CM YS Jagan Review Meeting On Spandana Programme Updates - Sakshi
Sakshi News home page

మే 9న ‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభం: సీఎం జగన్‌

Published Fri, Apr 28 2023 10:15 AM | Last Updated on Fri, Apr 28 2023 4:23 PM

CM YS Jagan Review Meet On Spandana April 2023 Updates - Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష పథకం, నాడు-నేడుపై సీఎం సమీక్షించారు. చాలా ప్రతిష్టాత్మకంగా మే 9న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని.. దీనికోసం 1902 హెల్ప్‌లైన్‌ నంబర్ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశామని సీఎం అన్నారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే?
‘‘చాలా ప్రతిష్ట్మాతకమైన కార్యక్రమం. మనం ఇప్పటికే స్పందన నిర్వహిస్తున్నాం. స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం. ఇండివిడ్యువల్‌ గ్రీవెన్సెస్‌ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే దీని ఉద్దేశం. హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి గ్రీవెన్స్‌ రిజిస్టర్‌ చేస్తే.. దాని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలి’’ అని సీఎం అన్నారు.

సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్‌ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయి
ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్‌ చేయాలి
గ్రీవెన్స్‌ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలి
ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యం
ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుంది
హెల్ప్‌లైన్‌ద్వారా గ్రీవెన్స్‌ వస్తాయి
వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలి
గ్రీవెన్స్‌ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం

ఇండివిడ్యువల్‌, కుటుంబం స్థాయిలో గ్రీవెన్సెస్‌
రిజ్టసర్‌ అయిన గ్రీవెన్సెస్‌ ఫాలో చేయడం
ప్రభుత్వ సేవలు, పథకాలపై ఎంక్వైరీ 
ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం అన్నది జగనన్నకు చెబుదాం ప్రధాన కార్యక్రమాలు

ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్‌ అయి ఉంటారు
వారి గ్రీవెన్స్‌స్‌ను సలహాలను నేరుగా తెలియజేయవచ్చు:
ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ గ్రీవెన్స్‌స్‌ను నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చూస్తుంది

ఐవీఆర్ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు రెగ్యులర్‌ అప్‌డేట్స్ అందుతాయి
అంతేకాక ఇదే హెల్ప్‌లైన్‌ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటుంది
గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్‌ గురించి అవగాహన కల్పిస్తారు
ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకునేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తారు

జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమల్లో మూడు కీలక యంత్రాంగాల ఉంటాయి
సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయి

ప్రతి జిల్లాకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులుప్రత్యేకాధికారులుగా ఉంటారు
క్రమం తప్పకుండా ఆయా జిల్లాలను వీరు సందర్శించి పర్యవేక్షిస్తారు
ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను పర్యవేక్షిస్తారు
కలెక్టర్లతో కలిపి… జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు
సమస్యల పరిష్కారాల తీరును రాండమ్‌గా చెక్‌చేస్తారు
ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల పనితీరును పర్యవేక్షిస్తారు
ఎక్కడైనా స పట్ల సంతృప్తి లేకపోతే.. దాన్ని తిరిగి ఓపెన్‌ చేస్తారు

ఎస్‌ఎంఎస్‌, ఐవీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారు
పరిష్కార తీరుపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తారు
చీఫ్‌సెక్రటరీ, సీఎంఓ, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్‌ చేస్తారు
ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుంది
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగారి పేరు పెట్టారు అంటే.. మొత్తం ప్రభుత్వం యంత్రాంగం పేరు పెట్టినట్టే
అధికారుల మీద ఆధారపడే ముఖ్యమంత్రి తన విధులను నిర్వహిస్తారు
మీరు అంత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తే… కార్యక్రమం సమర్థవంతంగా సాగుతున్నట్టే లెక్క
ప్రజలకు నాణ్యంగా సేవలను అదించాలన్నదే దీని ఉద్దేశం
ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్ల రూపాయలను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుంది
అవసరమైన చోట.. ఈ డబ్బును ఖర్చు చేయవచ్చు
వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్‌కు ఇస్తున్నాం:
దీనివెల్ల వేగవంతంగా గ్రీవెన్స్‌స్‌ పరిష్కారంలో డెలవరీ మెకానిజం ఉంటుంది:
అంతేకాకుండా గ్రామ స్థాయిలోని సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్‌వాడీలు, విలేజ్‌క్లినిక్స్‌.. అవన్నీకూడా సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న అంశంపైన కూడా దృష్టిపెడతారు
ఇవి సక్రమంగా పనిచేస్తే… చాలావరకు సమస్యలు సమసిపోతాయి
అందుకే అవి సమర్థవంతంగా పనిచేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం
ఇదీ చదవండి: రామోజీ, రాధాకృష్ణా..  జననేతకు జనమేగా స్వాగతం పలికేది!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement