ఎల్లారెడ్డిపేట (కరీంనగర్) : ఎండిపోయిన పంటను చూసి మనోవేదనకు గురైన రైతు గుండె ఆగింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండలం గొల్లపల్లిలో గురువారం జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్రాల రవీందర్ రెడ్డి(44) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ప్రతి ఏడులాగే ఈ ఏడాది పత్తి పంట సాగు చేశాడు. అయితే సరైన దిగుబడి రాకపోవడంతో ఇప్పటికే అప్పులు అధికమయ్యాయి. ఈ ఏడాది కూడా పంట పూర్తిగా ఎండిపోవడంతో పత్తి చేనులోనే గుండె ఆగి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఎండిన పంటను చూసి ఆగిన గుండె
Published Thu, Sep 24 2015 5:23 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement