
సాక్షి, కర్నూలు : ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం ఇప్పిస్తానని విజయవాడకు చెందిన సతీష్‌కుమార్ రూ.4 లక్షలు తీసుకొని మోసం చేశాడని కల్లూరుకు చెందిన హరీ నాయుడు ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశాడు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10.30 నుంచి 12.30 గంటల వరకు ఎస్పీ స్పందన కార్యక్రమం నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన వారి నుంచి వినతులను స్వీకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తొమ్మిది నెలల నుంచి ఉద్యోగం పేరుతో తమను తిప్పుకొని మోసం చేశాడని తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని హరీష్‌నాయుడు ఎస్పీకి సమరి్పంచిన వినతి పత్రంలో కోరాడు. జిల్లా వ్యాప్తంగా 95 ఫిర్యాదులు వచ్చాయి. అందులో కొన్ని..
- ఇంటి పక్కన సెల్ టవర్‌ను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని బుధవారపేటకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి జనార్ధన్ ఫిర్యాదు చేశారు.
- అన్నదమ్ముల ఆస్తి తగాదాలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని కల్లూరు మండలం యాపర్లపాడు గ్రామానికి చెందిన శివారెడ్డి ఫిర్యాదు చేశారు.
- ఖాళీ స్థలం ఇప్పిస్తానని నమ్మించి రూ.1.50 లక్షలు తీసుకొని విజయకుమార్ అనే వ్యక్తి మోసం చేశాడని తాండ్రపాడు గ్రామానికి చెందిన మేరమ్మ ఫిర్యాదు చేశారు.
- జీవనాధారంగా ఉన్న భర్త ఆస్తిని కుమారుడు తమకు తెలియకుండా అమ్ముకున్నాడని, తిరిగి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్యాపిలి మండలం కొమ్మేమర్రి గ్రామానికి చెందిన దూదేకుల బావమ్మ ఫిర్యాదు చేశారు.
- స్థలానికి వెళ్లే రస్తాలో దిబ్బలు వేసి రాకపోకలకు లేకుండా ఇబ్బందులు కలుగచేస్తున్నాడని శిరివెళ్ల మండలం గుండుపాడు గ్రామానికి చెందిన శివరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. కోర్టు ఇచి్చన తీర్పును కూడా ధిక్కరిస్తూ వృద్ధుడైన తనపై దౌర్జన్యం చేస్తున్నాడని రామిరెడ్డి ఫిర్యాదు చేశాడు.
స్పందనకు వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్టప్రకారం విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామి ఇచ్చారు. ఓఎస్‌డీ ఆంజనేయులు, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు డి..వి.రమణమూర్తి, వెంకట్రామయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ వాసు కృష్ణ, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు నల్లప్ప, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment