అండగా ఉంటా.. | ys jaganmohan reddy assured farmers | Sakshi
Sakshi News home page

అండగా ఉంటా..

Published Tue, May 2 2017 9:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

అండగా ఉంటా.. - Sakshi

అండగా ఉంటా..

► ప్రభుత్వ వైఖరి మారేవరకూ పోరాడతాం
► ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తాం
► అన్నదాతకు   వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా
► కష్టాలు వింటూ... భరోసా కల్పించిన ప్రతిపక్ష నేత
► గుంటూరు ‘రైతు దీక్ష’కు పెద్దఎత్తున తరలి వచ్చిన కర్షకులు

ఒక్క మాట... అండగా ఉంటానన్న ఒకే ఒక్క మాట... లక్షలాది మంది రైతుల గుండెల్లో భారాన్ని దూరం చేసింది. పంట పండక కొందరు... పండిన పంటకు గిట్టుబాటు ధర లభించక మరికొందరు.. ఇలా కడుపు మంటతో అల్లాడుతున్న వారికి భవిష్యత్‌పై భరోసా నింపింది. కూడు లేక అల్లాడుతున్న వారిని కుండలో మెతుకై ఆదుకునేందుకు ఒక నాయకుడు ఉన్నాడనే నమ్మకం కలిగించింది...

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల అన్ని రకాలుగా కష్టాలు పడుతున్న కర్షకులకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులోని మిర్చియార్డు సమీపంలో చేపట్టిన ‘రైతు దీక్ష’ ఊరటనిచ్చింది. ప్రభుత్వంపై పోరాడి రైతులకు న్యాయం జరిగేలా చేస్తానని... భార్య పుస్తెలమ్మి సాగు చేసిన ఏ ఒక్కరూ పస్తులుండకుండా చూస్తానని వైఎస్‌ జగన్‌ చెప్పడంతో అన్నదాతల్లో సరికొత్త ఆశ చిగురించింది. మంచి రోజులొస్తాయనే నమ్మకం కలిగింది.

సాక్షి, గుంటూరు/అమరావతిబ్యూరో : ‘మీ కోసం నేనున్నా.. మీ పక్షాన నేను నిలిచి పోరాడతా..’ అని ప్రతిపక్ష నేత వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. మిర్చి నుంచి ఉల్లి వరకు 19 పంటలు సాగు చేసిన అన్నదాత పూర్తిగా నష్టాల ఊబిలో చిక్కి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గిట్టుబాటు ధర కల్పిస్తామని, ప్రతి పంటకూ మద్దతు ధర ఇస్తామని మాయమాటలు చెప్పిన సర్కారు మొఖం చాటేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతాంగ సమస్యల పరిష్కారం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు మిర్చియార్డు వద్ద చేపట్టిన రెండు రోజుల ‘రైతు దీక్ష’ సోమవారం ప్రారంభమైంది.                

స్ఫూర్తి నింపిన జగన్‌ ప్రసంగం....
రైతుల సమస్యలను ప్రతిబింబించేలా... అన్నదాతల్లో మనోధైర్యం నింపేలా.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ప్రభుత్వం అడుగడుగునా అన్నదాతలను దగా చేస్తున్న వైనాన్ని వివరించారు. సీఎం చంద్రబాబు వైఖరిపై నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గిట్టుబాటు ధర కల్పిస్తామని, రూ.5వేల కోట్లతో రైతు స్థిరీకరణనిధి ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు మాట మార్చడంతో రైతులు రోడ్డున పడుతున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో 1.04 కోట్ల రైతు ఖాతాలు ఉంటే, వాటిలో 40 లక్షల ఖాతాలు ఎన్‌పీ (నాన్‌ పెర్ఫార్మింగ్‌) అకౌంట్లుగా మారిపోయాయని చెప్పారు. ఐదు వారాల కిందట తాను మిర్చి యార్డుకు వచ్చినప్పుడు క్వింటా ధర రూ.6 వేల నుంచి 7వేలు ఉందని, ఇప్పుడు ఆ ధర రూ.2,500 నుంచిరూ. 4వేలకు పడిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. సర్కారు మాత్రం ఇప్పటికీ స్పందించకపోవడం దారుణమని విమర్శించారు.

రైతులకు ప్రభుత్వం అండగా నిలువకుండా వ్యాపారులకు మద్దతు పలకడం నీతిమాలిన చర్య అని ధ్వజమెత్తారు. మిర్చి, పసుపు, ధాన్యం, టమోటా, ఉల్లి, సుబాబుల్‌... ఇలా ఏ పంటలు చూసినా మార్కెట్‌లో ధర లేదని చెప్పారు.

వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం...
సోమవారం ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి గుంటూరు బస్టాండ్‌ చేరుకున్నారు. బస్‌స్టాండ్‌ వద్ద కార్మిక సంఘాలు ఏర్పాటు చేసిన కార్మిక దినోత్సవంలో పాల్గొని పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అక్కడి నుంచి కలెక్టరేట్‌ సెంటర్‌కు చేరుకుని కాసు వెంగళరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం నేరుగా నల్లపాడు రోడ్డులోని మిర్చి యార్డు సమీపంలో ఉన్న దీక్షా ప్రాంగణానికి ఉదయం 11.45 గంటలకు  చేరుకుని దీక్ష ప్రారంభించారు. వేదికపై దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల   ర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్‌ అధ్యక్షత వహించారు. సాయంత్రం చిరు జల్లులతో వర్షం ప్రారంభమై వాతావరణం చల్లబడింది.

హాజరైన ముఖ్య నేతలు వీరే.....
పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాద్, వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సీనియర్‌ నేత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి, మాజీ మంత్రులు బొత్ససత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారథి, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పార్టీ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, విశ్వేశ్వరరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, నారాయణస్వామి, అనిల్‌కుమార్‌ యాదవ్, ఐజయ్య, మేకా వెంటప్రతాప్‌ అప్పారావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, గౌరు చరితారెడ్డి, గిడ్డి ఈశ్వరి, కళావతి, మేకపాటి గౌతంరెడ్డి, ఎమ్మెల్సీలు కోలగుట్ల వీరభద్రస్వామి, వెన్నపూస గోపాలరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు భూమన కరుణాకర్‌రెడ్డి, ప్రసాద్‌రాజు, తలశిల రఘురామ్, జంగా కృష్ణమూర్తి, అధికార ప్రతినిధులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరి గౌతమ్‌రెడ్డి, పార్టీ జిల్లా, నగర అధ్యక్షులు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు పాల్గొన్నారు.

వీరితోపాటు పార్టీ ముఖ్య నేతలు అనంత వెంకటరామిరెడ్డి, వల్లభనేని బాలశౌరి, రెడ్డి శాంతి, రాష్ట్ర కార్యదర్శులు లావు శ్రీకృష్ణదేవరాయలు, కిలారి రోశయ్య, థామస్‌ నాయుడు, నసీర్‌ అహ్మద్, లాల్‌పురం రాము, పుత్తా ప్రతాపరెడ్డి, మిట్టపల్లి రమేష్, సమన్వయకర్తలు మేకతోటి సుచరిత, రావి వెంకటరమణ, కాసు మహేష్‌రెడ్డి, ఉదయభాను, జోగి రమేష్, అన్నాబత్తుని శివకుమార్, కత్తెర హెనిక్రిస్టినా, యేళ్ల జయలక్ష్మి, దేవళ్ల రేవతి, వెలంపల్లి శ్రీనివాస్, అమృతపాణి, కావటి మనోహర్‌నాయుడు, బొల్లా బ్రహ్మనాయుడు, టీజీవీ కృష్ణారెడ్డి, గుడివాడ అమర్‌నాథ్, దూలం నాగేశ్వరరావు, గొట్టిపాటి భరత్, కాపు రామచంద్రారెడ్డి, కాపు భారతి, బొప్పన భవనకుమార్, మొండితోక అరుణ్‌కుమార్, సఫాయతుల్లా, లోయ తాండవ కృష్ణ, గుంటూరు రూరల్‌ జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, లీగల్‌ సెల్‌ గుంటూరు జిల్లా అధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి,  చిల్లపల్లి మోహన్‌రావు, సయ్యద్‌మాబు, మేరాజోత్‌ హనుమంతు నాయక్, ఎలికా శ్రీకాంత్‌యాదవ్, డైమండ్‌ బాబ, చినప్పరెడ్డి, మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, అత్తోటో జోసఫ్, ఈపూరి అనూప్, శానంపూడి రఘురామిరెడ్డి, కొరిటెపాటి ప్రేమ్‌కుమార్, మేరువ నర్సిరెడ్డి, పానుగంటి చైతన్య, షేక్‌ రబ్బాని, షేక్‌ గౌస్, పల్లపు శివ, పల్లపు మహేష్, ఉప్పుటూరి నర్సిరెడ్డి, జగన్‌ కోటి, ఈచంపాటి వెంకటకృష్ణ, యోగేశ్వరరెడ్డి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.  

ఉప్పొంగిన జనాభిమానం...
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో జనాభిమానం ఉప్పొంగింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం ర్యాలీలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నాయి. ఉదయం 6 గంటల నుంచే నల్లపాడు రోడ్డు పార్టీ శ్రేణులతో కిటకిటలాడి కోలాహలంగా మారింది. బస్టాండ్, కలెక్టరేట్‌ సెంటర్‌ వద్ద జననేత రాకతో పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. జగన్‌ దీక్షలో కూర్చునప్పటి నుంచి ఆయన్ను కలిసేందుకు పెద్ద ఎత్తున రైతులు, యువత తరలి వచ్చారు.

ప్రధానంగా పొన్నూరు నియోజకవర్గం పచ్చలతాడిపర్రుకు చెందిన బొల్లంశెట్టి వెంకటేశ్వరరావు తనకు రుణమాఫీ కాలేదయ్యా... అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వైఎస్‌ జగన్‌కు రుణమాఫీ పత్రాలు, పట్టాదారు పాస్‌పుస్తకాలు చూపించి బాధపడ్డారు. పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన కొప్పుల సరోజ అనే వృద్ధురాలు జగన్‌ను చూసేందుకు సభకు తరలి వచ్చింది. డెబ్బై ఏళ్ల వయస్సులో మండుటెండలో వచ్చిన ఆమె కోసం జననేత వేదిక కిందకు వచ్చి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.

మరోవైపు యువత పెద్ద ఎత్తున నినాదాలతోపాటు దివంగత వైఎస్సార్‌ విగ్రహాన్ని జననేతకు బహూకరించింది. సెల్ఫీలు దిగేందుకు యువత, మహిళలు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. తెనాలికి చెందిన చిన్నారి రాజ్యలక్ష్మి... గాంధీ, వివేకానంద ఫొటోలతో ఉన్న చిత్రపటాన్ని బహూకరించింది. ఆ చిన్నారిని చూడగానే జగన్‌ ఆప్యాయంగా పలకరించారు. కిష్కిందపాలేనికి చెందిన కమలమ్మ అనే వృద్ధురాలు జగన్‌ను కలవడానికి దూరం నుంచి రావడంతో గమనించిన ఆయన కిందకు వచ్చి ఆప్యాయంగా పలకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement