కరీంనగర్: ‘డాడీ మేము స్కూల్ నుంచి వచ్చేసరికి నువ్వు వస్తానన్నావు.. హోలీ పండుగ రోజు రంగులు పూసుకొని, ఆడుకుందామన్నావు.. మేము వచ్చాము.. లేచి మమ్మల్ని ముద్దు పెట్టుకో డాడీ.. మమ్మీ మా ఇద్దరినీ పట్టుకొని ఏడుస్తుంది’.. అంటూ ఆ చిన్నారులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మక్కాన్‌సింగ్ సోదరుడు శైలేందర్‌సింగ్(44) గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. శైలేందర్‌సింగ్ బిల్డర్. ఆయనకు భార్య సరోజ్‌ఠాగూర్, కూతుళ్లు కనీషాసింగ్, అనితాసింగ్ ఉన్నారు.
భార్యాపిల్లలు హైదరాబాద్‌లో ఉంటుండగా శైలేందర్‌సింగ్ గోదావరిఖనిలో కన్‌స్ట్రక్షన్ పనుల నిమిత్తం స్థానిక కేసీఆర్ కాలనీలోని శ్రీనిధి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. మూడు రోజులకోసారి హైదరాబాద్ వెళ్లి, కుటుంబంతో గడిపి, వస్తుండేవాడు. శుక్రవారం ఉదయం పైఅంతస్తు నుంచి కిందకు వెళ్లేందుకు లిఫ్ట్ వద్దకు వెళ్లగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. అక్కడున్నవారు పరిగెత్తుకు వచ్చి, పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఆయన భార్యాపిల్లలు హైదరాబాద్ నుంచి బయలుదేరి, సాయంత్రం 4 గంటలకు ఇక్కడికి చేరుకున్నారు. మృతుడి అత్తామామ గుజరాత్ నుంచి రావాల్సి ఉంది. అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ప్రముఖుల నివాళి..
శైలేందర్‌సింగ్ మృతి వార్త తెలియడంతో గోదావరిఖని పట్టణంలోని ఆయన ఇంటికి పార్టీలకతీతంగా ప్రముఖులు, నాయకులు తరలివచ్చారు. శైలేందర్‌సింగ్ సోదరులు అయోధ్యసింగ్, మక్కా న్‌సింగ్‌లను పరామర్శించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, కౌశికహరి, కాంగ్రెస్ జాతీయ నాయకుడు బాబ ర్‌సలీంపాషా, కార్పొరేటర్లు శ్రీనివాస్, సతీశ్‌కుమార్, లత, స్వా మి, ధర్మపురి, కుమారస్వామి, రఘువీర్‌సింగ్, మేయర్ అనిల్‌కుమార్, డిప్యూ టీ మేయర్ అభిషేక్‌రావు ఆయన మృతదేహానికి నివాళి అర్పించారు. హైదరాబాద్ నుంచి శైలేందర్‌సింగ్ అభిమానులు వచ్చారు. కుటుంబసభ్యులు శైలేందర్‌సింగ్ నేత్రాలను దానం చేయాలని నిర్ణయించారు. సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులకు సమాచా రం ఇవ్వడంతో టెక్నీషియన్ ద్వారా నేత్రాలను సేకరించి, హైదరాబాద్‌లోని వాసన్ ఐ బ్యాంకుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment