District Collectors Video Conference
-
అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. మంగళవారం కూడా దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో సోమవారం సమీక్షించారు.ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్–మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల్లో వరదల పరిస్థితి, పునరావాస, సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తలు తీసుకోండి: భారీ వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాల కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ఏ విధమైన ఆస్తి, ప్రాణనష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే విషయమై జిల్లా కలెక్టర్లే నిర్ణయించుకోవాలన్నారు. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్‌ను ఆదేశించారు.కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు 24/7 పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో డీజీపీ జితేందర్, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరి్వంద్ కుమార్, ఫైర్ సరీ్వసుల డీజీ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. -
రూటు మారినా.. జర్నీ అదే!
సాక్షి, హైదరాబాద్: ధరణి దరఖాస్తుల పరిష్కార రూటు మారింది. గతంలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారానికి ఏ దరఖాస్తు వచ్చినా, ఆ దరఖాస్తు కేవలం కలెక్టర్ లాగిన్‌లో మాత్రమే కనిపించేది. కలెక్టర్ వేలిముద్రతో తన లాగిన్‌ను ఓపెన్ చేసి సదరు దరఖాస్తును కిందిస్థాయికి పంపాల్సి వచ్చేది. కానీ తాజాగా ధరణి పోర్టల్‌లో ఓ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ధరణి కింద ఏ దరఖాస్తు వచ్చినా అది తహసీల్దార్‌కు కనిపించేలా, తహసీల్దార్ ఆ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం కోసం పైఅధికారులకు పంపేలా లాగిన్ లభించింది. ప్రయోజనం లేదంటున్న తహసీల్దార్లు దరఖాస్తు పరిష్కారం చేసే రూటు మారింది కానీ ఆ పరిష్కారం కోసం సదరు దరఖాస్తు చేయాల్సిన ప్రయాణం (జర్నీ) మాత్రం మారలేదని, అలాంటప్పుడు రూటు మార్చడం వల్ల ఒనగూరే ప్రయోజనం కూడా ఏమీ లేదని తహసీల్దార్లు చెబుతున్నారు. ⇒ ప్రస్తుతమున్న విధానంలో ధరణి దరఖాస్తులను తహసీల్దార్ ఓపెన్ చేసినా..ఆన్లైన్, ఆఫ్‌లైన్ రికార్డులను ఆర్డీఓ, జేసీ,కలెక్టర్లకు నాలుగు స్థాయిల్లో పంపాలని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఆన్లైన్లో, ప్రింట్లు తీసి ఆఫ్‌లైన్‌లో పంపాల్సి వస్తోందని వాపోతున్నారు. ⇒ఇలా కాకుండా ఆన్లైన్లో దరఖాస్తు పరిశీలించిన తర్వాత ఆన్లైన్లోనే రిమార్క్స్ పంపితే సరిపోతుందని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లతో కూడిన ఆఫ్‌లైన్ రికార్డును నిక్షిప్తం చేసి సదరు దరఖాస్తులకు పరిష్కారం చూపెడితే బాగుంటుందని వారంటున్నారు. ⇒నాలుగుసార్లు ఆన్లైన్లో, నాలుగుసార్లు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చక్కర్లు కొట్టిన తర్వాత పరిష్కారానికి ప్రత్యేక ఫైల్‌పెట్టి మళ్లీ ఆన్లైన్లో పరిష్కరించాల్సి వస్తుందని, ఈ పద్ధతిలో మార్పు తీసుకురావడంపై ఉన్నతస్థాయిలో సమీక్ష జరగాల్సి ఉందని వారంటున్నారు. ⇒ ఆ మార్పు జరిగినప్పుడే ధరణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు. మూడు వారికి... రెండు వీరికి.. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా క్షేత్రస్థాయిలో ఉండే తహసీల్దార్లు, ఆర్డీఓలకు ప్రస్తుతం చాలా తక్కువ అధికారాలున్నాయి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ), గ్రీవెన్స్ ల్యాండ్మ్యాటర్స్ (కులం, ఆధార్‌కార్డుల్లో తప్పులు నమోదు, పేర్లలో అక్షర దోషాలు సవరించడం) లాంటి అధికారాలు తహసీల్దార్లకు ఉండగా, కోర్టు కేసుల సమాచారం, పాస్‌బుక్ లేకుండా నాలా, సంస్థాగత పాస్బుక్కులిచ్చే అధికారాలు మాత్రం ఆర్డీఓలకు ఉన్నాయి.ఈ అధికారాలు మినహా అన్ని అంశాల్లో నిర్ణయాలు తీసుకునే బాధ్యతలు ఇప్పటికీ కలెక్టర్లకు ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా వికేంద్రీకరణ వీలున్నంత త్వరగా జరగాలని, క్షేత్రస్థాయిలో పరిష్కారం కాగలిగిన దరఖాస్తులను అక్కడే పరిష్కరించే అధికారాలు సదరు సిబ్బందికి కలి్పంచినప్పుడే ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. నేడు వీడియో కాన్ఫరెన్స్‌లు ధరణి దరఖాస్తుల పురోగతిపై రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్‌మిత్తల్ శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి నిర్వహించనున్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు సిరిసిల్ల, భూపాలపల్లి, జగిత్యాల, మహబూబ్‌నగర్, మంచిర్యాల, వికారాబాద్, వనపర్తి, వరంగల్, ములుగు, నిర్మల్ జిల్లాలు, 12 నుంచి ఒంటి గంట వరకు మిగిలిన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని సీఎంఆర్ఓ పీడీ వి. లచి్చరెడ్డి విడుదల చేసిన షెడ్యూల్లో పేర్కొన్నారు. -
మే 9న ‘జగనన్నకు చెబుదాం’ ప్రారంభం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష పథకం, నాడు-నేడుపై సీఎం సమీక్షించారు. చాలా ప్రతిష్టాత్మకంగా మే 9న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని.. దీనికోసం 1902 హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశామని సీఎం అన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే? ‘‘చాలా ప్రతిష్ట్మాతకమైన కార్యక్రమం. మనం ఇప్పటికే స్పందన నిర్వహిస్తున్నాం. స్పందనకు మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదాం. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం. ఇండివిడ్యువల్ గ్రీవెన్సెస్‌ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే దీని ఉద్దేశం. హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి గ్రీవెన్స్ రిజిస్టర్ చేస్తే.. దాని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలి’’ అని సీఎం అన్నారు. ►సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్ యూనిట్లు ఉంటాయి ►ఈ యూనిట్లను కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్ చేయాలి ►గ్రీవెన్స్ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలి ►ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యం ►ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుంది ►హెల్ప్‌లైన్‌ద్వారా గ్రీవెన్స్ వస్తాయి ►వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలి ►గ్రీవెన్స్ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం ►ఇండివిడ్యువల్, కుటుంబం స్థాయిలో గ్రీవెన్సెస్ ►రిజ్టసర్ అయిన గ్రీవెన్సెస్ ఫాలో చేయడం ►ప్రభుత్వ సేవలు, పథకాలపై ఎంక్వైరీ ►ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం అన్నది జగనన్నకు చెబుదాం ప్రధాన కార్యక్రమాలు ►ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్ అయి ఉంటారు ►వారి గ్రీవెన్స్‌స్‌ను సలహాలను నేరుగా తెలియజేయవచ్చు: ►ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ గ్రీవెన్స్‌స్‌ను నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చూస్తుంది ►ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు రెగ్యులర్ అప్డేట్స్ అందుతాయి ►అంతేకాక ఇదే హెల్ప్‌లైన్ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటుంది ►గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్ గురించి అవగాహన కల్పిస్తారు ►ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకునేలా వారిని మరింతగా ప్రోత్సహిస్తారు ►జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమల్లో మూడు కీలక యంత్రాంగాల ఉంటాయి ►సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు ఉంటాయి ►ప్రతి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారులుప్రత్యేకాధికారులుగా ఉంటారు ►క్రమం తప్పకుండా ఆయా జిల్లాలను వీరు సందర్శించి పర్యవేక్షిస్తారు ►ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను పర్యవేక్షిస్తారు ►కలెక్టర్లతో కలిపి… జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు ►సమస్యల పరిష్కారాల తీరును రాండమ్‌గా చెక్చేస్తారు ►ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల పనితీరును పర్యవేక్షిస్తారు ►ఎక్కడైనా స పట్ల సంతృప్తి లేకపోతే.. దాన్ని తిరిగి ఓపెన్ చేస్తారు ►ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారు ►పరిష్కార తీరుపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తారు ►చీఫ్‌సెక్రటరీ, సీఎంఓ, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్ చేస్తారు ►ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుంది ►ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగారి పేరు పెట్టారు అంటే.. మొత్తం ప్రభుత్వం యంత్రాంగం పేరు పెట్టినట్టే ►అధికారుల మీద ఆధారపడే ముఖ్యమంత్రి తన విధులను నిర్వహిస్తారు ►మీరు అంత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తే… కార్యక్రమం సమర్థవంతంగా సాగుతున్నట్టే లెక్క ►ప్రజలకు నాణ్యంగా సేవలను అదించాలన్నదే దీని ఉద్దేశం ►ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్ల రూపాయలను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుంది ►అవసరమైన చోట.. ఈ డబ్బును ఖర్చు చేయవచ్చు ►వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్‌కు ఇస్తున్నాం: ►దీనివెల్ల వేగవంతంగా గ్రీవెన్స్‌స్ పరిష్కారంలో డెలవరీ మెకానిజం ఉంటుంది: ►అంతేకాకుండా గ్రామ స్థాయిలోని సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్వాడీలు, విలేజ్‌క్లినిక్స్.. అవన్నీకూడా సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న అంశంపైన కూడా దృష్టిపెడతారు ►ఇవి సక్రమంగా పనిచేస్తే… చాలావరకు సమస్యలు సమసిపోతాయి ►అందుకే అవి సమర్థవంతంగా పనిచేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం ఇదీ చదవండి: రామోజీ, రాధాకృష్ణా.. జననేతకు జనమేగా స్వాగతం పలికేది! -
ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం రూ.240 అందేలా చూడాలి: సీఎం జగన్
-
డిసెంబర్ నాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తి చేయాలి
సాక్షి, తాడేపల్లి: ఎస్డీజీ(స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు) సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయని, ఎస్డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రమాణమని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం స్పందన వీడియో కాన్ఫరెన్స్ చేపట్టారు. ఈ సందర్భంగా.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో కేటాయించిన నిధులపై సమీక్ష జరిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో గడపగడపకూ మన ప్రభుత్వం నిర్వహించిన తర్వాత నెల రోజుల్లో ప్రాధాన్యతా పనులు మొదలు కావాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే.. అక్టోబరు 25న ఈ–క్రాపింగ్ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శించాలని, ఈ మేరకు షెడ్యూల్ వివరించారాయన. అలాగే.. ఉపాధి హామీ పథకం కింద కనీసం వేతనం రూ.240 అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. డిసెంబర్ 21వ తేదీ నాటికి ఐదు లక్షల ఇళ్లు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే.. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేజ్ –3 కింద డిసెంబర్లో ఇళ్ల మంజూరు చేయాలన్నారు. ఎస్డీజీ(స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు) సాధన ఆధారంగా కలెక్టర్లకు మార్కులు ఉంటాయని, ఎస్డీజీ లక్ష్యాలే కలెక్టర్ల పనితీరుకు ప్రమాణమని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. స్పందనలో వస్తున్న ఫిర్యాదులు పరిష్కారంపై సమీక్ష నిర్వహించడంతో పాటు జాతీయ రహదారులకు కావాల్సిన భూసేకరణ, వైఎస్సార్ అర్బన్-విలేజ్ క్లినిక్స్ పై సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. చదవండి: గుడ్ న్యూస్.. ఆ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ -
మనం ప్రజా సేవకులం
సాక్షి, అమరావతి: మనం బాస్‌లం కాదు.. ప్రజా సేవకులమనే విషయాన్ని నిరంతరం దృష్టిలో ఉంచుకోవాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించేందుకే 26 జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజల సమస్యల పట్ల మరింత మానవీయ దృక్పథంతో ఉండాలని, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల్లో బాధ్యతలు స్వీకరించిన అధికార యంత్రాగానికి తానిచ్చే సలహా ఇదేనని కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలనుద్దేశించి ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘స్పందన’లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరింత మెరుగ్గా స్పందన కార్యక్రమం అమలుతోపాటు ఉపాధి హామీ, కలెక్టర్లు, ఎస్పీలు, జేసీల పనితీరు మదింపునకు సంబంధించి సీఎం జగన్ మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ స్పందన అర్జీల పరిష్కారంపై వివిధ స్ధాయిల్లో పర్యవేక్షణ జరగాలి. సచివాలయం నుంచి మండల స్ధాయి, జిల్లా స్ధాయి వరకు వివిధ దశల్లో పర్యవేక్షణ ఉండాలి. ప్రస్తుతం జిల్లాల పరిణామం తగ్గింది.స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత అత్యంత ముఖ్యం. మా కలెక్టర్ బాగా పనిచేస్తున్నారని ప్రజలు చెబుతున్నారంటే అర్జీలు నాణ్యతతో పరిష్కారమైనట్లే. ప్రధానంగా నాలుగైదు అంశాలపై కలెక్టర్లు దృష్టి సారించాలి. నిర్దేశిత కాలపరిమితిలోగా పరిష్కరించాలి. నిర్ణీత సమయానికి మించి పెండింగ్‌లో పెట్టకూడదు. ఒకే సమస్యపై తిరిగి రెండోసారి అర్జీ వస్తే కలెక్టర్ దృష్టికి రావాలి. ఈసారి అదే అధికారితో కాకుండా ఆపై అధికారితో అర్జీని పరిష్కరించాలి. నాణ్యతతో పరిష్కరించలేకపోతే మొత్తం ప్రక్రియ అంతా అర్థంలేనిది అవుతుంది. గ్రామ సచివాలయాల దగ్గర నుంచి అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి ఉండాలి. మనం సక్రమంగా చేస్తున్నామా? లేదా? అన్నది పరిశీలించుకోవాలి. అర్జీలను పరిష్కరిస్తున్న విధానాన్ని పరిశీలించేందుకు జిల్లా, డివిజన్, మండలాల స్థాయిలో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి. ఆయా స్ధాయిల్లో వారానికి ఒకసారి అర్జీల పరిష్కారానికి సమయం కేటాయించాలి. ఆ విధులను మరొకరికి అప్పగించరాదు. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇతరులకు అప్పగించొద్దు.. స్పందనపై కలెక్టర్ల మార్కు కచ్చితంగా ఉండి తీరాలి. ఇది మీ కార్యక్రమం.. మీరు మాత్రమే దీనిపై దృష్టి సారించాలి. ఇతరులకు అప్పగించొద్దు. మీరే స్వయంగా పర్యవేక్షించండి. కలెక్టర్లు సక్రమంగా వ్యవహరిస్తేనే స్పందన విజయవంతం అవుతుంది. సచివాలయాల్లో రోజూ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు స్పందన నిర్వహిస్తున్నారు. అలా ఎవరైనా నిర్వహించకుంటే సంబంధిత నివేదికలు తెప్పించుకుని పరిశీలించాలి. అర్జీలు తీసుకున్న రోజే రశీదు ఇచ్చి మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. అర్జీపై విచారణ జరుగుతున్నప్పుడు పిటిషనర్‌ను ఈ ప్రక్రియలో భాగస్వామిగా చేయాలి. క్షేత్రస్థాయి విచారణ సమయంలో తప్పనిసరిగా పిలవాలి. ఫొటో తీసి పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. తమ సమస్యను పట్టించుకుంటున్నారనే భరోసా పిటిషనర్‌కు కలుగుతుంది. అర్జీని పరిష్కరిస్తున్నామా? తిరస్కరిస్తున్నామా? అన్నది తెలియజేయాలి. దృష్టి సారిస్తే మరింత సమర్థంగా.. సచివాలయాలపై ఎంత దృష్టి పెడితే అంత సమర్థంగా పనిచేస్తాయి. కలెక్టర్లు, జేసీలు వారానికి రెండు సచివాలయాల్లో పర్యటించాలి. మిగతా అధికారులు వారానికి కనీసం నాలుగు సచివాలయాలను సందర్శించాలి. సచివాలయ సిబ్బంది పనితీరును పరిశీలించాలి. మీరు వెళ్లినప్పుడు వచ్చే నెలలో పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ చేశారా.. లేదా? అన్నది పరిశీలించాలి. అంతకు ముందు నెలలో అమలైన పథకానికి సంబంధించి మిగిలిపోయిన అర్హులు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. మూడు నెలలు ముమ్మరంగా ‘ఉపాధి’.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉపాధిహామీ పనులను ముమ్మరంగా చేసేందుకు అవకాశం ఉంటుంది. నిర్దేశించుకున్న లక్ష్యంలో కనీసం 60 శాతం పనులను ఈ మూడు నెలల్లోనే పూర్తి చేసేలా కలెక్టర్లు దృష్టి సారించాలి. ఏప్రిల్‌లో 250 లక్షల పనిదినాలను లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటికే 185 లక్షల పనిదినాలు చేశాం. మిగిలినవి వేగంగా చేపట్టాలి. లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి జిల్లాలో రోజూ కనీసం లక్ష పని దినాలు చేయాలి. నెలలో కనీసం 25 లక్షల పని దినాలను ప్రతి జిల్లాలో చేపట్టాలి. కలెక్టర్లు విస్తృతంగా పర్యటించి సమీక్షిస్తూ లక్ష్యాలను సాధించాలి. కలెక్టర్లు, జేసీలు, పీడీలు, ఎంపీడీఓలు.. ప్రతి అధికారీ దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. బిల్లులు క్లియర్.. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్.. భవనాల నిర్మాణాలకు సంబంధించిన బిల్లులను క్లియర్ చేశాం. ఈ నెలలో కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను సాధించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. నెలాఖరులోగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉపాధి హామీ నిధులను ఈ నెలాఖరులోగా తెచ్చేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు.. అన్నింటినీ పూర్తి చేయాలి. కంపెనీల నుంచి సిమెంట్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణకు కలెక్టర్లు నోడల్ అధికారిని నియమించాలి. సిమెంట్, స్టీలు, ఇసుక, మెటల్ సరఫరా సవ్యంగా సాగేలా నోడల్ అధికారికి బాధ్యతలు అప్పగించాలి. దీనిపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి సచివాలయం పరిధిలో మరోసారి పునఃపరిశీలన చేసి భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి. డిసెంబర్ నాటికి 4,545 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తి కావాలి. అదే సమయానికి ఇంటర్నెట్ కేబుల్ కూడా సంబంధిత గ్రామాలకు సమకూరుతుంది. తద్వారా గ్రామాల్లోనే వర్క్‌ఫ్రం హోమ్ అందుబాటులోకి వస్తుంది. ప్రగతి ఆధారంగా పనితీరు మదింపు ఏడు రకాల ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రగతి ఆధారంగా కలెక్టర్లు, జేసీల పనితీరును మదింపు చేస్తాం. ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ స్కూళ్లు – ఆస్పత్రుల్లో నాడు–నేడు, సమగ్ర భూసర్వే, స్పందన అర్జీల పరిష్కారంలో నాణ్యత, ఎస్డీజీ లక్ష్యాలు, ఉపాధిహామీ పనులు, సచివాలయాల పనితీరు... ఈ అంశాల్లో ప్రగతి ఆధారంగా వారి పనితీరును మదింపు చేస్తాం. ఏసీబీ, ఎస్ఈబీ, దిశ, సోషల్ మీడియా ద్వారా వేధింపుల నివారణ అంశాల్లో ప్రగతి ఆధారంగా ఎస్పీల పనితీరును మదింపు చేస్తాం. ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ ముందుకు సాగాలి. కానీ సమీక్ష పేరుతో అనవసరంగా కాలహరణం వద్దు. గంట లోపలే ముగించి పనిలో ముందుకుసాగాలి. సిటిజన్ అవుట్ రీచ్తో ప్రతి ఇంటికీ.. ప్రతి నెలలో చివరి శుక్రవారం, శనివారం వలంటీర్లు, సచివాలయ సిబ్బంది సిటిజన్ అవుట్‌రీచ్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఇంటికీ వెళ్లాలి. వచ్చే నెలలో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. ప్రతి వారం రెండు రోజులపాటు కలెక్టర్లు, జేసీలు గ్రామ సచివాలయాలను పర్యవేక్షించాలి. మే నెలలో పథకాలు ఇవీ జగనన్న విద్యా దీవెన, ఉచిత పంటల బీమా పథకం, వైఎస్సార్ రైతు భరోసా, మత్స్యకార భరోసా పథకాలను మే నెలలో అమలు చేస్తున్నాం. ఈ నాలుగు కార్యక్రమాల గురించి సిటిజన్ అవుట్రీచ్లో వలంటీర్లు, సచివాలయాల సిబ్బంది ప్రజలకు వివరించాలి. సిటిజన్ అవుట్ రీచ్‌ను కూడా కలెక్టర్లు పర్యవేక్షించాలి. మీరు మంచి చేస్తే.. నేను మంచి చేసినట్లవుతుంది. మీరే నా కళ్లు, చెవులు. రాష్ట్రంలో ఎలాంటి అవినీతి, వివక్షకు తావు లేకుండా పథకాలను అమలు చేస్తున్నాం. రూ.1.37 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బటన్ నొక్కి పారదర్శకంగా జమ చేశాం. ఇదంతా మీ పర్యవేక్షణ వల్లే సాధ్యమైంది. – ఉన్నతాధికారులతో సీఎం జగన్ -
ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో స్పందనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందనలో భాగంగా ఉపాధి హామీ కార్యక్రమం కింద చేపట్టిన పనులు, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్స్, డిజిటిల్ లైబ్రరీలు, ఏఎంసీలు, బీఎంసీలు, గృహనిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష, ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భూ సేకరణ, నాడు-నేడు, స్పందన కింద అర్జీల పరిషారం తదితర అంశాలపై సీఎం సమీక్ష జరిపారు. ఈ వార్త కూడా చదవండి: మంత్రి కారుమూరి ఔదార్యం ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, 26 జిల్లాలను ఎందుకు ఏర్పాటు చేశామన్న విషయం అందరికీ తెలియాలన్నారు. ‘‘పరిపాలన అనేది సులభతరంగా ఉండాలి. ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలి. మరింత మానవీయ దృక్పథంతో ప్రజల పట్ల ఉండాలి. ఈ విషయాలను ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ’’ సీఎం సూచించారు. ఉపాధిహామీ పనులు: ►ఏప్రిల్, మే, జూన్... నెలల్లో ముమ్మరంగా పనులు చేయడానికి అవకాశం ఉంటుంది ►కనీసం 60 శాతం పనులను ఈనెలల్లో చేయాలి ►కలెక్టర్లు ఈ మూడు నెలల్లో పనులు ముమ్మరంగా పనిచేయడంపై దృష్టిపెట్టాలి ►ప్రతిజిల్లాలో కూడా ప్రతిరోజూ కనీసం 1 లక్షల పనిదినాలు చేయాలి ►నెలలో కనీసంగా 25 లక్షల పని దినాలు చేపట్టాలి ►క్షేత్రస్థాయిలో లక్ష్యాలు పెట్టుకుని ఉపాధిహామీ పనులు చేపట్టాలి ►విస్తృతంగా పర్యటనలు చేసి, సమీక్షలు చేసి... ఈ లక్ష్యాలను సాధించాలి ►కలెక్టర్లు, జేసీలు, పీడీలు, ఎంపీడీఓలు.. ఇలా ప్రతి అధికారి ప్రత్యేక దృష్టిపెట్టాలి ►గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్కులు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు.. అన్నింటినీకూడా పూర్తిచేయాలి ►కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉపాధి హామీ నిధులు ఈనెలాఖరులోగా వచ్చేలా అధికారులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ►కంపెనీల నుంచి సిమ్మెంటు సప్లైలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి కలెక్టర్లు ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలి, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి: ►సిమెంటు, స్టీలు, ఇసుక, మెటల్ సరఫరా సవ్యంగా సాగేలా నోడల్ అధికారికి బాధ్యతలు అప్పగించాలి ►గ్రామాల్లో ఈ భవనాల నిర్మాణ బాధ్యతలను ఒకరికన్నా ఎక్కువ మందికి అప్పగించడం వల్ల పనులు చురుగ్గా సాగుతాయి ►ప్రతి సచివాలయం పరిధిలో మరోసారి పునఃపరిశీలన చేసి.. భవనాల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి ►డిసెంబర్ నాటికి 4545 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం పూర్తి కావాలి ►అదే సమయానికి ఇంటర్నెట్ కేబుల్‌కూడా సంబంధిత గ్రామాలకు చేరుకుంటుంది: ►గ్రామాల్లోనే వర్క్‌ఫ్రం హోం అందుబాటులోకి వస్తుంది ఇళ్లనిర్మాణం: ►తొలిదశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నాం ►లే అవుట్లలో 11.9 లక్షలు, సొంతప్లాట్లు లేదా పొసెషన్ సర్టిఫికెట్లు పొందన వారి స్థలాల్లో 3.7 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలి ►ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలి ►కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణం పెండింగులో పండింది ►ఈ కేసుల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలి ►వీలుకాని పక్షంలో ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలి ►అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం అందాలి ►అర్హులకు ఇళ్లు రాకుండా కత్తిరించడం అన్నది సరైనది కాదు ►అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాల్సిందే, దీనికి ఎంత ఖర్చైనా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ►కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి ►ఆప్షన్ 3 ఎంపిక చేసుకున్న ఇళ్ల నిర్మాణంపైనా కలెక్టర్లు దృష్టిపెట్టాలి ►ప్రతి వేయి ఇళ్లకూ ప్రత్యేకంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ను పెట్టాలి ►ఇళ్ల నిర్మాణం పూర్తచేసే బాధ్యతను వారికి అప్పగించాలి ►రోజూ వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి ►లే అవుట్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పన పనులు శరవేగంగా పూర్తిచేయాలి ►ఆప్షన్ 3 కింద ఇళ్ల నిర్మాణాన్ని ఈనెల 28న ప్రారంభిస్తున్నాం ►అదే రోజు 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం: ►అదే రోజున 1.79 లక్షల పీఎంఏబై, వైఎఎస్సార్-గామీణ్ ఇళ్ల నిర్మాణంకూడా ప్రారంభిస్తున్నాం ►తద్వారా మొత్తంగా చూస్తే మొదటి విడత ఇళ్ల నిర్మాణంలో భాగంగా 15.6 లక్షలు, టిడ్కోలో 2.62 లక్షలు, విశాఖపట్నంలో 1.23 లక్షలు, పీఎంఏవై-వైఎస్సార్ గ్రామీణ్ ద్వారా 1.79లక్షల ఇళ్లు నిర్మాణాలు జరుగుతాయి ►అంటే 21.24 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతున్నట్టు లెక్క ►అలాగే పెద్ద లే అవుట్లలో బ్రిక్ తయారీ యూనిట్లు నెలకొల్పడంపైనా దృష్టిపెట్టాలి ►ఇళ్ల నిర్మాణం జరుగుతున్న లే అవుట్లలో నీరు, కరెంటు సదుపాయాలను కల్పించాలి ►మురుగునీరు పోచే సదుపాయాలను కూడా కల్పించాలి ►ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులను సత్కరిస్తాం: ►మండలానికో సర్పంచి, మున్సిపాల్టీలో కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, జిల్లాకు ఒక జడ్పీటీసీ చొప్పున వారికి అవార్డులు ఇస్తాం ►ఇళ్ల నిర్మాణం, స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు – నేడు, సమగ్ర భూసర్వే, స్పందనలో అర్జీల పరిష్కారంలో నాణ్యత, ఎస్డీజీ లక్ష్యాలు, ఉపాధిహామీ పనులు, సచివాలయాల పనితీరు... ఈ అంశాల్లో ప్రగతి ఆధారంగా కలెక్టర్లు, జేసీల పనితీరును మదింపు చేస్తాం ►ఏసీబీ, ఎస్ఈబీ, దిశ, సోషల్‌మీడియా ద్వారా వేధింపుల నివారణ అంశాల్లో ప్రగతి ఆధారంగా ఎస్పీల పనితీరును మదింపు చేస్తాం ►ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి ముందుకు సాగాలి ►ఒక గంటలోపలే సమీక్షచేసుకుని.. పనిలో ముందుకుసాగాలి ►సమీక్ష పేరుతో అనవసరంగా కాలహననం వద్దు ►సమీక్షలు క్రమం తప్పకుండా ముందుకు సాగాలి -
Andhra Pradesh: సుస్థిర ప్రగతిపై దృష్టి
సుస్థిర ప్రగతి లక్ష్యాల కోసం చేస్తున్న పని, సాధిస్తున్న ప్రగతి నమోదు కావాలి. మనం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం. మన కలెక్టర్లు.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న కంటే బాగా పని చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీని వల్ల మన ప్రమాణాలు మరింత పెరుగుతాయి. దేశంలో అత్యుత్తమంగా నిలుస్తాం. దేశం మొత్తం మనవైపు చూస్తుంది. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్డీజీ –సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్)పై కలెక్టర్లు దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. 43 సూచికలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలన్నారు. ఈ రంగాల్లో ప్రగతి ఎస్డీజీ లక్ష్యాలకు చేరువయ్యేలా ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలతో కలిసి ముందుకు సాగాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పలు విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం పోటీ ప్రపంచంలో ఉన్నామని, కేవలం మన పని మనం చేయడమే కాకుండా చేసిన పనికి, సాధించిన లక్ష్యాలకు ప్రమాణాలు అందుకోవడం కూడా అవసరమని చెప్పారు. తద్వారా ఆయా జిల్లాలు జీవన ప్రమాణాలు, సుస్థిర ప్రగతి దిశగా ముందుకు సాగుతూ అంతర్జాతీయ ప్రమాణాలను సాధిస్తాయన్నారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో 43 సూచికలపై కలెక్టర్ల ప్రమేయం నేరుగా ఉంటుందని, నవరత్నాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతగా అమలు చేయడం ద్వారా ఈ సూచికలు గణనీయంగా మెరుగు పడతాయని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయం మొదలు జిల్లాలు.. రాష్ట్ర సచివాయలం వరకు ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు. అమ్మ ఒడి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా పాఠశాలల్లో చేరికలు పెరగడంతో పాటు, బడి మానేయకుండా నియంత్రించగలుగుతామని చెప్పారు. ఒక పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా 2 సూచికల్లో మన రాష్ట్ర పని తీరు గణనీయంగా కనిపిస్తుందని, ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని వివరించారు. సుస్థిర ఆర్థిక ప్రగతి సూచికలపై కలెక్టర్లు జిల్లాలో అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. జగనన్న హౌసింగ్‌తో ఆర్థిక వృద్ధి ► హౌసింగ్ వల్ల ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. జిల్లా స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుంది. సిమెంటు, స్టీలు వినియోగం పెరుగుతుంది. చాల మందికి ఉపాధి లభిస్తుంది. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 15.60 లక్షల ఇళ్లు నిర్మాణం అవుతున్నాయి. ఇంకా ప్రారంభంకాని ఇళ్లు ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి. కోర్టు కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టండి. లే అవుట్లలో ఇంకా పనులు ఏమైనా పెండింగ్ ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి. ► అప్రోచ్ రోడ్లు ఏర్పాటుపై కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలి. విద్యుత్ లైన్ల ఏర్పాటు, గోదాముల నిర్మాణం పూర్తి కావాలి. మార్చి 31లోగా మొదటి విడతలో అన్ని ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాలి. పనులు మొదలు కాని ఇళ్లు అంటూ ఉండకూడదు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు అధికారులు చేదోడుగా నిలవాలి. ► బ్యాంకర్లతో మాట్లాడి లబ్ధిదారులకు రూ.35 వేల రుణాలు వచ్చేట్టు చేయాలి. వారికి అవసరమైన సామగ్రి అందేలా చర్యలు తీసుకోవాలి. సబ్సిడీపై సిమెంటు, స్టీలు, ఇసుక అందిస్తున్నాం. సక్రమంగా అవి లబ్ధిదారులకు చేరేలా తగిన చర్యలు తీసుకోవాలి. ► 3.27 లక్షల మంది ఆప్షన్ 3 కేటగిరీ ఎంచుకున్నారు. ప్రభుత్వమే నిర్మించాలంటూ ఆప్షన్ ఉంచుకున్న లబ్ధిదారుల్లో 3.02 లక్షల మంది గ్రూపులుగా ఏర్పాటయ్యారు. మిగిలిన 25,340 మంది గ్రూపులుగా ఏర్పాటయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. వెంటనే పనులు మొదలు పెట్టేలా చూడాలి. లే అవుట్ల తనిఖీలు తప్పనిసరి ► కలెక్టర్లు ప్రతి వారం ఒక లే అవుట్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. జేసీలు, మున్సిపల్ కమిషనర్ల స్థాయి అధికారులు వారానికి ఒకసారి తనిఖీ చేయాలి. జేసీ– హౌసింగ్‌కు సంబంధించిన అధికారి, ఆర్డీఓ, సబ్కలెక్టర్లు వారానికి 4 సార్లు తనిఖీ చేయాలి. ఇళ్ల నిర్మాణంలో ఖర్చును తగ్గించడంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. ► లే అవుట్ల సమీపంలోనే ఇటుక తయారీ యూనిట్లు పెట్టాలి. 500 ఇళ్ల కంటే ఎక్కువ ఉన్న లే అవుట్లలో తప్పనిసరిగా గోడౌన్లు పెట్టాలి. దీనివల్ల ఇళ్ల నిర్మాణ ఖర్చు నియంత్రణలో ఉంటుంది. మెటల్ రేట్లపైనా దృష్టి పెట్టాలి. గృహ నిర్మాణంపైనా ప్రతి వారం కలెక్టర్లు సమీక్ష చేయాలి. గ్రామాలు, పట్టణాలు, మండలాలు, లే అవుట్ల వారీగా క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలి. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ► డిసెంబర్ 21న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పథకాన్ని ప్రారంభించాం. ఉగాది నుంచి దీపావళి వరకు ఈ పథకం గడువు పొడిగించాం. ఈ పథకం ద్వారా పూర్తి హక్కులు వారికి లభిస్తాయి. లబ్ధిదారుల్లో అవగాహన కల్పించండి. ► డాక్యుమెంట్లు ఉన్న ఆస్తికీ, డాక్యుమెంట్లు లేని ఆస్తికీ ఉన్న తేడాను వారికి వివరించాలి. డాక్యుమెంట్లు లేకపోతే దక్కాల్సిన విలువలో 25 శాతమో, 30 శాతానికో కొనుగోలు చేసి.. వారిని దోపిడీ చేసే పరిస్థితి ఉంటుంది. పూర్తి హక్కులు ఉంటే వారి ఆస్తికి మంచి విలువ ఉంటుంది. ► గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులు ఓటీఎస్ కింద రుసుము చెల్లించడానికి 2 వాయిదాల అవకాశం కూడా కల్పించాం. ఒక వాయిదాలో రూ.5 వేలు, ఇంకో వాయిదాలో రూ.5 వేలు కట్టి పూర్తి హక్కులు పొందవచ్చు. ఆస్తి బదలాయింపు జరిగిన వారికి కూడా ఇలాంటి అవకాశాలే ఇచ్చాం. ► ఈ పథకాన్ని ఇప్పటి వరకు 9.41 లక్షల మంది వినియోగించుకున్నారు. 2.8 లక్షల మందికి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యింది. మిగిలిన వారికీ రిజిస్ట్రేషన్ చేసి, మండలాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి రిజిస్ట్రేషన్ పత్రాలు అందించాలి. 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాలు ► ఇప్పటి వరకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆ తర్వాత 2,01,648 దరఖాస్తులు ప్రాసెస్ చేశాం. వీరిలో 1,05,322 మందికి సరిపడా భూములు గుర్తించాం. 91,229 మందికి పట్టాలు ఇచ్చాం. ► భూమి బదలాయింపు విధానాన్ని వాడుకుని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. మిగిలిన 96,325 మందికి పట్టాలు ఇవ్వడానికి కలెక్టర్లు అన్ని చర్యలూ తీసుకోవాలి. 26 కోట్ల పని దినాల లక్ష్యం ► ఇంకా 2 నెలల సమయం ఉంది. ప్రతి జిల్లాలో లక్ష పని దినాలు రోజుకు నమోదు చేయాలి. అప్పుడే మనం మరోసారి 26 కోట్ల పని దినాల లక్ష్యాన్ని చేరుకుంటాం. రానున్న రెండు నెలల్లో మెటీరియల్ కాంపొనెంట్ ఎక్స్‌పెండేచర్‌పై దృష్టి పెట్టాలి. లేకపోతే నిధులు మురిగిపోయే అవకాశం ఉంటుంది. ► సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీల పనులు చాలా ముఖ్యమైనవి. వీటి నిర్మాణం ద్వారా గ్రామీణ అర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. తద్వారా రాష్ట్ర జీడీపీ పెరుగుతుంది. స్పందన అర్జీల పరిష్కారం ముఖ్యం ► ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆర్జీలను నాణ్యతతో పరిష్కరిస్తున్నారా.. లేదా? నిర్ణీత సమయంలోగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉంటున్నాయా? ఎందుకు పెండింగ్‌లో ఉంటున్నాయి? అనే అంశాలపై వారానికి రెండు సార్లు కలెక్టర్లు సమీక్ష చేపట్టాలి. కొత్తగా మనం ఆధునీకరించిన పోర్టల్‌ను ప్రారంభించాం. అర్జీ ఎక్కడ ఉందనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది. ► నిర్దేశిత సమయం కన్నా.. ఆ ఫైలు ఎందుకు పెండింగులో ఉందనే దానిపై దృష్టి పెట్టాలి. 11 శాతం అర్జీలు తిరిగి వస్తున్నాయి. వాళ్లు మళ్లీ దరఖాస్తు చేస్తున్నారు. ఒకే ఫిర్యాదుపై తిరిగి అర్జీ వస్తే.. తిరిగి అదే అధికారికి ఆ అర్జీ వెళ్లకుండా ఎస్ఓపీ పాటించాలి. ఈ విధానంపై కలెక్టర్లు మరింత ధ్యాస పెట్టాలి. ► అర్జీల పరిష్కారంలో మానవత్వం ప్రదర్శించడం ద్వారా 90 శాతం సమస్యలు పూర్తిగా సమసిపోతాయి. ఉద్యోగులు అందుబాటులో ఉన్నప్పుడు, ప్రజల పట్ల మానవతా దృక్పథంతో ఆర్జీని అర్థం చేసుకున్నప్పుడు చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయి. ► ప్రతి నెలా మూడు రోజులు ఆర్డీఓ కార్యాలయాలను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించాలి. ప్రధానంగా రెవిన్యూ, భూములకు సంబంధించిన అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్ష చేయాలి. ► గ్రామ సచివాలయం నుంచీ శాఖల వారీగా శిక్షణ, అవగాహన ఉండాలి. ఈ శిక్షణ సక్రమంగా కొనసాగుతుందా.. లేదా? అనే దానిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ఫిబ్రవరి, మార్చిలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ► ఫిబ్రవరి 8న జగనన్న చేదోడు (రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు లబ్ధి) ► ఫిబ్రవరి 15న వైఎస్సార్ ఇన్పుట్ సబ్సిడీ (తాజాగా వరదల్లో నష్టపోయిన రైతులకు.. ఒక సీజన్లో జరిగిన నష్టం.. అదే సీజన్‌లోగా ఇవ్వాలన్న లక్ష్యానికి అనుగుణంగా, డిసెంబర్లో నష్టం జరిగితే.. ఫిబ్రవరిలో ఇస్తున్నాం) ► ఫిబ్రవరి 22న జగనన్న తోడు (చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం). ఇప్పటికే 10 లక్షల మందికి వర్తింపు. అదనంగా మరో 6 లక్షల మందికి వర్తింపు. ► మార్చి 8న విద్యా దీవెన ► మార్చి 22న వసతి దీవెన ఫిబ్రవరి, మార్చిలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ► ఫిబ్రవరి 8న జగనన్న చేదోడు (రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు లబ్ధి) ► ఫిబ్రవరి 15న వైఎస్సార్ ఇన్పుట్ సబ్సిడీ (తాజాగా వరదల్లో నష్టపోయిన రైతులకు.. ఒక సీజన్లో జరిగిన నష్టం.. అదే సీజన్‌లోగా ఇవ్వాలన్న లక్ష్యానికి అనుగుణంగా, డిసెంబ ర్లో నష్టం జరిగితే.. ఫిబ్రవరిలో ఇస్తున్నాం) ► ఫిబ్రవరి 22న జగనన్న తోడు (చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం). ఇప్పటికే 10 లక్షల మందికి వర్తింపు. అద నంగా మరో 6 లక్షల మందికి వర్తింపు. ► మార్చి 8న విద్యా దీవెన ► మార్చి 22న వసతి దీవెన. -
ఒమిక్రాన్ సోకితే ముప్పు తప్పదు.. ఈ 12 దేశాల నుంచి వచ్చేవారు..
సాక్షి, చెన్నై: ఒమిక్రాన్‌గా రూపుమార్చుకుని విదేశాల్లో ప్రబలుతున్న వైరస్ భారత్‌లో ప్రవేశించకుండా కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు తెలిపారు. ఒమిక్రాన్ సోకితే ప్రజల ప్రాణాలకు పెనుముప్పు తప్పదని.. జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వివిధ దేశాల్లో ఒమిక్రాన్ వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో సీఎస్ ఇరైయన్బు సోమవారం చెన్నై సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ దేశంలోకి రాకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్త చర్యలను చేపడుతోందని తెలిపారు. ఇందులో భాగంగా కేంద్రం రాష్ట్రానికి ఓ లేఖ రాసిందన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మాస్కు, భౌతిక దూరం పాటించేలా చూడాలని సూచించారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దక్షిణాఫ్రికా, ఐరోపా, బంగ్లాదేశ్, బోడ్స్వానా, మార్షియస్, జింబాబ్వే, సింగపూర్, ఇజ్రాయల్ తదితర 12 దేశాల నుంచి వచ్చేవారు తమకు వైరస్ లక్షణాలు లేకున్నా ఆంక్షలు పాటించాలన్నారు. చదవండి: (Omicron Variant: ఒమిక్రాన్ కట్టడి ఎలా?.. ప్రస్తుతానికి నో లాక్డౌన్: ఆరోగ్యమంత్రి) ఒమిక్రాన్ పరీక్షలకు 12 కేంద్రాలు ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. చెన్నై, కోయంబత్తూరు, మధురై, తిరుచ్చిరాపల్లి జిల్లాల్లో ఈ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. చెన్నైలోని స్టాన్లీ, కీల్పాక్ ప్రభుత్వ వైద్య కళాశాలల, చెన్నై గిండీలోని కింగ్ ఇన్స్టిట్యూట్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. టేక్బాత్ అనే కిట్ ద్వారా ఫలితాలను ప్రకటిస్తున్నామని వెల్లడించారు. తొలి దశ పరీక్షలో డీఎన్ఏ టెస్ట్ చేసి ఫలితాలు వెల్లడించేందుకు ఏడు రోజులు పడుతుందన్నారు. ఒమిక్రాన్ వైరస్ శరీరంలోని రోగనిరోధకశక్తిని దెబ్బతీసి వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. ఇప్పటి వరకు తమిళనాడులో ప్రవేశించలేదని తెలిపారు. ఒమిక్రాన్‌ను ఆర్టీపీసీఆర్ ద్వారా గుర్తించవచ్చని చెప్పారు. -
బాధితులకు తాత్కాలిక బస
సాక్షి, అమరావతి: వరదల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు తాత్కాలిక వసతి కల్పించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. తాత్కాలిక వసతిలో కనీస సదుపాయాలుండాలని స్పష్టం చేశారు. వరదల్లో ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన వారికి కొత్తవి మంజూరు చేయడంతోపాటు వెంటనే పనులు కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. మళ్లీ వసతి సమకూరేవరకు వారి బాగోగుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంట నష్టంపై ఎన్యూమరేషన్ పూర్తయ్యే కొద్దీ సోషల్ ఆడిట్ కూడా నిర్వహించాలని స్పష్టం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై వైఎస్సార్ కడప, చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అంశాలవారీగా పనులను సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపైనా సమాచారం తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. గొలుసుకట్టు చెరువులు.. వర్షాల నేపథ్యంలో చెరువుల మధ్య అనుసంధానం చేయడంతో పాటు గండ్లు పడకుండా అప్రమత్తంగా ఉండాలి. చెరువులు నిండగానే అదనపు నీటిని నేరుగా కాల్వలకు తరలించే వ్యవస్థపై దృష్టి సారించాలి. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో నీటిని నిల్వచేయలేని పరిస్థితి నెలకొంది. చాలాచోట్ల తాగునీటి సరఫరాకు ఆధారమైన చెరువులకు గండ్లు పడ్డాయి. వీటిపై ఆధారపడ్డ పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చే వేసవిని కూడా దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. నిత్యావసరాలు అందించిన ప్రతి కుటుంబానికీ అదనపు సహాయం రూ.2 వేలు కూడా అందాలి. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు బాధితుల నుంచి అందే విజ్ఞప్తులపై అధికారులు ఉదారంగా వ్యవహరించాలి. ఆర్బీకేల్లో విత్తనాలను సిద్ధం చేసి పంపిణీకి అన్ని ఏర్పాట్లూ చేశాం. ఆ పెద్ద మనిషి.. బురద రాజకీయాలు రాష్ట్రంలో వరదలతో రూ.6 వేల కోట్ల మేర నష్టం జరిగితే ఇచ్చింది రూ.34 కోట్లే అని కొందరు విమర్శలు చేస్తున్నారు. 40 శాతం రోడ్లకు, 30 శాతానికిపైగా పంటల రూపంలో, సుమారు 18 శాతం ప్రాజెక్టులకు నష్టం వాటిల్లింది. గత ప్రభుత్వ హయాంలో హుద్‌హుద్ తుపాన్ వల్ల రూ.22 వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. మరి నాడు ఇచ్చింది రూ.550 కోట్లు మాత్రమే. అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. రూ.22 వేల కోట్ల మేర నష్టం జరిగిందని చెప్పిన ఆ పెద్ద మనిషి అప్పుడు బాధితులకు ఇచ్చింది రూ.550 కోట్లే. ఇప్పుడు కలెక్టర్లు, అధికారులు బాగా పనిచేసి పరిహారాన్ని వేగంగా అందిస్తే దానిపై కూడా బురద జల్లుతున్నారు. గతంలో కనీసం నెల.. ఇప్పుడు వారంలోనే అన్నీ వరద ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు ఇంత శరవేగంగా చర్యలు తీసుకోవడం ఎన్నడూ జరగలేదు. గతంలో కనీసం నెల సమయం పట్టగా ఇప్పుడు వారం రోజుల్లోనే బాధితులకు సాయాన్ని అందించగలిగాం. బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా నష్ట పరిహారాన్ని అందించాం. గతంలో ఇల్లు ధ్వంసమైనా, దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణించినా పరిహారం ఇవ్వాలంటే నెల రోజులు పట్టేది. గల్లంతైన వారికి ఎలాంటి పరిహారాన్ని ఇచ్చేవారు కాదు. అలాంటిది ఇప్పుడు వారం రోజుల్లోనే ఆయా కుటుంబాలకు పరిహారం చెల్లించి ఆదుకున్నాం. గతంలో రేషన్, నిత్యావసరాలు ఇచ్చి సరిపెట్టగా ఇప్పుడు వాటిని అందించడమే కాకుండా రూ.2 వేల చొప్పున తక్షణ సాయం కూడా చెల్లించాం. నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగా సాయం చేసిన దాఖలాలు గతంలో లేవు. ఇప్పుడు యుద్ధప్రాతిపదికన ఎన్యుమరేషన్ పూర్తిచేసి సీజన్‌లోగా వారికి సహాయం అందిస్తున్నాం. ఇక గతంలో ఇన్పుట్ సబ్సిడీ అందాలంటే కనీసం సంవత్సరం పట్టేది. ఆ తర్వాత కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవాళ పంట నష్టపోయిన సీజన్ ముగిసేలోగానే పరిహారాన్ని అందిస్తున్నాం. -
Heavy Rains: ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: తడ, సూళ్లూరుపేట సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఏపీలోని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో తాడేపల్లిలోని తాన క్యాంప్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తమిళనాడు సరిహద్దుల్లో ఆప్రమత్తంగా ఉండాలని తెలిపారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయని, కర్నూలులో మరో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. మంగళగిరిలో కూడా అదనపు బృందాలు సిద్ధం చేశామని చెప్పారు. పరిస్థితులను బట్టి వారి సేవలను వినియోగించుకోవచ్చని సీఎం అన్నారు. చదవండి: మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు సీఎం జగన్ నివాళి ‘‘అవసరమైన చోట సహాయ శిబిరాలు తెరవండి. సహాయ శిబిరాల్లో ఉంచిన వారిని బాగా చూసుకోండి. వారికి మంచి ఆహారం అందించండి. బాధితులకు వేయి రూపాయల చొప్పున వారికి అందించండి. బాధితులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోండి. ఏం కావాలన్నా.. వెంటనే అడగండి. బాధితులకోసం ఒక ఫోన్ నంబర్‌ను అందుబాటులో ఉంచండి. వివిధ విభాగాలతో సమన్వయం చేసుకోండి. లైన్ డిపార్ట్మెంట్లను సిద్ధంచేయండి. ఎస్ఓపీల ప్రకారం అన్నిరకాల చర్యలను తీసుకోండి. ముంపు ప్రాంతాలనుంచి ప్రజలను తరలించేలా చర్యలు తీసుకోండి. అవసరమైన మందులను సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని’’ సీఎం సూచించారు. ‘‘పీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల్లో అన్నిరకాల మందులను ఉండేలా చర్యలు తీసుకోండి. వర్షాల అనంతరం కూడా పారిశుద్ధ్యం విషయంలో చర్యలు తీసుకోండి. అత్యవసర సేవలకు అంతరాయం రాకుండా జనరేటర్లను కూడా చర్యలు తీసుకోండి. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటే.. వెంటనే వాటిని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. యుద్ధ ప్రాతిపదికిన చర్యలు తీసుకునేలా విద్యుత్‌శాఖ అధికారులు సిద్ధంగా ఉండాలి. తాగునీటిప్యాకెట్లను బాధిత ప్రాంతాల్లో పంపిణీ చేయండి. భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లు, చెరువులు, నీటి పారుదల సదుపాయాల పట్ల అప్రమత్తంగా ఉండండి. గండ్లు పడకుండా చర్యలు తీసుకోండి. ఎప్పటికప్పుడు నీటి ప్రవావాహాలను, వర్షాలను అంచనా వేసుకుంటూ.. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నీటిని విడుదల చేయండి. ఇదే సమయంలో తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకోవాలని’’ సీఎం పేర్కొన్నారు. ‘‘రోడ్లు ఇతరత్రా మౌలిక సదుపాయాలకు ఎక్కడ నష్టం వాటిల్లినా వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని.. తీవ్ర ప్రభావిత మండలాల్లో అగ్నిమాపక కేంద్రాలను, సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు. ఫోన్‌కాల్‌కు తాము అందుబాటులో ఉంటామని.. ఇంకా ఏం కావాలన్నా వెంటనే తెలియజేయాలని’’ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. -
నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్
-
నేడు జిల్లా కలెక్టర్ల తో సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్
-
ఆరోగ్యపథం.. సంక్షేమ రథం
సాక్షి, హైదరాబాద్: మూడు నెలలుగా కరోనా వ్యాధి నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారించి పనిచేసిన ప్రభుత్వ యంత్రాంగం ఇక అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వైపు మళ్లనుంది. వైరస్ కట్టడికి మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటూనే, ప్రగతి కార్యక్రమాలను పరుగులు పెట్టించనుంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరగనున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేయనున్నారు. కరోనా వైరస్ నియంత్రణతోపాటు ప్రభుత్వం చేపట్టాల్సిన పలు కార్యక్రమాల అమలుపై ఆయన కలెక్టర్లకు సూచనలు చేసే దిశగా సమావేశపు ఎజెండాను ఖరారు చేశారు. (ప్రొఫెసర్ ఖాసీం విడుదల) ఈ సమావేశంలో నియంత్రిత వ్యవసాయంతో పాటు భూముల ప్రక్షాళన, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, భూసేకరణ, రుణమాఫీ, ఉపాధి హామీ పనులు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, రానున్న వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు తదితర పది అంశాలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో జరిగే విస్తృతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు. సేద్యం..రైతులు..భూములు కలెక్టర్లతో నేడు జరిగే సమావేశంలో నియంత్రిత వ్యవసాయం, భూముల ప్రక్షాళన, రైతు రుణమాఫీ అంశాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. రాష్ట్రంలో ఏ పంట ఎంత సాగు చేయాలి?, ఏ ప్రాంతంలో ఎలాంటి పంటల సాగుకు రైతులు అలవాటుపడ్డారు?, ఒకవేళ ఆ ప్రాంతంలో పంటమార్పిడి చేయాలనుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రైతులకు ఆ దిశగా కౌన్సెలింగ్ ఎలా చేయాలనే విషయాలపై కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా నేటి సమావేశానికి వ్యవసాయ శాఖ, జిల్లా రైతుసమన్వయ కమిటీ అధ్యక్షులను కూడా ఆహ్వానించారు. భూముల ప్రక్షాళన అంశంపై కేసీఆర్ ఈ సమావేశంలో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములపై హక్కుల మార్పిడి, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, వ్యవసాయ భూములుగా పేర్కొంటూ వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూముల లెక్కలు తేల్చనున్నారు. అలాగే ఇంకా రాష్ట్రంలో జరగాల్సిన భూసేకరణ, ప్రజలకు కనీస అవసరాల కల్పనలో (పట్టణ ప్రాంతాల్లో) భూముల లభ్యత, ఆహారశుద్ధి పరిశ్రమలు, వ్యవసాయ గిడ్డంగులు, ఆగ్రి కాంప్లెక్సుల నిర్మాణానికి భూముల లభ్యతపై కలెక్టర్ల నుంచి వివరాలు సేకరించనున్నారు. తద్వారా రైతు సంబంధ పరిశ్రమల అభివృద్ధికి బాటలు వేసేలా ఏ జిల్లాలో ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటుచేయాలనే దానిపై కూడా కలెక్టర్లకు మార్గదర్శనం చేయనున్నారని తెలుస్తోంది. ప్రధాన ఎన్నికల హామీ అయిన రైతు రుణమాఫీపై కలెక్టర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు స్థానిక బ్యాంకర్లతో సమావేశమై ఏ మేరకు మాఫీ జరిగిందన్న వివరాలు తీసుకురావాలని కలెక్టర్లకు సమాచారమందింది. ఇంకా ఉపాధిహామీ పథకం అమలు, పనిదినాల కల్పన, జాబ్‌కార్డుల జారీ, పల్లె ప్రగతి అమలుపైనా సీఎం కలెక్టర్లతో చర్చించే వీలుంది. సమావేశ ముఖ్యాంశాలు రైతులకు రుణమాఫీ కరోనా నియంత్రణ చర్యలు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, అగ్రి కాంప్లెక్సులు, గోదాముల నిర్మాణానికి భూముల లభ్యత ప్రభుత్వ అవసరాలకు సేకరించిన భూములను సమగ్ర భూరికార్డుల నిర్వహణ విధానం (ఐఎల్‌ఆర్‌ఎంఎస్)తో సరిపోల్చే అంశం ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌లో అన్ని ప్రభుత్వ ఆస్తుల మార్కింగ్ పంచాయతీల్లో లేఅవుట్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విశ్లేషణ ద్వారా వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూముల గుర్తింపు, వాటిని ఐఎల్‌ఆర్‌ఎంఎస్‌లో నవీకరణ భూసేకరణ తప్పనిసరి అయిన ప్రాజెక్టులు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు పట్టణాల్లో ప్రజావసరాలకు భూముల లభ్యత ఉపాధి హామీ అమలు, జాబ్ కార్డులు, ఉపాధి పనుల కల్పన, పల్లె ప్రగతి వర్షాకాలంలో పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో తీసుకోవాల్సిన చర్యలు -
భయపడొద్దు.. జాగ్రత్తలే మందు
ప్రపంచ వ్యాప్తంగా 80.9 శాతం కేసులకు సంబంధించి ఇళ్లల్లోనే ఉంటూ వైద్యం తీసుకోవడం ద్వారా నయం అయ్యింది. 13.8 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరుతున్నారు. 4.7 శాతం కేసులు మాత్రమే ఐసీయూలో ఉంచాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి ఎవరూ కలత చెందాల్సిన అవసరం లేదు. ఈ విషయాలన్నీ అందరికీ చెప్పాలి. పారాసెటమాల్, 6 యాంటీ బయాటిక్స్ నిల్వలు సరిపడా ఉంచాలని కేంద్రం కోరిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ మేరకు నాణ్యమైన మందుల నిల్వలు ఉండేలా చూసుకోవాలి. కరోనా నేపథ్యంలో జాతరలు రద్దు చేయడం లాంటి విషయాల్లో ఆదేశాలివ్వడం కంటే జిల్లా స్థాయి అధికారులు స్థానిక ప్రజలతో కలిసి కూర్చుని పరిస్థితిపై వారికి అవగాహన కల్పించాలి. గ్రామ వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ మన బలం. దీనిని బాగా వాడుకోవాలి. ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ.. వారిని గైడ్ చేయాలి. ఈ వ్యవస్థ వల్లే ఎప్పటికప్పుడు విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి ఐసోలేషన్లోకి పంపుతున్నాం. జిల్లా స్థాయిలో కలెక్టర్ కన్వీనర్‌గా టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేశాం. జిల్లా వైద్యాధికారి, డీసీహెచ్‌లు, ఎస్ఈలు, ఆర్ఎంలు, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు ఈ టాస్క్‌ఫోర్స్‌లో ఉన్నారు. ప్రతిరోజూ తప్పకుండా టాస్క్‌ఫోర్స్ సమావేశమై పరిస్థితిని సమీక్షించాలి. హోం ఐసోలేషన్, సోషల్ డిస్టెన్స్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. 65 ఏళ్లకు పైబడిన, కిడ్నీ వ్యాధులు, సుగర్‌తో బాధపడేవాళ్లు ఈ వైరస్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే సోషల్ డిస్టెన్స్ పాటించడం అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రధానమంత్రి జనతా కర్ఫ్యూకు పిలుపు ఇచ్చారు. రానున్న రోజుల్లో ఇలాంటివి ఎక్కువగా చేయాల్సి వస్తుందేమో? – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాపించకుండా నిరోధించేందుకు ‘నో టూ పానిక్.. ఎస్ టూ ప్రికాషన్స్’ (భయపడొద్దు.. జాగ్రత్తలే ముద్దు) అన్నదే నినాదం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. కరోనా వైరస్ పట్ల భయంతో కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు, జాగ్రత్తలను శ్రద్ధగా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా వల్ల మనుషులు పిట్టల్లా రాలతారనడం కరెక్టు కాదన్నారు. ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలతోనే రక్షణ కలుగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయమై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిస్తూ.. అవగాహన బాగా పెంచాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను ఆందోళనకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వైరస్‌ను నిరోధించడంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని, సున్నితమైన అంశాల్లో ప్రజలను చైతన్యం చేయడం ద్వారా వారే నిర్ణయాలు తీసుకునేలా చూడాలని సీఎం సూచించారు. ఇంకా సీఎం చేసిన సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి. తీవ్ర ఆందోళనకు గురికావద్దు – సరకులకు కొరత వస్తుందన్న ఆందోళన అవసరం లేదు. దుకాణాలు అందుబాటులో ఉంటాయి. వాటిని మూసి వేయం. నిత్యావసర వస్తువులకు ఎట్టి పరిస్థితుల్లో కొరత రాదు. ఈ విషయాలను ప్రజలకు గట్టిగా చెప్పండి. – తప్పుడు సమాచారం ఇచ్చి, ఆందోళనకు గురిచేసి.. తద్వారా లాభపడాలని సరుకుల రేట్లను పెంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిత్యావసర వస్తువుల ధరలపై దృష్టి పెట్టాలి. – దేశం మొత్తం మీద పాజిటివ్ కేసులు సుమారు 191 ఉన్నాయి. మన రాష్ట్రంలో కేవలం మూడు కేసులు వచ్చాయి. ఈ ముగ్గురూ కూడా విదేశాల నుంచి వచ్చిన వారే. ఒకరు ఇటలీ, ఒకరు యూకే, ఇంకొకరు సౌదీ నుంచి వచ్చారు. – కలెక్టర్లు, అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, ఆశావర్కర్లు, వలంటీర్లు బాగా పని చేస్తున్నారు. వీరు చేపడుతున్న చర్యల కారణంగా కరోనాకు అడ్డుకట్ట పడుతోంది. ఈ వైరస్ నివారణకు సంబంధించి బాగా ప్రచారం చేపట్టాలి. కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ పొరపాట్లకు తావివ్వకూడదు – మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దాదాపుగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టే. దీన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి. – ప్రతి గ్రామ సచివాలయానికి ఒక ఏఎన్ఎం, ఇద్దరు ఆశావర్కర్లు, ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్ ఉన్నారు. వాళ్ల ఫోన్లలో ఒక యాప్ ఉంటుంది. 50 ఇళ్ల డేటా ఆ యాప్‌లో ఉంటుంది. – ఎవరైనా విదేశాల నుంచి వస్తే.. ఏ తేదీలో వచ్చారు, ఎప్పుడు వచ్చారు, అతని ఇంట్లో ఎంత మంది ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటన్న దానిపై వైద్య శాఖకు నిరంతరం సమాచారం అందుతుంది. ఈ డేటా ఆధారంగా ఏఎన్ఎం, ఆశావర్కర్లు అలర్ట్ అవుతున్నారు. దగ్గర్లోని ఆస్పత్రిని కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. – పరిస్థితి త్రీవతను బట్టి కలెక్టర్లు సమర్థవంతంగా పర్యవేక్షించాలి. ఎక్కడా పొరపాట్లకు తావివ్వొద్దు. ఇదీ టాస్క్‌ఫోర్స్ బాధ్యత – హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిని రోజూ పర్యవేక్షించాలి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారా? లేదా? అన్నది పర్యవేక్షించాలి. ఆర్టీసీ బస్సుల్లో ఇష్టం వచ్చినట్టు నిండుగా ప్రయాణికులను తీసుకెళ్లడానికి వీల్లేదు. – బస్సుల్లో శుభ్రత పాటిస్తున్నారా? వాటిని శానటైజ్ చేస్తున్నారా? లేదా? అన్నది చూడాలి. – జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డులను కలెక్టర్లు తనిఖీ చేయాలి. కావాల్సిన మందులు ఉన్నాయా? లేదా? చూడాలి. – 21 ఔషధాలు ఉంచాలని కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ సూచిస్తోంది. ఇవి ఉన్నాయా? లేదా? అన్నది చూసుకోవాలి. – జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రుల్లో పొటెక్టెడ్ సూట్స్ ఉన్నాయా? లేవా? వెంటిలేటర్స్ ఉన్నాయా? లేవా? ఐసీయూ బెడ్స్ ఉన్నాయా? లేవా? అన్నది చూసుకుని ఆ మేరకు సన్నద్ధం కావాలి. మాస్క్‌ల వినియోగంపై అవగాహన కల్పించాలి – చాలా మంది ఎమ్మెల్యేలు మాస్క్‌లు కావాలని అడుగుతున్నారు. మాస్క్‌లు ఎవరికి అవసరం? వాటిని ఏ రకంగా వినియోగించాలి? ఎప్పుడు వినియోగించాలి? అన్న దానిపై అందరికీ అవగాహన కలిగించాలి. – వాడిన మాస్క్‌లను రోడ్డు మీద పడేస్తే మరింత ప్రమాదకరం. వాడిన మాస్క్‌లను సరైన పద్ధతిలో డిస్పోజ్ చేయాలి. మాస్క్‌లు వాడుతున్న వారు ఐదు గంటలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. – వైద్య సిబ్బంది కచ్చితంగా మాస్క్‌లు వేసుకోవాలి. – పొడిదగ్గు, జ్వరం, జలుబు ఉంటే.. వాళ్లు విదేశాల నుంచి వచ్చారా? లేక విదేశాల నుంచి వచ్చిన వారిని కలిశారా.. అని ఆరా తీయాలి. అలాంటి వారెవరైనా ఉంటే 104కు కాల్ చేసి, ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయించాలి. – ఈ విషయాలన్నీ గ్రామ సచివాలయాల స్థాయి వరకు వెళ్లాలి. ఇవన్నీ ముందు జాగ్రత్త చర్యేలే – స్కూళ్లకు సెలవులు ప్రకటించడం, ఇండోర్ అమ్యూజ్ మెంట్ పార్క్‌లు, థియేటర్లు, మాల్స్, పెద్ద దేవాలయాలు (నిత్య పూజలు జరిపిస్తూ), జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ మూసి వేయడం ముందస్తు జాగ్రత్తల కోసమే. మార్చి 31 వరకు ఈ నిర్ణయాలు అమల్లో ఉంటాయి. – ఆ తర్వాత పరిస్థితి గమనించి తదుపరి నిర్ణయాలు తీసుకుందాం. లోకల్‌బాడీ ఎలక్షన్స్ పూర్తయి ఉంటే.. వ్యవస్థ మరింత బలోపేతంగా ఉండేది. సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రజల తరఫున బాధ్యతగా ఉండేవాళ్లు. దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. – వచ్చే రోజుల్లో విలేజ్ క్లినిక్స్‌ను తీసుకు వస్తున్నాం. ఈలోగా మనకున్న సిబ్బందిని సరిగ్గా వాడుకోవాలి. పీహెచ్‌సీల్లో, ఆస్పత్రుల్లో కచ్చితంగా సిబ్బంది ఉండేలా చూసుకోవాలి. -
మాస్క్‌లు ఎక్కడిపడితే అక్కడ పడేస్తే ప్రమాదకరం..
సాక్షి, అమరావతి: కరోనా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రజల్లో అపోహలను తొలగించి.. అవగాహన పెంచాలని అధికారులకు ఆయన సూచించారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు, ఇళ్ల పట్టాల పంపిణీపై జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాపై తప్పుడు సమాచారం వ్యాపింప చేసి ప్రజలను ఆందోళనకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దుకాణాలు అన్ని అందుబాటులో ఉంటాయని.. నిత్యావసర వస్తువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొరత రాదని సీఎం స్పష్టం చేశారు. కరోనాను సాకుగా చూపించి ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల ధరలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని.. గ్రామ సచివాలయాల ద్వారా నిత్యావసర వస్తువులపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. (కరోనా: ఒక్కరోజు బస్సులు బంద్!) మాస్క్‌లను సరైన పద్దతిలో డిస్పోజ్ చేయాలి మాస్క్‌లు వాడేవాళ్లు వాటిని సరైన పద్దతిలో డిస్పోజ్ చేయాలని సీఎం సూచించారు. మాస్క్‌లను ఎక్కడిపడితే అక్కడ పడేస్తే ప్రమాదకరమన్నారు. ఐదు గంటలకు ఒకసారి మాస్క్‌లను మార్చాల్సి ఉంటుందని.. వైద్య సిబ్బంది కచ్చితంగా మాస్క్‌లు వేసుకోవాలని సీఎం తెలిపారు. 65 ఏళ్లకు పైబడ్డ వయస్సు గలవారికి ఈ వైరస్ గట్టి ప్రభావం చూపుతోందన్నారు. అలాగే యువకులు, చిన్న పిల్లల నుంచి ఈ వైరస్ వృద్ధులకు సోకితే.. ఇబ్బందిపడేది వృద్ధులేనని పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధులు, సుగర్ తో బాధపడేవాళ్లు ఈ వైరస్వల్ల తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. అందుకే సోషల్ డిస్టెన్స్ పాటించడం అవసరమని.. దీన్ని అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపు ఇచ్చినట్టున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటివి ఎక్కువగా చేయాల్సి వస్తుందేమోనని సీఎం అభిప్రాయపడ్డారు. (కోవిడ్-19: చైనా కంపెనీ సరికొత్త రికార్డు!) ఏపీలో కేవలం మూడు కేసులే.. ‘‘దేశం మొత్తం మీద కేవలం 191 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మన ఏపీలో కేవలం మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ మూడు కేసులు కూడా విదేశాల నుంచి వచ్చిన వారే.. ఒకరు ఇటలీ, ఒకరు యూకే, ఇంకొకరు సౌదీ నుంచి వచ్చారని’’ సీఎం పేర్కొన్నారు. కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్న కలెక్టర్లు, అధికారులు, గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులు, ఆశా వర్కర్లు, వాలంటీర్లను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఆందోళన వద్దు.. ప్రపంచవ్యాప్తంగా 80.9 శాతం మంది కరోనా వైరస్ కేసులకు ఇళ్లలోనే ఉంటూ వైద్యం తీసుకోవడం ద్వారా వ్యాధి నయం అయ్యిందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 13.8 శాతం మంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారన్నారు. 4.7శాతం కేసులు మాత్రమే ఐసీయూలో ఉంచాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది నిర్థారిస్తోందన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. దాదాపుగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టేనని సీఎం తెలిపారు. దగ్గు జలుబు ఉంటే అది కరోనానా, లేక ఫ్లూ అన్న సందేహం వస్తుందన్నారు. పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉంటే... వారు విదేశాల నుంచి వచ్చారా? లేదా అని మొదటి ప్రశ్న అడగాలని.. విదేశాలనుంచి వచ్చిన వ్యక్తులతో వీళ్లు కాంటాక్టులో ఉన్నారా? అన్నది కనుక్కోవాలని సీఎం సూచించారు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించి... వారికి పరీక్షలు చేయించి, వైద్యం అందించాలని సీఎం పేర్కొన్నారు. ఇది మంచి ఫలితానిస్తోంది.. ‘‘ప్రతి గ్రామ సచివాలయానికి ఒక ఏఎన్ఎం, ఇద్దరు ఆశావర్కర్లు ఉన్నారు. వీరే కాకుండా ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ ఉన్నారు. ఒక యాప్‌ను వాళ్ల ఫోన్లలో అందుబాటులోకి ఇచ్చాం. ఈ యాభై ఇళ్లకు సంబంధించి డేటాను కలెక్ట్ చేసి ఉంచుతున్నారు. ఎవరైనా విదేశాల నుంచి వస్తే.. ఏ తేదీలో వచ్చారు.. ఎప్పుడు వచ్చారు.. ఆయన ఇంటిలో ఎంతమంది ఉన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై వైద్య శాఖకు నిరంతరం డేటా పంపుతున్నారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే గ్రామ సచివాలయాల్లో ఉన్న ఏఎన్ఎం, ఆశా వర్కర్లు తక్షణమే అలర్ట్ అవుతున్నారు. దగ్గర్లో ఉన్న ఆసుపత్రిని కూడా అలర్ట్ చేస్తున్నారు. ఇది మంచి ఫలితాలను ఇస్తోందని’’ సీఎం జగన్ పేర్కొన్నారు. కరోనా కట్టడికి జిల్లాస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌లు జిల్లా స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేశామని.. కలెక్టర్లను కన్వీనర్‌గా నియమించామని సీఎం తెలిపారు. జిల్లా వైద్యాధికారి, డీసీహెచ్‌స్‌లు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారన్నారు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా టాస్క్ ఫోర్స్ సమావేశం జరిపి నిరంతరం పర్యవేక్షణ జరగాలని సీఎం చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దని సూచించారు. బస్సుల్లో శుభ్రత పాటిస్తున్నారా.. శానిటైజ్ చేస్తున్నారా అన్నది చూడాలన్నారు. జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులను కలెక్టర్లు తనిఖీ చేయాలన్నారు. కావాల్సిన మందులు ఉన్నాయా.. లేదా అన్నది తనిఖీ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యలు కోసమే.. స్కూళ్లకు సెలవులు ప్రకటించడం, ఇండోర్ అమ్యూజ్మెంట్ పార్క్‌లు, థియేటర్లు, మాల్స్ మూసివేయడం, పెద్ద దేవాలయాలు, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్ మూసి వేయాలంటూ.. తీసుకున్న చర్యలన్నీ ముందస్తు జాగ్రత్తల కోసమేనని సీఎం వివరించారు. ‘‘స్థానిక సంస్థ ఎన్నికలు జరిగి ఉంటే.. వ్యవస్థ మరింత బలోపేతంగా ఉండేది. సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రజల తరపున బాధ్యతగా ఉండే వారు. కాని దురదృష్టవశాత్తూ కొన్ని కారణాల వల్ల జరగలేదు. కాని మనకు గ్రామ వాలంటీర్లు, సచివాలయాల రూపంలో మంచి వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను వాడుకోవాలి. మీరు నిరంతరం పర్యవేక్షణ ఇస్తూ.. వారిని చైతన్యం చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ మన బలం. వచ్చే రోజుల్లో ప్రతి విలేజ్ క్లినిక్స్‌ను తీసుకువస్తాం. ఈలోగా మనకున్న సిబ్బందిని సరిగ్గా వాడుకోవాలి. పీహెచ్‌సీల్లో, ఆస్పత్రుల్లో కచ్చితంగా సిబ్బంది ఉండేలా చూసుకోవాలి. హోం ఐసోలేషన్, సోషల్ డిస్టెన్స్ మీద ప్రధాన దృష్టిపెట్టాలని’ కలెక్టర్లకు సీఎం సూచించారు. -
లంచం లేకుండా పని జరగాలి
సాక్షి, అమరావతి: రూపాయి లంచం లేకుండా పని జరిగిందన్న పేరు రావాలని, ఇందుకు కొన్ని నియమాలు, నిబంధనలు, ప్రమాణాలు తీసుకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దీనిపై కలెక్టర్లు మరిన్ని సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఎమ్మార్వో, పోలీసుస్టేషన్లు, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కార్యాలయాల్లో అవినీతి అన్నది కనిపించకూడదని స్పష్టం చేశారు. స్పందన సమస్యల పరిష్కారంలో పురోగతి సాధించినందుకు, వినతులు ఇస్తే పరిష్కారం అవుతాయన్న నమ్మకాన్ని కలిగించినందుకు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘స్పందన’ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. జూలై 12 వరకు పెండింగ్‌లో 59 శాతం సమస్యలుంటే, జూలై 19 నాటికి 24 శాతానికి తగ్గాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో నాణ్యత ఇంకా మెరుగుపడాలని, స్పందన కింద వచ్చే సమస్యలను వేగవంతగా పరిష్కరించాలని సూచించారు. ఎమ్మార్వోలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పక్కపక్కనే ఉంటారు కాబట్టి పర్యవేక్షణతో పాటు నిర్ణయాలు తీసుకునే వీలు ఉంటుందన్నారు. స్పందన కార్యక్రమం కింద సమస్యలను స్వీకరించాక కలెక్టర్లు ఒక గంట ఎమ్మార్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే నాణ్యత మరింత పెరుగుతుందని చెప్పారు. ఎమ్మార్వోలు, ఎస్ఐలతో ప్రతి వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారా.. లేదా అనే విషయంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. పశ్చిమగోదావరి జిల్లాలో స్పందన సమస్యల పరిష్కారంలో ట్రాకింగ్ విధానం బాగుందని ముఖ్యమంత్రి అన్నారు. అవినీతి రహిత వ్యవస్థ రావాల్సిందే ఎమ్మార్వో కార్యాలయాలు, పోలీసుస్టేషన్లలో అవినీతి అనేది ఉండకూడదని, మండల అధికారులతో నిర్వహించే సమీక్షా సమావేశాల్లో ఈ విషయాన్ని పదే పదే చెప్పాలని, వ్యవస్థ అవినీతి రహితంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పోలీసుస్టేషన్లలో రిసెప్షనిస్టులను ఏర్పాటు చేశారా లేదా అనే విషయాన్ని ముఖ్యమంత్రి ఆరా తీశారు. కొన్ని పిటీషన్లు దీర్ఘకాలం పెండింగ్‌లో ఉండటం గురించి ఎస్పీలు ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఆ కేసులకు సంబంధించి ఇప్పటి వరకు ఏం చేశారు.. ఇకపై ఏం చేయబోతున్నారో చెప్పాలన్నారు. ఇలాంటి కేసులను ప్రత్యేకంగా ఒక అధికారికి అప్పగించి పరిష్కారానికి ప్రయత్నించాలని సీఎం సూచించారు. దీని వల్ల పిటీషన్ ఇచ్చిన వారికి బాధ్యతగా సమాచారం ఇచ్చినట్లు అవుతుందన్నారు. మనం సమస్యను సీరియస్‌గా తీసుకుంటామని, చిత్తశుద్ధిని ప్రదర్శిస్తున్నామనే సంకేంతం పోవాలన్నారు. పోలీసుస్టేష్లలో రిసెప్షనిస్టులు చిరునవ్వుతో స్వాగతించాలని, ఎందుకు పోలీసుస్టేషన్‌కు వచ్చామనే భావన రాకూడదని స్పష్టం చేశారు. కొన్ని భూ వివాదాలను త్వరగా పరిష్కరించాలనే ఆత్రుతలో న్యాయం కన్నా, అన్యాయం చేశామనే భావన వచ్చే అవకాశం ఉందని.. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. సచివాలయంలో స్పందన కార్యక్రమంపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాలు అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని, రేషన్ కార్డు, హౌసింగ్ లాంటి సమస్యలను 72 గంటల్లోగా పరిష్కారం ఉండాలని, రేషన్ కార్డును గ్రామ సచివాలయమే ప్రింట్ చేసి లబ్ధిదారునికి అందిస్తుందని సీఎం చెప్పారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా దీనిని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ప్రతి జిల్లాలో పని చేయని మురుగునీటి శుద్ధిప్లాంట్లు, మినరల్ వాటర్ ప్లాంట్లను గుర్తించాలని ఆదేశించారు. నిర్వహణ సరిగా లేక మూత పడుతున్నాయని, కలెక్టర్లు వీటిపై దృష్టి పెట్టి కచ్చితంగా నడిచేలా చేయాలని సూచించారు. లేకపోతే పెట్టిన ఖర్చు వృథా అయినట్లేనని, నిధులు కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. ఉగాది నాటికి ప్రతి నిరుపేదకూ ఇంటి స్థలం ఇవ్వాలని, ఇది కలెక్టర్లకు చాలా పెద్ద టాస్క్ అని, ఇంతకు ముందు ఎవ్వరూ ఇలాంటి కార్యక్రమం చేయలేదని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించామని, కలెక్టర్ల తరఫున సమన్వయం కోసం సీపీఎల్‌ఏలో ఒక అధికారిని నియమించామని సీఎం పేర్కొన్నారు. పాఠశాలల రూపు రేఖలు మార్చాలి హాస్టళ్లలో వసతుల మెరుగు కోసం ప్రతి జిల్లాకు కేటాయించిన నిధులు వచ్చాయా లేదా అంటూ ముఖ్యమంత్రి ఆరా తీశారు. ప్రతి జిల్లాకు ఏడు కోట్ల రూపాయల చొప్పున ఇచ్చామని, మిగిలిన డబ్బు కూడా ఇస్తామని అధికారులు తెలిపారు. హాస్టళ్లు బాగు చేయడానికి ఈ నిధులు వెచ్చించాలని, ప్రతి హాస్టల్‌ను కూడా విద్యార్థులు ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. ఇందుకు ఇంకా అవసరమైతే ఎక్కువ నిధులు ఇస్తామని, ఇంకా ఎక్కడెక్కడ నిధులు అవసరమో ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్రంలో 40 వేల స్కూళ్లకు సంబంధించి ఇవాల్టి పరిస్థితి ఏంటన్నది ఫొటోలు తీయాలని, రెండు మూడేళ్లలో వ్యవస్థీకృతంగా స్కూళ్లను మెరుగు పరుస్తామని సీఎం స్పష్టం చేశారు. ఏటా మూడింట ఒక వంతు స్కూళ్లపై దృష్టి సారించాలని చెప్పారు. బాత్రూం, నీళ్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, బ్లాక్ బోర్డులు, కాంపౌండ్ వాల్, పెయింటింగ్, ఫినిషింగ్ పనులు కచ్చితంగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. స్కూళ్లలోని బాత్ రూమ్స్‌ను శుభ్రం చేసే వారికి సామగ్రి సహా కనీసం 5 వేల రూపాయలు జీతంగా ఇవ్వాలన్నారు. ఆధునికీకరించాక ఫొటోలు తీసి, గతంలో ఉన్న ఫొటోలతో పోల్చి చూపాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్లు, ఎస్పీలు విద్యుత్ అంతరాయం లేకుండా చూడండి కరెంటు కోతలు ఎక్కడా ఉండకూడదని చెప్పారు. వర్షాలకు ముందు మెయింటెనెన్స్‌కు గత ప్రభుత్వం అంగీకరించలేదని చెబుతున్నారని, దీని వల్ల అక్కడక్కడా అంతరాయాలు వస్తున్నాయన్న సమాచారం కొన్ని వర్గాల నుంచి వస్తోందని చెప్పారు. ఎక్కడా కూడా విద్యుత్ అంతరాయాలు రాకుండా కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్నట్లు సమాచారం ఉందని, కొంత వెసులు బాటు ఇవ్వండని చెప్పామని, అదే సమయంలో అవినీతి లేకుండా చూసుకోవాలన్నారు. ఇసుక కొరత ఎక్కడ ఎక్కువ ఉందో చూసి సరఫరాను పెంచాల్సిందిగా సీఎం సూచించారు. సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
లంచాలు లేకుండా పనులు జరగాలి
నా స్థాయిలో నేను గట్టిగా ప్రయత్నిస్తున్నా. మీ స్థాయిలో మీరు కూడా కృషి చేయాలి. దయచేసి అంతా అవినీతి నిర్మూలనపై దృష్టి పెట్టాలి. పోలీస్ స్టేషన్లు, ఎమ్మార్వో కార్యాలయాలకు ఎవరు వచ్చినా సంతోషంగా తిరిగి వెళ్లామనే సంతృప్తి ప్రజల్లో కలగాలి. – అధికారులకుసీఎం వైఎస్ జగన్ సూచన సాక్షి, అమరావతి: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు లేకుండా పనులు చేసుకోగలిగామని ప్రజలంతా సంతృప్తి చెందాలి.. రాష్ట్రంలో ఆ పరిస్థితి తీసుకురావడమే మన ముందున్న లక్ష్యం..’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ‘అవినీతి అన్నది ఉండకూడదని పదేపదే చెప్పా. ఎమ్మార్వో కార్యాలయాల్లోకానీ పోలీస్స్టేషన్లలోకానీ ఎక్కడా ఆ పరిస్థితి లేదని నేను అనుకోవచ్చా? అవినీతి నిర్మూలనపై మనం ఇచ్చిన సందేశం బలంగా వెళ్లిందా?.. లేదా?’ అని కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అవినీతిని సహించబోదని కలెక్టర్లు, ఎస్పీలు గట్టి సందేశాన్ని ఇవ్వడంతోపాటు అవినీతిని కూకటివేళ్లతో పెకలించాలని సీఎం ఆదేశించారు. ‘స్పందన’ మరింత బాగుండాలి.... ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా జూలై 1వతేదీ నుంచి 12 వరకు జిల్లాలవారీగా అందిన వినతిపత్రాలు, పరిష్కారాలపై సీఎం జగన్ మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. స్పందనలో 45,496 వినతులు అందగా ఆర్థిక అంశాలతో సంబంధం లేనివి 1,904 అర్జీలు ఉన్నాయి. ఇందులో ఏడు రోజుల్లోగా పరిష్కరించాల్సిన సమస్యలు ఇంకా 1,116 ఉన్నాయని గుర్తించారు. స్పందనలో అందిన వినతిపత్రాలను పరిష్కరించకుంటే రానురాను పేరుకుపోతాయని ఈ నేపథ్యంలో తదుపరి స్పందన కార్యక్రమంలోగా వీటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. మన దృష్టి, ఏకాగ్రత తగ్గితే విశ్వసనీయత దెబ్బతింటుందన్నారు. ప్రజలను సంతోషపెట్టేలా ఈ కార్యక్రమం ఉండాలని, ఇప్పటివరకూ బాగానే చేస్తున్నారని, మరింత బాగా చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారు. గ్రీవెన్సెస్ పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దాలన్నారు. 80 శాతం గ్రీవెన్సెస్ భూ సంబంధిత, సివిల్ సప్లై, పెన్షన్లు, పురపాలక, నగర పాలక సంస్థలకు చెందినవి, ఇళ్లకు సంబంధించినవే ఉన్నాయన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించిన విజ్ఞాపన పత్రాలు కూడా ఉన్నాయన్నారు. ఎమ్మార్వోల వద్దకు వచ్చిన గ్రీవెన్సెస్‌ని కలెక్టర్లు ఆన్లైన్లో పరిశీలించే విధానం ఉండాలని, అదే సమయంలో జాయింట్ కలెక్టర్ కూడా సమీక్షించే వ్యవస్థ ఉండాలన్నారు. కలెక్టర్, జేసీ పక్కపక్కనే ఉంటారు కాబట్టి అక్కడికక్కడే నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. దీనివల్ల చాలావరకు సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి ఎమ్మార్వోలు కూడా చురుగ్గా సమస్యలను పరిష్కరిస్తారన్నారు. జిల్లా స్థాయిలో అందే విజ్ఞాపన పత్రాల పరిష్కారంలో నాణ్యతపై కలెక్టర్లు పరిశీలించాలని సీఎం ఆదేశించారు. వారంలో ఒకరోజు ఎమ్మార్వోలు, స్థానిక అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే సిబ్బంది స్పందన కార్యక్రమాన్ని మరింత సీరియస్‌గా తీసుకుంటారని సీఎం పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఎమ్మార్వో కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారో నేరుగా కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. సీఎస్ కూడా దీన్ని పర్యవేక్షిస్తారని చెప్పారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో ఫిర్యాదుల పరిష్కారంపై కాస్త ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. మలేరియా ప్రబలకుండా చర్యలు గుంటూరు, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో మలేరియా కేసులు పెరుగుతూ వస్తున్నాయని, దీనిపై దృష్టి పెట్టాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. మిగతా జిల్లాల్లో కూడా వర్షాకాలంలో జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, మలేరియా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు వ్యవసాయ శాఖ నుంచి కంటెంజెన్సీ ప్రణాళికలను జిల్లాలకు పంపిస్తున్నామని, దాని ప్రకారం విత్తనాల లభ్యత ఉండేలా చూసుకోవాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచించారు. విత్తన సేకరణలో ఇప్పటికే తప్పులు జరిగాయని, అయితే ఇందులో అధికారులను తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 45 రోజులే అయిందని, గత సర్కారు వీటిపై సరిగా స్పందించలేదన్నారు. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నామని, కచ్చితంగా అధికారులు, ప్రభుత్వం కలసి ముందుకు సాగాలన్నారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. నాసిరకం విత్తనాలు, పురుగు మందుల కొనుగోలుతో రైతులు నష్టపోకుండా నివారించాలన్నారు. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో ల్యాబ్స్ (నాణ్యత పరీక్షా కేంద్రాలు) ఏర్పాటు చేసేందుకు బడ్జెట్లో నిధులు కూడా కేటాయించామని తెలిపారు. ఈలోగా కలెక్టర్లు దీనిపై దృష్టి సారించి తనిఖీలు జరపాలని సూచించారు. విత్తనాలు, పురుగుమందులు, ఎరువులపై ప్రభుత్వ ముద్ర ఉండాలని, గ్రామ సచివాలయాలు కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమవుతాయని చెప్పారు. ఇంటి స్థలం లేని పేదలు ఉండకూడదు వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో ఇంటి స్థలం లేని పేదలు ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని ప్రభుత్వ భూమి ఎంత ఉందో గుర్తించాలని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం ఇవ్వాలని సూచించారు. గ్రామ వలంటీర్లు, సచివాలయాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని, ఎంతమందికి ఇళ్లు లేవో వీరి ద్వారా సమాచారం అందుతుందన్నారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే కొనుగోలు చేయాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగాది నాటికి ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తి కావాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇచ్చిన స్థలం ఎక్కడ ఉందో లబ్ధిదారుడికి తెలియని పరిస్థితి ఉండకూడదన్నారు. గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో రూ. 8,600 కోట్లు కేటాయించామని, చరిత్రలో ఎప్పుడూలేని విధంగా లక్షల సంఖ్యలో ఇళ్ల స్థలాలు ఒకేసారి ఇస్తున్నామన్నారు. ‘కలెక్టర్ల మీదే నా విశ్వాసం.. వారే నా బలం కూడా..’ అని సీఎం వ్యాఖ్యానించారు. కలెక్టర్లు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఈ కార్యక్రమం కచ్చితంగా చేయగలుగుతామన్నారు. ‘వచ్చే తరాలు కూడా మీ (కలెక్టర్లు) గురించి మాట్లాడుకుంటాయి. ఇవ్వాళ్టి నుంచే మీరు (కలెక్టర్లు) పని చేయడం ప్రారంభిస్తేనే ఉగాది నాటికి పూర్తవుతుంది’ అని సీఎం పేర్కొన్నారు. ఇసుక లభ్యత పెంచండి ఇసుక కొరత ఉన్నట్లు నివేదికలు అందుతున్న నేపథ్యంలో లభ్యతను పెంచాలని, అదే సమయంలో అవినీతికి అవకాశం ఇవ్వొద్దని సీఎం జగన్ కలెక్టర్లకు సూచించారు. సెప్టెంబరు 1 నుంచి ఇసుకపై కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. గ్రామ వలంటీర్ల శిక్షణ కార్యక్రమాల్లో అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొనాలని ముఖ్యమంత్రి సూచించారు. 50 ఇళ్లకు ఒకరు చొప్పున నియమిస్తున్నందున వారి సేవలను మెరుగ్గా వినియోగించుకోవడంపై మార్గనిర్దేశం చేయాలని కోరారు. సీఎం కార్యాలయం నుంచి కొన్ని మార్గదర్శకాలు పంపిస్తామని తెలిపారు. అన్ని పోలీస్స్టేషన్లలో రిసెప్షనిస్టులు రాష్ట్రంలో అన్ని పోలీసు స్టేషన్లలో రిసెప్షనిస్టులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలు పనుల నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు ఎందుకు వచ్చామా? అని బాధపడకూడదన్నారు. ప్రజలు రకరకాల సమస్యలతో వస్తారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఫిర్యాదులను ఎలా స్వీకరిస్తున్నాం? ఎలా పరిష్కరిస్తున్నామన్నది ముఖ్యమని చెప్పారు. చిరునవ్వుతో ప్రజలను స్వాగతించాలని ఇదివరకే చెప్పానని, ఇది కొనసాగాల్సిందేనని, ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఈ సందేశం పంపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్కూళ్లు, ఆసుపత్రుల దశ, దిశ మారాలి రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రుల దశ, దిశ మార్చాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. ఈ విషయంలో కలెక్టర్లకు మంచి పేరు రావాలని, జిల్లాపై మీ ముద్ర కనిపించాలని ఆకాంక్షించారు. వీటిని మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. స్కూళ్లలో మంచినీరు, మరుగుదొడ్లు, ప్రహరీ, ఫర్నిచర్, బ్లాక్ బోర్డ్స్, ఆట స్థలం లాంటి కనీస సదుపాయాలు కల్పించాలన్నారు. కొద్ది రోజుల తరువాత ఫొటోలు తీసి వీటిని ఎలా మెరుగుపరిచామో ప్రజలకు తెలియచేస్తామన్నారు. పాఠ్యప్రణాళికలను మార్చటంపై నిపుణుల కమిటీ కసరత్తు చేస్తోందన్నారు. ప్రతి పాఠశాలనూ ఇంగ్లీషు మీడియంలోకి మారుస్తామని అయితే తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడంతోపాటు సరుకుల కొనుగోళ్లు, ఆయాలకు సరైన సమయంలో వేతనాలు అందేలా చూడాలని సూచించారు. ఎక్కడైనా ఆలస్యమైతే వెంటనే తనను అప్రమత్తం చేయాలని సీఎం కోరారు. నెలల తరబడి వారికి డబ్బులివ్వకుండా పిల్లలకు మంచి భోజనం పెట్టమని ఎలా అడగగలమంటూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలను సీఎం ప్రస్తావించారు. యూనిఫారాలు, పుస్తకాలు కూడా సరైన సమయానికి అందించాలన్నారు. తల్లిదండ్రులకు దుస్తులు అందచేసి కుట్టుకూలీ చార్జీలు ఇవ్వాలని సూచించారు. జూన్ మొదటివారం నాటికి ఇవన్నీ అందాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల విషయంలో కూడా ఇదే తరహాలో దృష్టి సారించాల్సిందిగా కలెక్టర్లకు సీఎం సూచించారు. కర్నూలు కలెక్టర్‌కు సీఎం అభినందనలు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అభినందించారు. పాణ్యం అక్రమ పాఠశాల హాస్టల్‌ను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి అక్కడున్న పరిస్థితులను వెలుగులోకి తీసుకువచ్చిన వైనాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు. కర్నూలు కలెక్టర్ ఆకస్మికతనిఖీ వీడియోను నేరుగా ఆయన చూశారు. మిగతా అధికారులు కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తే వ్యవస్థలు బాగుపడతాయని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. -
రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ముకరంపుర : రాష్ట్ర అవతరణ వేడుకలు వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సూచించారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, బాణసంచా పేల్చి వేడుకలు ప్రారంభించాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను విద్యుత్‌దీపాలతో అలంకరించాలన్నారు. ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని తెలిపారు. జూన్ 2న అన్ని జిల్లా కేంద్రాలలో ఉదయం 9 గంటలకు సంబంధిత మంత్రి వర్యులతో పతాకావిష్కరణ, పోలీస్కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అవతరణ వేడుకల సందర్భంగా వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి, నగదు అవార్డులకు ఎంపికైన వారికి మండల, నగర, పంచాయతీ, మున్సిపాలిటీ, నగరపాలక సంస్థ, జిల్లాస్థాయిలో ఎక్కడివారికి అక్కడే అవార్డులు ప్రదానం చేయాలని సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి జైత్రయాత్రలు అన్ని జిల్లాల్లో నిర్ణయించిన తేదీలలో నిర్వహించాలన్నారు. వేడుకల సంధర్బంగా పాటల సీడీలు, తెలంగాణ పత్రికలు జిల్లాలకు పంపుతామని, వీటిని అన్ని గ్రామ పంచాయతీలకు పంపించాలని వివరించారు. వారం రోజుల పాటు గ్రా మ పంచాయతీలలో పాటలు వేయూలని సూచించారు. వేడుకల సంధర్బంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ శివకుమార్, అదనపు జేసీ నాగేంద్ర, అడిషనల్ ఎస్పీ జనార్దన్‌రెడ్డి, డీఆర్వో వీరబ్రహ్మయ్య, డీఈవో నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.