అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కలెక్టర్ వెంకట్రావు
సాక్షి,ధన్వాడ(నారాయణపేట): స్వచ్ఛ భరత్ మిషన్ పనుల ఆలస్యంపై కలెక్టర్ వెంకట్రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ధన్వాడ, మరికల్, నర్వ మండలాల ఏపీఓ, ఎంపీడీఓ, ఏపీం, ఈఓపీఆర్‌డీ, సీసీలతో సమీక్ష సమావేశం నిర్వమించారు. ఇప్పటి ఎరకు 20శాతం పనులు కూడా పూర్తికాలేదెందుకని అధికారులను ప్రశ్నించారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అంటున్నారే తప్ప పూర్తిఅవ్వడంలేదని ఫొటో క్యాప్చర్‌కూడా చేయడంలేదని అన్నారు. నర్వ మండలంలో కేవలం 9శాతమే పనులు కూడా పూర్తి చేయకలేకపోయరని ఏపీఎం, ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.16కోట్ల నిధులు పెండింగ్‌లోనే..
నారాయణపేట జిల్లాలకు స్వచ్ఛభరత్ మిషన్ నిధులు విడుదల చేయాలని అధికారులను కోరితే ప్రస్తుతం కొన్ని మండాలలో రూ. 16 కోట్లు పెండింగ్‌లో ఉన్నా యని వాటికి సంబంధించిన పనులు పూర్తిచేస్తేనే కొత్త నిధులు విడుదల చేస్తామని చెప్పారన్నారు. కొన్ని మండలాల వల్ల పనులు పూర్తిచేసుకున్నవారికీ నిధులు ఇవ్వలేకపోతున్నామన్నారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి లోపు అన్ని మండలలోని గ్రామాలలో ఓడిఎఫ్ చేయాలని లేదంటే సస్పెన్షన్ వేటు పడుతుందని హెచ్చరించారు.
మూడురోజుల్లో ఎన్నికలు ఉన్నాయని కేంద్రాలలో సౌకర్యాలు కల్పించాలన్నారు. ట్రైసీకిల్స్‌ను ఏర్పటు చేయాలని కార్యదర్శులకు సుచించారు. వికలంగులకు ప్రత్యేకంగా దూరని బట్టి ఆటోవులను ఏర్పటు చేయాలు అధికారులకు సుచించారు. మక్తల్ మండలంలో నిర్వహించిన సమీక్షకు గైర్హాజరైన అంగన్‌వాడీ సూపర్‌వైజర్లను 12న స్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు.
స్వచ్ఛత పనులు పూర్తిచేయాలి
మక్తల్: వందశాతం ఓడీఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెంకట్‌రావు అన్నారు. ఆదివారం మక్తల్‌లో ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ విషయంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో రూ.1.50కోట్లు నిల్వ ఉంచారెందుకని ప్రశ్నించారు. పీడీ శంకరాచారీ, ఎంపీడీఓ విజయనిర్మల, ఏపీఓ చిట్టెం మాధవరెడ్డి, ఏపీఎం నారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment