11 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షలో సీఎస్ శాంతికుమారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. మంగళవారం కూడా దాదాపు 11 జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో సోమవారం సమీక్షించారు.
ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమురం భీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్–మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల్లో వరదల పరిస్థితి, పునరావాస, సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు.
జాగ్రత్తలు తీసుకోండి: భారీ వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాల కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ఏ విధమైన ఆస్తి, ప్రాణనష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించే విషయమై జిల్లా కలెక్టర్లే నిర్ణయించుకోవాలన్నారు. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్మల్ కలెక్టర్‌ను ఆదేశించారు.
కలెక్టరేట్‌లలో కంట్రోల్ రూంలు 24/7 పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో డీజీపీ జితేందర్, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరి్వంద్ కుమార్, ఫైర్ సరీ్వసుల డీజీ నాగిరెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment