chennakesavulu
-
దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి
సాక్షి, నారాయణపేట : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార, హత్య కేసులో నిందితుడైన చెన్నకేశవులు తండ్రి తండ్రి కురమయ్య మృతిచెందారు. గతంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన హైదరాబాద్‌లో కొన్నిరోజులపాటు చికిత్స పొందారు. కొన్ని రోజుల క్రితమే కురమయ్య కుటుంబ సభ్యులు ఆయన్ని తన స్వగ్రామం నారాయణపేట జిల్లా గుడిగండ్లకు తీసుకునివెళ్లారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో తన ఇంట్లోనే మృతి చెందారు. కాగా దిశ అత్యాచార కేసులో ఏ4గా ఉన్న చెన్నకేశవులు పోలీసుతో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. ఇక ఆయన భార్య రేణుక రెండు రోజుల క్రితమే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో కురమయ్య మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు గుడిగండ్ల వాసులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. (ఆడబిడ్డకు జన్మనిచ్చిన రేణుక) -
దిశ: చెన్నకేశవులు భార్యను కలిసిన వర్మ
సాక్షి, హైదరాబాద్: నిర్భయ సంఘటన తర్వాత ఇటీవల జరిగిన దిశా అత్యాచారం ఘటన దేశాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. దిశపై అత్యాచారం, అనంతరం హతమార్చిన వాళ్లను ఉరి తీయాలంటూ జనాలు రోడ్డెక్కెలా చేసిందా ఘటన. ఈ కేసులో నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సినిమా చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. (నా తదుపరి చిత్రం ‘దిశ’: వర్మ) ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు.. నిందితుల కుటుంబాల గురించి కూడా వివరాలు తెలుసుకోవడానికి నిందితుడు చెన్న కేశవులు భార్య రేణుకను దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆదివారం కలిశారు. దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు.. అతని భార్య రేణుకకు భవిష్యత్తు లేకుండా చేశాడని వర్మ మండిపడ్డారు. ‘రేణుక 16 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకుంది, 17 ఏళ్లకే ఒక బిడ్డకు జన్మనివ్వబోతుందన్నారు. బాస్టర్డ్ చెన్న కేశవులు దిశను మాత్రమే కాకుండా.. అతని భార్య రేణుకను కూడా బాధితురాలిగా మార్చాడు. వాడి వల్ల ఒక బాలిక మరో పాపకు జన్మనిస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు వారిద్దరికీ భవిష్యత్తు లేకుండా పోయింది’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. Just met Renuka , Rapist Chenna keshavlu’s wife ..She married him at 16 and she’s about to deliver his baby at 17 ..Not only Disha, the bastard made his own wife a victim too ..she is a child giving birth to a child and both have no future pic.twitter.com/zcVwL1p1Bu — Ram Gopal Varma (@RGVzoomin) February 2, 2020 -
దిశ కేసు నిందితుడి తండ్రిని ఢీకొన్న కారు
మహబూబ్‌నగర్ : దిశ కేసులో నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు తండ్రి కురమయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గురువారం మక్తల్ మండలం జక్లేర్ నుంచి స్వగ్రామం గుడిగండ్లకు వెళ్తున్న కురమయ్యను ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతన్ని మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో చెన్నకేశవులు కుటుంబంలో విషాదం నెలకొంది. హైదరాబాద్ నగర శివార్లలో దిశపై అత్యాచారం, హత్య చేసిన కేసులో జక్లేర్ గ్రామానికి చెందిన ఆరిఫ్ ఏ1 నిందితుడు కాగా, మిగిలిన ముగ్గురు నిందితులు జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు గుడిగండ్ల గ్రామానికి చెందినవారు. దిశ ఘటన తరువాత నిందితులు ఎన్కౌంటర్లో మృతిచెందగా.. ఇటీవలే వారి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. -
ఎన్‌కౌంటర్‌పై మృతుల తల్లిదండ్రుల మండిపాటు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘దిశ’కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై మృతుల తల్లిదండ్రుల ఆవేదన ఇది. తమ బిడ్డలు చేసిన పని తప్పేనని, వారికి శిక్ష వేయాల్సిందే అని పేర్కొంటున్న నిందితుల తల్లిదండ్రులు.. ఇంత తొందరగా ఇలాంటి శిక్ష పడుతుందని ఊహించలేదని చెబుతున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్‌కు చెందిన మహమ్మద్ ఆరిఫ్, గుడిగండ్ల గ్రామానికి చెందిన జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును శుక్రవారం ఉదయం పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలుసుకున్న ఆయా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. వారంతా దిశకు న్యాయం జరిగిందని చెబుతూనే.. మృతులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారని, తల్లిదండ్రులకు వారే దిక్కని, ఎన్‌కౌంటర్‌తో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డా యని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కసారి కూడా మాట్లాడనీయ కుండా ఇలా ఎన్కౌంటర్ చేయడం దారుణమని మృతుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మరోవైపు ఎన్కౌంటర్లో చనిపోయిన మృతుల తల్లిదండ్రులను వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు ఓదార్చారు. వారికి ఎన్కౌంటర్ స్థలానికి పంపించారు. మా పొలంలో పూడ్చొద్దు.. ఎన్కౌంటర్లో చనిపోయిన వారిని ఖననం చేసేందుకు శుక్రవారం సాయంత్రమే ఏర్పా ట్లు చేశారు. అయితే గుడిగండ్లకు చెందిన నిందితుడు చెన్నకేశవులును శ్మశానవాటికలో ఖననం చేసేందుకు సన్నద్ధమవుతుండగా.. తన పొలానికి దగ్గరగా పూడ్చొద్దంటూ మ్యాకల వెంకటమ్మ స్పష్టంచేశారు. ఆమె పొలానికి ఆనుకుని ఉన్న శ్మశానవాటికలోనే మృతులందరినీ పూడుస్తున్నామని చెప్పినా.. ఆమె అంగీకరించలేదు. దీంతో వెంకటమ్మ పొలానికి దూరంగా మృతదేహాలను ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు చెన్నకేశవులు మృతదేహాన్ని తమకే అప్పగించాలని తల్లి జయమ్మ, భార్య రేణుక, బంధువులు, కుటుంబ సభ్యులు ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. ‘‘కోర్టు తీర్పు రాకముందే మా ఆయన్ను చంపడం పెద్ద తప్పు.. ఇది అన్యాయం.. నన్నూ తీసుకెళ్లి అక్కడే చంపండి’’ – చెన్నకేశవులు భార్య రేణుక ‘‘తప్పు చేసిన మా కొడుకుకు శిక్ష వేయడం కరెక్టే. ఇకపై తెలంగాణలో ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఇలాగే కాల్చి చంపుతారా? పోలీసులు సమాధానం చెప్పాలి. ఇప్పుడు నా కోడలు కడుపుతో ఉంది. ఒక్కసారి కూడా మాట్లడనివ్వకుండా చంపడం సరైంది కాదు’’ – చెన్నకేశవులు తల్లి జయమ్మ ‘‘కనీసం మాకు చెప్పకుండానే, కోర్టులో శిక్ష పడకుండానే పోలీసులు ఎలా ఎన్కౌంటర్ చేశారో సమాధానం చెప్పాలి’’ – మహమ్మద్ ఆరిఫ్ తల్లి మౌలానాబీ ‘‘మా కొడుకును ఒక్కసారి చూడకుండా మాట్లాడకుండా ఇలా చంపేయడం కరెక్ట్ కాదు. తప్పు చేస్తే శిక్షించమన్నాం. ఇంత తొందరగా ఇలా చంపుతారని అసలే అనుకోలేదు. మా కొడుకు శవం మాకొద్దు’’ – శివ తల్లిదండ్రులు మణెమ్మ, రాజప్ప ‘‘నా కొడుకును చూడకుండానే చంపేశారు.. కడ చూపుకైనా కనికరించ లేదు..’’ – నవీన్ తల్లి లక్ష్మి మృతుల దేహాల్లో 11 బుల్లెట్లు! ఎన్కౌంటర్లో చనిపోయిన మహమ్మద్ ఆరిఫ్ (ఏ–1) శరీరంలో నాలుగు బుల్లెట్లు, జొల్లు శివ (ఏ–2) శరీరంలో మూడు, జొల్లు నవీన్ (ఏ–3) శరీరంలో మూడు, చెన్నకేశవు లు (ఏ–4) శరీరంలో ఒక బుల్లెట్‌ను వైద్యాధికారుల బృందం గుర్తించినట్లు సమాచారం. సంఘటనా స్థలంలో పోలీసులు 15 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇం దులో పలు బుల్లెట్లు మిస్ ఫైర్ కాగా.. 11 బుల్లెట్లు నిందితుల శరీరంలోకి చొచ్చుకుని పోయాయని తెలుస్తోంది. -
విజయాలనిచ్చే కప్పచెన్నకేశవుడు
కర్ణాటక రాష్ట్రంలోని బేలూరు చెన్నకేశవాలయం శిల్పానికి పెట్టింది పేరు.అది విష్ణ్వాలయం. హొయ్సళ శిల్పకళాప్రాభవానికి అదో మచ్చుతునక. ఇక్కడ ప్రధాన ఆలయానికి కుడివైపున నైఋతి మూలలో కప్పచెన్నిగరాయస్వామి ఆలయం ఒకటుంది. భగవద్రామానుజులవారి ప్రభావంతో విష్ణువర్ధనమహారాజు పంచనారాయణ క్షేత్రాలు నిర్మింపజేశాడు. అందులో బేలూరు చెన్నకేశవాలయం విజయనారాయణ క్షేత్రంగా విఖ్యాతి గాంచింది.ప్రధానవిగ్రహం స్వయంగా మహాశిల్పి జక్కనాచార్య చేతుల్లోనే రూపుదిద్దుకుని, ప్రతిష్ఠకు సిద్ధమైంది. అయితే ఇంతలో ఆ విగ్రహం ప్రతిష్ఠకు పనికిరాదని అక్కడికి వచ్చిన ఒక పిల్లవాడు చెబుతాడు. విషయాన్ని నిరూపిస్తే తన చేతులను తెగనరుక్కుంటానని జక్కన ప్రతిజ్ఞ చేశాడు. ఆ విగ్రహం తెప్పించి చందనాన్ని విగ్రహమంతా పూయమని చెప్తాడా బాలుడు. కొంతసేపటికి చందనమంతా ఆరిపోయింది. కానీ విగ్రహానికి నాభి ప్రదేశంలో మాత్రం తడిగానే ఉంది. ఆ బాలుడు ఉలితో ఆ భాగాన్ని మాత్రం బద్దలు చేసి చూస్తే అందులోంచి ఒక కప్ప బయటకు వచ్చింది. ఈ శిల గర్భశిల అనీ, తన పేరు ఢంకణాచార్యుడనీ చెప్పగా, తాను తప్పు చేసినట్లు గుర్తిస్తాడు జక్కనాచార్యుడు. అన్నమాటకు కట్టుబడి తన రెండు చేతులనూ నరుక్కుంటాడు. అయితే ఢంకణాచార్యుడు తన కుమారుడే అని తెలుసుకుని, పుత్రుని చేతిలో పరాజయం పొందడం అదృష్టంగా భావిస్తాడు. చేతులు లేకపోయినా కుమారుడి సహాయంతో ప్రతిష్ఠా సమయానికి మరో అద్భుతమైన విగ్రహం తయారు చేసి ఇస్తాడు. జక్కణాచార్యుని అకుంఠిత భక్తికి మెచ్చి చెన్నకేశవుడు ఆయనకు తిరిగి చేతులిచ్చాడని చెబుతారు. అయితే కప్ప బయటపడిన విగ్రహానికి కూడా ఆలయం నిర్మించి ప్రతిష్ఠించారు. నేటికీ మనం ఆ విగ్రహం నాభి ప్రదేశంలో చదరపు భాగాన్ని గమనించవచ్చు.ఈ స్వామి స్థితరూపంలో కుడిచేతిలో పుష్పాన్ని, అభయముద్రతో, ఎడమచేతితో గదను, వెనుక చేతులలో శంఖచక్రాలను ధరించి ఉంటాడు. ఈ స్వామికి ఇరు వైపులా శ్రీదేవి భూదేవి ఉంటారు. కష్టాలను తీర్చి, విజయాలనిచ్చే విజయనారాయణుడిగా ఈయన ప్రసిద్ధుడు. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
తల్లి ఒడి చేరిన చెన్నకేశవుడు
టెక్నాలజీ, పోలీసుల కృషితో దొరికిన కిడ్నాపర్లు వివాహేతర సంబంధాన్ని నిలుపుకునేందుకే బాలుడి కిడ్నాప్ అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు తిరుపతి క్రైం: ఈ నెల 14న తిరుమల శ్రీవారి ఆలయం ముందు గొల్లమండపం వద్ద కిడ్నాప్‌నకు గురైన చిన్నారి చెన్నకేశవులును డీఐజీ ప్రభాకర్‌రావు శనివారం తల్లిదండ్రులకు అప్పగించారు. ఆయన అర్బన్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడు నామక్కల్ జిల్లా రాసిపురం తాలూకా సింగనందాపురం గ్రామం మెల్కొత్తూరుకు చెందిన ఎం. అశోక్ (24)కు, అదే జిల్లాలోని శాంతిమంగళం తాలూకా మల్లెవేపగుంటకు చెందిన పెరీస్వామి భార్య తంగే (24)తో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. 2015లో తంగే భర్తతో గొడవపడి అశోక్‌తో పాటు బెంగళూరుకు వెళ్లిపోయింది. గత నెల 10వ తేదీ రాత్రి ఇద్దరు రైలు ఎక్కి తిరుపతికి వచ్చారు. శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. 14వ తేదీన ఉదయం 5.45 నిమిషాలకు గొల్లమండపం వద్ద చెన్నకేశవులును కిడా్నప్ చేసి బస్సులో తిరుపతికి వచ్చి ప్రైవేటు ద్వారా బెంగళూరు వెళ్లిపోయారు. వారం రోజులు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో అశోక్ తన తండ్రికి ఫోన్ చేసి తమకు మగబిడ్డ పుట్టాడని తెలిపాడు. వారి పిలుపు మేరకు సొంత ఊరుకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో చిన్నారి కిడ్నాప్‌పై పోలీసులు విస్తృతంగా ప్రకటనలు చేయడంతో ఆ విషయం గ్రామస్తులకు తెలిసింది. వారు భయపడి శుక్రవారం నామక్కల్ జిల్లా మేల్‌కుర్చి పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. అక్కడి పోలీసులు అర్బన్ జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. ఎస్వీ యూనివర్సిటీ సీఐ శ్రీనివాసులు అక్కడకు చేరుకుని బాబును, నిందితుల్ని తిరుపతికి తీసుకువచ్చారు. వివాహేతర సంబంధాన్ని నిలుపుకునేందుకే.. ఇద్దరు నిందితులు తమ వివాహేతర సంబంంధాన్ని నిలుపుకోవడంతోపాటు కుటుంబ సభ్యుల నుంచి ఇబ్బందులు లేకుండా కలుగకుండా ఉండేందుకు పన్నాగం పన్నారు. తమకు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు దగ్గరకు తీసుకుంటారని, గ్రామస్తులు కూడా ఏమీ చేయరని భావించారు. పిల్లల కోసం అనాథాశ్రమాల్లో ప్రయత్నించారు. అక్కడ కుదరకపోవడంతో తిరుమలకు చేరుకుని బాలుడిని కిడ్నాప్ చేశారు. చిన్నారికి తల్లిపాలు ఇవ్వకపోవడం, తంగే ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడం, వాట్సాప్, పేస్‌బుక్‌లో వీరి చిత్రాలు రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అనుమానించి హెచ్చరించారు. దీంతో వారు చేసేది లేక పోలీసుల వద్ద లొంగిపోయారు. ఈ కేసును ఛేదించడంలో ఏఎస్పీ మురళీకృష్ణ, డీఎస్పీలు మునిరామయ్య, కొండారెడ్డి, సుధాకర్‌రెడ్డి, సీఐలు శ్రీనివాసులు, తులసీరామ్, వెంకటరవి, శరత్చంద్ర, భాస్కర్, సత్యనారాయణ, రామకృష్ణ, సిబ్బంది ఎంతగానో కృషి చేశారని డీఐజీ తెలిపారు. అదేవిధంగా సీసీ టీవీల కమాండెంట్ కంట్రోల్ రూమ్‌లు నిరంతరం కష్టపడడం వల్లే కిడ్నాప్ కేసును ఛేదించామన్నారు. ఈ కేసులో ప్రతిభ చూపిన ప్రతి ఒక్కరికీ డీజీపీ సాంబశివరావు ప్రత్యేక అభినందనలు తెలిపినట్టు డీఐజీ పేర్కొన్నారు. -
తిరుమలలో కిడ్నాపైన బాలుడి ఆచూకీ లభ్యం
తిరుమల : ఈ నెల 14న తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారి బాలుడి ఆచూకీ లభ్యమైంది. బాలుడిని అపహరించిన దంపతులు తమిళనాడులోని నమ్మకల్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. కాగా తమకు పిల్లలు లేని కారణంగానే కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. పోలీసులు బాబును తిరుమల తీసుకు వస్తున్నారు. కాగా తల్లిదండ్రులతో కలసి నిద్రిస్తున్న బాలుడిని గుర్తు తెలియని ఓ మహిళ, పురుషుడు కలసి ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. నిద్రలేచిన తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించకపోవడంతో తల్లడిల్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీటీవీ ఫుటేజ్‌ను గమనించగా.. బాబును ఎత్తుకెళ్లిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం ఛాయాపురానికి చెందిన వెంకటేశ్వర్లు, రత్నమ్మలు తమ పిల్లలు ప్రమీల(8), శ్రీనివాసులు(6), సువర్ణ(2), చిన్నకుమారుడు చెన్నకేశవులు(7నెలలు)తో కలసి శ్రీవారి దర్శనం కోసం ఈ నెల 13వ తేదీ మంగళవారం ఉదయం తిరుమల వచ్చారు. దర్శనం పూర్తిచేసుకున్న వారు రాత్రికి ఆలయం ఎదురుగా ఉన్న గొల్లమండపం ప్రాంతంలో నిద్రించారు. బుధవారం వేకువన నాలుగు .. 5.30 గంటల సమయాల్లో బాలుడికి తల్లి రత్నమ్మ పాలుపట్టి.. నిద్రలోకి జారుకుంది. ఉదయం 6.30 గంటలకు నిద్రలేచిన తల్లిదండ్రులు బిడ్డ కనిపించకపోవటంతో కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.