సాక్షి, పుంగనూరు: అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా పచ్చ పార్టీ నేతలు రెచ్చిపోయారు. పుంగనూరులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, పోలీసులను టార్గెట్ చేసి దాడులకు పాల్పడ్డారు. ఇక, ఎల్లో బ్యాచ్ దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, 14 మంది పోలీసులు గాయపడ్డినట్టు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి స్పందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ రిషాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పథకం ప్రకారమే పోలీసులపై దాడి చేశారు. చంద్రబాబు పుంగనూరు హైవే మీదుగా చిత్తూరు వెళ్లాల్సి ఉంది. రూట్ మార్చి పుంగనూరు వచ్చేందుకు ప్రయత్నించారు. పుంగనూరులోకి రాకుండా టీడీపీ శ్రేణులను అడ్డుకున్నాం. అడ్డుకున్న పోలీసులపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగారు. విచక్షణారహితంగా దాడులు చేశారు.
బీర్ బాటిళ్లు, కర్రలు, రాళ్లతో టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడి చేశారు. టీడీపీ శ్రేణుల రాళ్ల దాడిలో 50 మందికిపైగా గాయపడ్డారు. రెండు పోలీసు వాహనాలను తగలబెట్టారు. దాడులకు దిగిన టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేస్తాం. దాడుల వెనుక ఎంత పెద్ద వ్యక్తులను అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: పుంగనూరు దాడుల్లో షాకింగ్ వాస్తవాలు.. టీడీపీ నేతల వాహనాల్లో గన్స్..
Comments
Please login to add a commentAdd a comment