నిర్మల్: ఎస్పీ సీహెచ్ ప్రవీణ్‌కుమార్ బదిలీ అయ్యా రు. కొత్త ఎస్పీగా జీ జానకీషర్మిల నియమితులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అధికారులను బది లీ చేస్తూ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నాలుగో ఎస్పీగా తొలిసారి మహిళా అధికారి నియమితులయ్యారు. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న జానకీషర్మిలను ఎస్పీగా నియమించారు.
ప్రస్తుతం బదిలీపై వెళ్తున్న ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌కు కొత్త ఎస్పీ శాఖాపరంగా ఒక ఏ డాది సీనియర్. తన జూనియర్ స్థానంలోకి వస్తున్న ఈ సీనియర్ అధికారి రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిని చూసి న అనుభవం ఉంది. జిల్లా మూడో ఎస్పీగా 2021 మార్చి 14 చల్లా ప్రవీణ్‌కుమార్ నియమితులై మూ డేళ్లు సేవలందించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడేళ్లు నిండుతున్న అధికారుల బదిలీల్లో భాగంగా ప్రవీణ్‌కుమార్‌ను బదిలీ చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్‌బీనగర్ జోన్ డీసీపీగా బదిలీపై వెళ్తున్నారు.
జిల్లాపై తనదైన ముద్ర
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పారదర్శక పోలీస్ విధుల్లో ప్రవీణ్‌కుమార్ తనదైన ముద్రవేశారు. మూడేళ్ల కాలంలో ఎదురైన పలు ఘటనలు, అసెంబ్లీ ఎన్నికలనూ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. పోలీసుల సంక్షేమానికీ తనవంతు కృషిచేశారు. జిల్లాకేంద్రంలో పోలీస్ పెట్రోల్‌బంక్, ప్రత్యేక పోలీస్ క్యాంటిన్ తీసుకువచ్చారు.
జానకీషర్మిల బయోడేటా
2007 మే 31న గ్రూప్–1 ద్వారా డీఎస్పీగా ఎంపిక.
2009 మార్చిలో ఉమ్మడిరాష్ట్రంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా నియామకం.
2009 జులైలో కొవ్వూరు డీఎస్పీగా..
2009 నవంబర్‌లో రాజమండ్రి అర్బన్ సెంట్రల్‌జోన్ డీఎస్పీగా..
2011లో రాజమండ్రి అడిషనల్ ఎస్పీగా పదోన్నతి.
2012లో సైబరాబాద్ క్రైమ్స్ అడిషనల్ డీసీపీగా బదిలీ.
2013లో కన్ఫర్డ్ ఐపీఎస్‌గా ఉత్తర్వులు.
2015లో హైదరాబాద్ నార్త్‌జోన్ రీజినల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా..
2016లో ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా బదిలీ.
2017లో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీగా పదోన్నతి.
2018లో ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ.
2024లో నిర్మల్ ఎస్పీగా బదిలీ.
Comments
Please login to add a commentAdd a comment