పింఛన్‌.. ఇప్పించరూ! | - | Sakshi
Sakshi News home page

పింఛన్‌.. ఇప్పించరూ!

Published Wed, Apr 2 2025 1:03 AM | Last Updated on Wed, Apr 2 2025 1:03 AM

పింఛన

పింఛన్‌.. ఇప్పించరూ!

చిత్రంలోని దివ్యాంగురాలి పేరు తిమ్ముపురే సునీత. భైంసా పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన ఈమెకు పుట్టుకతోనే బుద్ధిమాంద్యం ఉంది. తండ్రి పాండురంగ్‌ అనారోగ్యంతో బాధపడుతుండగా, తల్లి విమల 37 ఏళ్ల కూతురి బాగోగులు చూస్తుంటుంది. 90శాతం వైకల్యంతో ఉన్న సునీతకు పర్మనెంట్‌ వ్యాలిడిటీతో సదరం సర్టిఫికెట్‌ జారీ అయింది. గత ప్రభుత్వ హయాంలో ఆసరా పథకం కింద పింఛన్‌ మంజూరైంది. 2018 జనవరి నుంచి 2019 జనవరి వరకు నెలకు రూ.1,500 చొప్పున బ్యాంక్‌ ఖాతాలో పింఛన్‌ మొత్తం జమయ్యేది. కానీ, తరువాత పింఛన్‌ నిలిచిపోయింది. దీంతో ఆమె అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఆర్థికంగా ఎలాంటి ఆధారం లేదని, దివ్యాంగురాలైన తన కూతురికి పింఛన్‌ మంజూరు చేసి ఆదుకోవాలని ఆమె తల్లి విమల కోరుతోంది.

చిత్రంలోని దివ్యాంగురాలి పేరు భూసారి దివ్య. పట్టణంలోని గుజిరిగల్లికి చెందిన ఈమె డిగ్రీ పూర్తి చేసి కొద్దిరోజులు ప్రైవేట్‌ ఉద్యోగం చేసింది. కచేరీల్లోనూ పాటలు బాగా పాడేది. ఈ క్రమంలో ఒకసారి తీవ్ర జ్వరం రాగా, అస్వస్థతకు గురై బ్రెయిన్‌ స్ట్రోక్‌ బారిన పడింది. అప్పటి నుంచి కాలు, నోరు, చేయి పడిపోయి ఇంటికే పరిమితమైంది. 22ఏళ్ల దివ్యను చూస్తే ఎవరికై నా జాలి కలగకమానదు. తండ్రి మృతిచెందగా, తల్లి ప్రతిభపై కుటుంబభారం పడింది. దివ్య ప్రస్తుతం ఇంట్లో మంచానికి పరిమితమై సదరం సర్టిఫికెట్‌ కోసం ఎదురుచూస్తోంది. ఆన్‌లైన్‌లో స్లాట్‌బుక్‌ చేసి శిబిరానికి వెళ్లినా.. ధ్రువపత్రం రాలేదని వాపోయింది. తన కూతురికి సదరం సర్టిఫికెట్‌ ఇప్పించి, పింఛన్‌ మంజూరు చేయాలని ప్రతిభ కోరుతోంది.

ఇలా.. వీరేకాకుండా జిల్లాలో ఎంతోమంది దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు పింఛన్లు లేక ఇబ్బందులు పడుతున్నారు.

భైంసాటౌన్‌: ప్రభుత్వాలు ఏళ్ల తరబడి కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంతో అర్హులు ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. ఏ పనీ చేయలేక కు టుంబానికి భారంగా మారి అసహాయ స్థితిలో కొ ట్టుమిట్టాడుతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గత ప్రభుత్వం ఆసరా పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఇతరులకు నెలకు రూ.2,016 చొప్పున పింఛన్‌ అందించేది. దివ్యాంగులకు రూ.2,516 అందించగా, ప్రస్తుతం దాన్ని రూ.4,016కు పెంచారు. ప్రస్తుతం ప్రభుత్వం చేయూత పేరిట పింఛన్లు అందిస్తోంది. అయితే, కొత్తగా ఎలాంటి పింఛన్లు మంజూరు చే యడం లేదు. దీంతో కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారో నని ఎంతోమంది అర్హులైన దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు ఎదురుచూస్తున్నారు.

కార్యాలయాల్లోనే దరఖాస్తులు

కొన్నేళ్లుగా ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదు. ప్రస్తుతం ఇంట్లో పింఛన్‌ పొందుతున్న భార్య లేదా భర్త చనిపోతే వారి పింఛన్‌ను మాత్రమే రెండో వ్యక్తికి ఇస్తున్నారు. కొత్తగా ఎలాంటి పింఛన్లు అందడం లేదు. భర్త చనిపోయి ఎంతోమంది వితంతువులు పింఛన్‌ రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది దివ్యాంగులు కూడా పింఛన్లు లేక, ఎలాంటి ఆసరా లేక అవస్థలు పడుతున్నారు. పింఛన్ల కోసం పట్టణాల్లో ప్రజలు మున్సిపల్‌ కార్యాలయాలు, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు అందజేస్తున్నారు. పింఛన్‌ మంజూరు చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అధి కారులు కూడా చేసేది లేక దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇలా మున్సిపల్‌, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ, ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేయడంలేదు. దీంతో పింఛన్లు ఎప్పు డు మంజూరవుతాయోనని అర్హులంతా ఆశగా ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు.

‘ఆసరా’ కరువైన దివ్యాంగులు

‘చేయూత’ కోసం ఎదురుచూపు

ఈ చిత్రంలోని బాలుడి పేరు రావుల శ్వేజన్‌. భట్టిగల్లికి చెందిన సుజాత, రవి దంపతుల కుమారుడైన ఇతడు పుట్టుకతోనే బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. సదరం సర్టిఫికెట్‌ పొందినా.. ఇప్పటికీ పింఛన్‌ మంజూరు కాలేదు. తండ్రి వ్యవసాయం చేస్తూ, తల్లి బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. దివ్యాంగుడైన తమ కొడుకుకు పింఛన్‌ మంజూరు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

పింఛన్‌.. ఇప్పించరూ!1
1/2

పింఛన్‌.. ఇప్పించరూ!

పింఛన్‌.. ఇప్పించరూ!2
2/2

పింఛన్‌.. ఇప్పించరూ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement