గుండెపోటుతో రైతు మృతి | Farmer dies of heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో రైతు మృతి

Published Mon, Oct 19 2015 3:34 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

Farmer dies of heart attack

వీణవంక (కరీంనగర్) : సాగులో నష్టపోయిన ఓ రైతన్న అదే ఆందోళనతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బొంతుపల్లిలో ఈ ఘటన జరిగింది. బాబు రాజకొమరయ్య (52) రెండేళ్లుగా సాగులో దిగుబడి లేక నష్టపోయాడు. రూ.5 లక్షల వరకు అప్పులు చేయడంతో అవి తీర్చడం తన వల్ల కాదని మానసికంగా కుదేలయ్యాడు. ఈ క్రమంలో కొమరయ్యకు ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అర్ధరాత్రి మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement