ఫైల్ ఫొటో
హుజూరాబాద్ రూరల్: దళితబంధు సర్వే గురువారంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ముగిసింది. ఆగస్టు 27 నుంచి ఏడురోజుల పాటు ఐదు మండలాల్లో అధికారులు ఇంటింటా తిరుగుతూ.. సర్వే నిర్వహించారు. 2014 సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా వివరాలు సేకరించారు. 17,166 కుటుంబాలకుగానూ.. 16,370 కుటుంబాల వివరాలు యాప్‌లో అప్‌లోడ్ చేశారు. మరో 2,775 కుటుంబాలకు సంబంధించి దరఖాస్తులు నింపారు. సర్వేలో నియోజకవర్గంలో మొత్తంగా 18,619 దళిత కుటుంబాలు ఉన్నట్లు తేల్చారు.
హుజూరాబాద్ పట్టణంలో 1,794 కుటుంబాల వివరాలు యాప్‌లో నమోదు చేశారు. మరో 611కుటుంబాలకు సంబంధించి దరఖాస్తులు నింపారు. హుజూరాబాద్ మండలంలోని 19 పంచాయతీల్లో 3,387 కుటుంబాల వివరాలు ఆప్‌లోడ్ చేశారు. మరో 295 కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జమ్మికుంట మున్సిపాలిటీలో 2,313 కుటుంబాలను పొందుపర్చారు. 446 కుటుంబాలవి దరఖాస్తులు స్వీకరించారు. జమ్మికుంట రూరల్ పరిధిలో 2,428 కుటుంబాలను గుర్తించగా 464 దరఖాస్తులను స్వీకరించారు. ఇల్లందకుంట మండలంలో 2,951కుటుంబాలను ఆప్‌లోడ్‌చేశారు. వీణవంక మండలంలో 3,497 కుటుంబాల వివరాలు యాప్‌లో, 955 దరఖాస్తులను నేరుగా స్వీకరించారు.
చదవండి: ‘సోనీ క్షమించు! నీకు ఏం చేయలేకపోయా’ కన్నీటితో భర్త
చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి
Comments
Please login to add a commentAdd a comment