జాతీయ జెండాకు అవమానం | insulted to national flag in Adilabad | Sakshi
Sakshi News home page

జాతీయ జెండాకు అవమానం

Published Sat, Jan 27 2018 5:20 PM | Last Updated on Sat, Sep 15 2018 4:15 PM

insulted to national flag in Adilabad - Sakshi

తలకిందులుగా జాతీయ జెండా ఆవిష్కరించిన దృశ్యం

గుడిహత్నూర్‌(బోథ్‌) : ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కరాడ్‌ బ్రహ్మానంద్‌ కార్యాలయంలో అప్పటికే సిద్ధంగా ఉన్న టీఆర్‌ఎస్‌ గద్దె, గులాబిరంగులో ఉన్న పోల్‌ పైనే జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో వేడుకలకు హాజరైన పలువురు నాయకుల తీరుపట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తలకిందులుగా జెండా ఆవిష్కరణ 
మందమర్రిరూరల్‌(చెన్నూర్‌): పట్టణంలోని కార్మెల్‌ హైస్కూల్‌ సమీపంలో ఉన్న హెచ్‌ఎంఎస్‌ యూనియన్‌ కార్యాలయం ఎదుట నాయకులు జాతీయ జెండాను తల కిందులుగా ఆవిష్కరించారు. అటువైపుగా వెళ్తున్న సాక్షి విలేఖరి కంట పడడంతో వెంటనే కెమెరాలో బంధించాడు. కొద్ది సమయానికి తేరుకున్న నాయకులు తిరిగి జెండాను కిందికి దించి సరిచేసి ఆవిష్కరించారు.

మురుగునీటిలో జెండా పండుగ 
కెరమెరి(ఆసిఫాబాద్‌): ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్‌ పేరిట స్వచ్ఛత కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుంటే.. ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా ఉంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలోని ఎస్సీ కాలనీలో అంగన్‌వాడి కేంద్రం వద్ద జెండా మురికి నీటిలో రెపరెపలాడింది. ఆ కేంద్రానికి సమీపంలోనే డ్రెయినేజీ ఉంది. అది పిచ్చిమొక్కలు, పూడికతో నిండి ఉండడం వల్ల ఆ మురుగునీరంతా జెండా ఎగురవేసే గద్దె వరకు పారింది. దీంతో గతి లేని పరిస్థితుల్లో జెండాను అక్కడే ఎగురవేశారు. ఈ దృశ్యాన్ని చూసిన వారు మాత్రం ఈసడించుకున్నారు



 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

జెండావద్ద మురుగునీరు 

2
2/2

టీఆర్‌ఎస్‌ గద్దె, పోల్‌పై ఎగురవేసిన జాతీయ జెండా

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement