
గుంటూరు : అప్పు తీర్చలేక రైతు ఆత్మహత్యాయత్నం చేసుకుంటే, అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాదేమోన్న బెంగతో రిటైర్డ్ ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందారు. నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో అప్పుల బాధ తట్టుకోలేక నాగేశ్వరరావు అనే రైతు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబసభ్యులు నాగేశ్వరరావును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, అప్పు ఇచ్చిన రిటైర్డ్ ఉద్యోగి సూర్యనారాయణకు ఈ విషయం తెలియడంతో గుండెపోటుతో మృతి చెందారు. సూర్యనారాయణ రూ. 8 లక్షలు నాగేశ్వరరావుకు అప్పుగా ఇచ్చారు.