swatch bharath
-
స్వచ్ఛ భారత్ కోసం రిలయన్స్ మెగా ప్లాగింగ్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌ను చెత్తరహిత దేశంగా మార్చేందుకు రిలయన్స్ కు చెందిన ఆర్ ఎలాన్ (ఫ్యాబ్రిక్ మ్యానుఫాక్చరింగ్ సంస్థ) చేపట్టిన రన్ విజయవంతం అయింది. భారతదేశపు మొదటి ప్లాగర్ రిపు దామన్ భాగస్వామ్యంతో అటు పర్యావరణ పరిరక్షణ ఇటు ఫిట్నెస్ను సాధించే ఉమ్మడి లక్ష్యంతో చేపట్టిన ప్లాగింగ్ రన్‌ను గురువారం విజయవంతంగా ముగించింది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ గ్రాండ్‌ఫినాలేకు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు కూడా హజరయ్యారు. 50 నగరాల ప్రజలు ఈ రన్లో పాల్గొన్నారని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఆర్ఎలాన్ సంస్థ వెల్లడించింది. ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించేందుకు సెప్టెంబర్ 5న కొచ్చిలో ప్రారంభమైన ఈ రన్ ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో పూర్తి అయిందని, ఈ సందర్భంగా తమకు ఘనస్వాగతం లభించిందని తెలిపింది. ముంబై, హైదరాబాద్, కోల్‌కతా తదితర 50 నగరాల్లో సుమారు 1000 కిలోమీటర్ల మేర కొనసాగిన ఈ మెగా రన్లో సుమారు 2.7 టన్నుల ప్లాస్టిక్ చెత్తను సేకరించారు. ‘రన్ టు మేక్ ఇండియా లిట్టర్ ఫ్రీ' కార్యక్రమంపై ప్లాగర్ దామన్ స్పందిస్తూ ఇది డ్రీమ్ రన్ అని పేర్కొన్నారు. తమ ప్రయత్నాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత క్రీడా అథారిటీ గుర్తించడం గర్వంగా ఉందని దామన్ అన్నారు. ఆర్ఐఎల్ పాలిస్టర్ బిజినెస్ సీఈవో గుంజన్ శర్మ మాట్లాడుతూ ఈ ప్లాగింగ్ రన్ దేశవ్యాప్తంగా లభించిన ఆదరణ తమకెంతో సంతోషానిచ్చిం దన్నారు. పర్యావరణంపై అవగాహనతోపాటు, పౌరులలో ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను పెంపొందింస్తామన్నారు. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలతో గ్రీన్ గోల్డ్ ఫైబర్‌తో అద్భుతమైన దుస్తులను తయారుచేస్తామని వెల్లడించారు. కాగా రి లయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో గ్రీన్ గోల్డ్ ఫైబర్ అద్భుతమైన వస్త్రాలను తయారు చేస్తుంది. ప్లాంట్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ లోని ప్లాంట్ ద్వారా ప్రతి ఏటా ఈ యూనిట్ 2.5 బిలియన్ పెట్ బాటిల్స్‌ను రీసైకిల్ చేస్తుంది. దీన్ని పర్యావరణహితమైన గ్రీన్ గోల్డ్ ఫైబర్‌గా మారుస్తున్న సంగతి తెలిసిందే. -
పనిచేయకపోతే ఇంట్లో కూర్చోండి
సాక్షి,ధన్వాడ(నారాయణపేట): స్వచ్ఛ భరత్ మిషన్ పనుల ఆలస్యంపై కలెక్టర్ వెంకట్రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ధన్వాడ, మరికల్, నర్వ మండలాల ఏపీఓ, ఎంపీడీఓ, ఏపీం, ఈఓపీఆర్డీ, సీసీలతో సమీక్ష సమావేశం నిర్వమించారు. ఇప్పటి ఎరకు 20శాతం పనులు కూడా పూర్తికాలేదెందుకని అధికారులను ప్రశ్నించారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అంటున్నారే తప్ప పూర్తిఅవ్వడంలేదని ఫొటో క్యాప్చర్కూడా చేయడంలేదని అన్నారు. నర్వ మండలంలో కేవలం 9శాతమే పనులు కూడా పూర్తి చేయకలేకపోయరని ఏపీఎం, ఎంపీడీఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.16కోట్ల నిధులు పెండింగ్‌లోనే.. నారాయణపేట జిల్లాలకు స్వచ్ఛభరత్ మిషన్ నిధులు విడుదల చేయాలని అధికారులను కోరితే ప్రస్తుతం కొన్ని మండాలలో రూ. 16 కోట్లు పెండింగ్‌లో ఉన్నా యని వాటికి సంబంధించిన పనులు పూర్తిచేస్తేనే కొత్త నిధులు విడుదల చేస్తామని చెప్పారన్నారు. కొన్ని మండలాల వల్ల పనులు పూర్తిచేసుకున్నవారికీ నిధులు ఇవ్వలేకపోతున్నామన్నారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి లోపు అన్ని మండలలోని గ్రామాలలో ఓడిఎఫ్ చేయాలని లేదంటే సస్పెన్షన్ వేటు పడుతుందని హెచ్చరించారు. మూడురోజుల్లో ఎన్నికలు ఉన్నాయని కేంద్రాలలో సౌకర్యాలు కల్పించాలన్నారు. ట్రైసీకిల్స్ను ఏర్పటు చేయాలని కార్యదర్శులకు సుచించారు. వికలంగులకు ప్రత్యేకంగా దూరని బట్టి ఆటోవులను ఏర్పటు చేయాలు అధికారులకు సుచించారు. మక్తల్ మండలంలో నిర్వహించిన సమీక్షకు గైర్హాజరైన అంగన్వాడీ సూపర్వైజర్లను 12న స్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. స్వచ్ఛత పనులు పూర్తిచేయాలి మక్తల్: వందశాతం ఓడీఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. ఆదివారం మక్తల్‌లో ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ విషయంపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో రూ.1.50కోట్లు నిల్వ ఉంచారెందుకని ప్రశ్నించారు. పీడీ శంకరాచారీ, ఎంపీడీఓ విజయనిర్మల, ఏపీఓ చిట్టెం మాధవరెడ్డి, ఏపీఎం నారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ జెండాకు అవమానం
గుడిహత్నూర్(బోథ్) : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ కార్యాలయంలో అప్పటికే సిద్ధంగా ఉన్న టీఆర్ఎస్ గద్దె, గులాబిరంగులో ఉన్న పోల్ పైనే జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో వేడుకలకు హాజరైన పలువురు నాయకుల తీరుపట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తలకిందులుగా జెండా ఆవిష్కరణ మందమర్రిరూరల్(చెన్నూర్): పట్టణంలోని కార్మెల్ హైస్కూల్ సమీపంలో ఉన్న హెచ్ఎంఎస్ యూనియన్ కార్యాలయం ఎదుట నాయకులు జాతీయ జెండాను తల కిందులుగా ఆవిష్కరించారు. అటువైపుగా వెళ్తున్న సాక్షి విలేఖరి కంట పడడంతో వెంటనే కెమెరాలో బంధించాడు. కొద్ది సమయానికి తేరుకున్న నాయకులు తిరిగి జెండాను కిందికి దించి సరిచేసి ఆవిష్కరించారు. మురుగునీటిలో జెండా పండుగ కెరమెరి(ఆసిఫాబాద్): ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్ పేరిట స్వచ్ఛత కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుంటే.. ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా ఉంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని ఎస్సీ కాలనీలో అంగన్వాడి కేంద్రం వద్ద జెండా మురికి నీటిలో రెపరెపలాడింది. ఆ కేంద్రానికి సమీపంలోనే డ్రెయినేజీ ఉంది. అది పిచ్చిమొక్కలు, పూడికతో నిండి ఉండడం వల్ల ఆ మురుగునీరంతా జెండా ఎగురవేసే గద్దె వరకు పారింది. దీంతో గతి లేని పరిస్థితుల్లో జెండాను అక్కడే ఎగురవేశారు. ఈ దృశ్యాన్ని చూసిన వారు మాత్రం ఈసడించుకున్నారు -
300 మీటర్ల జాతీయ జెండాతో ‘స్వచ్ఛ ర్యాలీ’
సంగారెడ్డి జోన్ : వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పారిశుద్ధ్యాన్ని సక్రమంగా నిర్వహించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని డీఆర్డీఏ వెంకటేశ్వర్లు సూచించారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా జిల్లా యంత్రాంగం గురువారం స్వచ్ఛగణతంత్ర వారోత్సవాలను నిర్వహించింది. ఇందులో భాగంగా స్థానిక ఐబీ అతిథిగృహం నుంచి కలెక్టరేట్ వరకు సుమారు 500 మంది కళాశాల విద్యార్థులతో కలిసి 300 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతంగా యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. ప్రజలంతా స్వచ్ఛందగా సహకరించినప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. ర్యాలీ కలెక్టరేట్‌కు చేరుకున్న అనంతరం జేసీ వాసం వెంకటేశ్వర్లు చేతులమీదుగా కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ ఏపీడీ సిద్ధారెడ్డి, ఏఓ మధులత, వివిధ కళాశాలల విద్యార్థులు, స్వచ్చభారత్ మిషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
భారత్‌లోనే అత్యంత చెత్త నగరం
నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక ఇచ్చిన మొదటి నినాదం స్వచ్ఛ భారత్. మోదీ ఎంతో కలలు ప్రాజెక్టుగా కూడా దీనిని గురించి గొప్పగా చెప్పుకుంటాయి బీజేపీ శ్రేణులు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా సిటీ.. దేశంలో అత్యంత చెత్త సిటీగా నిలిచింది. సాక్షి, గోండా సిటీ: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోకు 125 కిలో మీటర్ల దూరంలో గోండా సిటీ ఉంది. ఇక్కడ చెత్త పర్వతాకారంలో పేరుకుని ఉంటుంది. మురికి కాలువల్లో చెత్త పేరుకుని.. మురుగునీరు రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంటుంది. ఎటు చూసినా మురికి కూపాలే... ఈ నగరాన్ని చెత్త నగరాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకోవచ్చని కొందరు స్థానికులు అంటున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్రం ఎంచుకున్న 434 నగరాల్లో ఈ సిటీ కూడా ఉండడం గమనార్హం. మురికి కూపాలు దోమలకు, పందులకు ఆవాసాలుగా మారిపోయాయి. మురుగు నీరు ప్రవహించని రోడ్లు నగరంలో ఒక్కటంటే ఒక్కటికూడా లేదని దుర్గేష్ మిశ్రా అనే స్థానికుడు చెబుతున్నాడు. స్థానిక మున్సిపల్, ప్రభుత్వాధికారుల అవినీతి వల్లే నగరం ఇలా ఉందని ఆయన అంటున్నారు. -
‘స్వచ్ఛ భారత్’కు బ్రాండ్ అంబాసిడర్‌ను చేస్తే బాగుంటుందేమో?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉధృతంగా సాగుతోందట. ఇతర రాష్ట్రాల్లో సెటిలర్లు వచ్చి మరీ తమ తమ ఖాళీ స్థలాల్లో చెత్త, మురుగు నీటిని తొలగించడం వంటి పనులకు శ్రీకారం చుడుతున్నారట. ఇంతటి ఊపుతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కొనసాగుతుందేంటా? మోడీ ఇచ్చిన పిలుపు కారణమా? జన్మభూమిపై మమకారమా? అన్న ప్రశ్నలు మెదళ్లను తొలుస్తున్న వారంతా ఆరా తీస్తే వారికి విస్తుబోయే నిజాలు తెలుస్తున్నాయట. అమరావతి పక్కనే ఉన్న నియోజకవర్గంలో ఓ టీడీపీ ముఖ్య నేత తనయుడి ఆక్రమణలు పెచ్చుమీరాయి. దీంతో తమ ఖాళీ స్థలాల్ని నిరుపయోగంగా ఉంచితే ఎక్కడ కబ్జా చేస్తారోనన్న భయంతో ఖాళీగా ఉన్న స్థలాల్ని కొత్త రూపు సంతరించుకునేలా చేస్తున్నారట. ఎక్కడ జాగా కనబడితే అక్కడ పాగా వేస్తున్న సదరు టీడీపీ నేత తనయుడు వ్యవహారంతో మురుగు నీటితో కంపు కొడుతున్న స్థలాలు కళ కళలాడుతున్నాయి. ఖాళీ స్థలాలలో చిన్న పాటి గుడిసైనా వేసుకుని తమ స్థలాన్ని పరిశుభ్రంగా కాపాడుకుంటున్నారట. ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సదరు ముఖ్య నేత తనయుడిని స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తే బాగుంటుందని సొంత పార్టీ నేతలు సెటైర్లు విసురుతున్నారట. -
స్వచ్ఛభారత్ రాజకీయ ప్రచారానికే...
విశాఖపట్నం: ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం రాజకీయ ప్రచారం కోసమేనని సీపీఎం నేత సీతారాం ఏచూరీ విమర్శించారు. ఎన్నికల్లో తాము ఇక ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. శుక్రవారం ఇక్కడి సమావేశంలో మాట్లాడిన ఆయన అంశాల వారిగానే పార్లమెంటు లోపల, వెలుపల మద్దతు కూడగట్టుకుని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం ఇంటర్నెట్పై ఆంక్షలు విధించాడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. కాగా, పనిచేసే చోటుతోపాటు బహిరంగ ప్రదేశాల్లో కూడా పురుషుడి ప్రవర్తన బాగుండాలని సూచించారు.