సాక్షి,తెలంగాణ భవన్: నేను ఏ తప్పు చేయలే .. అందుకే నేను భయపడను. ఈ రేస్ అయినా ఇంకేదైనా. అరెస్టు చేసుకుంటే చేసుకో అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. గురువారం రాష్ట్ర రాజకీయాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిట్‌చాట్‌లో కేటీఆర్ ఏమన్నారంటే..
ఎస్పీ నారాయణ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల్ని వదిలేసి బీఆర్‌ఎస్ శ్రేణుల్ని కొట్టారు. దీనిపై మేధావులు ఎవరు మాట్లాడలేదు. పోలీసుల తీరు సరిగా లేదు. పోలీసులు వైఫల్యం ఉంది. ఇంటిజెన్స్ వ్యవస్థ అట్టర్ ప్లాప్ అయింది.
రేవంత్‌రెడ్డి సైన్యంలా పరిస్థితి తయారైంది. రైతులు,బీఆర్‌ఎస్ శ్రేణుల్ని ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసినట్లు చేస్తున్నారు. నేను ఊరుకోను. రేవంత్ రెడ్డి నీ సంగతి తేలు. లగచర్ల బాధితులను ఢిల్లీకి తీసుకుపోయి.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయిస్తా. నేను ఏ తప్పు చేయలే.. అందుకే నేను భయపడను. ఈ రేస్ అయినా ఇంకేదైనా. అరెస్టు చేసుకుంటే చేసుకో.
మీలాంటి వాళ్ళను చాలా మందిని చూశా. నీ కుర్చీ కాపాడుకో. ఎన్ని రోజులు ఉంటావో. ఉత్తమ్, భట్టీ నీ కుర్చిలో కూర్చుంటారు. బాంబులు పేల్చేది నీ మీదనే.. మీ పార్టీలోనే. మూసీ కోసం రేవంత్ కొత్తగా చేసిందేమీ లేదు. డబ్బు దండుకోవడమే. డీపీఆర్ లేకుండా రూ. లక్ష 50వేల కోట్లు ఎలా అవుతాయ్ రేవంత్. ఢిల్లీకి డబ్భులు పంపాలని ప్లాన్ చేశారు. నీ నియోజకవర్గంలో సమస్యనే పరిష్కరించలేని నువ్వు ఓ ముఖ్యమంత్రివి. నీదో కథ’ అని కేటీఆర్ చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment