ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ
ముకరంపుర : రాష్ట్ర అవతరణ వేడుకలు వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సూచించారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, బాణసంచా పేల్చి వేడుకలు ప్రారంభించాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను విద్యుత్‌దీపాలతో అలంకరించాలన్నారు. ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని తెలిపారు.
జూన్ 2న అన్ని జిల్లా కేంద్రాలలో ఉదయం 9 గంటలకు సంబంధిత మంత్రి వర్యులతో పతాకావిష్కరణ, పోలీస్‌కవాతు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అవతరణ వేడుకల సందర్భంగా వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనబర్చిన వారికి, నగదు అవార్డులకు ఎంపికైన వారికి మండల, నగర, పంచాయతీ, మున్సిపాలిటీ, నగరపాలక సంస్థ, జిల్లాస్థాయిలో ఎక్కడివారికి అక్కడే అవార్డులు ప్రదానం చేయాలని సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి జైత్రయాత్రలు అన్ని జిల్లాల్లో నిర్ణయించిన తేదీలలో నిర్వహించాలన్నారు.
వేడుకల సంధర్బంగా పాటల సీడీలు, తెలంగాణ పత్రికలు జిల్లాలకు పంపుతామని, వీటిని అన్ని గ్రామ పంచాయతీలకు పంపించాలని వివరించారు. వారం రోజుల పాటు గ్రా మ పంచాయతీలలో పాటలు వేయూలని సూచించారు. వేడుకల సంధర్బంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఎస్పీ శివకుమార్, అదనపు జేసీ నాగేంద్ర, అడిషనల్ ఎస్పీ జనార్దన్‌రెడ్డి, డీఆర్‌వో వీరబ్రహ్మయ్య, డీఈవో నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
Published Thu, May 28 2015 5:04 AM | Last Updated on Sun, Sep 3 2017 2:47 AM
Advertisement