సాక్షి, హుజూరాబాద్: భూ కబ్జా ఆరోపణలతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల.. తదుపరి బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ఈటల ప్రచారంలో ఉండగా.. అధికార టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది ఇంతవరకు స్పష్టత లేదు. టీఆర్‌ఎస్ తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర నేతలు తీవ్రంగా శ్రమిస్తున్న అభ్యర్థి విషయం ఇంకా తేలలేదు. ఇదిలా ఉండగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి రేసులో పలువురు నాయకులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
చివరికి వీణవంక మండలం హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ వైపే సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే టీఆర్‌ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్ పేరును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ నాయకుడు, విద్యార్థినేత, తెలంగాణ ఉద్యమకారుడిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు గుర్తింపు ఉంది. ఈటల రాజేందర్ బీసీ నాయకుడిగా ప్రజల్లోకి వెళ్తుండటంతో కేసీఆర్ సైతం బీసీ నాయకుడినే బరిలో నిలిపి చెక్ పెట్టాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రేసులో పలువురు
కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన వీణవంక గ్రామానికి చెందిన పాడి కౌశిక్‌రెడ్డి టీఆర్‌ఎస్ తరఫున రేసులో ఉన్నారని ప్రచారం జరిగినా.. ఆయనకు గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు మంత్రి వర్గం సిఫారుసు చేసింది. దీంతో బీసీ వర్గం నుంచే అభ్యర్థిని బరిలో దింపుతారని స్పష్టమైంది. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఎల్.రమణ, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి సోదరుడు పురుషోత్తంరెడ్డి (రిటైర్డ్ కలెక్టర్), ముద్దసాని దామోదర్ రెడ్డి సతీమణి మాలతి, టీఆర్‌ఎస్ నేత పొనగంటి మల్లయ్య పేర్లు కూడా ప్రధానంగా వినిపించాయి. కానీ.. అధిష్టానం శ్రీనివాస్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే గెల్లు శ్రీనివాస్ గ్రామాలలో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రజల్లో తన ఉద్యమ స్వరాన్ని వినిపిస్తున్నారు.
గెల్లుకు ఉద్యమకారుడిగా గుర్తింపు..
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యనభ్యసించిన గెల్లు.. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బొంతు రామ్మోహన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బాల్క సుమన్‌తో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనపై వందకు పైగా కేసులు నమోదయ్యాయి. జైలు జీవితం కూడా గడిపారు. మానుకోట సంఘటనలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈటల రాజేందర్ తరచూ బీసీ నాయకుడినని, ఉద్యమకారుడినని ప్రజల్లో నినాదం వినిపిస్తుండటంతో ఆయనకు చెక్ పెట్టాలంటే యాదవ సామాజికవర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్ అయితేనే మంచిదనే అభిప్రాయం సర్వేల ద్వారా తేలినట్లు సమాచారం. అందుకే సీఎం కేసీఆర్ ఆయన పేరునే ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ శ్రేణుల ద్వారా తెలిసింది. అంతేకాదు.. శ్రీనివాస్ కేటీఆర్‌కు కూడా అత్యంత సన్నిహితుడిగా పేరుంది.
16న ప్రకటించే చాన్స్..?
ఈ నెల 16న హుజూరాబాద్‌లోని శాలపల్లిలో దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దళితబంధు ప్రారంభ వేదికలోనే టీఆర్‌ఎస్ అభ్యర్థి పేరును ప్రకటించే చాన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. లక్ష మందితో సభ ఏర్పాట్లు చే
Comments
Please login to add a commentAdd a comment