
కురమయ్య (ఫైల్‌ఫోటో)
సాక్షి, నారాయణపేట : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార, హత్య కేసులో నిందితుడైన చెన్నకేశవులు తండ్రి తండ్రి కురమయ్య మృతిచెందారు. గతంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన హైదరాబాద్‌లో కొన్నిరోజులపాటు చికిత్స పొందారు. కొన్ని రోజుల క్రితమే కురమయ్య కుటుంబ సభ్యులు ఆయన్ని తన స్వగ్రామం నారాయణపేట జిల్లా గుడిగండ్లకు తీసుకునివెళ్లారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో తన ఇంట్లోనే మృతి చెందారు. కాగా దిశ అత్యాచార కేసులో ఏ4గా ఉన్న చెన్నకేశవులు పోలీసుతో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఇక ఆయన భార్య రేణుక రెండు రోజుల క్రితమే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో కురమయ్య మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు గుడిగండ్ల వాసులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. (ఆడబిడ్డకు జన్మనిచ్చిన రేణుక)