
సాక్షి, నారాయణపేట్: మంత్రి కేటీఆర్ నారాయణపేట జిల్లా పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. కేటీఆర్ కాన్వాయ్‌ను బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులకు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో నిరసనకారలపై పోలీసుల లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. పలువురుఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. కాగా జిల్లా ఆస్పత్రిలో చిల్డ్రన్స్ ఐసీయూ వార్డును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.