‘వీణవంక’ నిందితులకు బెయిల్ నిరాకరణ | "Veenavanka ' accused bail denial in high court | Sakshi
Sakshi News home page

‘వీణవంక’ నిందితులకు బెయిల్ నిరాకరణ

Published Sun, May 1 2016 3:57 AM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

‘వీణవంక’ నిందితులకు బెయిల్ నిరాకరణ

‘వీణవంక’ నిందితులకు బెయిల్ నిరాకరణ

ఇద్దరు నిందితుల పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం, చల్లూరుకు చెందిన ఓ దళిత యువతిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన గ్యాంగ్‌రేప్ కేసులో నిందితులకు హైకోర్టు శుక్రవారం బెయిల్ నిరాకరించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులు ముద్దం అంజయ్య అలియాస్ అంజన్న, ముద్దం రాకేష్‌లు బెయిల్ కోసం దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.

కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఈ దశలో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే దాని ప్రభావం దర్యాప్తుపై ఉంటుందన్న అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి వాదనలతో హైకోర్టు ఏకీభవిస్తూ నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement