Superintendent of Police (SP)
-
పల్నాడులో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు: ఎస్పీ
-
బెస్ట్ లేడీ పోలీస్.. దుర్మార్గులను చీల్చి చెండాడిన ఏఎస్పీ సుప్రజ
ఆమె ఓ నమ్మకం.. ఆమెపై అచంచలమైన విశ్వాసం.. కేసు టేకప్ చేశారంటే బాధితులకు సాంత్వన దొరికినట్లే.. నిందితుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తినట్లే. నిందితులు ఎక్కడ దాక్కున్నా వెదికి పట్టుకుని, వారికి శిక్ష పడేవరకు విశ్రమించరని అంటారు.. ఆమే గుంటూరు ఏఎస్పీ సుప్రజ. బాధితుల పక్షాన నిలిచి, వారి కన్నీళ్లు తుడిచి, న్యాయం చేయడమే కాకుండా సిబ్బందికి అన్నివిషయాల్లో చోదోడు వాదోడుగా ఉంటూ ‘సుప్రజ’ల పోలీస్‌గా పేరు గడించారు. గుంటూరు: ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం.. సిబ్బంది కష్టసుఖాల్లో వారికి అండగా నిలుస్తారు.. అడ్మినిస్ట్రేషన్ లో ఆమె పెట్టింది పేరు.. కేసు విచారణ చేపడితే.. నిందితులకు శిక్షపడే వరకు విశ్రమించరు. అవినీతి మచ్చ లేకుండా.. మూడేళ్ల పాటు జిల్లా ప్రజలకు ఎన్నో సేవలందించిన గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ కె.సుప్రజ అటు అధికారులు.. సిబ్బంది.. ఇటు ప్రజల నుంచి ఎన్నో మన్ననలు పొందారు. జిల్లా అడ్మిన్ ఏఎస్పీగా ఉన్న సుప్రజను ఏసీబీకి బదిలీ చేస్తూ.. బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు ఈస్ట్, వెస్ట్, ట్రాఫిక్ డీఎస్పీగా పనిచేయటంతో పాటు, ఏఎస్పీగా ఆమె సమర్ధవంతగా విధులు నిర్వర్తించారు. అనేక కేసుల్లో విచారణాధికారిగా బాధితుల పక్షాన నిలిచి, నిందితులకు జైలు శిక్షలు పడేలా కృషి చేశారు. 2020లో కోవిడ్ సమయంలో గుంటూరు జిల్లా అడ్మిన్ ఏఎస్పీగా కె.సుప్రజ బాధ్యతలు స్వీకరించారు. కరోనా కల్లోల సమయంలో సిబ్బందికి రావాల్సిన పలు నగదు అంశాల్లో ఆమె కీలకంగా వ్యవహరించి అవి వారికి చెందేలా చూశారు. గుంటూరు జిల్లా రూరల్, అర్బన్ విభజన అంశంలో కీలక పాత్ర పోషించారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా పూర్తిస్థాయిలో దృష్టి సారించి, మన్ననలు పొందారు. అనేక కేసుల్లో విశేష ప్రతిభ.. జిల్లా అడ్మిన్‌గా బాధ్యతలు చేపట్టక ముందు అనేక కేసుల్లో విచారణాధికారిగా ఉన్న ఏఎస్పీ సుప్రజ నిందితులకు శిక్షలు పడటంలో ఎంతో పట్టుదలతో ముందుకు సాగారు. గుంటూరు ఈస్ట్ డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో నేపాల్‌కు చెందిన ఒక కుటుంబం స్వెట్టర్లు అమ్ముకునేందుకు గుంటూరుకు వచ్చిన సమయంలో వారి ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ కుటుంబం స్థానిక వ్యక్తులకు భయపడి ఇక్కడ నుంచి నేపాల్‌కు తిరిగి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ సుప్రజ, ఇక్కడి సిబ్బందిని నేపాల్‌కు పంపి, వారిని తిరిగి ఇక్కడకు పిలిపించి కేసు నమోదు చేయటంతో పాటు, నిందితుడి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా కృషి చేశారు. ► లాలాపేట పీఎస్ పరిధిలో ఒక వృద్ధుడు చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడేలా ఆమె కేసును నడిపించారు. ► రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మేడికొండూరు బాలిక కిడ్నాప్, రేప్ కేసులో నెలల తరబడి పని చేసి స్వయంగా రంగంలోకి దిగిన ఏఎస్పీ 82 మంది నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. వెస్ట్ డీఎస్పీగా ఉన్న సమయంలో చేపట్టిన ఈ కేసులో పురోగతి సాధించటంతో అడ్మిన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా, కేసు నిర్వహణ, చార్జిటు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించటంతో పాటు, ఆమెను అభినందించింది. మూడేళ్లు ఒక ఎత్తు.. ఆ మూడు నెలలు ఒక ఎత్తు మూడేళ్ల పాటు గుంటూరు అడ్మిన్ ఏఎస్పీగా పనిచేసిన సుప్రజ.. ఒక మూడు నెలల పాటు గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆ సమయంలో గుంటూరు రేంజ్ ఐజీ జి.పాలరాజు ఆదేశాలతో ఆమె చేపట్టిన అడ్మిని్రస్టేషన్ అద్భుతమనే చెప్పాలి. జిల్లాలో ఉన్న 1600 రౌడీషీటర్లుకు సంబంధించి, ఆధిపత్య పోరు, నేరాలు జరుగుతున్న సమయంలో స్వయంగా ప్రతి స్టేషన్‌కు వెళ్లిన ఆమె రౌడీషీటర్లకు తమదైన శైలిలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న 8 మంది రౌడీషీటర్లును జిల్లా బహిష్కరణ చేసి, వారిపై పీడీ యాక్టును ప్రయోగించిన ఘనత ఏఎస్పీ సుప్రజదే. వారిలో 1250కిపైగా బైండోవర్ చేసి వెన్నులో వణుకు పుట్టించారు. రాత్రి పది గంటలకల్లా దుకాణాలను మూసి వేయించడంతో పాటు, విజుబుల్ పోలీసింగ్ నిర్వహించి, అర్ధరాత్రి ప్రయాణాలు చేసే ఎంతోమందికి ధైర్యాన్ని కలి్పంచారు. కేవలం ఆ మూడు నెలల వ్యవధిలో 3వేల మందికిపైగా బహిరంగ మద్యపానానికి పాల్పడుతున్న మందుబాబులను పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎన్నో అవార్డులు... ప్రశంసలు విధి నిర్వహిణలో విశేష ప్రతిభ కనబరిచి.. అవినీతి మచ్చలేని అధికారిగా ఏఎస్పీ సుప్రజ మంచిపేరు సంపాదించుకున్నారు. నేపాల్ చిన్నారి రేప్ కేసు ఘటనలో స్వయంగా నేపాల్ ప్రభుత్వ ప్రతినిధులు గుంటూరు వచ్చి ఆమెను సత్కరించటంతో పాటు, అక్కడ ఆమెకు ప్రకటించిన అవార్డును అందజేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ‘ది బెస్ట్ ఇన్విస్టిగేషన్’ అవార్డును అందుకున్నారు. ముఖ్యంగా బాలికలు, మహిళలకు సంబంధించి చేపట్టిన కేసుల్లో విశేష ప్రతిభ చూపిన ఆమె ఆరుగురికి యావజ్జీవ శిక్షలు పడేందుకు పాటుపడ్డారు. అనేక అవార్డులు చేపట్టి.. విధి నిర్వహణలో ఎలా ఉండాలో చేసి చూపించారు. అందుకే ‘అడ్మిన్ మేడం.. అందరి మనిíÙ’గా పేరు తెచ్చుకున్నారు. -
ఎస్పీ ప్రవీణ్‌కుమార్ బదిలీ
నిర్మల్: ఎస్పీ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ బదిలీ అయ్యా రు. కొత్త ఎస్పీగా జీ జానకీషర్మిల నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అధికారులను బది లీ చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నాలుగో ఎస్పీగా తొలిసారి మహిళా అధికారి నియమితులయ్యారు. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న జానకీషర్మిలను ఎస్పీగా నియమించారు. ప్రస్తుతం బదిలీపై వెళ్తున్న ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌కు కొత్త ఎస్పీ శాఖాపరంగా ఒక ఏ డాది సీనియర్. తన జూనియర్ స్థానంలోకి వస్తున్న ఈ సీనియర్ అధికారి రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిని చూసి న అనుభవం ఉంది. జిల్లా మూడో ఎస్పీగా 2021 మార్చి 14 చల్లా ప్రవీణ్‌కుమార్ నియమితులై మూ డేళ్లు సేవలందించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లు నిండుతున్న అధికారుల బదిలీల్లో భాగంగా ప్రవీణ్‌కుమార్‌ను బదిలీ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ జోన్ డీసీపీగా బదిలీపై వెళ్తున్నారు. జిల్లాపై తనదైన ముద్ర జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పారదర్శక పోలీస్ విధుల్లో ప్రవీణ్‌కుమార్ తనదైన ముద్రవేశారు. మూడేళ్ల కాలంలో ఎదురైన పలు ఘటనలు, అసెంబ్లీ ఎన్నికలనూ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. పోలీసుల సంక్షేమానికీ తనవంతు కృషిచేశారు. జిల్లాకేంద్రంలో పోలీస్ పెట్రోల్‌బంక్, ప్రత్యేక పోలీస్ క్యాంటిన్ తీసుకువచ్చారు. జానకీషర్మిల బయోడేటా 2007 మే 31న గ్రూప్–1 ద్వారా డీఎస్పీగా ఎంపిక. 2009 మార్చిలో ఉమ్మడిరాష్ట్రంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా నియామకం. 2009 జులైలో కొవ్వూరు డీఎస్పీగా.. 2009 నవంబర్‌లో రాజమండ్రి అర్బన్ సెంట్రల్‌జోన్ డీఎస్పీగా.. 2011లో రాజమండ్రి అడిషనల్ ఎస్పీగా పదోన్నతి. 2012లో సైబరాబాద్ క్రైమ్స్ అడిషనల్ డీసీపీగా బదిలీ. 2013లో కన్ఫర్డ్ ఐపీఎస్‌గా ఉత్తర్వులు. 2015లో హైదరాబాద్ నార్త్‌జోన్ రీజినల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా.. 2016లో ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా బదిలీ. 2017లో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీగా పదోన్నతి. 2018లో ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ. 2024లో నిర్మల్ ఎస్పీగా బదిలీ. -
పక్కా ప్లాన్‌తోనే టీడీపీ శ్రేణుల దాడి: చిత్తూరు ఎస్పీ
సాక్షి, పుంగనూరు: అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా పచ్చ పార్టీ నేతలు రెచ్చిపోయారు. పుంగనూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పోలీసులను టార్గెట్ చేసి దాడులకు పాల్పడ్డారు. ఇక, ఎల్లో బ్యాచ్ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, 14 మంది పోలీసులు గాయపడ్డినట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఎస్పీ రిషాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పథకం ప్రకారమే పోలీసులపై దాడి చేశారు. చంద్రబాబు పుంగనూరు హైవే మీదుగా చిత్తూరు వెళ్లాల్సి ఉంది. రూట్ మార్చి పుంగనూరు వచ్చేందుకు ప్రయత్నించారు. పుంగనూరులోకి రాకుండా టీడీపీ శ్రేణులను అడ్డుకున్నాం. అడ్డుకున్న పోలీసులపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగారు. విచక్షణారహితంగా దాడులు చేశారు. బీర్ బాటిళ్లు, కర్రలు, రాళ్లతో టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేశారు. టీడీపీ శ్రేణుల రాళ్ల దాడిలో 50 మందికిపైగా గాయపడ్డారు. రెండు పోలీసు వాహనాలను తగలబెట్టారు. దాడులకు దిగిన టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేస్తాం. దాడుల వెనుక ఎంత పెద్ద వ్యక్తులను అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: పుంగనూరు దాడుల్లో షాకింగ్ వాస్తవాలు.. టీడీపీ నేతల వాహనాల్లో గన్స్.. -
మే 9న ‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష పథకం, నాడు-నేడుపై సీఎం సమీక్షించారు. చాలా ప్రతిష్టాత్మకంగా మే 9న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని.. దీనికోసం 1902 హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశామని సీఎం అన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే? ‘‘చాలా ప్రతిష్ట్మాతకమైన కార్యక్రమం. మనం ఇప్పటికే స్పందన నిర్వహిస్తున్నాం. స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం. ఇండివిడ్యువల్ గ్రీవెన్సెస్‌ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే దీని ఉద్దేశం. హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తే.. దాని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలి’’ అని సీఎం అన్నారు. ►సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్ యూనిట్లు ఉంటాయి ►ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్ చేయాలి ►గ్రీవెన్స్ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలి ►ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యం ►ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుంది ►హెల్ప్‌లైన్‌ద్వారా గ్రీవెన్స్ వస్తాయి ►వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలి ►గ్రీవెన్స్ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం ►ఇండివిడ్యువల్, కుటుంబం స్థాయిలో గ్రీవెన్సెస్ ►రిజ్టసర్ అయిన గ్రీవెన్సెస్ ఫాలో చేయడం ►ప్రభుత్వ సేవలు, పథకాలపై ఎంక్వైరీ ►ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం అన్నది జగనన్నకు చెబుదాం ప్రధాన కార్యక్రమాలు ►ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్ అయి ఉంటారు ►వారి గ్రీవెన్స్‌స్‌ను సలహాలను నేరుగా తెలియజేయవచ్చు: ►ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ గ్రీవెన్స్‌స్‌ను నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చూస్తుంది ►ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు రెగ్యులర్ అప్డేట్స్ అందుతాయి ►అంతేకాక ఇదే హెల్ప్‌లైన్ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటుంది ►గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్ గురించి అవగాహన కల్పిస్తారు ►ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకునేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తారు ►జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమల్లో మూడు కీలక యంత్రాంగాల ఉంటాయి ►సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు ఉంటాయి ►ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారులుప్రత్యేకాధికారులుగా ఉంటారు ►క్రమం తప్పకుండా ఆయా జిల్లాలను వీరు సందర్శించి పర్యవేక్షిస్తారు ►ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను పర్యవేక్షిస్తారు ►కలెక్టర్లతో కలిపి… జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు ►సమస్యల పరిష్కారాల తీరును రాండమ్‌గా చెక్చేస్తారు ►ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల పనితీరును పర్యవేక్షిస్తారు ►ఎక్కడైనా స పట్ల సంతృప్తి లేకపోతే.. దాన్ని తిరిగి ఓపెన్ చేస్తారు ►ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారు ►పరిష్కార తీరుపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తారు ►చీఫ్‌సెక్రటరీ, సీఎంఓ, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్ చేస్తారు ►ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుంది ►ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగారి పేరు పెట్టారు అంటే.. మొత్తం ప్రభుత్వం యంత్రాంగం పేరు పెట్టినట్టే ►అధికారుల మీద ఆధారపడే ముఖ్యమంత్రి తన విధులను నిర్వహిస్తారు ►మీరు అంత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తే… కార్యక్రమం సమర్థవంతంగా సాగుతున్నట్టే లెక్క ►ప్రజలకు నాణ్యంగా సేవలను అదించాలన్నదే దీని ఉద్దేశం ►ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్ల రూపాయలను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుంది ►అవసరమైన చోట.. ఈ డబ్బును ఖర్చు చేయవచ్చు ►వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్‌కు ఇస్తున్నాం: ►దీనివెల్ల వేగవంతంగా గ్రీవెన్స్‌స్ పరిష్కారంలో డెలవరీ మెకానిజం ఉంటుంది: ►అంతేకాకుండా గ్రామ స్థాయిలోని సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్వాడీలు, విలేజ్‌క్లినిక్స్.. అవన్నీకూడా సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న అంశంపైన కూడా దృష్టిపెడతారు ►ఇవి సక్రమంగా పనిచేస్తే… చాలావరకు సమస్యలు సమసిపోతాయి ►అందుకే అవి సమర్థవంతంగా పనిచేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం ఇదీ చదవండి: రామోజీ, రాధాకృష్ణా.. జననేతకు జనమేగా స్వాగతం పలికేది! -
పులివెందుల కాల్పుల ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
సాక్షి, వైఎస్సార్: పులివెందుల కాల్పుల ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పరిశీలించారు. ఆర్థిక లావాదేవీల విషయంలో భరత్ యాదవ్.. దిలీప్, మహబూబ్ బాషాపై లైసెన్స్ గన్‌తో కాల్పులు జరిపినట్లు తెలిపారు. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో దిలీప్ అక్కడికక్కడే మరణించినట్లు పేర్కొన్నారు. బుల్లెట్ గాయాలైన మహబాబ్ బాషాను మెరుగైన చికిత్స నిమిత్తం పులివెందుల ఆస్పత్రి నుంచి కడప ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. కాల్పుల ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. నిందితుడు భరత్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. చదవండి: మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు -
కూరగాయల కత్తితో రోహిత్ దాడి చేశాడు : ఎస్పీ
-
లేడీ సింగం: అవినీతి పోలీస్ అధికారుల వెన్నులో వణుకు
ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తా.. మహిళా రక్షణకు ప్రాధాన్యతనిస్తా.. కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా చూస్తా.. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతా.. ఇల్లీగల్ లిక్కర్..గుట్కా..గాంబ్లింగ్ తదితరాలపై ప్రత్యేక దృష్టిసారిస్తా.. ఇక డిపార్ట్మెంట్లో అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదంటూ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాడే తన బాటను స్పష్టం చేశారు మలికా గర్గ్. తొమ్మిది నెలల కిందట బాధ్యతలు స్వీకరించిన ఆమె ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన ప్రారంభించారు. నిర్లక్ష్యం, అక్రమార్కులపై వేటు వేశారు. డీఎస్పీ, సీఐ, నలుగురు ఎస్ఐలు, పలువురు కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని దూకుడు పెంచారు. తమ మార్క్ పాలనతో ముందుకు సాగుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో అవినీతి పోలీస్ అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. కింది స్థాయి సిబ్బంది మొదలు డీఎస్పీ స్థాయి అధికారి వరకు ఎస్పీ దెబ్బకు అలర్ట్ అయ్యారు. ఇప్పటి వరకు చేసిన అవినీతి కార్యకలాపాలను నిలిపివేయాల్సిన అనివార్య పరిస్థితులు పోలీస్ సిబ్బందికి, అధికారులకు ఏర్పడ్డాయి. జిల్లా సరిహద్దుల్లోనూ అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు కొంతమేర తెరపడింది. కేసుల దర్యాప్తులో సైతం వేగం పెరిగింది. తప్పు చేస్తే వేటు తప్పదనే సంకేతాలు ఇస్తూనే సమర్ధవంతంగా పనిచేసే వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఎస్పీ మలికా గర్గ్. 2021 జూలై 15న ప్రకాశం జిల్లా ఎస్పీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. రెండు, మూడు నెలల పాటు జిల్లాపై అవగాహన పెంచుకున్నారు. హోంగార్డు మొదలుకొని డీఎస్పీ, ఏఎస్పీ స్థాయి అధికారి వరకు విధుల్లో వారి పనితీరును పరిశీలించారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టే వరకు జిల్లాలో పరిస్థితులు వేరేగా ఉండేవి. సలాములతో కాలం గడుపుతూ ఇష్టారీతిన విధులు నిర్వహిస్తూ వచ్చిన పోలీసు సిబ్బందికి, అధికారులకు తనదైన శైలిలో కౌన్సెలింగ్ ఇస్తూ వచ్చారు. దీంతో చాలా వరకు వారి పంథాను మార్చుకున్నారు. తమ వైఖరిలో మార్పురాని వారిపై ఆమె చర్యలకు ఉపక్రమించారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తూనే, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ తనదైన మార్క్ చూపిస్తున్నారు. తప్పుచేస్తే అంతే.. విధుల్లో తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ మలిక గర్గ్ కొన్ని సంఘటనల్లో నిరూపించారు. జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన కొన్ని సంఘటనల్లో కఠినమైన చర్యలు చేపట్టారు. ఇటీవల యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన రియల్టర్ హత్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైని సస్పెండ్ చేశారు. అదేవిధంగా యర్రగొండపాలెం సీఐని వీఆర్‌కు పిలిపించారు. మార్కాపురం డీఎస్పీకి చార్జ్ మెమో జారీ చేశారు. లింగసముద్రం ఎస్సై ఇసుక రవాణా విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో అతనిని సస్పెండ్ చేశారు. కొత్తపట్నం ఎస్సై విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సస్పెండ్ చేశారు. గ్రానైట్ విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని బల్లికురవ ఏఎస్సైతో పాటు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి హోంగార్డును విధుల నుంచి తప్పించారు. బేస్తవారిపేటలో ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు మద్యం తాగి న్యూసెన్స్ సృష్టించడంతో వారిరువురినీ సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంపై వేటు విధుల్లో ఉంటూ ప్రజల పట్ల, ఫిర్యాదుల పట్ల, ఫిర్యాదుదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను సహించేది లేదంటూ కొందరిపై చర్యలు చేపట్టారు. జరుగుమల్లి ఎస్సై ఇసుక అక్రమార్కుల విషయలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదులు రావటంతో ఆమెను వీఆర్‌కు పిలిపించారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరికొందరు పోలీస్ సిబ్బంది, అధికారులను కూడా దాదాపు 10 మందికి పైగా వీఆర్‌కు పిలిపించారు. జిల్లాలోని మారుమూల పోలీస్ స్టేషన్‌ను సైతం తనిఖీ చేసిన ఎస్పీ మలిక గర్గ్ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది, పోలీస్ అధికారులకు మెమోలు, చార్జ్ మెమోలు జారీ చేశారు. రికార్డులు సక్రమంగా నిర్వహించకపోయినా అలాంటి వారిపై చర్యలు తీసుకున్నారు. -
Uday Kumar Reddy: ఎస్సైగా ఇక్కడే.. ఎస్పీగా ఇక్కడికే!
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: ఎస్సైగా పోస్టింగ్ పొందిన చోటే ఎస్పీ హోదాలో విధుల్లో చేరడం ఆనందంగా ఉందని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నూతనంగా విధుల్లో చేరిన ఎస్పీతో సోమవారం ‘సాక్షి’ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. 1991లో పోలీసు శాఖలో ఎస్సైగా విధుల్లో చేరా. ఉట్నూర్ ఏరియాలో తుపాకీ భుజాన వేసుకుని అడవులను జల్లెడ పట్టా. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ హిస్టరి పట్టా పొందా. ఉట్నూర్ పోలీసు స్టేషన్లో ప్రొహిబిషన్ ఎస్సైగా కడెం పోలీసు స్టేషన్లో ఎస్సైగా పనిచేశా. మావోయిస్టుల కార్యకలాపాలపై దృష్టి సారించి జిల్లా నుంచి వారిని తరిమివేయడంతో ప్రభుత్వం సీఐగా పదోన్నతి కల్పించింది. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎస్పీ హోదాలో జిల్లాకు వచ్చా. 18 సంవత్సరాల పాటు జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది. సాక్షి: శాంతి భద్రతల విషయంలో ఎలాంటి చర్యలు చేపడతారు? ఎస్పీ: శాంతిభద్రతల విషయంలో ప్రత్యేక చర్యలు చేపడతాం. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లను సందర్శిస్తా. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటా. నేరాలు కట్టడి చేసేందుకు నిఘా సారిస్తాం. సాక్షి: గుట్కా, మట్కా, పేకాటపై ఏవిధంగా దృష్టి సారిస్తారు? ఎస్పీ: గుట్కా, మట్కా, పేకాట, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. తప్పు చేసిన వారు ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు చట్టపరిధిలో ఉంటే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు ఫోన్ ద్వారా, నేరుగా కలిసే అవకాశం కల్పించి వారి సమస్య పరిష్కారానికి కృషిచేస్తా. చదవండి: (పోలీస్ వర్సెస్ పార్టీస్: న్యూఇయర్ వేడుకలపై ఉత్కంఠ) సాక్షి: జిల్లాలో పనిచేసిన 18 ఏళ్లలో మీ అనుభవం ఎలా ఉంది? ఎస్పీ: 1991లో ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సైగా విదుల్లో చేరా. మారుమూల ఆదివాసీ గిరిజన గ్రామాల్లో అటవీ ప్రాంతాలన్నీ కలియతిరిగా. మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాంచంద్రాపూరం. వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలు సుబ్బారెడ్డి, సామ్రాజ్యం. నాతో పాటు ఓ సోదరి ఉంది. నా భార్య అరుణ. ఇద్దరు సంతానం. కుమారుడు సంతోష్, కూతురు సాధన ఉన్నారు. ఇటీవలే వీరి వివాహం జరిగింది. ఎస్సైగా ప్రారంభమైన నా జీవితం అంచెలంచెలుగా ఎదుగుతూ ఎస్పీ స్థాయికి చేరా. ఇదే నెలలో నాన్ క్యాడర్ ఐపీఎస్ హోదా రావడం సంతోషంగా ఉంది. సాక్షి: జిల్లాలో మావోయిస్టుల కదలికలపై ఎలాంటి దృష్టి సారిస్తారు? ఎస్పీ: జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతా. గతంలో ఎస్సైగా పనిచేసిన సమయంలో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపాం. అందుకే ప్రభుత్వం నాకు సీఐగా పదోన్నతి సైతం కల్పించింది. ఆ అనుభవంతో జిల్లాలో వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తా. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ప్రతీ కదలికపై నిఘా పెంచుతాం. సాక్షి: నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు ఉన్నాయా? ఎస్పీ: నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలి. అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. సోమవారం నుంచి జనవరి 2వరకు ర్యాలీలు, బహిరంగసభలు నిషేధం. అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రజలు ఒకేచోట గుమిగూడి ఉండరాదు. భౌతిక దూరం పాటించాలి. వేడుకల సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి అన్ని ప్రధాన కూడళ్ల వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తాం. సాక్షి: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎస్పీ: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపడతాం. పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలు నిలిపేలా చూస్తాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతాం. సాక్షి: మహిళల భద్రత, నేరాల అదుపునకు ఎలాంటి చర్యలు చేపడతారు? ఎస్పీ: షీ టీమ్ ద్వారా మహిళలు, యువతుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడతాం. నేరాల అదుపునకు రాత్రి వేళల్లో పెట్రోలింగ్, గస్తీ ముమ్మరం చేస్తాం. విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని మరింత పటిష్టం చేస్తాం. సంఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తాం. రౌండ్ ది క్లాక్ పోలీసింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం. సాక్షి: జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. చిన్నపాటి ప్రమాదాలు, నేరాలు జరిగితే సాక్ష్యం లేకుండా పోతోంది. వీటిపై మీ స్పందన ఏమిటి? ఎస్పీ: కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపడతాం. జిల్లా కేంద్రంలో ఎక్కడెక్కడా సీసీ కెమెరాలు ఉన్నాయి, ఎన్ని పనిచేస్తున్నాయి, ఎన్ని పనిచేయడం లేదనే వివరాలు సేకరిస్తాం. ఏయే ప్రాంతంలో సీసీ కెమెరాలు అవసరం ఉన్నాయో గుర్తించి ఏర్పాటు చేస్తాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తాం. -
భూదందాలకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ వెంకట అప్పలనాయుడు
-
‘నన్ను, నా పిల్లల్ని నరికేస్తానంటున్నాడు’.. హోంగార్డ్‌పై భార్య ఫిర్యాదు
అనంతపురం: ‘నన్ను, నా పిల్లల్ని నరికిపారేస్తానని భర్త బెదిరిస్తున్నాడు. అతని నుంచి మాకు ప్రాణహాని ఉంది’ అంటూ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పకు జిల్లా జైలు హోంగార్డు నీలిమ ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని ఎస్పీ చేపట్టారు. వివిధ సమస్యలపై 153 అర్జీలు అందాయి. తన సమస్యను ఎస్పీ దృష్టికి హోంగార్డు నీలిమ అర్జీ రూపంలో తీసుకువచ్చి మాట్లాడారు. నగరానికి చెందిన బాబాఫకృద్దీన్తో తనకు 11 ఏళ్ల క్రితం వివాహమైందని, తమకు ఇద్దరు ఆడపిల్లలు సంతానమని వివరించారు. తనను భర్త తరచూ కొట్టేవాడన్నారు. తాజాగా చంపుతానని బెదిరిస్తున్నాడని వాపోయారు. నీలిమ సమస్యపై ఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ.. విచారణ, తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ఎస్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అల్పపీడనం: మీ రక్షణ కోసమే మేమున్నాం.. అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, తిరుపతి: రానున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి రంగంలో ఎన్డీఆర్ఎస్, ఎస్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు అందుబాటులో ఉంటాయని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. రానున్న రోజుల్లో అల్పపీడనం కారణంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పాడనున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఎవరికి వారు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రమాదం బారిన పడకుండా జాగ్రత్త వహించాలని కోరారు. అదే విధంగా అత్యవసరం వచ్చినప్పడు ఎదుర్కోవలసిన పరిస్థితులపై సూచనలు, సలహాలు ఇచ్చారు. సూచనలు, సలహాలు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 26 నుంచి డిసెంబర్ 2 వరకు అతి భారీగా వర్షాలు పడనున్నాయని సమాచారం ఉందని ఈ నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యవసరం అయితేనే ప్రజలుగానీ, వాహనదారులుగానీ బయటకు రావాలన్నారు. ప్రజలు ప్రమాదాల భారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ పోల్స్, పాత భవనాలు, చెట్ల కింద నిలబడరాదని సూచించారు. ఈ సమయంలో ప్రస్తుతం నిండిన చెరువులు పొంగే అవకాశం ఉందని, నదులు కాలువలు వరద నీటితో ఉధృతంగా ప్రవహించవచ్చు అని తెలిపారు. పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. సోషల్ మీడియాలో భయాందోళనలు కలిగించవద్దని, అపోహాలను నమ్మొద్దని.. ఏ విషయమైనా నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియా, వాట్సప్‌లో వచ్చు కొన్ని వార్తలను అతిగా నమ్మవద్దని, మెసేజులు వచ్చిన వెంటనే ఇతరులకు పంపవద్దని.. ఒక్కసారి నిజమేంటో తెలుసుకోవాలని సూచించారు.ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్త పడాలని, అలసత్వం పనికిరాదన్నారు. అనుక్షణం ప్రజల రక్షణ కొరకే తాము ఉన్నామని, ప్రజలను కాపాడే విషయంలో అనునిత్యం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ట్రాఫిక్ మళ్లింపు జరిగినప్పుడు అధిక ట్రాఫిక్‌లో ప్రయాణించేటప్పుడు, ఎదుటి వాహనదారులకు వెళ్లడానికి అవకాశం ఇస్తేనే మీరు(ప్రజలు) వెళ్లడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కావున లైన్ పద్దతిని తప్పకుండా పాటించి సహకరించాలని కోరారు. అత్యవసర వాహనాలకు ఆటంకం కలిగించరాదని సూచించారు. మరికొన్ని జాగ్రత్తలు, సూచనలు: ► లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు, వరద ముంపుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివాసముంటున్నవారు తమ ఇళ్లలోని విలువైన వస్తువులు నగదు, నగలు, ఇంటి పత్రాలు వంటి వాటిని సురక్షిత ప్రాంతంలో భద్రపరచుకోవాలి. ► రోడ్లపై ప్రయాణించేటప్పుడు తెలియని ప్రాంతాల్లో నీటి క్రింద మ్యాన్‌హోల్ ఉండవచ్చు, కావున నడిచి వెళ్లేవారు, వాహనదారులు రోడ్డు పరిస్థితిని అంచనా వేస్తూ జాగ్రత్తపడి వెళ్లాలి. ► వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో ఉన్నవాళ్లు పోలీస్ కంట్రోల్ రూమ్‌కి గానీ దగ్గరలో ఉన్న పోలీస్ వారికీ తమ యొక్క ప్రాంత పరిస్థితిని ఫోన్ ద్వారా అందించండి. ► ఇళ్లలో వృద్ధులు చిన్న పిల్లలు ఉంటే, వారిపట్ల జాగ్రత్తలు తీసుకోండి. సురక్షిత ప్రాంతంలో ఉన్న బంధువుల వద్దకు పంపండి. వరద ముంపు వలన ప్రమాదం ఏర్పడే వరకు అవకాశం ఇవ్వకండి. ►ఈ దఫా పడనున్న భారీ వర్షాల కారణంగా చెరువులకు గండి పడే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి, రిజర్వాయర్లలో నీరు అధికంగా చేరే ప్రమాదం ఉంది, భారీ గాలులతో కూడిన వర్షం వలన చెట్లు విరిగి పడే ప్రమాదం ఉంది, కరెంటు స్తంభాలు ఒరిగి లైను తెగిపడే ప్రమాదం ఉంది, చాలాకాలం క్రితం కట్టిన పాత భవనాలు నేలకొరిగే ప్రమాదముంది. ► ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టినప్పటికీ, ప్రజలు కూడా తమపైన ఉన్న బాధ్యతను గుర్తెరిగి అప్రమత్తంగా ఉండాలి. ►జిల్లాలోని పలు ప్రాంతాలలో చెరువులన్నీ నిండి ఇప్పటికే పొర్లుతున్నాయి, 27వ తేదీ నుంచి రెండవ తేదీ వరకు కురిసే అతి భారీ వర్షాల కారణంగా చెరువులు తెగిపోయే ప్రమాదం కూడా ఉంది. ►గ్రామాలలో ఉన్న వారు, పట్టణాలలో నగరాలలో లోతట్టు ప్రాంతాలలో నివసించేవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకునేందుకు, వరద ముంపుకు గురి కాకుండా ఉండేందుకు ముందస్తు ఆలోచనలు చేసుకోవాలి. ►అత్యవసర పరిస్థితులలో సహాయం కోరదలచినవారు డయల్ 100, 8099999977, 63099 13960 నెంబర్లకు సమాచారం అందిస్తే వెంటనే సంబంధిత రేస్క్యు ఆపరేషన్ పోలీసు సిబ్బంది సహాయం అందించడానికి అందుబాటులోకి వస్తారు. ►ఇప్పటికే పలు బృందాలను ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో రేస్క్యు ఆపరేషన్ పోలీస్ బృందాలు సిద్ధంగా ఉంచాము. ప్రజల రక్షణ కొరకే పోలీస్‌వారు అనునిత్యం అప్రమత్తంగా ఉండి ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఇది గమనించి సహాయక చర్యల్లో భాగంగా మీవంతు సహకారం అవసరమైన సమయంలో పోలీస్‌వారికి అందించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను. -
అంత్యక్రియల కోసం దాచిన సొమ్ము లూటీ.. పోలీసాఫీసర్‌పై ప్రశంసలు
SSP Sandeep Chaudhary of Srinagar helped Chana seller with 1 lakh సాక్షి, ఇంటర్నెట్: బోసి నవ్వులు చిందిస్తున్న ఈ తాతను చూడగానే.. మనసుకు ఏదో తెలియని ఆహ్లాదం కలుగుతుంది కదా. కానీ ఈ తాతకు వచ్చిన కష్టం తెలిస్తే.. గుండె బద్దలవుతుంది. కష్టానికి కారకులైన వారి మీద ఎక్కడాలేని కోపం వస్తుంది. కొందరు సోమరిపోతుల మాదిరి కాకుండా.. వయసు మీద పడి.. వృద్ధాప్యంలోకి అడుగుపెట్టినప్పటికి కూడా.. పని చేయడం మానలేదు ఈ తాత. రోడ్డు పక్కన కూర్చుని పల్లీ, బఠాణీలు అమ్ముకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు. ఇప్పటి వరకు పల్లీలు అమ్ముతూ దాదాపు లక్ష రూపాయల వరకు పోగు చేశాడు. తాను చనిపోయాక అంత్యక్రియలకు అక్కరకు వస్తుందని ఈ మొత్తాన్ని దాచుకున్నాడు. కానీ దరిద్రులు తాత కష్టార్జితాన్ని దొంగిలించారు. దీని గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఈ విషయం ఓ ఉన్నతాధికారికి తెలిసింది. వృద్ధుడి కష్టం అతడిని కదిలించింది. దాంతో తాత పొగొట్టుకున్న లక్ష రూపాయలను తానే అందించాడు. సదరు ఉన్నతాధికారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. ఆ వివారలు.. (చదవండి: Mrs Vishnoi: నాన్న కావాలని ఉందన్నారు.. కానీ తిరిగి రాలేదు.. అయినా) జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ రెహమాన్ అనే వృద్ధుడు రోడ్డు పక్క పల్లీలు, బఠాణీలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. కుటుంబ సభ్యులు ఉన్నారో లేరే తెలియదు. ఒకవేళ ఉన్నా.. బతికున్నప్పుడు, మరణించిన తర్వాత కూడా తన వల్ల వారు ఇబ్బంది పడకూడదని భావించిన రెహమాన్.. రోడ్డు పక్కన పల్లీలు అమ్ముతూ తద్వారా వచ్చిన డబ్బును కూడబెట్టసాగాడు. ఇలా ఇప్పటి వరకు లక్ష రూపాయల వరకు దాచుకున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం కొందరు దుండగులు రెహమాన్ అంత్యక్రియల కోసం దాచుకున్న మొత్తాన్ని దొంగిలించారు. పాపం జీవితాంతం కష్టపడి సంపాదించి దాచుకున్న సొమ్ము ఇలా దొంగలపాలవ్వడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు రెహమాన్. పోయిన సొమ్ము తిరిగి వస్తుందనే నమ్మకం ఏ కోశాన లేదు. అయినప్పటికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: 20ఏళ్ల అవమానాలు: బారాత్, డీజే, విందుతో వృద్ధ జంట పెళ్లి ) రెహమాన్ వ్యధ, బాధ శ్రీనగర్ సీనియర్ సూపరింటెండెంట్ పోలీసు అధికారి సందీప్ చౌదరీని కదిలించింది. రెహమాన్ వివరాలు తెలుసుకున్న సందీప్.. అతడు పొగొట్టుకున్న లక్ష రూపాయలను రెహమాన్‌కు అందజేశాడు. దీని గురించి శ్రీనగర్ మేయర్ పర్వైజ్ అహ్మద్ ఖాద్రీ తన ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. సందీప్ మంచి మనసును ప్రశంసిస్తున్నారు నెటిజనులు. Appreciative decision by Srinagar police & @Sandeep_IPS_JKP towards the old aged Channa seller to assist him with the money of one lakh that was looted from his home. Abdul Rehman had saved the laborious money for his last rites; he sells snacks and lives all alone! Salute sir pic.twitter.com/FL0tXvoUWB — Parvaiz Ahmad Qadri (@Parvaiz_Qadri) November 14, 2021 చదవండి: దారుణం: కాచుకోవాల్సిన వారే కాటికి పంపారు.. -
32 మంది పోలీసులను బదిలీ చేసిన కర్నూలు ఎస్పీ
సాక్షి, కర్నూలు: పోలీసుశాఖలో అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం వహించిన 32 మందిపై బదిలీ వేటు పడింది. కర్నూలు ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి 32 మంది పోలీసులను బదిలీ చేశారు. ముగ్గురు ఏఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లు..17 మంది కానిస్టేబుళ్లను ఎస్పీ బదిలీ చేశారు. వారు పనిచేస్తున్న స్థానాల నుంచి తప్పించి మరో ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మట్కా, గుట్కా, అక్రమ మద్యం వ్యవహారాల్లో ఆరోపణలు నేపథ్యంలో బదిలీ చేసినట్లుఓ తెలుస్తోంది. ప్రస్తుతం బదిలీ వేటు పోలీసుల శాఖలో చర్చనీయాంశంగా మారింది. -
ఎనీ డ్యూటీ.. వుయ్ డూ ఇట్
మహిళా పోలీసులు అంటే రిసెప్షన్, బందోబస్తులకే పరిమితం అనేది ఒకనాటి మాట. మహిళా పోలీసులు అంటే హోంగార్డు నుంచి డిజీ స్థాయి వరకు ఎక్కడ చూసినా వారే అనేది నేటి మాట. సెంట్రీ గార్డ్, పెట్రోలింగ్, డ్రైవర్ పోలీస్ స్టేషన్, సర్కిల్, సబ్‌డివిజన్ ‘ఎనీ డ్యూటీ.. వుయ్ డూ ఇట్’ అనే కాన్ఫిడెన్స్ మహిళా పోలీసుల్లో పెరిగిందని అంటూ పోలీసు శాఖలో మహిళా శక్తి గురించి ఐపీఎస్ ఆఫీసర్, కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎన్.శ్వేత ‘సాక్షి’కి వివరించారు. ‘‘గతంలో పోలీసు శాఖలో ఎక్కడో ఒక చోట మహిళా సిబ్బంది ఉండేవారు. ఏవైనా ఆందోళన ప్రదర్శనలు, వీఐపీల కార్యక్రమాలు ఉంటే మహిళల కోసం మహిళా పోలీసులను ఎక్కడెక్కడి నుంచో రప్పించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భద్రత విషయంలో వుమెన్ సేఫ్టీ వింగ్ తీసుకుంటున్న అనేక చర్యలు మహిళల్లో ఎంతో ధైర్యాన్ని నింపుతున్నాయి. మహిళలు, విద్యార్థినులు, యువతులపై వేధింపులు, దాడులను నిరోధించడంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ‘షీ టీం’ల ద్వారా పోలీసు శాఖ చాలా వరకు సక్సెస్ అయ్యింది. అలాగే వేధింపులు, దాడులకు గురైన మహిళలను చేరదీసి వారికి ధైర్యాన్ని కలిగించేందుకు ‘భరోసా’ కేంద్రాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. భారీగా మహిళల హాజరు ఇటీవల పోలీసు ఎస్సైతో పాటు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన రాత పరీక్షకు భారీ సంఖ్యలో యువతులు హాజరయ్యారు. అందులో ఎంపికైన వారు ఎసై ్స, కానిస్టేబుల్ శిక్షణ కూడా పూర్తి చేసుకుని విధుల్లో చేరారు. మరోవైపు పోలీసు శాఖలో హోంగార్డు నుంచి అదనపు డీజీ స్థాయి వరకు మహిళా అధికారులు తమ పనితీరుతో గుర్తింపు పొందుతున్నారు. చాలా మంది మహిళా అధికారులు శాంతిభద్రతల పరిరక్షణలో తమదైన శైలిలో పనిచేస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు. శ్వేత, ఐపీఎస్ రాష్ట్రంలో అన్ని విభాగాలకు కలిపి 55 వేల మంది వరకు పోలీసులు ఉండగా, అందులో కానిస్టేబుల్ నుంచి అదనపు డీజీ స్థాయి వరకు 4,829 మంది ఉన్నారు. అలాగే 2 వేల మందికి పైగా హోంగార్డులుగా పనిచేస్తున్నారు. పోలీసు శాఖలో మొత్తం ఉద్యోగుల్లో మహిళల సంఖ్య ప్రస్తుతం 10 శాతానికి చేరింది. ఇంకా పెరగాల్సి ఉంది. ఇటీవల ప్రభుత్వం పోలీసు శాఖ ఉద్యోగాలలో మహిళలకు 33 శాతం కేటాయించిన మీదట వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో కొద్దిమంది మాత్రమే మహిళలు ఉన్న పోలీసు శాఖలో ఇప్పుడు దాదాపు ఏడు వేల పైచిలుకు మహిళా అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. డ్రైవింగ్.. ఎనీ టైమ్.. మహిళా పోలీసు కానిస్టేబుళ్లు, ఎస్సైలు అందరికీ డ్రైవింగ్‌లో శిక్షణ ఉంటుంది. అవసరం ఏర్పడినపుడు వెహికిల్‌ను వారే స్వయంగా నడుపుకుని వెళ్లేలా శిక్షణ ఇస్తారు. మహిళా కానిస్టేబుళ్లు సెంట్రీ డ్యూటీతో పాటు బందోబస్తు డ్యూటీలు, డ్రైవింగ్, పెట్రోలింగ్, ట్రాఫిక్ డ్యూటీలన్నీ చేస్తున్నారు. ఏ డ్యూటీ అయినా చేయగలమని నిరూపిస్తున్నారు. అందుకు మానసికంగానూ సంసిద్ధులయ్యారు. అన్ని రకాల డ్యూటీలు మగవారితో సమానంగా చేసి సత్తా చాటుతున్నారు. మరింత ప్రోత్సాహం అవసరం మహిళా పోలీసు అధికారులు, సిబ్బందిని ప్రోత్సహిస్తే మరింతగా దూసుకుపోతారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎంతో మంది మహిళా ఉన్నతాధికారులు తమ సత్తా చాటుతున్నారు. పోలీసు డ్యూటీ అనగానే మగవారిదనే భావన సమాజంలో మెల్లమెల్లగా మాయమైపోతోంది. దీనికి అనుగుణంగా పోలీసు శాఖలో చేరడానికి మహిళలూ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే పది శాతం వరకు మహిళల సంఖ్య పెరిగింది. మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. మహిళలకు అండగా... పోలీసు స్టేషన్‌కు వెళ్లాలంటే మహిళలు జంకే పరిస్థితులు ఉండేవి. ఆపద ఉందని పోలీసు స్టేషన్‌కు వెళితే తమ గోడు వినేవారు ఉండకపోగా, వాళ్ల నుంచి వచ్చే ప్రశ్నలు ఇబ్బందిపెట్టేవిగా ఉండేవి. అయితే పోలీసు శాఖలో మహిళలు అధికారులుగా వచ్చిన తరువాత అనేక మార్పులు జరిగాయి. ప్రభుత్వం కూడా మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతీ ఠాణాలో మహిళా రిసెప్షనిస్టును ఉంచడం ద్వారా మహిళలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఏర్పడింది. అలాగే మహిళలపై దాడుల నిరోధానికి షీ టీమ్స్ ఏర్పాటు, మహిళపై జరిగే అఘాయిత్యాల్లో బాధితులకు ‘సఖి’ అండగా నిలవడం, ఇంకా ఎన్నో చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మహిళా అధికారులు ఉన్న చోట బాధిత మహిళలు నేరుగా వెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తద్వారా వారికి సత్వర న్యాయం అందుతోంది. పోలీసు శాఖలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం ద్వారా మహిళలకు కొండంత అండ దొరికినట్టయ్యింది’’ అని వివరించారు శ్వేత. – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
సూపర్ మామ్ ముందు.. కాప్ ఎంత?
సీబీఐలో పెద్ద ఆఫీసర్ నిర్మల. డిపార్ట్మెంట్లో సూపర్ కాప్. ‘కావచ్చు కానీ.. నేనైతే డాటర్ ఆఫ్ లక్ష్మీ సుందరం’ అంటారు ఆమె. అదే ఆమె కోరుకునే పెద్ద హోదా.. గౌరవం, గుర్తింపు.. అన్నీ! ‘‘మా అమ్మే నన్నింత చేసింది. ఆ సూపర్ మామ్ ముందు..ఈ సూపర్ కాప్ ఎంత? అని.. నవ్వుతూ అంటున్నారు నిర్మల. ‘‘మా అమ్మ సూపర్ మామ్. అంతేకాదు సూపర్ ఉమన్ కూడా. నా ఈ యూనిఫామ్ వెనుక మా అమ్మ పోరాటం ఉంది. నన్ను ఇలా తీర్చిదిద్దే క్రమంలో ఆమె ఎన్నో సామాజిక అడ్డంకులను ఛేదించింది. తనకోసం తను కూడా అమ్మమ్మ తాతయ్యలతో పోరాడింది. ఉన్నత చదువులు చదవాలని ఎంతో ఆశ పడింది. కానీ అప్పట్లో మా అమ్మమ్మ, తాతయ్య సామాజిక ఒత్తిడికి తలొగ్గి అమ్మకు పదిహేడేళ్లకే పెళ్లి చేశారు. మా నాన్న రైతు. నేను పుట్టిన తర్వాత ఏడాదిన్నరకే నాన్న ఈ లోకాన్ని వదిలాడు. ఊహ తెలిసేటప్పటికి నాకు తెలిసిన మా కుటుంబం... అమ్మ, అన్నయ్య, నేను. అమ్మ తన గురించి తాను ఎలా కలలు కన్నదో అలా నన్ను తీర్చిదిద్దింది. యూపీఎస్సీ పరీక్షను నేను ఒకటి, రెండు కాదు... నాలుగో ప్రయత్నంలో పూర్తి చేశాను. యూనిఫామ్ నా ఒంటిమీదకు వచ్చి పద్నాలుగేళ్లయింది’’ అని తల్లి లక్ష్మీ సుందరంను గుర్తు చేసుకున్నారు ఐపీఎస్ ఆఫీసర్ నిర్మలాదేవి. రాత్రిళ్లలో పొలానికి నీరు నిర్మలాదేవిది కోయంబత్తూరులోని అలందురై గ్రామం. ఇప్పుడామె నాగపూర్‌లో సీబీఐ విభాగంలో ఎస్పీ. ‘‘తల్లిని తలుచుకోవడానికి మదర్స్‌డే వంటి ఏడాదికి ఒక రోజు కాదు, మా అమ్మ మాకు రోజూ తలుచుకోవాల్సినన్ని జ్ఞాపకాలను మిగిల్చింది’’ అన్నారామె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో. ‘‘అమ్మ తెల్లవారు జామునే నిద్రలేచి ఇంటి పనులు, వంట పూర్తి చేసి అన్నయ్యను, నన్ను స్కూల్‌కి సిద్ధం చేసేది. ఆ తర్వాత తాను చెరకు పొలానికి వెళ్లి పని చేసేది. హోమ్‌వర్క్ చేయడంలో మాకు సహాయం చేసేది. రాత్రి ఎప్పుడు పడుకునేదో తెలియదు. మళ్లీ మేము నిద్రలేచేటప్పటికి పనుల్లో కనిపించేది. మాకు గ్రామాల్లో రోజంతా కరెంటు కష్టం. మోటార్లు పని చేయడానికి అనువుగా మూడు ఫేజ్‌ల సప్లయ్ రోజులో కొద్ది గంటలు మాత్రమే ఉండేది. కొద్ది రోజులు త్రీ ఫేజ్ కరెంటు రాత్రిళ్లు ఇచ్చేవారు. అలాంటప్పుడు పొలానికి నీరు పెట్టడానికి రాత్రి పూట వెళ్లాల్సి వచ్చేది. ఇవన్నీ చేస్తూనే మా ఊరి మహిళలకు ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేయడంలో మార్గదర్శనం చేసేది. దరఖాస్తు ఫారాలు నింపి పెట్టేది. తొంబైలలో ట్రాక్టర్ నడిపిన సూపర్ ఉమన్ మా అమ్మ. అప్పట్లో మాకు అ పనులన్నీ అవసరమై చేసినవే. సరదాగా ప్రతి సంఘటనను ఫొటో తీసి పెట్టుకోవడం తెలియదు. ఇప్పట్లాగ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న రోజులు కావవి. పది మందికి న్యాయం నాకు డిగ్రీ పూర్తవగానే బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అమ్మకు ఆర్థికంగా సహాయంగా నిలవగలిగాను. అన్నయ్య డిగ్రీ చేశాడు, కానీ అమ్మకు సహాయంగా వ్యవసాయంలోనే స్థిరపడ్డాడు. అమ్మ మాకు చిన్నప్పటి నుంచి పదిమందికి సహాయం చేసే ఉద్యోగం చేయమని చెప్తుండేది. అన్యాయానికి గురయ్యి పోలీస్ స్టేషన్ మెట్లెక్కేవాళ్లు, ఇంటి స్థలం ఇప్పించమని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసేవాళ్లు కొల్లలు. ఆ సర్వీసులు ప్రజలకు నేరుగా సహాయం చేయగలిగిన రంగాలనేది అమ్మ. నా బ్యాంకు ఉద్యోగం అమ్మకు సంతృప్తినివ్వలేదు. దాంతో యూపీఎస్సీ మీద దృష్టి పెట్టాను. ఉద్యోగం చేస్తూ రాసిన పరీక్ష ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తర్వాత సొంతంగా లైబ్రరీలో పుస్తకాలు తెచ్చుకుని ప్రిపేరవుతున్న సమయంలో... కోయంబత్తూరులో ఉచితంగా సివిల్స్‌కి కోచింగ్ ఇస్తున్న విద్యాసంస్థ వివరాలను వార్తా పత్రికలో గమనించింది అమ్మ. ఆ విద్యాసంస్థలో చేరాను. పుస్తకాలన్నీ కొనడం కష్టమయ్యేది. దాంతో మా బ్యాచ్‌మేట్ కొన్న పుస్తకాలను ఫొటోకాపీలు తీసుకుని చదువుకున్నాను. నాలుగో ప్రయత్నంలో 272వ ర్యాంకు వచ్చింది. అలా 2008లో ఈ యూనిఫామ్‌కు అర్హత సాధించగలిగాను. నన్నిలా చూడాలని అమ్మ పాతికేళ్ల పాటు ఎదురు చూసింది. ఎనిమిదేళ్లు చూడగలిగింది. 2016లో మాకు దూరమైంది. ఆమె వరకు ఆమె ఎటువంటి అసంతృప్తి లేకుండా సంతృప్తిగానే మాకు దూరమైంది. కానీ అప్పటి నుంచే అన్నయ్యకు, నాకు వెలితి మొదలైంది. అమ్మను రోజూ తలుచుకుంటాం. మన సమాజంలో ఉండే అనేక అర్థం లేని నియమాలను ఎదుర్కొంటూ, ఏ దశలోనూ అధైర్యపడకుండా, సింగిల్ ఉమన్‌గా అనేక కష్టనష్టాలకోర్చి మరీ మమ్మల్ని తన కలల ప్రతిరూపాలుగా తీర్చిదిద్దుకుంది. ‘నీకు సివిల్స్ ప్రిపరేషన్‌కి పుస్తకాలు షేర్ చేసిన అర్జున్... తన జీవితాన్ని కూడా నీకు షేర్ చేశాడు..’ అంటుండేది అమ్మ. అర్జున్ అప్పుడప్పుడూ ఆ మాటను గుర్తు చేస్తుంటాడు. తనిప్పుడు నాగపూర్‌లో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు’’ అని చిరునవ్వుతో చెప్పారు ఎస్పీ నిర్మలాదేవి. -
హత్రాస్ ఉదంతం.. ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు
లక్నో: ఉన్నతకుల దురహంకారానికి 20 ఏళ్ల దళిత యువతి బలయిన ఉదంతం దేశవ్యాప్తంగా ఆగ్రహ రగిలిస్తోంది. ప్రజలు, విపక్షాలు సదరు యువతికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. దాంతో యూపీ ప్రభుత్వం హత్రాస్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తో సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. దీనిపై దర్యాప్తు చేస్తోన్న ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక నివేదిక ఆధారంగా దుర్వినియోగ ఆరోపణలపై వీరిని సస్పెండ్ చేసినట్లు తెలిపింది. నిందితులతో సహా బాధితురాలి కుటుంబ సభ్యులకు కూడా నార్కో ఎనాలసిస్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సిట్ బృందం కోరింది. (చదవండి: మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నాం) పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై పెప్టెంబర్ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. తీవ్రంగా గాయపడిన యువతి రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడి ఈ మంగళవారం మరణించింది. ఆమె మృతదేహాన్ని తెల్లవారుజామున 2:30 గంటలకు పోలీసులు దహనం చేశారు. దీనిపై కూడా విమర్శలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇక హత్రాస్ దారుణానికి వ్యతిరేకంగా ఢిల్లీ సహా దేశంలోని పలు నగరాల్లో నిరసనలు చెలరేగాయి. వీటిలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భీమ్ ఆర్మీ చీష్ చంద్ర శేఖర్ ఆజాద్ పాల్గొన్నారు. దోషులను ఉరితీయాలని.. యూపీ సీఎం రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఇక ఇందుకు సంబంధించి అలహాబాద్ హై కోర్టు యూపీ అధికారులకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
ఎస్పీపై హెడ్ కానిస్టేబుల్ ఫైర్
సాక్షి, ఒంగోలు: ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న ప్రకాశం పోలీసు శాఖలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో రైటర్‌గా పనిచేస్తూ తాజాగా కొమరోలు పోలీసుస్టేషన్‌కు బదిలీ అయిన సుబ్బారావు స్థానిక కలెక్టరేట్ వద్ద మంగళవారం మీడియాతో మాట్లాడారు. సుబ్బారావు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు, పబ్లిక్‌తో దురుసుగా వ్యవహరించారంటూ ఏకంగా 38 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలను బదిలీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆరోపణలు వచ్చినప్పుడు విచారించి చర్యలు తీసుకుంటే సంతోషిస్తాంగానీ ఆరోపణలపై ఎటువంటి విచారణ జరపకుండానే ఏకంగా తమను దొంగలుగా పేర్కొనడం ఎంతవరకు సమంజసమని ఎస్పీని హెడ్ కానిస్టేబుల్ సూటిగా ప్రశ్నించారు. తాము విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. కనీసం హెచ్చరిక కూడా చేయకుండానే ఏకంగా బదిలీ వేటు వేయడం అంటే పాము తన పిల్లలను తానే తిన్నట్లుగా ఉందన్నారు. ఇటీవలే తన భార్య చనిపోయిందని, తాను రెండో వివాహం చేసుకున్నానని, ఇలాంటి పరిస్థితుల్లో బదిలీ చేయడం సమంజనం కాదన్నారు. మానసికంగా బాధపడే ఒక అధికారి ఎస్పీకి ఇచ్చే సలహాలతో నేడు జిల్లాలోని పోలీసు సిబ్బంది మొత్తం బాధపడుతున్నారని హెడ్ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో తన గురించి కథనాలు రావాలన్న ఎస్పీ కోరికకు సిబ్బంది బలవుతున్నారన్నారు. ఇలాగే కొనసాగి రామాంజనేయులులా తామూ ఆత్మహత్య చేసుకోవాలా..అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మీడియాతో మాట్లాడడం తప్పో.. ఒప్పో తనకు తెలియదని, ఒక వేళ ఏదైనా చర్య తీసుకున్నా అది తన వరకే పరిమితమై మిగిలిన వారు సంతోషంగా ఉంటే అదే చాలన్నారు. ఒంగోలు టూటౌన్ సీఐ విజ్ఞప్తి హెడ్ కానిస్టేబుల్ ఒకరు మీడియాతో మాట్లాడుతున్నారని తెలియగానే టూటౌన్ సీఐ ఎం.రాజేష్ హుటాహుటిన కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. సుబ్బారావుతో మాట్లాడే ప్రయత్నం చేశారు. టూటౌన్ పోలీసుస్టేషన్‌కు రావాలని కోరారు. అరెస్టు చేస్తానంటే చెప్పండి వస్తా..అంటూ ఆయన సీఐని కోరారు. ఇదే సమయంలో ట్రాఫిక్ డీఎస్పీ నుంచి కూడా పిలుపు రావడంతో సుబ్బారావు డీఎస్పీ వద్దకు వెళ్లి తనకు ఎస్పీ అంటే గౌరవం ఉందని, అయితే అవినీతిపరులంటూ ముద్రవేసి బదిలీ చేయడం మాత్రమే తమను ఆవేదనకు గురిచేసిందంటూ వివరించారు. సుబ్బారావును సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు ఒంగోలు ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో రైటర్‌గా పనిచేస్తూ ప్రజలతో అనుచిత ప్రవర్తనతో పాటు వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ కానిస్టేబుల్ వి.సుబ్బారావు సర్వీస్ రిజిస్టర్‌ను పరిశీలించామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో రెండు క్రిమినల్ కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడని, అతని అనుచిత ప్రవర్తన, విధుల పట్ల నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగా ఇప్పటికే మూడు సార్లు సస్పెండ్ అయ్యారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రస్తుతం సుబ్బారావును సస్పెండ్ చేసి ఆయనపై ఎంక్వయిరీ వేశామని, విచారణలో వచ్చే నివేదిక ఆధారంగా శాఖాపరమైస చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రజారక్షణ కోసం ప్రకాశం పోలీస్ నిరంతరం పనిచేస్తోందని, ఎటువంటి పక్షపాతానికి తావు లేకుండా విధులు నిర్వహిస్తోందంటూ ఎస్పీ సిద్ధార్థ కౌశల్ స్పష్టం చేశారు. -
‘రవి మోహన్ సైనీ’ గుర్తున్నాడా?
జైపూర్: 19 ఏళ్ల క్రితం రాజస్తాన్ అల్వార్‌కు చెందిన రవి మోహన్ సైనీ అనే 14 ఏళ్ల కుర్రాడి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. హిందీలో బాగా ప్రసిద్ధి చెందిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’(కేబీసీ) షోలో మొత్తం 15 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి.. ప్రైజ్ మనీ రూ. కోటి సొంతం చేసుకున్నాడు. ఆ కుర్రాడు ప్రస్తుతం పోర్బందర్లో పోలీసు సూపరింటెండెంట్(ఎసస్పీ)గా విధులు నిర్వహిస్తున్నాడు. రవి పదో తరగతి చదువుతుండగా ‘కేబీసీ జూనియర్’ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఉన్న ఈ షోలో మొత్తం 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి ప్రైజ్ మనీ రూ.కోటి గెలుచుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచాడు రవి. ఓ ఆంగ్ల మీడియా సంస్థ 2017లో అతడిని ఇంటర్వ్యూ చేసింది.(అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం) ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ‘‘కేబీసీ’లో గెలిచిన నాలుగేళ్ల తర్వాత నాకు ప్రైజ్ మనీ అందింది. షో నియమం ప్రకారం 18 ఏళ్లు నిండిన తర్వాతే డబ్బు ఇచ్చారు. ట్యాక్స్ పోను ప్రైజ్ మనీ రూ.కోటిలో 69 లక్షల రూపాయలు నాకు దక్కాయి’ అని తెలిపాడు. తండ్రిని ఆదర్శంగా తీసుకున్న రవి.. పోలీసు డిపార్ట్మెంట్లో చేరాలనుకున్నాడు. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్షలకు హాజరయ్యాడు. అనేక ప్రయత్నాల తర్వాత 2014లో కోరుకున్న ఉద్యోగంలో చేరాడు. ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు సెలక్టయిన రవి గుజరాత్లో విధులు నిర్వహిస్తున్నాడు. రాజ్‌కోట్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న ఆయనకు మూడు రోజుల క్రితం పోర్బందర్ బాధ్యతలు అప్పగించారు.(రాధిక శరత్‌కుమార్ సరికొత్త అవతారం..) -
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులు
సాక్షి, నెల్లూరు: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వహించి మెరుగైన శాంతిభద్రతలను అందిస్తానని జిల్లా నూతన ఎస్పీ భాస్కర్‌భూషణ్ వెల్లడించారు. వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ ఆదివారం ఉదయం 7.45 గంటలకు నూతన పోలీసు కార్యాలయంలోని తన చాంబర్లో భాస్కర్‌భూషణ్ జిల్లా 43వ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువచేసి పోలీసుశాఖపై విశ్వాసాన్ని పెంపొందిస్తామన్నారు. పోలీసు ఉన్నది ప్రజలకోసమేననే భావన కలి్పంచేలా విధులు నిర్వహించేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు పెద్దపీట వేస్తామన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, బలహీనవర్గాల వారి రక్షణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రికవరీలపై ప్రత్యేక దృష్టిసారిస్తామని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక శక్తుల పీచమణుస్తామన్నారు. ప్రధానంగా క్రికెట్‌బెట్టింగ్, మైనింగ్, ఎర్రచందనం మాఫియాలపై ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచి పూర్తిస్థాయిలో కట్టడిచేస్తామన్నారు. చట్టాన్ని ఉపేక్షించేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పోలీసుశాఖకు మూల స్తంభాలైన ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్‌యాక్ట్ అనే మూడు అంశాలకు కట్టుబడి జిల్లా పోలీసు యంత్రాంగం విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. చట్టాలకు లోబడి సిబ్బంది అందరూవిధులు నిర్వహిచాలన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి తనవంతు కృషిచేస్తామని చెప్పారు. తొలుత ఆయన సిబ్బందినుంచి గౌరవవందనం స్వీకరించారు. పండితులు పూర్ణకుంభంతో ఎస్పీకి స్వాగతం పలికారు. 2009 ఐపీఎస్ బ్యాచ్ భాస్కర్‌భూషణ్ బిహార్ రాష్ట్రం ధర్మాంగ జిల్లా క్యూటీకు చెందినవారు. ఆయన ప్రా«థమిక విద్యాభ్యాసం రాంచీలో సాగింది. ఖరగ్‌పూర్ ఐఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. చెన్నై, సింగపూర్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ మరోవైపు సివిల్స్ రాసి 2009లో ఐపీఎస్ అధికారిగా పోలీసుశాఖలో ప్రవేశించారు. కరీంనగర్లో శిక్షణ పొందిన ఆయన ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఏఎస్పీగా, అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఓఎస్డీగా విధులు నిర్వహించారు. 2015 నుంచి 17వరకు పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా పనిచేశారు. అనంతరం ఇంటెలిజెన్స్ ఎస్పీగా, డీజీ కార్యాలయంలో ఐఏజీ అడ్మిన్‌గా విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన పోలీసు బదిలీల్లో నెల్లూరు ఎస్పీగా నియమితులయ్యారు. పనిచేసిన ప్రతిచోట సమర్థవంతమైన అధికారిగా పేరుగడించారు. సిబ్బంది శుభాకాంక్షలు నూతన ఎస్పీ భాస్కర్‌భూషణ్‌కు ఏఎస్పీ క్రైమ్స్ పి.మనోహర్‌రావు, ఏఆర్ ఏఎస్పీ వీరభద్రుడు, ఎస్బీ, నెల్లూరు నగర, రూరల్, ఏఆర్, హోమ్గార్డ్స్ డీఎస్పీలు ఎన్.కోటారెడ్డి, జే శ్రీనివాసులరెడ్డి, కేవీ రాఘవరెడ్డి, రవీంద్రరెడ్డి, డి. శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు మధుబాబు, వేమారెడ్డి, రాములునాయక్, మిద్దెనాగేశ్వరమ్మ, టీవీ సుబ్బారావు, వైవీ సోమయ్య, బి. శ్రీనివాసరెడ్డి, ఆర్ఐలు మౌలుద్దీన్, వెంకటరమణ, ఎంటీవో గోపినాథ్, ఎస్బీ ఎస్సై సాయి శుభాకాంక్షలు తెలిపారు. -
సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ..
సాక్షి, కర్నూలు : ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం ఇప్పిస్తానని విజయవాడకు చెందిన సతీష్‌కుమార్ రూ.4 లక్షలు తీసుకొని మోసం చేశాడని కల్లూరుకు చెందిన హరీ నాయుడు ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశాడు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు ఎస్పీ స్పందన కార్యక్రమం నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన వారి నుంచి వినతులను స్వీకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొమ్మిది నెలల నుంచి ఉద్యోగం పేరుతో తమను తిప్పుకొని మోసం చేశాడని తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని హరీష్‌నాయుడు ఎస్పీకి సమరి్పంచిన వినతి పత్రంలో కోరాడు. జిల్లా వ్యాప్తంగా 95 ఫిర్యాదులు వచ్చాయి. అందులో కొన్ని.. ఇంటి పక్కన సెల్ టవర్‌ను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని బుధవారపేటకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి జనార్ధన్ ఫిర్యాదు చేశారు. అన్నదమ్ముల ఆస్తి తగాదాలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కల్లూరు మండలం యాపర్లపాడు గ్రామానికి చెందిన శివారెడ్డి ఫిర్యాదు చేశారు. ఖాళీ స్థలం ఇప్పిస్తానని నమ్మించి రూ.1.50 లక్షలు తీసుకొని విజయకుమార్ అనే వ్యక్తి మోసం చేశాడని తాండ్రపాడు గ్రామానికి చెందిన మేరమ్మ ఫిర్యాదు చేశారు. జీవనాధారంగా ఉన్న భర్త ఆస్తిని కుమారుడు తమకు తెలియకుండా అమ్ముకున్నాడని, తిరిగి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్యాపిలి మండలం కొమ్మేమర్రి గ్రామానికి చెందిన దూదేకుల బావమ్మ ఫిర్యాదు చేశారు. స్థలానికి వెళ్లే రస్తాలో దిబ్బలు వేసి రాకపోకలకు లేకుండా ఇబ్బందులు కలుగచేస్తున్నాడని శిరివెళ్ల మండలం గుండుపాడు గ్రామానికి చెందిన శివరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. కోర్టు ఇచి్చన తీర్పును కూడా ధిక్కరిస్తూ వృద్ధుడైన తనపై దౌర్జన్యం చేస్తున్నాడని రామిరెడ్డి ఫిర్యాదు చేశాడు. స్పందనకు వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్టప్రకారం విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామి ఇచ్చారు. ఓఎస్డీ ఆంజనేయులు, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు డి..వి.రమణమూర్తి, వెంకట్రామయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ వాసు కృష్ణ, ఎస్ఐలు వెంకటేశ్వర్లు నల్లప్ప, తదితరులు పాల్గొన్నారు. -
మేడం.. నేను పోలీస్‌నవుతా !
సాక్షి, నారాయణపేట : పట్టణంలోని జంగిడిగడ్డ ఏరియా.. బుధవారం సాయంత్రం అంతా నిర్మానుష్యంగా ఉంది. ఒక్కసారిగా ఒకదాని వెంట మరొకటి వాహనాలు రయ్.. రయ్ మంటూ దూసుకొచ్చాయి. అందులో నుంచి పెద్దఎత్తున పోలీసులు దిగి ఇంటింటికి తిరుగుతూ జల్లెడ పట్టారు. అక్కడున్న వారంతా పోలీసులు వచ్చారేంటి అంటూ భయం భయంగా చూస్తున్నారు. అంతలోనే అక్కడికి వచ్చిన ఎస్పీ చేతన అక్కడే ఉన్న చిన్నారులతో ముచ్చటించింది. ఐశ్వర్య అనే అమ్మాయి ముందుకు వచ్చి మేడం.. నేను పెద్దయ్యాక పోలీస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటూ ఎస్పీని అడిగింది. వెంటనే ఎస్పీ ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని వెరీగుడ్.. మంచిగా చదువుకుంటే పోలీసు అవుతావని చెప్పింది. పోలీసులు ఎందుకు ఉంటారని అడగగా.. దొంగలను పట్టుకోడానికి అంటూ బదులిచ్చింది. పోలీసు వాహనాల శబ్దం ఎలా ఉంటుంది అనగానే అక్కడున్న చిన్నారులంతా కుయ్.. కుయ్ అని వినిపించడంతో శెభాష్ అంటూ.. అందరికి చాక్లెట్లు ఇచ్చి, వారితో ఫొటో దిగారు. -
ఇక ప్రతివారం ‘కాఫీ టుగెదర్’ : సీఎం జగన్
సాక్షి, అమరావతి : జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కాఫీ టుగెదర్ కార్యక్రమం పేరుతో ప్రతివారం కలుసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. తద్వారా అధికారుల మధ్య సమన్వయం కుదిరి భూవివాదాల పరిష్కారానికి అవకాశముంటుందని అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన స్పందన రివ్యూ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి మంగళవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘కాఫీ టుగెదర్’ కార్యక్రమం పేరుతో కలుసుకోవాలి. భూవివాదాలకు సంబంధించిన జాబితా ఇచ్చి పుచ్చుకోవాలి. ఈ జాబితాను తహశీల్దార్లకు బుధవారం పంపాలి. గురువారం తహశీల్దార్, ఎస్సై, సర్వేయర్, ఆర్ఐ, వీఆర్వోలు కలిసి కూర్చోవాలి. భూవివాదాల పరిష్కారంపై దృష్టిపెట్టాలి. చాలా చోట్ల భూవివాదాలు శాంతి భద్రతల సమస్యగా మారాయి. ప్రకాశం జిల్లా కలెక్టర్, ఎస్పీలు చేసిన ఈ ప్రతిపాదనలు బాగున్నాయి. మిగతా అధికారులు ఇది పాటించాలి. మళ్లీ చెప్తున్నా.. ఎక్కడా అవినీతి ఉండకూడదు’ అన్నారు. సెప్టెంబర్‌లో ప్రారంభం.. వచ్చే నెల (సెప్టెంబర్) నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో మొదటగా ప్రారంభిస్తామని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటిదాకా ప్రజలకు అందించే బియ్యంలో నాణ్యత లేక వారు తినడంలేదని చెప్పారు. ప్రజలు తినగలిగే బియ్యాన్నే ప్రభుత్వం ఇవ్వాలని స్పష్టం చేశారు. చిత్రావతిలో నీళ్లు నిలపాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అందుకోసం రూ.52 కోట్లు అవసరమవుతాయని కలెక్టర్ అడిగితే వెంటనే ఇవ్వండని అధికారులకు చెప్పానని గుర్తు చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఎస్పీగా దామోదర్ బాధ్యతలు స్వీకరణ
విజయనగరం టౌన్: జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్ శనివారం బాధ్యతలు స్వీకరిం చారు. విజయనగరం పోలీస్ కార్యాలయం ఆవరణలో విశాఖ రేంజ్ డీఐజీ జి.పాలరాజు నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను జిల్లాలో శాంతియుతంగా, నిష్పక్షపాతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ శాఖకు ప్రజలు, మీడియా సహకరించాలని కోరారు. గతంలో తను విశాఖ రూరల్ ఓఎస్డీగా పనిచేశానని, ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లాలో ఉత్సాహవంతులైన యువకులైన పోలీస్ అధికారులున్నారని, వారితో గతంలో పనిచేసిన అనుభవం కూడా ఉందన్నారు. జిల్లాలో ఎటువంటి మావోయిస్ట్ కార్యకలాపాలు గత మూడేళ్లుగా జరగలేదని, ఎటువంటి కేసులు నమోదుకాలేదన్నారు. నేరాలు నమోదయ్యే రేటు ఇతర జిల్లాల కంటే తక్కువగానే ఉందని, కేసులను తను ఒకసారి సమీక్షించి, వాటి సంఖ్యను, నాన్‌బెయిల్‌బుల్ వారెంట్లను మరింతగా తగ్గించేందుకు కృషిచేస్తానని తెలిపారు. జిల్లా ఎస్పీగా పనిచేసి, విశాఖ రేంజ్ డీఐజీగా ఉన్న పాలరాజు పర్యవేక్షణలో ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేస్తామని చెప్పారు. అనంతరం జిల్లాలో ప్రధానంగా నమోదవుతున్న కేసులు, శాంతి భద్రతల సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అభినందనలు వెల్లువ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దామోదర్‌కు విశాఖ రేంజ్ డీఐజీ పాలరాజు పుష్పగుచ్చంతో అభినందనలు తెలిపారు. అనంతరం ఏఎస్పీ ఎం.నరసింహరావు, ఒఎస్డీ జె.రామ్మోహనరావు, బొబ్బిలి ఏఎస్పీ గౌతమీశాలి, పార్వతీపురం ఏఎస్పీ సుమిత్ గరుడ, విజయనగరం డీఎస్పీ డి.సూర్యశ్రావణ్‌కుమార్, ఎస్బీ డీఎస్పీ సి.మురళీనాయుడు, ట్రాఫిక్ డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్సీ, ఎస్టీ సెల్–2 డీఎస్పీ గురుమూర్తి, సీసీఎస్ డీఎస్పీ పాపారావు, ఏఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, సీఐలు జి.రామకృష్ణ, వై.వి.శేషు, రంగనాథం, మోహనరావు, రాంబాబు, ఆర్.శ్రీనివాసరావు, రాజులనాయుడు, ఆర్ఐలు శ్రీహరిరావు, రామకృష్ణ, రమేష్, శంకరరావు, కమ్యూనికేషన్ సీఐ రమణమూర్తి, ఇతర పోలీస్ అధికారులు కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పైడితల్లిని దర్శించుకున్న ఎస్పీ జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దామోదర్ ముం దుగా స్థానిక మూడులాంతర్లు వద్ద ఉన్న పైడితల్లి అమ్మవారిని దర్శిం చుకున్నారు. ఆలయ ఈఓ టి.అన్నపూర్ణ ఆలయ సంప్రదాయం ప్రకా రం స్వాగతం పలికారు. అమ్మవారి కి పసుపు, కుంకుమలతో పూజలు చేయించా రు. అనంతరం వేదపండితులు దూసి కృష్ణమూర్తి, శంబరి శంకరంలు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్ రామారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.