
సాక్షి, వైఎస్సార్: పులివెందుల కాల్పుల ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పరిశీలించారు. ఆర్థిక లావాదేవీల విషయంలో భరత్ యాదవ్.. దిలీప్, మహబూబ్ బాషాపై లైసెన్స్ గన్‌తో కాల్పులు జరిపినట్లు తెలిపారు. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో దిలీప్ అక్కడికక్కడే మరణించినట్లు పేర్కొన్నారు.
బుల్లెట్ గాయాలైన మహబాబ్ బాషాను మెరుగైన చికిత్స నిమిత్తం పులివెందుల ఆస్పత్రి నుంచి కడప ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. కాల్పుల ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు ఎస్పీ వివరించారు. నిందితుడు భరత్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
చదవండి: మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు