సాక్షి, నారాయణపేట: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చులపై ఎన్నికల వ్యయ పరిశీలకులతో ప్రత్యేక నిఘా బృందాలతో పర్యవేక్షించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకట్రావు ఆధ్వర్యంలో జిల్లా పర్చేజెస్ కమిటీలో రేట్ ఆఫ్ చార్ట్‌ను నిర్ణయిస్తూ శుక్రవారం సర్క్యులర్‌ను విడుదల చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నివేదించాల్సిన ఖర్చుల వివరాలను ఈ రేట్ ఫర్ చార్ట్‌ను ఆధారంగా చేసుకొని బిల్లులను మున్సిపల్ కమిషనర్లకు ఎప్పటికప్పుడు సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.
ధరలు ఇలా..
లౌడ్ స్పీకర్స్, యాంపిల్ ఫైర్, మైక్రోఫోన్ లేబర్ చార్జీలతో కలిపి ఒకరోజుకు రూ.1,450, కన్‌స్ట్రక్షన్ ఆఫ్ పోడియం ఒకరోజుకు రూ.2,850, ఫ్లెక్సీ బ్యానర్ సైజ్ 10/12 రూ.1,200, క్లాత్ బ్యానర్ రూ.200, క్లాత్ ఫ్లాగ్స్ రూ.40, ప్లాస్టిక్ ప్లాగ్స్ సైజ్ 6/4 రూ.8, పోస్టర్ సింగిల్ కలర్ 18/23 రూ.8, మల్టీకలర్ పోస్టర్ సైజ్ 18/23 రూ.10, హోర్డింగ్ సైజ్ 8/12 లేబర్ చార్జీలతో కలిపి రూ.8,500, కటౌట్స్ (ఉడెన్) లెబర్ చార్జెస్‌తో 14/4 రూ.9 వేలు, కటౌట్స్ క్లాత్, ప్లాస్టిక్ 12/4 రూ.5 వేలు, వీడియోగ్రాఫర్, కెమెరామెన్ రూ.1,250, ఎరక్షన్ ఆఫ్ గేట్స్ 15/12 రూ.2,800గా ధరలు నిర్ణయించారు.
వాహనాల చార్జీలు..
వాహనాల చార్జీల విషయానికి వస్తే జీపు డ్రైవర్ బత్తతో కలిపి రూ.1,500, టెంపో/ ట్రక్ రూ.2,900, సుమో ఒకరోజుకు ఏసీ రూ.2 వేలు, ప్యూల్ రూ.వెయ్యి, నాన్ ఏసీ రూ.1,200, ప్యూల్ రూ.650, వ్యాన్ (డీసీఎం) ఒకరోజుకు రూ.2,900, ఫ్యూల్ రూ.వెయ్యి, వ్యాలీస్ ఒకరోజు ఏసీ రూ.2 వేలు, నాన్ ఏసీ రూ.1,200, ఇన్నోవా ఏసీ ఒకరోజు రూ.2,500, కారు ఒక రోజుకు రూ.1,200, త్రీ వీలర్ ఒకరోజుకు రూ.750, హోటల్ చార్జీలు ఏసీ రూ.1,600 ఒకరోజుకు, నాన్ ఏసీ రూ.800లు గెస్ట్‌హౌస్ రూ.400, చార్జెస్ ఆఫ్ డ్రైవర్స్ జీతాలు ఒకరోజు బత్త రూ.500, కుర్చీలు ఒకరోజుకు రూ.9, సోఫా రూ.250, హియరింగ్ చార్జెస్ హోర్డింగ్ సైట్స్ మున్సిపాలిటీ అథారిటీస్ రూ.500, టెంట్లు సైజు 18/36 రూ.800, 12/24 రూ.600, రూ.700, కార్పెట్స్ బిగ్ సైజ్ రూ.200, స్మాల్ సైజ్ రూ.150, సైడ్ వాల్స్ రూ.125, వాటర్ డ్రమ్స్ ఒకరోజుకు రూ.50, గ్లాసులు రూ.3, రైస్ ప్లేట్స్ రూ.4, ఐరన్ టేబుల్ రూ.50గా ధరలను నిర్ణయించారు. మొత్తంగా ప్రతి కౌన్సిలర్ అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుంచి కౌంటింగ్ వరకు రూ.లక్ష మించకుండా ఖర్చుచేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment