బడిలో గుండెపోటుతో ఉపాధ్యాయురాలి మృతి | Teacher Died In School Due To Heart Attack In Manthani | Sakshi
Sakshi News home page

బడిలో గుండెపోటుతో ఉపాధ్యాయురాలి మృతి

Published Thu, Jan 19 2023 11:54 AM | Last Updated on Thu, Jan 19 2023 12:04 PM

Teacher Died In School Due To Heart Attack In Manthani - Sakshi

సునీత(ఫైల్‌)

సాక్షి, కరీంనగర్‌: మంథని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన్నీరు సునీత(37) పాఠశాలలో బుధవారం గుండెపోటుతో మృతి చెందింది. ఫిజికల్‌ సైన్స్‌ బోధించే సునీత పాఠశాలలోని కార్యాలయగదిలో తోటి ఉపాధ్యాయులతో కలిసి కుర్చీలో కూర్చుంది. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అపస్మారకస్థితికి వెళ్లిపోయింది. తోటిసిబ్బంది పరీక్షించి వెంటనే 108కు సమాచారం ఇచ్చారు.

వారు అక్కడికి చేరుకుని పరీక్షించగా.. అప్పటికే పనిపోయిందని తెలిపారు. అప్పటివరకు తమతో ఉన్న ఉపాధ్యాయురాలు ఒక్కక్షణంలో చనిపోవడాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయురాలు జీర్ణించుకోలేకపోతున్నారు. సునీతది మంచిర్యాల జిల్లాకేంద్రంలోని గౌతమేశ్వరకాలనీ. ఈమె భర్త కూడా అంతర్గాం మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement