
కాన్‌కుర్తిలో పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు
సాక్షి,దామరగిద్ద: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఐసీడీఎస్ పథకం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చేపట్టిన పోషణ్ అభియాన్ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషిచేస్తుంది. గర్భిణులు, చిన్నారులు తీసుకునే ఆహరంలో పౌష్టికాహార ప్రాధాన్యతను గుర్తించి ప్రజలను అవగాహణ కల్పించడంలో అంగన్‌వాడీ కార్యకర్తలు వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు గ్రామంలో ఉన్న వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. స్థానికంగా లభించే ఏ ఆహారంలో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో తెలియజేస్తున్నారు. తీసుకోవల్సిన జాగత్రలు వాటిని కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు.
పక్షోత్సవాల్లో చైతన్య కార్యక్రమాలు
మద్దూర్ ప్రాజెక్టు పరిధిలోని దామరగిద్ద, కోస్గి, మద్దూరు మండలాల్లోని 239 అంగన్‌వాడీ కేంద్రాల్లో సీడీపీఓ స్వప్నప్రియ సమక్షంలో మహిళ దినోత్సం సందర్భంగా మార్చి 8 నుంచి పోషణ్ అభియాన్ నిర్వహిస్తున్నారు. మండలంలో 63 కేంద్రాల పరిధిలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రాధిక జ్యోతి పర్యవేక్షించారు. పౌష్టికాహరం ప్రాధాన్యతను తెలిపే ప్రదర్శణలు క్షేత్ర పర్యటను అవగాహణ సదస్సులు నిర్వహించారు.
రోజుకో కార్యక్రమంతో..
పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మార్చి 8న పోషణ మేళా– పోషణ పక్షం, 9న అన్నప్రాసన, సామూహిక సీమంతాలు, అక్షరాభ్యాసం, 10న పోషణ్ ర్యాలీ, 11న రకతహీణతపై పాఠశాలలో క్యాంపు, కిషోర బాలికలకు అవగాహన, 12న పోషక ఆహారం పై సమావేశం, 13న ఇంటింటి పోషణ పండుగ ప్రతిజ్ఞ, 14న యువజన సంఘాలతో సమావేశం పోషణ నడక, 15న పోషకాహార ప్రదర్శన, 16న రైతు క్లబ్‌ల సమావేశం, అంగడి సంత కార్యక్రమం, 17న ప్రభాత్ ఫెరి పోషణ, 18న యువజన సంఘాల లేదా పాఠశాలల్లో సమావేశం,19న కిచెన్ గార్డెన్‌ల పై క్షేత్ర పర్యటన, 20న రక్తహీనతపై కిషోర బాలికల ఆవగాహణ క్యాంపు, 21న పోషణ్ ర్యాలీ నిర్వహించారు.
పౌష్టికాహార ప్రాధాన్యత తెలిపేందుకే
పౌష్టికాహార లోపంతో గర్భిణులు, చాన్నిరులు అనారోగ్యపాలవుతున్నారు. ఈ సమస్యను తొలగించేందుకు ఐసీడీఎస్ ద్వారా ప్రభుత్వం పోషణ అభియాన్ పక్షోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్టు పరిధిలోని 239 కేంద్రాల్లో పక్షం రోజులుగా నిర్ధేశిత షెడ్యూలు ప్రకారం అంగన్‌వాడీ కార్యర్తలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్య వంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. శుక్రవారం ప్రాజెక్టు స్థాయి సదస్సు నిర్వహిస్తున్నాం.
–స్వప్నప్రియ, సీడీపీఓ, మద్దూరు
Comments
Please login to add a commentAdd a comment