కెట్‌పై ఆశతో ఉన్న జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి వర్గీయులు స్థానిక వాదనకు తెరలేపుతున్నారు. టిక్కెట్ దక్కని పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఉం దన్న సంకేతాలను పంపుతున్నారు. త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం నోటిఫికేషన్ జారీ కానుంది. ఇదే సందర్భంలో ఈనెల 5 లోగా కాంగ్రెస్ జాబి తాను విడుదల చేస్తామని అధిష్టానం ప్రకటిం చింది. దీంతో మెదక్ సీటు ఎవరికి దక్కుతుం దన్నది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
నెలరోజులుగా సాగుతున్న లాబీయింగ్
కాంగ్రెస్ తరఫున మెదక్ అసెంబ్లీ సీటుకోసం మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, డీసీసీ కార్యదర్శి పొతేదార్ మల్లన్న, రామాయంపేట మండల పార్టీ అధ్యక్షుడు పల్లె రాంచంద్రాగౌడ్‌లు పోటీపడుతున్నారు. వీరంతా నెలరోజులుగా ఎవరికి వారు లాబీయింగ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, డీసీసీ అధ్యక్షులు భూపాల్‌రెడ్డిల ద్వారా శశిధర్‌రెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఇక మెదక్ సీటు ఆశిస్తున్న పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు కూడా మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, సునీతారెడ్డి, వి. హన్మంతరావుల ద్వారా టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
డీసీసీ కార్యదర్శి పోతేదార్ మల్లన్న, రామాయంపేట మ ండల కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లె రాంచంద్రాగౌడ్‌లు బీసీ కార్డుతో ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌పార్టీలోకి చేరారు. అయితే మెదక్ ఎంపీ స్థానానికి టీఆర్‌ఎస్ నుంచి కేసీఆర్ పోటీచేస్తారన్న ప్రచారం జరుగుతున్న సందర్భంలో విజయశాంతి మెదక్ ఎమ్మెల్యే స్థానాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెదక్ ఎంపీ సీటా? లేదా ఎమ్మెల్యే సీటా? తేల్చుకోవాలంటూ అధిష్టానం కోరగా, ఆమె అసెం బ్లీకి వెళ్లేందుకే మొగ్గు చూపినట్లు సమాచారం. దీంతో ఎ మ్మెల్యే టికెట్ ఆశించిన సుప్రభాతరావు కూ డా విజయశాంతి అభ్యర్థిత్వానికి అనుకూలం గా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి వర్గీయులు మంగళవారం స్థానిక వాదనను తెరపైకి తెచ్చారు. ఇంత వరకు మెదక్ నియోజకవర్గం నుంచి స్థానికేతరులెవరూ గెలవలేదని, ఒకవేళ వారికి టికెట్ ఇస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే శశిధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే సంకేతాలను పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే శశి ధర్‌రెడ్డి మంగళవారం ఢిల్లీవెళ్లి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మెదక్‌లోని ఎంపీ విజయశాంతి వర్గీయులు మాత్రం సీటు తమకే వస్తుందనే ధీమాతో ఎన్నికల ఏర్పాట్లకు నిమగ్నమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మెదక్ సీటు ఎవరికిస్తుందన్న టాపిక్ ఇప్పుడు మెదక్‌లో చర్చనీయాంశమైంది.
మెదక్ అసెంబ్లీ నుంచి రాములమ్మ?
Published Wed, Apr 2 2014 12:17 AM | Last Updated on Tue, Oct 16 2018 3:09 PM
Advertisement
Advertisement