సాక్షి, నారాయణపేట : పట్టణంలోని జంగిడిగడ్డ ఏరియా.. బుధవారం సాయంత్రం అంతా నిర్మానుష్యంగా ఉంది. ఒక్కసారిగా ఒకదాని వెంట మరొకటి వాహనాలు రయ్.. రయ్ మంటూ దూసుకొచ్చాయి. అందులో నుంచి పెద్దఎత్తున పోలీసులు దిగి ఇంటింటికి తిరుగుతూ జల్లెడ పట్టారు. అక్కడున్న వారంతా పోలీసులు వచ్చారేంటి అంటూ భయం భయంగా చూస్తున్నారు. అంతలోనే అక్కడికి వచ్చిన ఎస్పీ చేతన అక్కడే ఉన్న చిన్నారులతో ముచ్చటించింది. ఐశ్వర్య అనే అమ్మాయి ముందుకు వచ్చి మేడం.. నేను పెద్దయ్యాక పోలీస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటూ ఎస్పీని అడిగింది. వెంటనే ఎస్పీ ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని వెరీగుడ్.. మంచిగా చదువుకుంటే పోలీసు అవుతావని చెప్పింది. పోలీసులు ఎందుకు ఉంటారని అడగగా.. దొంగలను పట్టుకోడానికి అంటూ బదులిచ్చింది. పోలీసు వాహనాల శబ్దం ఎలా ఉంటుంది అనగానే అక్కడున్న చిన్నారులంతా కుయ్.. కుయ్ అని వినిపించడంతో శెభాష్ అంటూ.. అందరికి చాక్లెట్లు ఇచ్చి, వారితో ఫొటో దిగారు.
Comments
Please login to add a commentAdd a comment