Dalita Bandhu Scheme
-
'ఆ కారణంతోనే ఇలా..' సూసైడ్ నోట్ రాసి యువకుడు తీవ్ర నిర్ణయం!
సాక్షి, ఆదిలాబాద్: జైనథ్ మండలంలోని భోరజ్ గ్రామానికి చెందిన రమాకాంత్(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రమాకాంత్ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం బయటకు వెళ్లిన ఆయన సాయంత్రం భోరజ్ గ్రామానికి వెళ్లే రోడ్డుపై శవమై కనిపించాడు. గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం అందించి 108కు ఫోన్ చేశారు. అప్పటికే అతడు మృతి చెందడంతో 108 తిరిగి వెళ్లిపోయింది. మృతదేహాన్ని ఆటోలో రిమ్స్‌కి తరలించారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్లో దళితబంధు రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉందని, తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు నర్సింగ్, చంద్రభాగ వేడుకుంటున్నారు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: అక్కకు బై చెప్పేందుకు వెళ్లి.. ఒక్కసారిగా.. -
దళిత బంధు తెచ్చిన మొనగాడు ఎవరైనా ఉన్నారా? కేసీఆర్
సాక్షి, ఖమ్మం: గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ప్రతీసారీ దళితులు మోసానికి గురయ్యారని తెలిపారు. చాలా రాష్ట్రల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్య దేశమా? అని ప్రశ్నించారు. ఎన్నికలులు వస్తుంటాయి, పోతుంటాయని.. పార్టీ ప్రజలకు ఏం చేసిందో గమనించి ఓటు వేయాలన్నారు. దళిత బంధు పథకం తెచ్చిన మొనగాడు ఎవరైనా ఉన్నారా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నట్లు తెలిపారు. సత్తుపల్లిలో 70 వేలకు పైగా మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దళితుల శ్రేయస్సు గురించి ఎవ్వరూ ఆలోచించలేదన్న కేసీఆర్.. దళితుల అభివృద్ధి కోసం దళిత బంధుతెచ్చామని తెలిపారు. చదవండి: గద్వాల నుంచి పోటీకి డీకే అరుణ దూరం.. కారణమిదే! ‘సత్తుపల్లి చాలా చైతన్యం ఉన్న ప్రాంతం.. ఆరునూరైనా తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే. కొందరు ఏవేవో చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ గేటు తాకనీయం అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో మీ ఆయుధం మీ ఓటు. ఓటు వేయడంలో మీదే స్వతంత్ర నిర్ణయం. అహంకారపూరితంగా మాట్లాడేవాళ్లకు బుద్ధి చెప్పండి. డబ్బు, మందు పంచితే ఓట్లు వేసేస్తారా?. నాలుగు డబ్బులు రాగానే అహంకారంగా మాట్లాడుతున్నారు. డబ్బు, అహంకార రాజకీయాలు ఎన్నాళ్లు చెల్లుతాయి. గతంలో కరెంట్ ఏ విధంగా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది. దేశంలో 24 గంటలు కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ప్రధాని మోదీకి ప్రవేటైజేషన్ తప్ప మరేం తెలీదు. నాలుగు డబ్బులు రాగానే అహంకారంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెసోళ్లు వస్తే ధరణీని తీసేస్తారంట. ధరణి లేకుంటే రైతుబంధు డబ్బులకు ఇబ్బంది పడాల్సిందే. ధరణితో రైతులకు ఎంతో మేలు జరిగింది. ధరణి ఉండాలా.. వద్దా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. -
రైతుబంధు దుబారా అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు: సీఎం కేసీఆర్
-
అధికారపార్టీలో వుంటేనే అర్హులు.. లెదంటే..
సూర్యాపేట: ఆత్మకూర్ మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామంలో ఎన్నికలకు ముందు దళితబంధు లొల్లి మొదలైంది. అనర్హులకు ఇచ్చారంటూ ఏకంగా సర్పంచ్ ఇంటికే తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. నెమ్మికల్ గ్రామానికి 24 దళితబంధు యూనిట్లు మంజూరయ్యాయని, వాటి ని మాదిగ సామాజిక వర్గానికి 12, మాల సామాజిక వర్గానికి 12 చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ యూనిట్ల పంపిణీ సక్రమంగా జరగలేదని దళితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఆర్థికంగా బలంగా ఉన్న దళితులకు, ప్రజాప్రతినిధులు, వారి బంధువులు, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్తలుగా పనిచేస్తున్న వారికే ఈ పథకం మంజూరు చేశారని, ఇదే విషయమై బుధవారం ఎస్సీ వర్గానికే చెందిన గ్రామసర్పంచ్ గంపల సతీష్‌ను కొందరు ప్రశ్నించారు. ఈ సమయంలో సర్పంచ్ కుటుంబ సభ్యులు దురుసుగా ప్రవర్తించడంతో ఆగ్రహంతో దళితులు ఆందోళన చేశారు. దళిత బంధులో అక్రమాలు జరిగాయని గ్రామంలోని సూర్యాపేట – దంతాలపల్లి రహదారిపై రాస్తారోకో చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేసిన గోడ గడియారాలను తీసుకొచ్చి పగులగొట్టారు. గృహలక్ష్మి పొందిన వారే తిరిగి దళితబంధు తీసుకుంటున్నారని, నిజమైన నిరుపేద దళితులు అన్యాయానికి గురవుతున్నారని ఆరోపించారు. ఉదయం 7గంటలకే రోడ్డు ఎక్కి 11గంటల వరకూ ఆందోళన విరమించకపోవడంతో రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకట్‌రెడ్డి ఆందోళన కారులకు నచ్చజెప్పినా వినిపించుకోకుండా వాగ్వాదానికి దిగడంతో పాటు అతని కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. ఇదిలా ఉండగా అసలు మండలానికి దళితబంధు యూనిట్లు రాలేదని తెలుస్తోంది. కేవలం ఆ పార్టీకి చెందిన నాయకులు దళితబంధు మంజూరైందని చెప్పి దళితుల మెప్పుపొందేందుకు ప్రయత్నించారని, ఇది బెడిసి కొట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మండలంలో దళితబంధు ఊసెత్తని వారు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మంజూరైందని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ మల్సూర్‌నాయక్‌ను వివరణ కోరగా తమకు దళితబంధు పథకంపై ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాస్తారోకో చేసి ప్రజారవాణాకు ఆటంకం కలిగించిన గంపల కరుణాకర్, గంపల లెనిన్, చంద్రు, పురం శివక్రిష్ణ, జానకిరాములు, గరిగంటి రాంబాబులతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. -
దళితబంధు జాబితాలో అనర్హులు
వైరారూరల్: రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఆర్థికాభివృద్ధికి ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు అనర్హులకు కేటాయిస్తున్నారని మండలంలోని పాలడుగు దళితులు శుక్రవారం సీపీఎం నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. జగ్గయ్యపేట రాష్ట్రీయ రహదారిపై సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. తమ గ్రామంలో ఐదుగురికి పథకం మంజూరు కాగా, వారు ఆర్థికంగా నిలదొక్కుకున్న వారేనని తెలిపారు. కాగా, రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోగా వైరా ఎస్ఐ మేడా ప్రసాద్ చేరుకుని ఫోన్లో ఉన్నతాధికారులతో మాట్లాడించగా వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ధర్నా వద్ద ఆగిన డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రపాద్ మాట్లాడుతూ దళితబంధు లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. దళితబంధు రాలేదని దీక్ష కారేపల్లి: అన్ని అర్హతలు ఉన్నా తనకు దళిత బంధు రాలేదంటూ కారేపల్లికి చెందిన ఆదెర్ల రాధాగోవింద్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శుక్రవారం దీక్ష చేపట్టారు. దళితబంధు జాబితాలో పేరు చేర్చేందుకు కొందరు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారని, తాను డబ్బు ఇవ్వకపోవడంతో గుర్తించలేదని వాపోయారు. ఆయన దీక్షకు వివిధ పార్టీల నాయకులు వై.ప్రకాశ్, బోళ్ల రామస్వామి, కొమ్ము ఉపేందర్, గౌసుద్దీన్, ప్రసాద్ మద్దతు తెలిపారు. -
కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. అసంతృప్త ఎమ్మెల్యేలకు పదవుల వల..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను, ఓ కార్పొరేషన్‌కు వైస్ చైర్మన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యకు కీలక పదవులు లభించాయి. వీరితో పాటు ఇటీవల పారీ్టలో చేరిన ఉప్పల వెంకటేశ్ గుప్తా, నందికంటి శ్రీధర్‌కు కూడా అధికారిక పదవులు దక్కాయి. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆరీ్టసీ) చైర్మన్‌గా, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య రైతుబంధు సమితి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇక ఉప్పల వెంకటేశ్ గుప్తా (కల్వకుర్తి)ను మిషన్ భగీరథ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా, నందికంటి శ్రీధర్ (మల్కాజిగిరి)ను ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. రాజీ ఫార్ములాలో భాగంగానే..! బీఆర్ఎస్ టికెట్లు దక్కని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్యకు రాజీ ఫార్ములాలో భాగంగా ఈ పదవులు దక్కాయి. జనగామలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మల్కాజిగిరి కాంగ్రెస్ టికెట్ ఆశించిన నందికంటి శ్రీధర్ నాలుగు రోజుల క్రితమే బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ ఇచ్చినా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో..ఆ పార్టీకి చెందిన నందికంటి శ్రీధర్‌ను బీఆర్ఎస్లోకి ఆహ్వానించి తాజాగా ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. మరోవైపు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడిన నేపథ్యంలో అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా ఉప్పల వెంకటేశ్‌కు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ పదవి అప్పగించారు. చదవండి: సిక్కిం వరదల్లో నిజామాబాద్ ఆర్మీ జవాన్ మృతి -
దళితబంధు కేవళం ఆ నేతలకేనా..!
కామారెడ్డి: అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులకే దళిత బంధు ఇస్తున్నారని భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన దళితులు ఆరోపించారు. గ్రామానికి చెందిన సుమారు 80 మంది దళితులు గురువారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌లోనికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలు దళితబంధు తీసుకోవడంతో పాటు వారి అనుచరులు, బంధువులకు ఇప్పించుకున్నారన్నారు. గ్రామంలో 500 దళిత కుటుంబాలు ఉన్నాయని 15 మందికే పథకం లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. లబ్ధిపొందినవారిలో ఒక్కరు కూడా అర్హులు లేరన్నారు. ఇతర పార్టీల వారికి ఇవ్వబోమని బహిరంగంగానే చెబుతున్నారన్నారు. అధికారులు స్పందించి విచారణ జరిపించి, అర్హులకే దళితబంధు వచ్చేలా చూడాలని కోరారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందించారు. -
వసూళ్ల చిట్టా ఉంది.. జాగ్రత్త!
దళితబంధులో రూ.10లక్షలకుగాను రూ.రెండు లక్షల నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్న వారి చిట్టా నాదగ్గర ఉంది. వెంటనే సరిదిద్దుకోని పక్షంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం కాదు కదా పార్టీ నుంచే బయటకు పంపిస్తా.. దళితబంధులో అనుచరులు అవినీతికి పాల్పడినా ఎమ్మెల్యేలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘‘దళితబంధు పథకం నా ఆత్మ బంధువు. దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ పథకంపై చర్చ జరుగుతోంది. ఈ పథకం ద్వారా బాగుపడిన కుటుంబాల విజయగాథలతో మరింత మంది స్ఫూర్తి పొందాలి. దీనిని పారదర్శకంగా అమలు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే. ఎవరైనా ఒక్క రూపాయి కమీషన్, వాటా, ఇతర రూపంలో తీసుకున్నట్టు తెలిసినా అడ్డంగా నరికేస్తా..’’ అని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. దళితబంధు సామాజిక పెట్టుబడి అని, దళితుల్లో వజ్రాలను వెలికి తీస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ రూ.6 లక్షల కోట్లకు చేరుతుందని, ఎన్ని కష్టాలొచ్చినా దళితబంధును కొనసాగిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యే,లు ఎమ్మెల్సీలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులకు కీలక అంశాలపై దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఎన్నికలకు నాలుగు నెలలే.. ‘‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో 63, 2018లో 88 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించాం. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు గెలుస్తాం. 2018 డిసెంబర్ తొలివారంలో ఓట్ల లెక్కింపు జరిగి రెండోసారి అధికారంలోకి వచ్చాం. ఈ ఏడాది నవంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే చాన్స్ ఉంది. అంటే ఎన్నికలకు కేవలం నాలుగు నెలల సమయమే ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు తమ కార్యాచరణ రూపొందించుకోవాలి. జాగ్రత్తగా లేకపోతే మీకే నష్టం. జనంతో మమేకం కావాల్సిందే.. నియోజకవర్గాల్లో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసేందుకు ఇద్దరేసి చొప్పున నాయకులకు బాధ్యతలు అప్పగిస్తాం. పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట ఎంపీలు, జెడ్పీ చైర్పర్సన్లు ఇన్చార్జులుగా బాధ్యతలు తీసుకోవాలి. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావడంతోపాటు కేడర్‌లో అసంతృప్తిని తగ్గించే చర్యలు చేపట్టాలి. నిత్యం ప్రజలతో ఉంటూ.. ప్రభుత్వ పథకాల ప్రచారం, ప్రజలతో కమ్యూనికేషన్ పెంచుకునేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. దాహమైనప్పుడే బావి తవ్వుదామనే ధోరణి ప్రస్తుత రాజకీయాలకు సరిపోదు. ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలనే ధోరణితో కాకుండా కచ్చితంగా మననే ఎన్నుకోవాలనే రీతిలో పనిచేయాలి. మన ప్రభుత్వం మరోమారు అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు.. మునుపటికంటే ఎక్కువ సీట్లు రావాలన్నదే ప్రాధాన్యతాంశం. త్వరలో ఒక్కో ఎమ్మెల్యేతోవ్యక్తిగతంగా మాట్లాడుతా. మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఆదరణ మహారాష్ట్రలో బీఆర్ఎస్కు ఆదరణ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశవ్యాప్త పర్యటనలు ముమ్మరం చేస్తా. టీఆర్ఎస్గా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేస్తూ ఎదిగిన పార్టీ.. నేడు దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే దిశలో జాతీయ పార్టీ బీఆర్ఎస్గా ఎదిగింది. రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేశాం. అదే బాటలో ‘‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’’ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నాం. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విజన్ లేదు. మనం అమలు చేస్తున్న పథకాలను అక్కడ అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత వాహనాల్లో తరలివస్తున్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ డబుల్ బెడ్రూం ఇళ్లు, సొంత స్థలంలో ఇంటి నిర్మాణం, దళితబంధు, పోడు భూముల లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేసుకోండి. 58, 59 జీవోలతో స్థలాల క్రమబద్ధీకరణ మంచి పథకం. హైదరాబాద్‌లో నోటరీ భూముల క్రమబద్ధీకరణ ఫైలుపై కొత్త సెక్రటేరియట్లో సంతకం చేస్తా. గతంలో ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ భూములు సేకరించాం. అలా ప్రభుత్వ భూముల లభ్యత ఉన్న చోట లేఔట్లు చేసి.. పట్టాలు పంపిణీ చేసేందుకు సర్వే నంబర్ల వారీగా వివరాలు ఇవ్వండి. అకాల వర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలి. మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొనేందుకు మార్క్‌ఫెడ్‌కు ఆదేశాలిస్తాం..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పార్టీ ఖాతాలో రూ.1,250 కోట్లు విరాళాల ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఫండ్ రూ.1,250 కోట్లకు చేరింది. ఇందులో రూ.767 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేసినం. దానిపై వస్తున్న వడ్డీలో నుంచి రూ.7 కోట్లను పార్టీ కార్యకలాపాల నిర్వహణ, కార్యాలయాల నిర్మాణం, ప్రచారం, మౌలిక వసతుల కల్పన కోసం ఉపయోగిస్తున్నాం. బీఆర్ఎస్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నిధులతో టీవీ ప్రచార ప్రకటనలు, ఫిలిం ప్రొడక్షన్‌తోపాటు అవసరమైతే జాతీయ టీవీ చానల్‌ను కూడా నడపొచ్చు. ఇతర రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు వీలుగా పార్టీ జాతీయ అధ్యక్షుడికి అధికారాలు అప్పగిస్తూ బీఆర్ఎస్ కార్యవర్గం తీర్మానించింది. మే 4న ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం రాబోయే నెలపాటు అధికారిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ నెల 30న రాష్ట్ర సచివాలయం, మే 4న ఢిల్లీలో నిర్మిస్తున్న బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం భవనాన్ని ప్రారంభిస్తాం. జూన్ 1న హుస్సేన్‌సాగర్ తీరాన అమరుల స్మారకాన్ని ఆవిష్కరిస్తాం. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగుతాయి. ఆ తర్వాత ఎన్నికల దిశగా పార్టీ కార్యకలాపాలపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలి. చాలాచోట్ల పార్టీ పరిస్థితి బాగానే ఉన్నా.. ఎమ్మెల్యేలు తమ పనితీరును సరిచేసుకోవాలి. ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై మరింత దృష్టి పెట్టాలి. ఎక్కడైనా విభేదాలు ఉంటే.. మెట్టు దిగి సర్దుకుపోయి పార్టీ ప్రతిష్టను పెంచాలి. బీజేపీ గ్రాఫ్ గతంతో పోలిస్తే బాగా పడిపోయింది. వారికి ఓట్లు ఏడెనిమిది శాతం కూడా మించవు. అర్థ రహిత రాజకీయ విమర్శలకు స్పందించి సమయం వృథా చేసుకోవద్దు. కొన్ని జిల్లా కలెక్టరేట్ల ప్రారంభంతోపాటు పార్టీ జిల్లా కార్యాలయాలను కూడా ప్రారంభించాల్సి ఉంది. వరంగల్, హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది. -
దేశంలో మార్పు కోసం యుద్ధం చేయాలి.. అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లో, వ్యవస్థలో, దేశంలో మార్పు కోసం భారతీయులు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకా శ్ అంబేడ్కర్ పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక ఇబ్బందులపై ఎలా పోరాటం చేయాలో సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారన్నారు. శుక్రవారం హుస్సేన్‌సాగర్ తీరాన 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్ర హాన్ని ప్రకాశ్ అంబేడ్కర్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ‘‘చదువుకోవడం, చదువుకున్న తర్వాత ఏకమై సమాజంలో మా ర్పుకోసం పోరాటం చేయాలని అంబేడ్కర్ ఉద్భో దించారు. దేశంలో ఆర్థిక అంతరాలు, ఆర్థిక దోపిడీ ల గురించి అప్పట్లోనే ‘ప్రాబ్లెమ్ ఆఫ్ రూపీ’ అనే పుస్తకం రాశారు. దళితబంధు పథకం ద్వారా రూ పాయి రూపాన్ని మార్చేందుకు కేసీఆర్ ప్రయతి్నస్తున్నారు. దేశ ఆర్థిక దుర్భలతపై ఎలా పోరాడాలో చెప్పడంతోపాటు దళిత బంధు ద్వారా పేదరిక ని ర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం కొత్త దిశను ఇచ్చే ప్రయత్నం చేస్తోంది’’ అని ప్రకాశ్ పేర్కొన్నారు. రాష్ట్రాల నుంచే జాతీయ నాయకత్వం దేశంలో కేవలం మతపరమైన మైనారిటీలే కాకుండా కమ్యూనిటీ మైనారిటీలు కూడా ఉన్నారని అంబేడ్కర్ అప్పట్లోనే స్పష్టం చేశారని ప్రకాశ్ గుర్తు చేశారు. ధర్మం, జాతి పేరిట రాజకీయాలు జరిగే దేశంలో సహజ నాయకులు ఉండరని కూడా చెప్పారని వివరించారు. దేశంలో మాజీ ప్రధాని వాజ్‌పేయి తర్వాత అసలైన జాతీయ నాయకుడెవరూ లేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల నుంచే జాతీయ నాయకత్వం వస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఉందని, దేశానికి మోడల్‌గా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశానికి రక్షణపరంగా రెండో రాజధాని అవసరమని, అది హైదరాబాద్ అయితేనే బాగుంటుందని అంబేడ్కర్ చెప్పారని.. ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉందని ప్రకాశ్ అంబేడ్కర్ చెప్పారు. ఈ డిమాండ్ నెరవేరాలని తాను కోరుకుంటున్నానని, తెలంగాణ ప్రభుత్వం కూడా కోరుకుంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ప్రకాశ్ అంబేడ్కర్‌కు సీఎం ఆతిథ్యం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచి్చన బాబాసాహెబ్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌కు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ప్రగతి భవన్‌కు చేరుకున్న ప్రకాశ్ అంబేడ్కర్‌ని కేసీఆర్ సాదరంగా ఆహా్వనించారు. శాలువాతో సత్కరించి మర్యాదపూర్వక భేటీ అయ్యారు. అనంతరం కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, శంకర్ అన్నా ధోంగే, సిద్దోజీరావు తదితరులున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటిన ప్రకాశ్ అంబేడ్కర్ సాక్షి, హైదరాబాద్: తమ తాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనుషుల్లో సమానత్వం–ప్రకృతి సమతుల్యత కోసం పరితపించారని ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. ఆయన జయంతి రోజున ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొని బేగంపేటలో మొక్కలు నాటారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా అంబేడ్కర్ ఉన్నప్పుడు తనను కలిసేందుకు వచ్చే ప్రతీ ఒక్కరు ఒక మొక్క ను నాటాకే తన వద్దకు రావాలని కోరుకున్నారని ఆయన మనుమడు ప్రకాశ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తమ తాత అంబేడ్కర్‌కు మొక్కలు నాటడం పట్ల అమితమైన ఆసక్తి ఉండేదన్నారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ స్ఫూర్తిని ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో చూస్తున్నామని పేర్కొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తున్న ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’సృష్టికర్త ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆశయం గొప్పదన్నారు. ‘గ్రీన్ చాలెంజ్’లిమ్కాబుక్‌లో చేరడం తనకు ఆనందాన్ని కలిగించిందని, సంతోష్ కృషికి మరింత గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, గ్రీన్ చాలెంజ్ ప్రతినిధి సంజీవ రాఘవ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘దళితబంధు’ దేశానికే మార్గదర్శి సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితబంధు పథకం దేశానికే మార్గదర్శి అని, ఇతర రాష్ట్రాలు కూడా దీనిని అమలు చేయాలని అంబేడ్కర్ మనవడు, వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధినేత ప్రకాశ్ యశ్వంత్ అంబేడ్కర్ అన్నారు. జమ్మికుంట, హుజూరాబాద్‌లలో దళితబంధు పథకం యూనిట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, విప్ బాల్క సుమన్ ఉన్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన హుజూరాబాద్ చేరుకున్న అనంతరం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. దళితబంధు యూనిట్లను పరిశీలించిన అనంతరం హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం బాగుంది. ఇది దేశంలోనే సరికొత్త పథకం. ప్రజలకు విద్యతోపాటు ఆర్థిక సాయం అందించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేయడం అభినందనీయం. మొన్నటిదాకా కూలీలుగా బతికిన వారంతా ఈ పథకం వల్ల ఇప్పుడు ఓనర్లుగా మారారు. లబి్ధదారులతో మాట్లాడాను. ఇంత తక్కువ సమయంలో ఈ పథకం లబ్ధిదారులకు అందేలా శ్రమించిన సీఎం కేసీఆర్, జిల్లా అధికారులకు ధన్యవాదాలు. 70 ఏళ్లుగా దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న తీరును నేను స్వయంగా చూశాను. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పథకం అమలు కావాలి. ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు కారణమైన ఈ పథకం దేశానికే మార్గదర్శిగా నిలిచింది. దేశంలో 30 శాతం వరకు ఉన్న అట్టడుగు వర్గాల వారికి సైతం ఈ పథకం వర్తింపజేయాలి. ఈ విషయాన్ని నేను సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావిస్తాను’అని అన్నారు. -
చల్నేదో బాల్ కిషన్
కతలు జెప్తున్నరు. చెవుల పూలు బెడ్తున్నరు. చెట్టు పేరు జెప్పి కాయలమ్ము కుంటున్నరు. కాయలను గాదు. ఏక్ దమ్ పండ్లనే అమ్ముకుంటున్నరు. ఎవలమ్ముకుంటున్నరు? ఎందు కమ్ముకుంటున్నరు? ఎవరంటె మన లీడర్లే. ఇంతకు గా చెట్టేంది? గది ఏందో గాదు. నిజాం చేత్లకెల్లి గుంజుకొన్న తెలంగాననే. బందూకులు బట్కోని రజాకార్ల తోని కొట్లాడినోల్ల గురించి మొన్నటిదాంక తప్పిజారి ఒక్క లీడర్ గుడ్క మాట్లాడలే. గియ్యాల గా లీడర్లే తీస్ మార్ కాన్ లెక్క ఫోజు గొడ్తున్నరు. గాల్లే నిజాం సర్కార్‌ను కూలగొట్టి తెలంగానకు సతంత్రం తెచ్చినట్లు మాట్లాడ్తున్నరు. గా దినం అయితారం. అంబటాల్లయింది. కడ్పులు ఎల్కలు చెంగడ బింగడ దుంకుతున్నయి. తలె ముంగట గూసున్న. కోడికూర తోని నా పెండ్లాం బువ్వ బెట్టింది. అంచుకు ఎల్లిగడ్డతొక్కు ఏసింది. సరింగ గప్పుడే మా తాత బోన్గిరి కెల్లి వొచ్చిండు. గాయిన పెండెం వాసుదేవ్, జైని మల్లయ్య గుప్త, గుండా కేశవులు, ముత్యం ప్రకాశ్, మాదాసు యాదగిరి అసువంటోల్లతోని గల్సి బందూకు బట్టి రజాకార్లతోని కొట్లాడినోడు. ‘‘తాతా! బువ్వ తిందురాయె’’ అన్న. గాయిన కాల్లు చేతులు గడుక్కోని నా పక్క పొంటి వొచ్చి గూసున్నడు. బువ్వ దినుకుంట ముచ్చట బెట్ట బట్టిండు. ‘‘ఇంతకుముందు టీఆర్ఎస్ మోటర్ బోయిన తొవ్వ మీదికెల్లే కడ్మ పార్టీలు బొయ్యేటియి. గని గిప్పుడు బీజేపీ ఏసిన తొవ్వ మీది కెల్లే టీఆర్ఎస్ మోటార్ బొయ్యే గతి బట్టింది’’ అని అన్నడు. ‘‘తాతా! నువ్వెప్పుడు రాజకీయాలే మాట్లాడ్తవేందే’’ ‘‘రాజకీయాలు గానిదేమన్న ఉన్నాదిర. బారతం రాజకీయమే. రామాయనం గూడ రాజకీయమే’’. ‘‘రామాయనం రాజకీయమెట్ల అయితదే?’’ ‘‘రాముని దిక్కు దుంకె బట్కె విబీషనుడు లంకకు రాజయిండు. నిజం జెప్పాలంటె పార్టీ ఫిరాయింపులు గాయినతోనే షురువైనయి’’ ‘‘బీజేపీ ఏసిన తొవ్వ మీదికెల్లే టీఆర్ఎస్ మోటర్ బోయిందంటివి. గదేందో జెర కుల్లకుల్ల జెప్పు తాతా’’ ‘‘మొన్న 17 తారీకు పరేడ్ మైదాన్ల సెంటర్ల ఉన్న బీజేపీ సర్కార్ తెలంగాన విమోచన దినం జేసింది. గా దాన్కి సెంటర్ హోం మంత్రి అమిత్ షా వొచ్చిండు. ‘మా సర్కారొస్తె సెప్టెంబర్ 17 తారీకు నాడు తెలంగాన విమోచన దినం జేస్తమన్నోల్లు గాల్ల సర్కారొచ్చినంక రజాకార్ల బయంతోని తెలంగాన విమోచన దినం జెయ్యలేదు. గియ్యాల మేము జేస్తుంటె అన్ని పార్టీలు జేస్తున్నయి’ అన్కుంట గాయిన స్పీచ్ గొట్టిండు’’. ‘‘ఇంతకుముందు కేసీఆర్ తెలంగాన విమోచన దినం ఎందుకు జెయ్యలేదు?’’ ‘‘విమోచన గాదు, మన్నుగాదు. గది జేస్తేంది, చెయ్యకుంటేంది. గదొక పెద్ద ఎజెండనా? గది జెయ్యకుంటె గీ దేసం ఏమన్న మున్గుతదా అని అసెంబ్లీల అన్న కేసీఆర్ ఇయ్యాల బీజేపీ సెట్ జేసిన ఎజెండలకే వొచ్చిండు. సమైక్యత వజ్రోత్సవం అన్కుంట కేసీఆర్ 17 తారీకు పబ్లిక్ గార్డెన్ల మూడు రంగుల జెండ ఎగిరేసిండు. ‘మత పిచ్చిగాల్లు దేసంను ఆగమాగం జేస్తున్నరు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తం. దలిత బందు తీర్గనే గిరిజన బందు బెట్టి ఒక్కో గిరిజన కుటుంబానికి పది లచ్చల రూపాయల వొంతున ఇస్తం’ అన్కుంట కేసీఆర్ స్పీచ్ గొట్టిండు’’ అని మా తాత జెప్పిండు. ‘‘హుజూరాబాద్ బై ఎలచ్చన్లు వొచ్చినప్పుడు దలిత బందు అన్నడు. మునుగోడు బై ఎలచ్చన్లు రాంగనే గియ్యాల గిరిజన బందు అంటున్నడు తాతా!’’ ‘‘అవ్ ఎలచ్చన్లు వొస్తేనే ముక్యమంత్రికి జెనం యాది కొస్తరురా’’ (క్లిక్: గటు దిక్కు బోవద్దు గన్పతీ!) ‘‘అమిత్ షాను బీజేపోల్లు అబినవ సర్దార్ పటేల్ అంటె, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కెసీఆర్‌ను అబినవ అంబేడ్కర్ అని అంటున్నడే’’ ‘‘వారీ! ఎల్క తోలును ఒక్క తీర్గ యాడాది ఉత్కితె యాడనన్న తెల్లగైతదా? అమిత్ షా సర్దార్ వల్లభాయ్ పటేలైతడా? కేసీఆర్ యాడనన్న అంబేడ్కర్ అయితడా?’’ అని మా తాత అడిగిండు. బువ్వ దిన్నంక గాయిన మంచం మీద ఒరిగిండు. (క్లిక్: బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా) తోక: పొద్దు మీకింది. ఎప్పటి లెక్కనే చౌరస్తల ఉన్న పాన్ డబ్బకాడ్కి బోయిన. గాడ పాన్లు దినుకుంట మా దోస్తులు ముచ్చట బెడ్తున్నరు. ‘‘నమీబియాకెల్లి గాలిమోటర్ల ఎన్మిది చిర్తపులులను మనదేసం దెచ్చిండ్రు. గవ్విట్ల మూడు చిర్తపులులను కన్జరేషన్ బాక్సులకెల్లి కునో జాతీయ పార్క్‌లకు ప్రతాని మోదీ ఇడ్సి పెట్టిండు’’ అని యాద్గిరి అన్నడు. ‘‘నెలొద్దుల ముందుగాలనే గ్యాస్ బండ, పిట్రోలు అనేటి రెండు చిర్తపులులను ప్రతాని జెనం మీద్కి ఇడ్సిపెట్టిండు’’ అని మా సత్నారి అన్నడు. నివొద్దే గదా! - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
తెలంగాణ నిజానిజాలు గమనిస్తోంది!
ఇప్పుడు తెలంగాణ ఎట్లుంది? తెలంగాణ తెగదెంపుల సంగ్రామంలో తెగించి స్థిర పడిన తెలంగాణ తనను తాను చూసుకుంటోంది. రేపటి భవిష్యత్తుపై గంపెడు ఆశలతో కలలు కంటోంది. మార్పును ప్రతినిత్యం కోరుకునే తెలంగాణ ఊహించని మార్పులతో ఊహకందనంత వేగంతో అభివృద్ధి చెందుతోంది. విషాదాల కొలిమి, విప్లవాల పొలి కేకలు, ఫెళఫెళ కూలిపడ్డ ఆధిపత్య అహంకారాలు... పాఠ్యాంశాలుగా మారిన తెలంగాణ ఇప్పుడు నిజానిజాల నిగ్గు తేల్చు కుంటోంది. ఎవరిది విద్రోహమో, ఏది విలీనమో, ఏది బల ప్రయోగమో, గాయాలు ఎక్కడ తగిలాయో, గేయాలై ఎక్కడ పలికాయో, సున్నితపు ఐకమత్యపు తెలంగాణ తీగలను ఎవరు తెంచ చూశారో... మళ్లీ అన్నింటినీ కలిపి జాతీయ ఐకమత్య మహానదిగా మన తెలంగాణను ఎవరు మారుస్తున్నారో... అంతా తెలంగాణ బిడ్డలకు తెలుసు. దయచేసి మళ్లీ ఇప్పుడు తెలంగాణ పాత గాయాల కట్లు విప్పి కారం చల్లే పనులు ఎవరూ చేయకండి. తరతరాల సామాజిక తాత్విక సహజత్వ జీవ జలపాతం తెలంగాణతనం. అబ్బురపరిచిన ఆశ్చర్యాల నుంచీ, నిప్పుల వర్షాల నుంచీ... సకల జనుల ప్రశాంత వెండి వెన్నెల సిరుల పందిరిగా మారిన తెలంగాణను సంరక్షించుకుందాం, పరిరక్షించుకుందాం. మానవీయ సంస్కృతికి పట్టుగొమ్మయిన తెలంగాణ అత్యున్నత మానవ సమాజ నిర్మాణం వైపు పయనించమంటోంది. ఈ కుళ్ళు కులసంకెళ్లను తెంచమంటోంది. కమ్ముకొస్తున్న మత మబ్బుల్ని చెదరగొట్టమంటోంది. ఒకనాడు భూమి, భుక్తి, విముక్తి అంటూ నినదించి ముందుకు సాగిన తెలంగాణ ఇప్పుడు ప్రతి మనిషినీ సంపదగా మార్చి ప్రపంచానికి ఒక నూతన సందేశం ఇవ్వమంటోంది. అన్నార్తులు, అనాథలు కానరాని సమాజ నిర్మాణం చేయమంటోంది. గంగా జమున తెహజీబ్ సంస్కృతిని విత్తనాలుగా చల్లి మహోన్నత మానవీయ పాఠంగా దేశాన్నే తీర్చిదిద్దుకుందాం అంటోంది. జాతీయ సమైక్యత దినోత్సవ మహాసందేశంగా జాతిగీతమై మోగ మంటుంది. తరతరాల వారసత్వ చరిత్రకు ఎవరు పేటెంట్ దారులు కాదని తెలంగాణ పదేపదే చెబుతోంది. ప్రపంచానికి పిడికెడు అన్నం పెడుతున్న రైతు భారతానికి పట్టాభిషేకం చేయమంటోంది తెలంగాణ. వ్యవసాయాన్ని పరిశ్రమలుగా మార్చి, పండించిన పంటలకు రైతు కూలీలనే అత్యా ధునిక వ్యవసాయ పరిశ్రమల యజమానులను చేయమంటోంది. సాటి మనుషుల్ని కుల మతాల పేరుతో వెంటాడుతున్న ఆటవిక సంస్కృతిని దరిదాపుల్లోకి రానీయకుండా మానవీయ మహా కోటను నిర్మించుకుంది తెలంగాణ. ఆధిపత్య కుల అహంకార పదఘట్టనల కింద పశువుగా ప్రవర్తించే దుర్మార్గ సంస్కృతిని దరిదాపులకు రాకుండా సరిహద్దు సైనికునిగా పహారా కాస్తోంది తెలంగాణ. ఆదివాసీ గిరిజన వికాసంలో భాగంగా ‘మా గూడెంలో మా రాజ్యం’, ‘మా తండాలో మా రాజ్యం’ అన్న కలలను నిజం చేస్తోంది తెలంగాణ. పేదలైన ముస్లింలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం 12 శాతం రిజర్వేషన్లు దక్కాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మైనారిటీ పిల్లలకు ఒక్క తెలంగాణ లోనే 1160 గురుకులాలను పెట్టి కార్పొరేట్ స్థాయి చదువు అందిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ వేలాది గురుకులాలు రావాలని తలుస్తోంది తెలంగాణ. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును నూతన సచివాలయానికి పెట్టి ఎద ఎదలో రాజ్యాంగ రక్షణ స్ఫూర్తిని చాటింది. దేశ పార్ల మెంటుకు అంబేడ్కర్ పేరు పెట్టమని నినదిస్తున్న ఆచరణవాది తెలంగాణ. సస్యశ్యామల దేశంలో క్షామాలు, నిరుద్యోగ రక్కసులు, రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని నడుంబిగించింది తెలంగాణ. నెర్రెలు బాసిన కరువు భూముల్లోకి గంగమ్మను రప్పించేందుకు కాళేశ్వరాన్ని కట్టుకొని జలకళతో నిండింది తెలంగాణ. ఇంటింటికీ ‘మిషన్ భగీరథ’నిచ్చి గొంతు తడిపిన తెలంగాణ... దేశానికి ఆ పథకాన్ని ఎందుకు అందించలేమని పయనమవుతోంది. దేశంలో జరగాల్సింది జాతీయ సమైక్యతా ఉత్సవాలు కానీ విద్వేష ఉత్సవాలు కాదని గొంతెత్తి పిలుస్తోంది తెలంగాణ. పగలు సెగలులేని, పరమత ద్వేషాలు లేని దేశమే సకల సంపదలతో తులతూగుతుందని ఆచరణాత్మకంగా తెలంగాణ తనను తాను తీర్చిదిద్దుకుంటోంది. దళితుల ఆత్మగౌరవ జెండాగా నిలిచిన ‘దళిత బంధు’ పథకాన్ని పెట్టి వాళ్లను ఉత్పత్తి శక్తులుగా తీర్చి దిద్దుతున్న తెలంగాణ దేశంలో దళితులంతా ఇట్లనే వర్ధిల్లాలని తలంచుతోంది. బహుజనులకు ఆత్మగౌరవ భవనాలనిచ్చి ఆయా కులాల సామాజిక ఎదుగుదలకు ఇంతగా కృషిచేసిన రాష్ట్రం దేశంలో మరోటి లేదంటోంది తెలంగాణ. ఇప్పుడు అన్ని రంగా లలో పురోభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణను చూస్తున్నాం. వర్ధిల్లు వీర తెలంగాణ ! వర్ధిల్లు సామరస్య తెలంగాణ! జూలూరీ గౌరిశంకర్ (ఛైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమి) -
ఉచితాలు కావవి... సంక్షేమ పథకాలు
ప్రజాస్వామ్య వ్యవస్థలో సంక్షేమ పథకాలు అనేవి బలహీన వర్గాలకెంతో మేలు చేసేవి. ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు రూపొందించడం. ఆ పనిని తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ దేశంలోనే అందరికంటే మేలైన రీతిలో అమలు చేస్తున్నారు. రైతును ఆదుకునే పథకాలు, విద్యా సంబంధమైన ఫీజు రీయింబర్స్మెంట్లు, రుణమాఫీలు, వృద్ధాప్య పెన్షన్లు, వివిధ వృత్తుల వారి ఆదాయాలను పెంచే పథకాలెన్నో రూపొందించి ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయి ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇవి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడాలేవు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఈ పథకాలను ఉచితాలంటూ, ఉచితాలు ఇవ్వకూడదంటూ విమర్శలు చేస్తున్నది. పేదల కడుపు కొట్టాలని చూస్తున్నది. ఉచిత కరెంటు, గ్రామీణ పేదలకు లక్షల్లో ఇళ్లు కట్టించడం, రైతుబంధు, ఇంగ్లిష్ మాధ్యమం ద్వారా నాణ్యమైన విద్యను పేదలకు అందించడం, రుణమాఫీ, దళితుల దీన పరిస్థితులను మార్చే దళితబంధు, వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి రైతును ఆదుకోవడం, మహిళలను ఆదుకోవడం... ఇలాంటివన్నీ బీజేపీ దృష్టిలో ఉచితాలే. ఈ ఉచితాల వల్ల నష్టం జరుగుతుందట. సర్వ సంపదలు సృష్టించే ఉత్పత్తి కులాల వారి బతుకుల్లో వెలుగు నింపడానికి అమలు చేసే సంక్షేమ పథకాలు ఉచితాలు ఎలా అవుతాయి? ప్రజాస్వామ్యంలో సంక్షేమ పథకాలు అమలు చేయడమనేది ప్రభుత్వ అతి ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటి. సంక్షేమ పథకాలను బాగా అమలు చేయడం వల్ల ప్రజల్లో హింసాయుత తిరుగుబాటు ధోరణి తగ్గు తుందన్నది వాస్తవం. అందుకే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఏ ఒక్క విప్లవమూ విజయవంతం కాలేదు. సంక్షేమ పథకాలతో పాటు ఉపాధిహామీ, ఉపాధి కల్పన వంటివి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించి దేశం పట్ల ప్రేమను పెంచుతాయి. ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలను ఉచితాలనడం ప్రజావ్యతిరేకతకు నిదర్శనం. ఇన్‌కంటాక్స్ పేయర్స్ డబ్బుల నుంచి ఈ డబ్బు వస్తుందట. ఈ కార్పొరేట్ శక్తుల ఆదాయం వేలు, లక్షల కోట్లలో పెరుగడానికి కారణం ఈ దేశ సాధారణ ప్రజలే. వీళ్ళు వాళ్ళ వస్తువులను కొనకుంటే వారికి ఆదాయమెక్కడిది? పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్ శక్తులకు, ఇన్‌కంటాక్స్ పేయర్స్‌కు వచ్చే ఆదాయంలోని ప్రతి రూపాయిలో కోట్లాది మంది ప్రజలు రోజూ కొంటున్న వస్తువులపై వేసే పన్నుందనేది వీరు మరచిపోతున్నారు. (క్లిక్ చేయండి: ఓటమి భయంతో రెండు నాల్కలు) ఇంతకీ కార్పొరేట్ శక్తులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర ఆదాయ పన్ను చెల్లింపుదారులు విదేశాల్లోలా పన్ను చెల్లిస్తే దేశ పరిస్థితి ఇలా ఉండేదా? పేదరికం ఈ స్థాయిలో బుసలు కొడుతుందా? ఈ శక్తులు అక్రమ సంపాదనను బ్లాక్ మనీగా ఉంచడం, విదేశీ బ్యాంకుల్లో దాచుకోవడం వల్లనే కదా లక్షల కోట్ల దేశ సంపద లెక్కల్లోకి రాకుండా పోతోంది! ఆ డబ్బునంతా వైట్‌మనీగా మారిస్తే దేశంలో పేదరికం ఉంటుందా? కార్పొరేట్లు... బ్యాంకుల రుణాలను కట్టలేమంటే రుణమాఫీ పేరుతో ఇచ్చే వెసులుబాటు ఉచితం కాదు కానీ ప్రజా సంక్షేమ పథకాలు మాత్రం ఉచితాలా? పేదలకిచ్చే ఉచితాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందా? పన్ను ఎగవేతదారులను సగౌరవంగా విదేశాలకు పంపించడం దేశానికి మేలు చేయడమవుతుందా? పేదలను ఆదుకొనే ప్రభుత్వాలే అసలు సిసలైన సంక్షేమ ప్రభుత్వాలు. వాటిని విమర్శించేవారు ఎప్పటికీ ప్రజావ్యతిరేకులే! (క్లిక్ చేయండి: ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?) - డాక్టర్ కాలువ మల్లయ్య ప్రముఖ కథారచయిత, విమర్శకులు -
బడులు.. మడులు.. బడుగులు బారెడు పద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల దళిత కుటుంబాలకు లబ్ధి కలిగేలా ‘దళిత బంధు’పథకానికి రూ.17,700 కోట్లను ఈసారి బడ్జెట్లో కేటాయించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.12 వేల కోట్లు కేటాయించారు. అందులో భాగంగానే సొంతంగా స్థలమున్న పేదలు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు. రైతు బీమా తరహాలో నేతన్నలకు కూడా రూ.5 లక్షల బీమా సౌకర్యం, లక్ష మంది భవన నిర్మాణ కార్మికులకు సబ్సిడీపై మోటార్ సైకిళ్లు ఇచ్చే పథకాలకు శ్రీకారం చుట్టారు. వీటితోపాటు వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి శాఖలకు కూడా భారీగా నిధులు కేటాయించారు. ఇక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ఆసరా పింఛన్లు, వడ్డీ లేని రుణాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, శిశు సంక్షేమం తదితర పథకాలు, విభాగాలకు గణనీయంగా కేటాయింపులు చేశారు. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో.. కుటుంబాలకు, వ్యక్తులకు నేరుగా లబ్ధి కలిగే పథకాలను ప్రభుత్వం ప్రకటించిందని ఆర్థిక, రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. విద్య, వైద్య రంగాలకూ ప్రాధాన్యం తొలి నుంచీ చర్చ జరుగుతున్న విధంగానే.. ఈసారి విద్య, వైద్య రంగాలకూ బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించారు. కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.1,000 కోట్లను కేటాయించారు. మన ఊరు–మన బడి కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3 వేల కోట్లకుపైగా కేటాయించారు. ప్రభుత్వ దవాఖానాల్లో చికిత్స పొందే రోగులకు డైట్ చార్జీలను పెంచడంతోపాటు హైదరాబాద్‌లోని 18 మేజర్ ఆస్పత్రులకు వచ్చే రోగుల సహాయకులకు సబ్సిడీపై భోజన సదుపాయాన్ని కొత్తగా కల్పించారు. తద్వారా రోజుకు 18,600 మందికి లబ్ధి కలుగుతుందని పేర్కొన్న ప్రభుత్వం.. ఇందుకోసం రూ.38.66 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న బస్తీ దవాఖానాలను.. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కూడా విస్తరించేలా కొత్తగా 60 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రకటించారు. కొత్తగా మహిళా విశ్వవిద్యాలయం, అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రతిపాదిస్తూ.. చెరో రూ.100 కోట్లను కేటాయించారు. పాలమూరు, డిండి పూర్తిచేస్తాం.. తాజా బడ్జెట్లో సాగునీటి రంగానికి రూ.24 వేల కోట్లకుపైగా ప్రతిపాదించారు. కృష్ణానదిపై చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్టు మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. మరో ముఖ్య ఎన్నికల హామీ అయిన రైతు రుణమాఫీ విషయంలోనూ స్పష్టత ఇచ్చారు. రూ.50వేలలోపు ఉన్న రైతుల రుణాలు ఈ నెలలో మాఫీ అవుతాయని.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.75వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. వృద్ధాప్య పింఛన్ల కోసం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితిని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని.. ఆసరా పింఛన్ల కోసం రూ.11,728 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లకు రూ.2,750 కోట్లను కేటాయిస్తున్నట్టు తెలిపారు. అయితే నిరుద్యోగ భృతిని మాత్రం బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదు. మొత్తంగా ప్రాధాన్య రంగాలకు కేటాయింపులు తగ్గకుండా చూసుకోవడంతోపాటు.. ప్రస్తుత సంక్షేమ పథకాల అమలు, కొత్తగా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టడం, దళితబంధుకు భారీ నిధులు వంటివి ఈసారి బడ్జెట్లో ముఖ్యాంశాలుగా హరీశ్‌రావు పేర్కొన్నారు. -
అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు అమలు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు శనివారం ప్రకటిచారు. బ్యాంక్ లింకేజీతో సంబంధం లేకుండా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో యూనిట్‌కు 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయమని సీఎం కేసీఆర్ అధికారులకు తెలిపారు. లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్నే ఎంపిక చేయాలని సీఎం సూచించారు. దళితబంధు అమలు వేగవంతం చేయాని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మార్చి నెలతో 100 శాతం గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యేల సలహాతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని చూచించారు. లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఆమెదించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. -
‘దళితుడిగా బీజేపీ చర్యలను ఖండిస్తున్నా’
-
‘దళితబంధు’ ఇవ్వకుంటే వీపు విమానంమోతే..: బండి సంజయ్
KCR Vs Bandi Sanjay: కవాడిగూడ(హైదరాబాద్): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులకు రూ.10 లక్షల దళితబంధు ఇవ్వకుంటే సీఎం కేసీఆర్ వీపు విమానం మోతే, ఆయన్ను సరైన టైమ్‌లో టచ్ చేస్తా మని బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. నయా నిజాం కేసీఆర్ పాలనను సమాధి చేసి రాష్ట్రంలో రామరాజ్యం స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యా ప్తంగా దళితబంధు అమలు చేయాలని డిమాం డ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు భారీగా డప్పుల ర్యాలీ నిర్వహించారు. సంజయ్ మాట్లాడుతూ దళితులు, పేదల కోసం తల నరుక్కోవడానికి తాను సిద్ధమని, మరి కేసీఆర్ సిద్ధమా.. అని ప్రశ్నించారు. ‘‘నా కొడక తల నరుకుతా..’ అన్నావు కదా.. సమయం, తేదీ ప్రకటించు. ప్రగతి భవన్‌కు రావాలో, ఫామ్‌హౌస్‌కు రావా లో చెబితే, అక్కడికే వస్తా.. ఆరు ముక్కలు కాదు, నా తల పది ముక్కలు నరుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాను’అని ప్రతిసవాల్ విసిరారు. ఇక గల్లీగల్లీలో డప్పులమోత... దళితబంధును అమలు చేయకుంటే వదిలేది లేదు. గ్రామగ్రామాన, గల్లీగల్లీలో డప్పుల మోత మోగిస్తామని సంజయ్ స్పష్టం చేశారు. ‘హుజూరాబాద్‌లో 17 వేల మంది లబ్ధిదారుల కు డబ్బులు డ్రా చేసుకునే సౌకర్యం కల్పిం చాలి, ఆ డబ్బులు నేటికీ ఎందుకియ్య లేదు. నీ అయ్య, తాత జాగీరా.. నీ జేబుల నుంచి ఇస్తు న్నావా... లేక ఫామ్ హౌస్‌లో ముద్రిస్తున్నా వా.. అని నిలదీశారు. కేసీఆర్ గద్దె దిగి దళితు డిని సీఎంగా చేయాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి, అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు హామీలు నేటికీ అమలు కాలేదని ధ్వజమెత్తారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన నేపథ్యంలో 22 రాష్ట్రాలలో కూడా వ్యాట్ తగ్గించారని, సీఎం కేసీఆర్ సైతం బేషరతుగా తగ్గించాలని అన్నారు. ‘కేసీఆర్ మీడియాతో సోయి తప్పి మాట్లాడు తున్నారు, సీఎం అంటే.. రోజూ టైంపాస్ చేసుకుంటూ, మందు తాగుతూ, చికెన్ తల నరికినట్లు అనుకుంటున్నావా’ అని ప్రశ్నించారు. చదవండి: (KTR: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు) కేసీఆర్‌కు చావుడప్పు తప్పదు.. రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలు చేయక పోతే కేసీఆర్‌కు చావుడప్పు తప్పదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హెచ్చరించారు. తన ముఖం అసెంబ్లీలో చూడొద్దనుకొని కేసీఆర్ భంగపడ్డారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలు రిటైర్మెంట్ ఇవ్వాలని భావిస్తున్నారని మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. కార్యక్ర మంలో బీజేపీ ఇన్చార్జి తరుణ్ ఛుగ్, వివేక్, మునుస్వామి, విజయరామారావు, చంద్ర శేఖర్, కొప్పు భాషా తదితరులు పాల్గొన్నారు. చదవండి: (కేసీఆర్ బెదిరింపులకు బీజేపీ భయపడదు: కిషన్‌రెడ్డి) -
ఒక ఎలక్షన్ వస్తది.. పీకుతది అది ఇష్యూనే కాదు
-
నన్ను జైలు కి పంపిస్తావా..ఏం బలుపా .. నన్ను టచ్ చేసి చూడు : కేసీఆర్ సవాల్
-
Huzurabad Bypoll Result: కారుకు బ్రేకులేసిన అంశాలివే..
సాక్షి, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దేశంలోనే ఖరీదైన ఉప ఎన్నికగా నిలిచిన హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. హుజురాబాద్ నుంచి ఏడో సారి ఈటల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈటల సెంటిమెంట్ ముందు.. టీఆర్ఎస్ అభివృద్ధి మంత్రం పని చేయలేదు. హుజురాబాద్ ఉప ఎన్నిక గెలుపుతో బీజేపీ ఫుల్లు ఖుషీగా ఉంది. మొన్న దుబ్బాక.. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపొంది.. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నయం తామే అని బీజేపీ మరోసారి రుజువు చేసుకుంది. ఇక హుజూరాబాద్ ఎన్నిక ఏకంగా కేసీఆర్ వర్సెస్ ఈటలగా సాగింది. కారు గుర్తు అభ్యర్థి గెలుపు కోసం టీఆర్ఎస్ ముఖ్యులంతా రంగంలోకి దిగారు. ఇక ఈ ఉప ఎన్నికలో గెలవడం కోసం టీఆర్ఎస్ దళితబంధు వంటి భారీ ప్రజాకర్షక పథకాన్ని ప్రకటించింది. దళితబంధు పైలెట్ ప్రాజెక్ట్‌ను కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించారు. ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. మహిళలకు, మహిళా సంఘాల భవనాలకు భారీ నిధుల మంజూరు చేశారు. ఇక ఓట్ల కోసం డబ్బులు ఇష్టారీతిన వెదజల్లారు. ఏకంగా ఒక్క ఓటుకు ఆరు వేల రూపాయలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ ఏకంగా 2000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇంత చేసినా హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ ఫలితం టీఆర్ఎస్పై ప్రజాగ్రహానికి నిదర్శనంగా నిలిచింది. ఈటల పట్ల కేసీఆర్ తీరు కూడా సరికాదని జనం తమ ఓట్లతో చెప్పకనే చెప్పారు. ఇక టీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాలు పరిశీలిస్తే.. ఈటల పట్ల కేసీఆర్ వ్యవహరించిన తీరు ఈటల భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం.. వాటిపై కేసీఆర్ వ్యవహరించిన తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. ఈటల 100 ఎకరాల భూమిని కబ్జా చేశాడనే ఆరోపణలు వచ్చిన వెంటనే కేసీఆర్ స్పందించారు. కలెక్టర్ ద్వారా సమగ్ర రిపోర్ట్ తెప్పించి ఇవ్వాలన్న సీఎం కేసీఆర్.. నిజనిజాలను నిగ్గు తేల్చాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే ప్రాథమిక నివేదిక అందజేయాలని ఆదేశించారు. తదుపరి చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈటల రాజీనామా చేశారు. ఈటల వ్యవహరంలో కేసీఆర్ తీరుపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతకు కొన్ని రోజుల ముందే ఓ మంత్రిపై భూకబ్జా ఆరోపణలకు సంబంధించి ఆడియో క్లిప్పింగ్ వైరల్‌గా మారింది. కేసీఆర్ ఆ వ్యవహారాన్ని కనీసం పట్టించుకోలేదు. కానీ ఈటల విషయంలో హుటాహుటిన దర్యాప్తుకు ఆదేశించారు. ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వారి పట్ల ఒకరకంగా.. వెనకబడిన తరగతికి చెందిన నాయకుడి పట్ల మరో రకంగా ప్రవర్తించినట్లుగానే జనాల్లోకి వెళ్లింది. ఆదుకోని దళితబంధు.. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ గెలుపు వ్యూహాలు రచించారు. దానిలో భాగంగానే హుజూరాబాద్‌లో బీసీల తర్వాత అత్యధికంగా ఉన్న దళితులను ఆకర్షించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందించేలా దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. దళిత బంధు పైలెట్ ప్రాజెక్ట్‌గా హుజూరాబాద్‌నే ఎన్నుకుని..1500 కోట్ల రూపాయల నుంచి 2000 కోట్ల వరకూ నిధుల కేటాయించారు. ఇక బీసీ ఓట్లు చీలినా.. దళిత ఓట్లు అన్ని కారు గుర్తుకే అని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. అయితే ఓట్ల కోసం కేసీఆర్ తీసుకువచ్చిన దళిత బంధు పథకం.. బెడిసికొట్టి కారుకే షాకిచ్చింది. ఇది కేవలం ఓట్ల కోసమే తీసుకువచ్చినట్లు స్పష్టంగా అర్థం అయ్యింది. ఇక ఈ పథకంపై మిగతా సామాజిక వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అయ్యింది. పేదలు అంటే కేవలం దళితులు మాత్రమే కాదు.. మిగతా సామాజిక వర్గాల్లో కూడా పేదలు ఉన్నారు. మరి వారి అభివృద్ధి సంగతి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. ప్రతిపక్షాలు కూడా అన్ని వర్గాలకు దళితబంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ... కేసీఆర్‌ను ఇరుకునపెట్టాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ అందరికి దళితబంధు ఇస్తానని ప్రకటించాడు. కానీ ఎన్నికలకు ముందు హైకోర్టు దళితబంధుపై స్టే విధించింది. దాంతో జనాల్లో.. ఇది కూడా జీహెచ్ఎంసీ వరద సాయం మాదిరి మూలనపడుతుందనే అభిప్రాయం ఏర్పడింది. వీటన్నింటి నేపథ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో దళితబంధు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందనే విషయం స్పష్టంగా అర్థం అయ్యింది. నిరుద్యోగుల అసంతృప్తి.. ఇక టీఆర్ఎస్ రెండో సారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగ ప్రకటన వెలువడలేదు. 2018లో వచ్చిన పోలీస్ నోటిఫికేషనే తెలంగాణలో చివరి భారీ నోటిఫికేషన్. ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా పలు శాఖల్లో 80 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. కానీ వాటి భర్తీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మూడేళ్ల నుంచి ఉద్యోగ ప్రకటన లేకపోవడంతో చాలా మంది నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోయి.. రానున్న రోజుల్లో వెలువడే ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం కోల్పోనున్నారు. దీనిపై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అలానే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఈ కారణలన్ని నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకతకు కారణమయ్యాయి. వెరసి హుజురాబాద్ ఉప ఎన్నికలో కారు ఓటమికి నిరుద్యోగ యువత కూడా ఓ కారణంగా నిలిచారు. ఇదే కాక కాంగ్రెస్ క్యాడర్ బీజేపీకి సహకరించిందనే వార్తలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. తమకు ఓట్లు రాకపోయినా పర్వాలేదు.. కానీ టీఆర్ఎస్ మాత్రం గెలవకూడదని బలంగా నిశ్చయించుకున్న కాంగ్రెస్.. బీజేపీకి పరోక్షంగా మద్దతిస్తూ... ఈటలకు భారీ విజయం దక్కేలా చేసిందని ప్రచారం జోరుగా సాగుతోంది. -
దళిత బంధుపై దాఖలైన 4 పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు
-
కిలికిరిగాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిన దళితబందు ఆగదు: సీఎం కేసీఆర్
-
దళితబంధు ఆపడం చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 18న జారీచేసిన ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ‘దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ముందుగా వాసాలమర్రిలో దళితులకు రూ.7.60 కోట్లను గత ఆగస్టు 5న విడుదల చేశారు. అలాగే పైలెట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆగస్టు 16 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దళితబంధు ఇప్పటికే కొనసాగుతున్న పథకం. హుజూరాబాద్ ఎన్నికలతో సంబంధం లేకపోయినా, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం కాకపోయినా.. ఎన్నికల కమిషన్ ఈ పథకం అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని ఉత్తర్వులు జారీచేసింది. దళితబంధు పథకాన్ని ఆపాలని ఆదేశించడం దళితుల హక్కులను హరించడమే. పథకం నిలిపివేతపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను వెంటనే రద్దు చేయండి’ అని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్లో కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎస్సీ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీ, ఎండీని ప్రతివాదులుగా చేర్చారు. -
దళితబంధును ఆపాలని నేను లేఖ రాసినట్లు సృష్టించారు: ఈటల
వీణవంక(హుజూరాబాద్): ‘బడ్జెట్లో ఐదు పైసల బిల్ల కూడా పెట్టకుండా దళిత బంధు ఎలా వచ్చింది? ఓట్ల కోసమే ఈ స్కీం తెచ్చారు’అని మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. ఈ స్కీంను ఆపాలని తాను లేఖ రాసినట్లు దొంగ లేఖలు సృష్టించారని, ఎన్నికల కమిషన్ కూడా ఈ దొంగ లేఖలను ఖండించిందని, ఇప్పుడు తన వల్లనే దళిత బంధు ఆగిపోయిందని విష ప్రచారం చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నేతలపై ఈటల విరుచుకుపడ్డారు. వీణవంక మండలంలోని రెడ్డిపల్లి, కిష్టంపేట, ఘన్ముక్కుల, బ్రహ్మణపల్లి, రామక్రిష్ణాపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దళిత బంధు తాను ఆపినట్లు నిరూపిస్తే తడిబట్టలతో పోచమ్మ గుడిలోకి వస్తానని సవాల్ విసిరారు. అన్నీ కులాల్లోని పేదలకు రూ.10 లక్షలు ఇవ్వాలని కొట్లాడుతానని, కేసీఆర్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది: లక్ష్మణ్ సాక్షి, న్యూఢిల్లీ: హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దురి్వనియోగానికి పాల్పడుతోందని, డబ్బు పంపిణీతో పాటు ఇతర పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణ బీజేపీ నేతల బృందంతో ఆయన బుధవారంనాడు కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై తమకు నమ్మకం పోయిందని, శాంతియుత వాతావరణంలో ఉపఎన్నిక నిర్వహించేందుకు అవసరమైన ఎన్నికల పరిశీలకులను పంపించాలని కోరామన్నారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అదనపు కేంద్ర బలగాలను మొహరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు. ఉపఎన్నిక పూర్తయ్యే వరకు స్థానికంగా ఎల్రక్టానిక్ మోడ్‌లో నగదు బదిలీని ఆపాలని కోరినట్లు తెలిపారు. -
నిరూపిస్తే దేనికైనా సిద్ధం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘బీజేపీ లేఖ రాయడం వల్లే దళిత బంధు ఆగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. టీఆర్ఎస్ వల్లే పథకం ఆగిపోయిందని నేను నిరూపిస్తా.. నువ్వు రాజీనామా చేస్తావా? ఒకవేళ బీజేపీ వల్లే పథకం ఆగిపోయిందని నువ్వు నిరూపించు.. నేను దేనికైనా సిద్ధం..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జమ్మికుంట రూరల్ గ్రామాల్లో బుధవారం పర్యటించారు. తొలుత అంకుషాపూర్, మడిపెల్లి గ్రామాల్లో పర్యటించిన ఆయన రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం ఖాయమైందని, హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోతుందని తెలిసే కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరదీశారని దుయ్యబట్టారు. హుజూరాబాద్‌లో ఓడిపోతామనే భయంతోనే దళితులకు డబ్బులు ఇవ్వకుండా అకౌంట్లు ఫ్రీజ్ చేయించాడని, ఎన్నికల తరువాత కేసీఆరే కోర్టులో కేసు వేయించి దళిత బంధు డబ్బు దళితులకు అందకుండా చేస్తాడని ఆరోపించారు. బీజేపీని గెలిపిస్తే.. కేసీఆర్ అహంకారం అణిగిపోయి ఫాంహౌస్‌ను వీడి ఒళ్లు వంచి పనిచేస్తాడని అన్నారు. ఓడిపోయే సీట్ల ప్రచారానికి పంపి హరీశ్‌రావును బలిపశువును చేస్తున్నారని, హరీశన్నా జాగ్రత్త అంటూ హితవు పలికారు. -
దళిత బంధును ఆపింది బీజేపీనే..
హుజూరాబాద్: ఎన్నికల కమిషన్‌కు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి లేఖ రాసింది నిజమని, దాని వల్లే దళిత బంధు ఆగిందని తాను రుజువు చేస్తానని, ఏ బీజేపీ నేత వస్తారో రండని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సవాల్ విసిరారు. బుధవారం జమ్మికుంటలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో నడమంత్రపు ఓట్లు వచ్చాయని, ఓటు ఎవరికి వేయాలో.. ఓటు వేస్తే ఏం జరుగుతదో ప్రజలు కొద్దిగా ఆలోచించాలని సూచించారు. రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.2,016 చేసుకున్నామని, కన్నకొడుకు చూడకపోయినా పెద్ద కొడుకు కేసీఆర్ పింఛన్ పంపుతున్నాడని ప్రతీ అవ్వ అంటోందని హరీశ్ చెప్పారు. బీజేపీ వాళ్లు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్తూ మనసులు కరాబు చేస్తారని, వాళ్లు ప్రజలకు ఏం చేస్తరో మాత్రం చెప్పడం లేదని అన్నారు. బీజేపీ పాలనలో 21 రోజుల్లో 16 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, దీంతో రవాణా చార్జీలు పెరిగి ఉప్పు, పప్పు, కూరగాయలు, నూనె ధరలు పెరిగాయని, ఇన్ని ధరలు పెంచిన బీజేపీలో చేరిన రాజేందర్ తనకు ఓటు వేయండని అంటున్నారని ఎద్దేవా చేశారు. ధరలు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. తన స్వార్థం కోసం ఈటల రాజీనామా చేసిండని, రాజేందర్ గెలిస్తే బీజేపీకి లాభమని, గెల్లు గెలిస్తే ఇక్కడి ప్రజలకు లాభమని తెలిపారు. భూముల పంచాయితీలు పెట్టుకుని ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని, వ్యక్తిగత పంచాయితీని ఇప్పుడు హుజూరాబాద్ ప్రజల పంచాయితీగా మాట్లాడుతున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
‘దళిత బంధు’వులు ఎవరు?
‘‘ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైన పార్లమెంటు, అసెం బ్లీల ఎన్నికల ప్రక్రియను నిర్వ హించే ఎన్నికల సంఘం ప్రభుత్వ అధికార యంత్రాంగానికి లోబడ కుండా స్వేచ్ఛగా ఉండాలి. అప్పుడే ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరుగుతాయి’’ అని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ సభలో ఈ విషయంపై 1949 జూన్ 15న జరిగిన చర్చలో వ్యాఖ్యానించారు. ఆ చర్చలో పాల్గొన్న రాజ్యాంగ సభ సభ్యులు కూడా అదే విధమైన అభిప్రా యాన్ని వ్యక్తం చేశారు. అందువల్లనే రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ – 324లో ఎన్నికల సంఘపు విధులు, అధికారాలను వివరించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ మీద రాజకీయ, అధికార జోక్యం ఉండకూడ దని, ఆయనను తొలగించే ప్రక్రియను కఠినతరం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉన్న విధంగానే నిబం ధనలను కల్పించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొల గించాలంటే పార్లమెంటు నిర్ణయం తీసు కోవాలి. ఆ అధి కారాన్ని రాష్ట్రపతికి గానీ, కేంద్ర మంత్రి వర్గానికిగానీ కల్పించలేదు. ఎంతో దూరదృష్టితో రాజ్యాంగ రచనా సంఘం, అంతిమంగా రాజ్యాంగ సభ మహత్తరమైన నిబంధనలు కల్పించాయి. అయితే, గత డెబ్భై ఏళ్ళలో కొద్దిమంది ప్రధాన ఎన్నికల కమిషనర్లు మాత్రమే కొంత మేరకైనా స్వేచ్ఛగా, స్వతంత్రంగా పనిచేశారు. చాలా మంది అధికారంలో ఉన్న పార్టీకి, ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేశారు. గత మూడు రోజుల కిందట కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఒక నిర్ణయం యావత్ దళిత జాతిని విస్మయానికి గురి చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్‌లో నిలిపివేయాలని ఆదేశించింది. భార తీయ జనతాపార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. వాస్తవాలను పరిశీలించకుండా ఎన్నికల సంఘం తీసు కున్న ఈ నిర్ణయం రాజకీయ జోక్యం ప్రకారమే జరిగిందనే వాదనకు బలం చేకూరుతున్నది. ఎందుకంటే, ఈ పథకం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రకటించింది కాదు. తెలంగాణ దళిత బంధు పథకానికి అన్ని రకాల అనుకూలాంశాలే ఉన్నాయి. మొదటగా దీనికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. మార్చి18, 2021న ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు ప్రవేశపెట్టిన 2021–22 బడ్జెట్లో దీని ప్రస్తావన ఉంది. ఆ బడ్జెట్‌ను రాష్ట్ర శాసనసభ ఆమో దించింది. దాని తర్వాత ఒక నిర్దిష్టమైన రూపం ఇవ్వ డానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. పది గంటల పాటు సాగిన ఈ సమావేశంలో దళితుల ఆర్థికాభివృద్ధికి చిన్న చిన్న సాయం సరిపోవడం లేదనీ, వారు అనుభవిస్తున్న పేదరికం నుంచి బయటపడటానికి తగిన విధంగా ఆర్థిక సాయం చేయాలనీ నిర్ణయం జరిగింది. ఆ సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. అన్ని రకాల అధికార లాంఛ నాలను పూర్తిచేసుకొని ఆగస్టు 5న యాదాద్రి–భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం, వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ గ్రామంలో 76 దళిత కుటుంబాలకు పథకాన్ని వర్తింప జేశారు. వెనువెంటనే వారి వారి ఖాతాల్లోకి పది లక్షలు జమ చేశారు. కొందరు ఇప్పటికే తమ కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ తర్వాతనే ఆగస్టు 16వ తేదీన హుజూరాబాద్ నియోజకవర్గానికి దీనిని విస్తరింప జేశారు. ఆ రోజున 15 మందికి లాంఛనంగా చెక్కులు అంద జేశారు. ఇప్పటికి దాదాపు 17,500 మందికి తమ బ్యాంకు ఖాతాల్లో పది లక్షలు జమయ్యాయి. ఇందులో కొంత మంది వ్యాపార, ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువ డింది సెప్టెంబర్ 29న మాత్రమే. అంటే ఎన్నికల నోటిఫి కేషన్ రావడానికి 50 రోజుల ముందు ఈ పథకం అమలు లోకి వచ్చింది. అంతేకాకుండా, రాష్ట్రంలో మరో నాలుగు నియోజకవర్గాల్లో ఈ పథకం అమలు కోసం మూడు రోజుల క్రితం 18వ తేదీన 250 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం అమలుకు, హుజూరాబాద్ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని దీనిని బట్టి అర్థమవుతున్నది. మరో విషయాన్ని మరచి పోకూడదు. హుజూరాబాద్ ఎన్నికలు హోరాహోరీగా జరు గుతున్నాయి. పోటీచేసిన రాజకీయ పార్టీలు తాము మాత్రమే గెలవాలని ప్రయత్నిస్తాయి. ఏ రాజకీయ పార్టీ అయినా తమ వి«ధానాల ద్వారా, తాము చేసిన మంచి పనుల ద్వారా, చేయబోయే పనుల ద్వారా ఓట్లను పొంద వచ్చును. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అనుసరించిన విధానంలో పూర్తి చెడు ఉద్దేశ్య కనిపి స్తున్నది. బీజేపీకి దళితుల పట్ల ఉన్న నిర్లక్ష్య భావన, చిన్న చూపు దీన్ని బట్టి మరోమారు రుజువవుతోంది. 2018 ఎన్నికల ప్రణాళికలో కేంద్రంలో బీజేపీ... ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన కూడా చేయకపోవడం యాదృచ్ఛికం కానేకాదు. దానికనుగుణంగానే ఇప్పటి వరకు వాళ్ళ కోసం ఎటు వంటి నూతన పథకాలను ప్రవేశపెట్టలేదు. ఒక్క ఉదాహరణ చెప్తాను. కోవిడ్ సమయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులతో పాటు, పారిశుద్ధ్య కార్మి కులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు. లక్షల కోట్లు కోవిడ్ ఉద్దీపన నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, అత్యల్ప జీతాలు తీసుకునే పారిశుద్ధ్య కార్మికులకు కనీసం ఇన్సెంటివ్గానైనా ఒక్క పైసా ఇచ్చింది లేదు. అంతే కాకుండా గత అయిదేళ్ళుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇవ్వలేదు. దక్షి ణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సబ్‌ప్లాన్ నిధులు ఉండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంతంగానే పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్స్ ఇచ్చాయి. హుజూరాబాద్ విషయంలో భారతీయ జనతా పార్టీ అనుసరించిన దళిత బంధు వ్యతిరేక వైఖరి వివక్షా పూరి తమైనది. బీజేపీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులకు నా మనవి. మీరు ఒకసారి వెనక్కు తిరిగిచూసుకోండి. ఈ ఏడేళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఏ పథకాలు అమలు చేశారో ఆలోచించండి. ఎన్ని నిధులు ఈ అణగారిన వర్గా లకు కేటాయించారో, వాటి ఫలితాలేమిటో సమీక్షించు కోవాల్సిన సందర్భమిది. -మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
దళితబంధు ఆపించడం అవివేకం: కొప్పుల ఈశ్వర్
హుజూరాబాద్: దళితబంధు కార్యక్రమాన్ని ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపివేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌కు బీజేపీ లేఖలు రాసి అడ్డుకోవడం అవివేకమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకం తెచ్చారని చెప్పారు. ఇప్పటికే 17 వేల మంది దళిత కుటుంబాలకు వారి వారి ఖాతాల్లో డబ్బులు పడ్డాయని తెలిపారు. సోమవారం స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దళితబంధును పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలుపరిస్తే, దానిని నిలిపివేయాలని బీజేపీ నాయకుడు ప్రేమేందర్ రెడ్డి లేఖ రాశారని, ఆ లేఖ ఆధారంగానే ఎన్నికల సంఘం దళితబంధును నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఈటల రాజేందర్ కుట్రలో భాగంగానే దళితబంధును నిలిపివేశారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. దళితబంధు పథకాన్ని నిలిపి వేయాల్సిందిగా ఒకవైపు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తూనే, మరోవైపు సీఎం కేసీఆర్‌ను నిందించడం వెనుక దగాకోరుతనం తేటతెల్లమవుతోందని అన్నారు. బీజేపీ కుట్రలు దళితులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. అదాని, అంబానీలు బాగుపడితే చాలు, దళిత కుటుంబాలు బాగుపడవద్దనే ఉద్దేశంతోనే బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. బీజేపీని దళిత సమాజం మొత్తం ప్రశ్నించాలన్నారు. అనంతరం బండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈటల దిష్టిబొమ్మను స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద దహనం చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, సుంకె రవిశంకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మోత్కుపల్లికి డబుల్ ధమాకా.. నేడు గులాబీ గూటికి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కొంతకాలంగా రాజకీయంగా నిస్తేజంగా ఉన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉన్నట్టుండి జిల్లా రాజకీయ క్షేత్రంపై తళుక్కున మెరిశారు. సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ సీనియర్ దళిత నాయకుడికి టీఆర్ఎస్ అధిష్టానం డబుల్ ధమాకా ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. సోమవారం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్న మోత్కుపల్లిని రాష్ట్ర దళిత బంధు చైర్మన్‌గా నియమిస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. అయితే, ఈ హోదాతో పాటు ఆయన్ను పెద్దల సభకు పంపే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని, సీనియర్ దళిత నాయకుడికి తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకే ఆయన రెడీ అయ్యారని తెలంగాణ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు దళితుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజలకు స్పష్టంగా వివరించేందుకు గాను మోత్కుపల్లిని శాసనమండలికి పంపుతారని సమాచారం. ఇందుకు జిల్లా రాజకీయ, సామాజిక సమీకరణలు కూడా కలిసి వస్తున్నాయని ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతస్థాయిలో చర్చ జరిగిందని, ఈ చర్చలో వచ్చిన ఎమ్మెల్సీ ప్రతిపాదనకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మోత్కుపల్లికి ఎస్సీ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఖాయమని, అయితే పార్టీలో చేరిన వెంటనే ఇస్తారా..? సమయం చూసి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తం మీద మోత్కుపల్లికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ఖరారయిందని, అయితే ఎప్పుడిస్తారన్నది మాత్రమే సస్పెన్స్ అని జిల్లా టీఆర్ఎస్ వర్గాలు కూడా చెబుతున్నాయి. గవర్నర్ పోటీదారు.. వాస్తవానికి, మోత్కుపల్లి నర్సింహులు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన మోత్కుపల్లి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలాకాలం పాటు ఆ పార్టీలోనే కొనసాగారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉండడం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు చెప్పి తనకు గవర్నర్ హోదా ఇప్పిస్తారని ఆశించారు. కానీ, ఎప్పటిలాగే చంద్రబాబునాయుడు మార్కు రాజకీయానికి బలయిన మోత్కుపల్లి అక్కడి నుంచి కాషాయ గూటికి చేరారు. బీజేపీలో ఆయన ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. దళితబంధు పథకం ప్రకటన తర్వాత ఆయన టీఆర్ఎస్ పక్షం వహించారు. దళిత వర్గాలకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని బలంగా చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే గులాబీ సేనకు దగ్గరయిన మోత్కుపల్లి తన మలిదశ రాజకీయ ప్రస్థానాన్ని గులాబీ గూటి నుంచి ప్రారంభిస్తున్నారు. మరి మోత్కుపల్లి మలిదశ ప్రస్థానం ఏ మలుపులు తిరుగుతుంది.. ఆయనకు ఎలాంటి పదవులు కట్టబెడుతుందన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. నేడు టీఆర్ఎస్లోకి .. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సీఎం కేసీఆర్ సమక్షంలో ఈనెల 18వ తేదీన టీఆర్ఎస్లో చేరనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఉదయం 12 గంటలకు బేగంపేట లీలానగర్‌లోని మోత్కుపల్లి నివాసం నుంచి బైక్‌ర్యాలీతో ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. ప్రగతిభవన్‌కు వెళ్లేముందు ట్యాంక్‌బండ్ పైనున్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడినుంచి గన్‌పార్క్‌కు చేరుకుని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. ప్రగతి భవన్ చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతారు. ఈ కార్యక్రమానికి ఆయన అనుచరులు పెద్దఎత్తున హాజరు కానున్నారు. ఆయనతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. మూడు వేల మందితో.. సాక్షి, యాదాద్రి : మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్లో చేరిక సందర్భంగా ఆయన అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు రానున్నారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం కరీంనగర్, హైదరాబాద్ జిల్లాలతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ముఖ్యఅనుచరులు 3 వేల నుంచి 4 వేల మంది వరకు హాజరవుతారని మోత్కుపల్లి ముఖ్య అనుచరులు చెబుతున్నారు. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్లే అవకాశం ఉంది. ఆయన అభిమానులు, ముఖ్య నాయకులు మోత్కుపల్లి వెంట టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం అవుతున్నారు. గత కొంతకాలంగా మోత్కుపల్లి వెంట నడిచిన పలువురు ద్వితీయ శ్రేణి సీనియర్ నాయకులు పార్టీలో చేరనున్నారు. చేరిక సందర్భంగా ప్రత్యేకంగా వాహనాలు ఏమీ ఏర్పాటు చేయనప్పటికీ ఎవరికి వారే హైదరాబాద్ వెళ్తారని అనుచరులు చెబుతున్నారు. చర్చనీయాంశంగా మోత్కుపల్లి చేరిక మోత్కుపల్లి టీఆర్ఎస్లో చేరిక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో సీనియర్ నేత అయిన మోత్కుపల్లి అప్పట్లో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. టీఆర్ఎస్ ఏర్పాటుతో కేసీఆర్ టీడీపీనీ వీడి బయటకు రాగా మోత్కుపల్లి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోయిందని టీఆర్ఎస్లో టీడీపీని విలీనం చేయాలని సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. టీడీపీని వీడిన అనంతరం బీజేపీలో చేరి కొంతకాలం అందులో కొనసాగారు. సీఎం దళితబంధు పథకంపై మోత్కుపల్లి సానుకూలంగా స్పందించారు. దీంతో కేసీఆర్ స్వయంగా మోత్కుపల్లిని టీఆర్ఎస్లోకి ఆహ్వానించడం చకచకా జరిగిపోయాయి. -
TS: ‘దళితబంధు’ సమావేశానికి వెళ్దాం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకుగాను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో సోమవారం జరగనున్న ఉన్నతస్థాయి సమావేశానికి వెళ్లాలా వద్దా అన్న దానిపై కాంగ్రెస్ పార్టీ తర్జనభర్జనలు పడింది. చివరకు హాజరుకావడానికి ఓకే చెప్పింది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర కూడా ఉంది. దీంతో ఎమ్మెల్యే హోదాలో ఆయన ఆ సమావేశానికి హాజరు కావాలా వద్దా అన్న దానిపైనా కొంత సందిగ్ధత నెలకొంది. ఆదివారం ఈ విషయాలపై చర్చించేందుకుగాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తదితరులు జూమ్ యాప్ ద్వారా సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి వెళ్లాలా వద్దా అనే అంశంపై వీరంతా చర్చించిన అనంతరం సమావేశానికి వెళ్లకపోతే దళితబంధు అమలుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమనే భావనను టీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రమాదముందనే అభిప్రాయానికి వచ్చారు. ‘దళితబంధు’సమావేశానికి వెళ్లడం ద్వారా ఈ పథకం అమలుపై కాంగ్రెస్ పార్టీ వాదనను కూడా ప్రభుత్వం ముందు ఉంచవచ్చని నిర్ణయించారు. నియోజకవర్గాలవారీగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలనే డిమాండ్‌తో సమావేశానికి హాజరుకావాలని నేతలు నిర్ణయించారు. -
హుజూరాబాద్‌లో దళితబంధు సర్వే పూర్తి.. ఎంత మందికంటే
హుజూరాబాద్ రూరల్: దళితబంధు సర్వే గురువారంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ముగిసింది. ఆగస్టు 27 నుంచి ఏడురోజుల పాటు ఐదు మండలాల్లో అధికారులు ఇంటింటా తిరుగుతూ.. సర్వే నిర్వహించారు. 2014 సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా వివరాలు సేకరించారు. 17,166 కుటుంబాలకుగానూ.. 16,370 కుటుంబాల వివరాలు యాప్‌లో అప్లోడ్ చేశారు. మరో 2,775 కుటుంబాలకు సంబంధించి దరఖాస్తులు నింపారు. సర్వేలో నియోజకవర్గంలో మొత్తంగా 18,619 దళిత కుటుంబాలు ఉన్నట్లు తేల్చారు. హుజూరాబాద్ పట్టణంలో 1,794 కుటుంబాల వివరాలు యాప్‌లో నమోదు చేశారు. మరో 611కుటుంబాలకు సంబంధించి దరఖాస్తులు నింపారు. హుజూరాబాద్ మండలంలోని 19 పంచాయతీల్లో 3,387 కుటుంబాల వివరాలు ఆప్‌లోడ్ చేశారు. మరో 295 కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జమ్మికుంట మున్సిపాలిటీలో 2,313 కుటుంబాలను పొందుపర్చారు. 446 కుటుంబాలవి దరఖాస్తులు స్వీకరించారు. జమ్మికుంట రూరల్ పరిధిలో 2,428 కుటుంబాలను గుర్తించగా 464 దరఖాస్తులను స్వీకరించారు. ఇల్లందకుంట మండలంలో 2,951కుటుంబాలను ఆప్లోడ్చేశారు. వీణవంక మండలంలో 3,497 కుటుంబాల వివరాలు యాప్‌లో, 955 దరఖాస్తులను నేరుగా స్వీకరించారు. చదవండి: ‘సోనీ క్షమించు! నీకు ఏం చేయలేకపోయా’ కన్నీటితో భర్త చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి -
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం: ఇక నలుదిశలా ‘దళిత బంధు’
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకాన్ని ఇక రాష్ట్రవ్యాప్తం చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని నలుదిశలా దళితబంధు పథకం అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని దళిత ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేశారు. ఆ నాలుగు మండలాల్లో అన్ని దళిత కుటుంబాలకు హుజూరాబాద్‌తో పాటు అమలుచేయాలని సీఎం ఆదేశించారు. (చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..?) ఎంపికైన ఆ నాలుగు మండలాలు ఇవే.. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం: చింతకాని మండలం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం: తిరుమలగిరి మండలం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం: చారగొండ మండలం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం: నిజాం సాగర్ మండలం ఈ మండలాల్లోని అన్ని దళిత కుటుంబాలకు వెంటనే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం వర్తింపచేయనుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో హైదరాబాద్‌లో సమీక్షా సమావేశాన్ని సీఎం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయనున్నారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు -
సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంపై సమీక్ష
-
దళిత కుటుంబాలను వెలివేసిన గ్రామ కమిటీ
-
కరీంనగర్లో దళిత బంధు తొలి విడత యూనిట్ల పంపిణీ
-
దళితబంధుపై నిఘా.. బాధ్యతలు థర్డ్‌పార్టీకి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌గా దృష్టి సారించారు. దేశంలో అత్యంత భారీ ఆర్థిక సాయంతో తలపెట్టిన సంక్షేమ పథకం కావడంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా పథకం అమలు ఎలా జరుగుతోంది? ఎలాంటి పొరపాట్లు దొర్లుతున్నాయి? ఏ విధానాలు వ్యాపారానికి ప్రతికూలంగా మారుతున్నాయి? తదితర విషయాలపై నిరంతరం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు విజిలెన్స్ తరహాలో ఓ సంస్థ పనిచేయాలని సీఎం నిర్ణయించారు. చదవండి: పాస్‌పుస్తకం కోసం రైతు వినూత్న నిరసన ఇటు లబ్ధిదారులకు, అటు ప్రభుత్వాధికారులకు సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియాలంటే థర్డ్‌పార్టీ (ప్రైవేటుసంస్థ) పర్యవేక్షణ ఉండాలన్న సీఎం ఆలోచనల మేరకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. ఇది విజయవంతం కావాలంటే అమలుపై మూడో నేత్రం ఉండాలన్న తలంపుతోనే థర్డ్‌పార్టీకి విజిలెన్స్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అధ్యయనం మొదలుపెట్టిన థర్డ్‌పార్టీ ఈ థర్డ్‌పార్టీ ఇప్పటికే లబ్ధిదారులతో సమావేశమైంది. ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక ప్యాకేజీతో ఎవరేం చేయాలనుకుంటున్నారో ఇప్పటికే వివరాలు సేకరించింది. ప్రభుత్వం ఎంపిక చేసిన 15 మంది లబ్ధిదారుల నుంచి థర్డ్‌పార్టీకి మిశ్రమస్పందన లభించినట్లు తెలిసింది. తమకు ఎలాంటి నైపుణ్యాభివృద్ధి అవసరం లేదని, తమకు ఇప్పటికే డ్రైవింగ్, మోటారు రంగంలో ఉన్న అనుభవం మేరకు వాహనాలు ఇప్పిస్తే చాలని కొంతమంది చెప్పారు. మరికొందరు తమకు నైపుణ్యాభివృద్ధితోపాటు, మార్కెటింగ్ సదుపాయాలు ప్రభుత్వమే కల్పించాలని కోరారు. ఇంకొందరు తమకు అసలు వ్యాపారం ఎలా చేయాలో తెలియదని, అందుకే తాము ఎంచుకున్న వ్యాపారంలో అలవాటు పడేంతవరకు తమను కనిపెట్టుకుని ఉండాలని చెప్పారు. ఈ సంస్థ లబ్ధిదారులతో మాట్లాడాక నివేదిక సిద్ధం చేసి సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయాని(సీఎంవో)కి పంపినట్లు తెలిసింది. లబ్ధిదారులకు ఎలాంటి సాయం కావాలి? వ్యాపారం/యూనిట్ అభివృద్ధి చెందాలంటే ఎలాంటి వ్యూహాలు అవలంబించాలి? అన్న విషయంలో తాము గమనించిన విషయాలపైనా నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా ముఖ్యమంత్రి నేరుగా జిల్లా మంత్రి, కలెక్టర్‌తో మాట్లాడి దిశానిర్దేశం చేస్తారు. -
‘ఆత్మగౌరవంతో బతకాలనుకున్న వాళ్లు మద్దతు తెలపండి’
సాక్షి, హైదరాబాద్: దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఉప ఎన్నిక జరుగనున్న హుజురాబాద్‌కు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేయకుండా, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ వర్తింపజేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలన్నీ విజయవంతం అవుతున్నాయన్న ఆయన... ఆత్మగౌరవంతో బతకాలనుకునే ప్రతీ ఒక్కరు తమకు మద్దతు తెలపాలని కోరారు. ‘‘స్వపరిపాలన- ఆత్మగౌవరంతో బతకాలని, వనరులు అందరికీ అందాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. ఏ లక్ష్యాల కోసం రాష్ట్రం ఏర్పాటు చేశారో అవి నెరవేరడం లేదు. తెలంగాణలో అత్యంత వెనకబడిన వర్గాలను తలెత్తుకునేలా చేయాలి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఏడేళ్లుగా కేసీఆర్ సర్కారు ఖర్చు పెట్టడం లేదు. నిధులు ఖర్చు కాకపోతే.. క్యారీపార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. కానీ, అది కూడా జరగడం లేదు. దళిత, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడానికి కాంగ్రెస్ నాంది పలికింది’’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. చదవండి: కష్టపడండి... ఇంటికొచ్చి బీఫారం ఇస్తా -
‘విశ్వకర్మబంధు’ను ప్రకటించి అమలు చేయాలి: జాజుల
కవాడిగూడ (హైదరాబాద్): విశ్వకర్మ సామాజికవర్గం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిధంగా వ్యవహరిస్తున్న ప్రభు త్వానికి గుణపాఠం చెప్పాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పిలుపు నిచ్చారు. దళిత బంధులాగే విశ్వకర్మల అభివృద్ధికోసం ‘విశ్వకర్మబంధు’ను తక్షణమే ప్రకటించి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో విశ్వకర్మలు తమ ఓటుద్వారా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు. విశ్వకర్మీయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద విశ్వకర్మనేతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు జాజుల, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేషాచారి హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసి ప్రత్యేక రాష్ట్రం రావడానికి ప్రధాన కారకులైన విశ్వకర్మల బతుకులు ఏమాత్రం బాగాలేవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మలకు ప్రకటించిన అన్ని హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆదివాసీబంధు అమలు చేయండి ఆదిలాబాద్‌లో తుడుందెబ్బ ధర్నా.. కలెక్టరేట్ ముట్టడి సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచి్చన దళితబంధు పథకం తరహాలోనే అత్యం త వెనుకబడిన తమ వర్గానికి కూడా ఆదివాసీబంధు అమలు చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పెద్ద ఎత్తున ఆదివాసీలు ఆదిలాబాద్ కలెక్టరేట్‌ను ముట్ట డించారు. కలెక్టర్ బయటకు వచ్చి తమ వినతిపత్రం స్వీకరించాలని డిమాండ్ చేశారు. అయితే కలెక్టర్ బయటకు రాకపోవడంతో దా దాపు రెండు గంటలు ధర్నా కొనసాగించా రు. అనంతరం సమీపంలోని కుమురం భీం చౌక్‌కు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. సాయంత్రం 4 గంటల వరకు ఆదివాసీల ఆందోళన కొనసాగింది. ఈ సందర్భంగా నా యకులు మాట్లాడుతూ ఆదివాసీబంధు అమ లు చేసి ప్రతీ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే లంబాడా సామాజికవర్గాన్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్నారు. ఆదివాసీలు సా గు చేస్తున్న అటవీ భూములకు హక్కు పత్రా లు ఇవ్వాలని కోరారు. సాయంత్రం అదనపు కలెక్టర్ నటరాజ్, ఆర్డీవో జాడి రాజేశ్వర్ ఆదివాసీల దగ్గరికి రావడంతో వారు శాంతించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. కాగా, ఆదివాసీల రాస్తారోకో కారణంగా జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు మూడు గంటలపాటు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సమయంలోనే రిమ్స్‌కు వెళ్లే అంబులెన్స్‌లు రావడంతో ఆదివాసీలు వాటి కి దారి వదిలారు. తుడుందెబ్బ జిల్లా అధ్య క్షుడు గొడం గణేశ్, ఉపాధ్యక్షుడు శ్యామ్‌రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
'కేసీఆర్.. మోసం' కవలపిల్లలుగా కనిపిస్తారు: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్, మోసం కవలపిల్లలుగా కనిపిస్తారంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లిలో రేవంత్ రెడ్డి ఆదివారం ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామానికి కేసీఆర్ ఏం చేశాడో ప్రజలకు చూపిస్తాం. కేసీఆర్ పాలనలో అత్యధికంగా దోపిడీకి గురైంది దళితులే అంటూ చురకలంటించారు. -
Huzurabad Bypoll: అలసత్వం వద్దు
సాక్షి, హైదరాబాద్: ‘హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మనం మెరుగైన స్థితిలో ఉన్నాం. రోజురోజుకూ మన బలం పెరుగుతున్నట్లు సర్వే నివేదికలు చెప్తున్నాయి. అయినా అలసత్వం వహించకుండా పార్టీ ఇన్చార్జీలు ఉప ఎన్నిక ముగిసేంత వరకు బాధ్యతలు అప్పగించిన చోట ఎక్కడివారక్కడే పనిచేయాలి. ప్రధానంగా పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రతి గడపకూ వెళ్లి వివరించాలి’ అని సీఎం కేసీఆర్.. మంత్రులు, ఇతర నేతలకు దిశా నిర్దేశం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై శుక్ర వారం ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రులు హరీశ్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌తో పాటు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, హుజూరాబాద్‌లో పార్టీ ఇన్‌చార్జీలుగా పనిచేస్తున్న పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. దళితబంధుపై ఏమంటున్నారు? ఉప ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు వెలువడుతుందనే అంశంపై స్పష్టత లేకున్నా అలసత్వం వహించొద్దని కేసీఆర్ పదే పదే హెచ్చరించినట్లు తెలిసింది. హుజూరాబాద్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సెప్టెంబర్ 10వ తేదీలోగా పూర్తయ్యేలా చూడాలని మంత్రులను ఆదేశించారు. ఇటీవల నియోజకవర్గంలో ప్రారంభించిన దళితబంధుపై స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నదీ తీశారు. ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ లబ్ధి జరిగేలా చూస్తామనే అంశాన్ని దళితుల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మరికొన్ని సూచనలు చేసిన ముఖ్యమంత్రి.. అవసరమైతే మరోమారు హుజూరాబాద్‌లో పర్యటిస్తానని చెప్పినట్లు తెలిసింది. -
రేవంత్ రెడ్డి మరోసారి జైలుకు వెళ్లకు తప్పదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్‌రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు గురువారం కౌంటర్ ఎటాక్ చేశారు. రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లక తప్పదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. దళితుల కోసం కేసీఆర్ రూ.55వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. అంతకముందు బుధవారం హైదరాబాద్ శివార్లలో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో బుధవారం నిర్వహించిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’సభలో రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ఎండగట్టిన సంగతి తెలిసిందే. -
ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులే.. దళితబంధు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగా చేసిందేమీ లేదని, ఏడేళ్లుగా ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించి, ఇప్పుడు తెరపైకి దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్సీ తాటికొండ జీవన్‌రెడ్డి అన్నారు. 75 ఏళ్లుగా దేశాన్ని పాలించిన వారు ఈ ఆలోచన ఎందుకు చేయలేదన్న సీఎం కేసీఆర్ ప్రశ్నకు సమాధానంగా మంగళవారం కరీంనగర్‌లోని ఇందిరాభవన్‌లో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ టౌన్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి జీవన్‌రెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో దళితులకు ఇచి్చన హామీలేవీ కేసీఆర్ నెరవేర్చలేదని, దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూపంపిణీ విషయంలో మాట తప్పారన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న టి.రాజయ్యను ఆకస్మికంగా తప్పించారని, కడియంను ఆ స్థానంలో కూర్చోబెట్టినా.. రెండోసారి అయనను కేబినెట్లోనే లేకుండా చేశారన్నారు. -
హుజూరాబాద్ ఎఫెక్ట్.. సీఎంఓలో ఎస్సీ సామాజిక వర్గ ఐఏఎస్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను ముఖ్యమంత్రి కార్యదర్శిగా బదిలీ చేస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశా రు. ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అద నపు బాధ్యతలను సైతం రాహుల్ బొజ్జాకు అప్ప గించారు. ప్రతిష్టాత్మక దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో సీఎంవోలో ఎస్సీ సామాజికవర్గ ఐఏఎస్ అధికారిని నియమించడం గమనార్హం. -
‘ఇంటికొస్తే చాయ్ పొయ్యాలె?’ నవ్వులు పూయిస్తున్న సీఎం కేసీఆర్ ప్రసంగం
-
‘ఇంటికొస్తే చాయ్ పొయ్యాలె?’ నవ్వులు పూయిస్తున్న సీఎం కేసీఆర్ ప్రసంగం
సాక్షి, కరీంనగర్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగమంటే తెలుగు ప్రజలు ఆసక్తిగా వింటారు. చమక్కులు, ఛలోక్తులు, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. సామెతలతో పాటు తెలంగాణ యాసతో మాట్లాడుతుండడం సీఎం కేసీఆర్ ప్రసంగ శైలి. తాజాగా కరీంనగర్ జిల్లా శాలపల్లిలో సోమవారం జరిగిన ‘తెలంగాణ దళితబంధు’ పథకం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ ప్రసంగంలోనూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరదాగా మాట్లాడడంతో నవ్వులు విరబూశాయి. లబ్ధిదారుతో సరదా సంభాషణ దళిత బందు లబ్ధిదారుగా ఎంపికైన హుజురాబాద్ మండలం కనుకులగిద్దకు చెందిన కొత్తూరి రాధ, ఆమె భర్త మొగిలికి దళితబంధు చెక్కు, లబ్ధిదారు కార్డు సీఎం కేసీఆర్ స్వయంగా అందించారు. ఈ సందర్భంగా మైక్ అందుకుని ‘ఏమ్మా ఈ డబ్బులతో ఏం చేస్తావ్’ అని అడగ్గా రాధ డెయిరీ పెట్టుకుంటానని చెప్పింది. ‘పాలు అమ్ముతవా? మంచిగా అమ్ముతవా? పక్కా మాట కదా’ సరదాగా ప్రశ్నించారు. ‘మళ్లొచ్చిన్నాడు మీ ఇంటి కాడ ఛాయ్ పొయ్యాలే’ అని సీఎం కేసీఆర్ అనడంతో సభికులతో పాటు సమావేశానికి హాజరైన వారందరూ ఘొల్లున నవ్వారు. ‘వెంకన్న నువ్వు ముందటికుండు’ అంతకుముందు ప్రసంగంలో దళిత బంధుపై పాట రాసిన కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ప్రస్తావన తెచ్చారు. ‘వచ్చిండా వెంకన్న? ఎనకకు ఎందుకు పోయినవ్. నువ్వు ముందటికుండు’ అని చెప్పడంతో గోరటి వెంకన్న లేచి నిలబడ్డారు. ముందు వరసలోకి రమ్మని విజ్ఞప్తి చేసినా వెంకన్న రాలేదు. ‘మట్టిల్లోంచే సిరులు తీసే మహిమ నీకూ ఉన్నది.. పెట్టుబడియే నీకు వరిస్తే నీకు ఎదురేమున్నది’ అని గోరటి వెంకన్న రాసిన పాటను కొంత ప్రస్తావించారు. అనంతరం మరో కవి రాసిన .. ‘సుక్కల ముగ్గు ఏసినట్టు సెల్లెల.. నువ్వు సక్కంగా కూడబెట్టు సెల్లెల్ల’ అని పాట పాడారు. ‘నడిమొళ్లకు ఎందుకు కడుపు ఉబ్బస’ అని దళితబంధుపై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ‘కిరికిరిగాళ్లు.. కొండిగాళ్లు ఒకరు కీ.. ఒకరు కా అంటే’ అంటూ ప్రతిపక్ష నాయకుల విమర్శలపై స్పందించారు. ‘సర్కార్ చేయగూసొంగ.. ముఖ్యమంత్రి ఇయ్యగూసున్నాంక ఏదన్నా ఆగుతదా? రాజు తలుచుకున్నాక దెబ్బలకు కొదువుంటదా?’ అని దళిత బంధును ఎవరూ ఆపలేరని కుండబద్దలు కొట్టి చెప్పారు. హుజురాబాద్ గురించి మాట్లాడదామా? అని సీఎం కేసీఆర్ అడగ్గా సమావేశానికి హాజరైన వారంతా ఓ స్థానిక నాయకుడికి మద్దతుగా నినాదాలు చేశారు. ‘నాయకత్వాలు వెనకసిరికి. ఆగాలే.. ఆగాలే. హే బాబు ఆగాలె’ అని వారించారు. ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీఎంఓలో కార్యదర్శిగా ఉంటాడని చెప్పారు. ఆయన తండ్రి బొజ్జా తారకం అని గుర్తుచేశారు. ఉద్యమంలో పని చేసిన బిడ్డలకు న్యాయవాదిగా పని చేశాడని, చాలా గొప్ప న్యాయవాది, ప్రజల కోసం పని చేశారని కీర్తించారు. ప్రసంగం ముగిస్తూ ‘ఒక్క మీ పిడికిలి బిగిస్తలేదు.’ అని చెప్పగా ‘నాకు చెవులు మందమైనవా? వినబడతలేదు. టెంట్ లేచిపోవాలె’ అని అంటూ ‘జై దళిత బంధు’ ప్రజలతో నినదింపజేశారు. ‘జై భీమ్.. జై హింద్.. జై తెలంగాణ’ అంటూ ప్రసంగం ముగించారు. సభ నుంచి నిష్క్రమిస్తుండగా మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కేసీఆర్ చేతిని ముద్దాడారు. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన హుజురాబాద్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి ప్రత్యేక జ్ఞాపిక అందించారు. అంబేడ్కర్‌తోపాటు సీఎం కేసీఆర్‌ను చిత్రించిన భారీ పెయింటింగ్‌ను కేసీఆర్‌కు అందించి ఆ పెయింటింగ్ వివరాలను కౌశిక్ రెడ్డి వివరించాడు. -
దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లు: కేసీఆర్
దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి, సామాజిక వివక్ష నుంచి విముక్తి కలిగించడమే లక్ష్యంగా నేనే దళితబంధు పథకానికి రూపకల్పన చేసిన. అణగారిన దళితజనం స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలనే మహా సంకల్పానికి ఆచరణ రూపమే ‘దళిత బంధు ఉద్యమం’. వివిధ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. కొత్త జోనల్ విధానం మేరకు పోస్టులు, ఉద్యోగుల విభజన ప్రక్రియ జరుగుతోంది. ఆ ప్రక్రియ తదనంతరం ప్రభుత్వం ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలవుతుంది. సాక్షి, హైదరాబాద్: ‘‘దళితులను వ్యాపార రంగంలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లను అమల్లోకి తేనుంది. ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొంది ఏర్పాటు చేసుకునే ఫర్టిలైజర్, మెడికల్ షాపులు, హాస్పిటళ్లు, హాస్టళ్లు, సరుకుల సరఫరా, ఇతర కాంట్రాక్టులు, వైన్స్, బార్‌షాపుల లైసెన్సుల వంటి విషయాల్లో దళితులకు ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేయనుంది..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సోమవారం (ఆగస్టు 16) నుంచే ఈ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద సంపూర్ణంగా, రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో పాక్షికంగా అమలు చేస్తామని తెలిపారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే, బీఆర్ అంబేద్కర్ల ఆలోచనల వెలుగులో రూపొందిన దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో నూతన క్రాంతిని తీసుకువస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం ప్రసంగ పాఠం ఆయన మాటల్లోనే.. దేశంలోనే ప్రథమంగా.. ‘‘మన దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం పథకాలను తెస్తోంది. దళిత బంధు కింద రూ.10లక్షలు ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తుంది. బ్యాంకులతో సంబంధం లేకుండా, తిరిగి చెల్లించే భారం లేకుండా పూర్తిగా గ్రాంటు రూపంలో అందజేస్తుంది. నచ్చిన రంగంలో జీవనోపాధిని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. కొందరు లబ్ధిదారులు సమూహంగా ఏర్పడి, పెట్టుబడిని పెంచుకొని పెద్ద యూనిట్ పెట్టుకొనే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. లబ్ధిదారులు, వారి కుటుంబాలు ఆపదకు గురైతే రక్షణ కవచంగా ఉండేందుకు ‘దళిత రక్షణ నిధి’ని ఏర్పాటు చేసింది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దళిత బంధు సమితుల నేతృత్వంలో దానిని నిర్వహిస్తారు. లబ్ధిదారుల ప్రగతి ఫలితాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకమైన, పటిష్టమైన విధానాన్ని రూపొందించాం. దళిత బంధు పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ఇతర పథకాలన్నీ యథాతథంగా అందుతాయి. రేషన్ కార్డు ద్వారా బియ్యం, పింఛన్లు, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం కొనసాగిస్తుంది. దళిత బంధు పథకాన్ని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ పథకం దేశానికి దారి చూపుతుంది. ఈర్ష్య, అసూయలకు తావివ్వొద్దు అణగారిన దళితజాతి అభ్యున్నతికి పాటుపడటమే నిజమైన దేశభక్తి. అదే నిజమైన దైవసేవ. మానవసేవే మాధవసేవ అని మహాత్ముడు ఏనాడో పేర్కొన్నాడు. ఆ దిశగా జరిగే ప్రయత్నాలకు సమాజమంతా అండగా నిలవాలి. ఈర్ష్య, అసూయలకు తావివ్వకుండా ఒక్క తాటిమీద నిలవాలి. కులం పేరిట నిర్మించిన ఇనుప గోడలను, ఇరుకు మనస్తత్వాలను బద్దలు కొట్టాలి. వ్యవసాయం పండుగగా మారింది ఒకప్పుడు తెలంగాణ అంటేనే కరువు కాటకాలు, రైతు ఆత్మహత్యలకు చిరునామాగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం చేసిన అద్భుత కృషితో వ్యవసాయ రంగంలో అసాధారణ అభివృద్ధి నమోదైంది. 2020–21లో 3.45 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు సాధించి దేశంలో అగ్రభాగాన నిలిచింది. మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల ఉచిత విద్యుత్, వ్యవసాయ క్లస్టర్ల ఏర్పాటు, రైతుబంధు, రైతుబీమా పథకాలు, రైతువేదికలు, కల్లాల నిర్మాణం, గోదాముల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా తదితర చర్యల ద్వారా ప్రభుత్వం వ్యవసాయం రంగంలో నూతన ఉత్తేజాన్ని నెలకొల్పింది. రూ.50వేలలోపు రుణమాఫీ మొదలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 3లక్షల మంది రైతులకు రూ.25 వేల వరకూ ఉన్న పంట రుణాలను ప్రభుత్వం ఇప్పటికే మాఫీ చేసింది. సోమవారం నుంచే మరో 6 లక్షల మంది అన్నదాతలకు రూ.50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తోంది. నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తవుతుంది. దీనితో 9 లక్షల మంది రైతన్నలు రుణ విముక్తులవుతున్నారు. మిగతా వారికి కూడా దశలవారీగా రుణమాఫీ అమలవుతుంది. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాం ►విద్యుత్, తాగునీటి, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవడమే కాదు.. ఈ రంగాలలో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ►రాష్ట్రం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని సృష్టిస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ పథకం చేరని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, నేతన్నలకు బీమా, డబుల్ బెడ్రూం ఇళ్లు వంటి పథకాలను అమలు చేస్తోంది. చివరి లబ్ధిదారుడికి ఇల్లు అందే వరకూ డబుల్బెడ్రూం పథకం అమలవుతుంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. ►కుల వృత్తుల వారి ఆర్థిక, సామాజికాభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ, నాయీ బ్రాహ్మణ, రజక వృత్తులవారికి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రజకులకు అధునాతన దోభీ ఘాట్లు, నాయీ బ్రాహ్మణులకు ఆధునిక సెలూన్లు ఏర్పాటు చేస్తోంది. ►కొత్త పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ ద్వారా గత ఏడేళ్లలో 16,671 పరిశ్రమలు రాష్ట్రానికి తరలివచ్చాయి. వాటితో 15 లక్షల 86 వేల 500 ఉద్యోగాల కల్పన జరిగింది. 2020–21 నాటికి రాష్ట్రం నుంచి ఐటీ దిగుమతులు రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయి. కరోనా అదుపులో ఉంది రాష్ట్ర పౌరుల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించే పనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల నియోజకవర్గాల్లో వివరాల సేకరణ ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 27,996 కోవిడ్ బెడ్లు ఉండగా, 17,114 బెడ్లకు ఆక్సిజన్ సదుపాయం ఉండగా.. త్వరలో అన్నిబెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా మార్చబోతోంది. బస్తీ దవాఖానాల స్ఫూర్తితో ‘పల్లె దవాఖానాలు’ ఏర్పాటు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నలుదిక్కులా నాలుగు మల్టీస్పెషాలిటీ హాస్పిటళ్లు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చింది. మూడో దశ గురించి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం పూర్తి సంసిద్ధతతో ఉంది. హైదరాబాద్.. ట్రీ సిటీ తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతంపైగా పెరిగింది. ట్రీ సిటీగా హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చింది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో నిర్మించిన ఫ్లైఓవర్లు ట్రాఫిక్ కష్టాలను గణనీయంగా తగ్గించాయి. నగరానికి కొత్త అందాలను చేకూరుస్తూ ఏర్పాటైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఆసియాలోనే రెండో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిగా నిలిచింది. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ కృషితో రామప్పకు గుర్తింపు కాకతీయ కళావైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించడం వెనక రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిరంతర కృషి ఉంది. తెలంగాణ చారిత్రక ప్రతిపత్తికి, ఆధ్యాత్మిక ఔన్నత్యానికి పూర్వవైభవం తేవడానికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోంది. అందులో భాగంగానే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేపట్టింది. నేడు ‘దళితబంధు’కు శ్రీకారం హుజూరాబాద్‌లోని శాలపల్లిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ సాక్షి,హైదరాబాద్: ప్రతిష్టాత్మక తెలంగాణ దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఎర్రవల్లిలోని ఫాంహౌస్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కేసీఆర్ బయలుదేరి జమ్మికుంట మండలంలోని శాలపల్లికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బహిరంగసభలో దళితబంధు పథకాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులతోపాటు దళితబంధు ఎలక్ట్రానిక్ కార్డులను అందజేయనున్నారు. ఎలక్ట్రానిక్ కార్డుపై పథకం పేరు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటో ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు పయనమవుతారు. -
‘దళితబంధు’పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వరంగల్: టీఆర్ఎస్ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితబంధు పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే టీఆర్ఎస్కే నష్టమని అన్నారు. ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు ఆర్థికసాయం అందించలేకపోవచ్చని తెలిపారు. దళితబంధు అమలు చేయకపోతే ఎన్నికల్లో ఓటమి తప్పదని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, హుజూరాబాద్‌లో ఉపఎన్నిక నేపథ్యంలో కడియం శ్రీహరి వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయం అంశంగా మారాయి. -
అలా చేస్తే మోదీకి పాలాభిషేకం చేస్తాం: హరీశ్‌రావు
సాక్షి, హుజూరాబాద్: హుజూరాబాద్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక.. యావత్ తెలంగాణ ఎన్నికగా మారింది. ఈ క్రమంలో అధికార, విపక్షాలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మతకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి పార్టీలు. హుజూరాబాద్ ఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ ఎలక్షన్‌గా మారింది. ఇప్పటికే టీఆర్ఎస్ తరఫున రంగంలోకి దిగిన హరీశ్‌రావు.. బీజేపీపై భారీ ఎత్తున విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరఫున రంగంలోకి దిగిన మంత్రి హరీశ్‌రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు భారీ సవాల్ విసిరారు హరీశ్‌రావు. దళితబంధుకు కేంద్రం నుంచి నిధులు తెస్తే.. మోదీ ఫోటోకు పాలాభిషేకం చేస్తానన్నారు హరీశ్‌రావు. శనివారం ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘‘ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు ఇస్తాం. రైతుబంధుపై దుష్ప్రచారం చేసినట్లే.. దళితబంధుపై కూడా చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. దళితబంధు ఇచ్చి తీరుతాం. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వాలి.. దళితబంధుకు కేంద్రం నిధులు ఇస్తే మోదీకి పాలాభిషేకం చేస్తాం’’ అన్నారు మంత్రి హరీశ్‌రావు -
సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: ఓ వైపు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు కురిపిస్తుండగా.. మరోపక్క హస్తం పార్టీ ముఖ్య నేత ఒకరు సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన దళితబంధు గొప్ప పథకమంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు ప్రశంసలు కురిపించి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలు.. కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ.. సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారు. దళిత బంధు చాలా గొప్ప పథకం అన్నారు సర్వే సత్యనారాయణ. దళితులు బాగుపడటానికి మంచి పథకం తీసుకొచ్చారని కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురపించారు. ఎవరికీ రాని ఆలోచన సీఎం కేసీఆర్‌కు వచ్చిందంటూ అభినందించారు. ఓవైపు కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌పై కారాలుమిరయాలు నూరుతుంటే.. సర్వే మాత్రం ఇలా ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే సర్వే కారు ఎక్కుతారా ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక సర్వే వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. గతేడాది జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో సర్వే సత్యనారాయణను రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కలిశారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరినట్లు ప్రచారం జరిగింది. అయితే సర్వే మాత్రం అధికారికంగా ఎక్కడా బీజేపీలో చేరలేదు. నిజానికి బీజేపీ నుంచి ఆయన రాజ్యసభ సీటు ఆశించారని... కానీ అందుకు హామీ లభించకపోవడంతోనే ఆ పార్టీలో చేరలేదనే ప్రచారం ఉంది. -
నా రాజీనామా వల్లే కేసీఆర్ ప్రగతిభవన్ వదిలి దళితకాలనీకి వచ్చారు
-
దళితబంధు చైర్మన్‌గా.. మోత్కుపల్లి..!
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు రోజుకో వ్యూహాన్ని తెరమీదకు తెస్తున్నారు. దళితబంధు పథకం, ఇతర పార్టీల నుంచి చేరికలు, అభ్యర్థి ఖరారుపై కసరత్తు పూర్తిచేసిన కేసీఆర్.. రాజకీయ నిర్ణయాల్లో మరింత వేగం పెంచాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇటీవల దూకుడు పెంచిన జాతీయ పార్టీలకు కళ్లెం వేయడం, తెరమీదకు కొత్తగా వస్తున్న రాజకీయ శక్తులకు చెక్ పెట్టడం లక్ష్యంగా సరికొత్త అస్త్రాలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ‘దళితబంధు’ పథకానికి వీలైనంత త్వరగా చట్టబద్ధత కల్పించి, దానికి చైర్మన్‌గా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును నామినేట్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మోత్కుపల్లి నర్సింహులు ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసినా అధికారికంగా టీఆర్ఎస్లో చేరలేదు. ఇది వ్యూహాత్మకంగానే వాయిదా పడిందని, కొద్దిరోజులుగా కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్న మోత్కుపల్లి టీఆర్ఎస్ ఆహ్వానం విషయాన్ని ఇప్పటికే ధ్రువీకరించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ‘దళిత బంధు’ ప్రకటన తర్వాత విపక్షాల నుంచి వస్తున్న విమర్శలు, సవాళ్లకు మంత్రివర్గ విస్తరణ ద్వారా చెక్ పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని.. హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందే కేబినెట్లో మార్పులు జరగవచ్చని వెల్లడిస్తున్నాయి. మంత్రివర్గంలో ఎస్సీల ప్రాతినిధ్యం పెంపు రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవలి వరకు సీఎం కేసీఆర్ సహా 17 మంది ఉండగా.. ఈటల రాజేందర్ తొలగింపు తర్వాత 16 మందితో కొనసాగుతోంది. ఇందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ (మాల సామాజికవర్గం) ఒక్కరే కేబినెట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ సామాజికవర్గం ప్రాతినిధ్యం పెంచాలని.. మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. శాసనసభలో ఎస్సీ కేటగిరీలో 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో 18 మంది టీఆర్ఎస్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో ఎనిమిది మంది మాల, తొమ్మిది మంది మాదిగ సామాజిక వర్గం వారుకాగా.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నేతకాని సామాజికవర్గానికి చెందినవారు. తాజా విస్తరణలో కొత్తగా ఒకరిద్దరికి అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సండ్ర వెంకట వీరయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయని.. వారికి సంబంధించి నిఘా వర్గాల నుంచి సమాచారం ముఖ్యమంత్రికి చేరిందని సమాచారం. విపక్షాలు, కొత్త శక్తులకు కళ్లెం వేసేలా.. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇటీవల రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు పెంచాయి. క్షేత్రస్థాయిలో కార్యాచరణను ప్రకటించాయి. పీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ పేరిట భారీ సభ నిర్వహించగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24 నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇటీవల బీఎస్పీలో చేరగా.. వైఎస్సార్టీపీ, తీన్మార్ మల్లన్న వంటి కొత్త రాజకీయ శక్తులు కూడా వివిధ సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి. చురుగ్గా మారిన జాతీయ పార్టీలు, కొత్త రాజకీయ శక్తులకు కళ్లెం వేసేందుకు ప్రత్యేక వ్యూహం అవసరమని సీఎం కేసీఆర్ ఇప్పటికే అంచనాకు వచ్చారని.. ఆయా పార్టీలు, వ్యక్తులను ఆత్మరక్షణలోకి నెట్టేలా ‘దళితబంధు’, మంత్రివర్గంలో ఎస్సీలకు ప్రాతినిధ్యం పెంపు వంటివాటిని తెరపైకి తేవాలని నిర్ణయించినట్టు తెలిసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత ‘దళిత బంధు’ అవగాహన పేరిట జిల్లాలు, నియోజకవర్గాల వారీగా భారీ సదస్సులు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికపైనా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. తద్వారా విపక్షాల పాదయాత్రలు, సభలు, ఆందోళనా కార్యక్రమాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఆత్మరక్షణలోకి నెట్టేలా.. బీజేపీ, కాంగ్రెస్, ఇతర రాజకీయ శక్తులు విస్తృత కార్యాచరణకు దిగుతున్నాయి. అన్నీ దళిత అంశాలను లేవనెత్తుతున్నాయి. వాటిని ఆత్మరక్షణలోకి నెట్టేలా దళిత బంధు చైర్మన్, ఎస్సీలకు మంత్రి పదవులు వంటి కొత్త అస్త్రాలను సీఎం కేసీఆర్ తెరపైకి తెస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. యువ ఎమ్మెల్యేలకు చాన్స్ ఎస్సీ సామాజికవర్గం నుంచి యువ ఎమ్మెల్యేలకు కేబినెట్ అవకాశమిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సీఎం లెక్కలు వేస్తున్నట్టు తెలిసింది. గతంలో మాదిరిగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మంత్రుల్లో ఒకరికి డిప్యూటీ సీఎం హోదా కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
రూ 500 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
-
వాసాలమర్రికి కేసీఆర్ వరాలు
-
దళితబంధు షురూ.. వెంటనే పథకం అమల్లోకి: సీఎం కేసీఆర్
ఇంటింటికి వెళ్లి.. సమస్యలు విని.. వాసాలమర్రి పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ దళితవాడలో ఇల్లిల్లూ తిరుగుతూ వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దళిత బంధు ద్వారా రూ.10 లక్షలు ఇస్తే ఏం చేస్తారంటూ ఆరా తీశారు. డబ్బులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొందరి సమస్యలు విని.. వెంటనే పరిష్కరించాలంటూ అక్కడిక్కడే అధికారులను ఆదేశించారు. ట్రాక్టర్ ఇప్పిస్తం.. సీఎం కేసీఆర్‌ను కలిసిన జెరిపోతుల పోశమ్మ తన కూతురికి ఏదైనా సాయం చేయాలని కోరింది. తనకు కూతురు ఒక్కతే ఉందని, అల్లుడు డ్రైవర్‌గా పనిచేస్తాడని చెప్పింది. దీనితో కేసీఆర్ స్పందిస్తూ.. ఆమె అల్లుడికి దళితబంధు కింద ట్రాక్టర్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే పనిముట్లు ఇప్పించండి! సీఎం: నీ పేరేంది, ఏం పనిచేస్తవు? కలకొండ కృష్ణాచారి. వడ్ల పనిచేస్తా. సీఎం: ఎంతమంది పిల్లలు ? కృష్ణాచారి: ముగ్గురు పిల్లలు సీఎం: ఏ కావాలి నీకు? కృష్ణాచారి: పనిముట్లు కావాలె, ఇంటికి ప్లాస్టరింగ్ లేదు సీఎం: సరే నీకు సాయం అందుతది. వెంటనే కృష్ణాచారికి పనిముట్లు ఇప్పించాలని, అతడి ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేయించాలని అక్కడే కలెక్టర్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దళితులందరికీ భూమి వాసాలమర్రిలో దళితులందరికీ భూమి పంపిణీ జరుగుతుంది. భూమి ఉన్నవారు ఎందరు, ఎంత ఉంది, భూమి లేనివారు ఎందరనేది పరిశీలిస్తున్నాం. గ్రామంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో దళితులకు ఇచ్చిన 612 ఎకరాల అసైన్డ్ భూముల్లో ఆక్రమణలకు గురైన వాటిని రికవరీ చేస్తాం. వాటిని అందరికీ పంచుతాం. కాళేశ్వరం నీళ్లు వస్తాయి కాబట్టి పంటలు పండించుకోవచ్చు. సాక్షి, యాదాద్రి: రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కోసం ‘దళిత బంధు’పథకాన్ని బుధవారం నుంచే అమల్లోకి తెస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.7.60 కోట్లు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. వాసాలమర్రి దళితులందరికీ భూమి ఇస్తామని, ఇండ్లు కట్టిస్తామని ప్రకటించారు. బుధవారం వాసాలమర్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్.. అక్కడి దళిత కుటుంబాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. వాసాలమర్రి గ్రామంలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ వెంటనే పథకం అమల్లోకి..: దళితులు కష్టపడేతత్వం కలవారు. అలాంటి వారు పేదరికంలో ఉండొద్దు. వ్యాపారం, స్వశక్తితో స్వయంగా ఆర్థికాభివృద్ధి సాధించాలి. ఈ రోజు నుంచే దళిత బంధు పథకం లాంచ్ అవుతున్నట్లు ప్రకటిస్తున్నాను. వాసాలమర్రి గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున గురువారం బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. వాసాలమర్రి గ్రామ దళితులు ఈ పథకం ద్వారా సమాజంలో ఆర్థికంగా పైకి ఎదిగి ఆలేరు నియోజకవర్గానికి దారి చూపాలి. రాష్ట్రంలో ఏడాది కిందనే దళిత బంధు అమలు కావాల్సి ఉంది. ఆరునూరైనా ఈ పథకాన్ని గొప్పగా అమలు చేస్తాం. రాష్ట్రంలో 15– 16 లక్షల దళిత కుటుంబా లు ఉన్నాయి. అందులో ఎలాంటి ఆధారం లేనివారికి దళిత బంధు పథకం ద్వారా ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తాం. ఈ పథకం కింద రూ.30కోట్లతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తాం. అనారోగ్యం, అనుకోకుండా వచ్చే ఇతర కష్టాలతో దళితులు దెబ్బతినకుండా ఇది ఉపయోగపడుతుంది. వాసాలమర్రితోపాటు అన్నిచోట్లా దళితుల మధ్య ఐకమత్యం ఉండాలి. ఏమైనా పోలీస్ కేసులు ఉన్నా రద్దు చేసుకోవాలి. యువతే కేసీఆర్ ఆస్తి.. దళిత సమాజంలోని చదువుకున్న యువతే కేసీఆర్ ఆస్తి. వారు ఎక్కువ బాధ్యత తీసుకుని, కుటుంబ సభ్యుల సమష్టి ఆలోచనలతో ఎదగాలి. దళిత కాలనీల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు, మురికి కాలువలు, రోడ్లు నిర్మిస్తాం. భూముల సమస్య పరిష్కరిస్తాం వాసాలమర్రిలో దళిత బంధు పథకాన్ని విజయవంతం చేసి కేసీఆర్‌కు ధైర్యం కల్పించాలి. రాబోయే 15 రోజుల్లో గ్రామంలో భూముల సమస్య పరిష్కరిస్తాం. మళ్లీ ఆరు నెలల తర్వాత దళితవాడలో తిరిగి సమావేశమై అందరం భోజనం చేద్దాం. ఎవరెవరు ఎలా అభివృద్ధి చెందుతున్నారనేది మాట్లాడుకుందాం. ఇండ్లు కూడా పాతవి తీసేసి కొత్త ఇండ్లు కట్టుకుందాం. వాసాలమర్రిని ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా బంగారు వాసాలమర్రి అయ్యేలా సమష్టి కృషిచేద్దాం’’అని సీఎం చెప్పారు. వాసాలమర్రి పర్యటనలో సీఎం వెంట ఎంపీ సంతోష్‌కుమార్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వృద్ధురాలి పరిస్థితిని ఆరా తీస్తున్న సీఎం కేసీఆర్ ఆగవ్వను ఆపారు! వాసాలమర్రిలో సీఎం పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వాసాలమర్రికి తొలిసారి వచ్చినప్పుడు సీఎం పక్కన కూర్చొని భోజనం చేసిన ఆగవ్వ.. బుధవారం దళితవాడలో సీఎంను కలిశారు. అయితే రైతు వేదిక వద్ద దళితులతో నిర్వహించిన సమావేశానికి వెళ్తున్న ఆమెను పోలీసులు ఆపేశారు. ‘నేను ఆగవ్వను, సీఎం సారుతో అన్నం తిన్న..’ అని చెప్పినా పంపలేదు. ఆమె నిరాశతో ఇంటికి వెళ్లిపోయింది. ఇక పోలీసులు తమను వ్యవసాయభూముల వద్దకు వెళ్లనివ్వక పోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీడీ కార్మికుల కష్టాలు నాకు తెలుసు గ్రామంలోని పలు ఇతర కాలనీల్లోనూ సీఎం పర్యటించారు. అధికారులు రూపొందించిన రోడ్‌మ్యాప్ ప్రకారం కాకుండా వేర్వేరు వీధుల్లోకి వెళ్లారు. నిరుపేద మహిళలు, వృద్ధులు చెప్పిన సమస్యలను ఓపికగా విని, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమకు పెన్షన్ రావడం లేదని విన్నవించుకున్న సుమారు 20 మంది మహిళా బీడీ కార్మికులకు రెండు రోజుల్లో పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్‌కు సూచించారు. ఒక మహిళ బీడీ కార్మికుల కష్టాల గురించి చెప్తుండగా సీఎం స్పందించి.. ‘‘నేను బీడీలు చేసేటోళ్ల ఇంట్లో ఉండే చదువుకున్న. వాళ్ల కష్టాలు నాకు తెలుసమ్మా’ అని చెప్పారు. వాసాలమర్రిని తాను దత్తత తీసుకున్నానని, గ్రామంలో అందరికీ ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ పర్యటన సందర్భంగా సర్పంచ్ అంజయ్య ఇంట్లో కేసీఆర్ భోజనం చేశారు. నీకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా.. దళితవాడలో దుబాసీ శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన సీఎం అది శిథిలమై ఉండటాన్ని చూశారు. ‘అరె.. ఎట్లుంటున్నరయ్యా ఈ ఇంట్లో.. వాన వస్తే నీళ్లు వస్తలేవా?’ అని అడిగారు. దాంతో.. ‘పరిస్థితి బాగాలేదు కూలినాలి చేసుకుని బతుకుతున్నం. బతుకుదెరువు కష్టంగా ఉంది’ అని శ్రీనివాస్ బదులిచ్చాడు. దీనిపై స్పందించిన సీఎం.. ‘నీకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా. మీ ఊరందరు సహకరిస్తే తొందరలోనే పూర్తి చేసుకుందాం..’ అని భరోసా ఇచ్చారు. ఇంటింటికీ తిరిగి.. సీఎం కేసీఆర్ సుమారు మూడు గంటల పాటు వాసాలమర్రిలో కలియదిరిగారు. దళితవాడతోపాటు ఇతర వాడల్లో కాలినడకన పర్యటించారు. స్వయంగా వినతిపత్రాలను స్వీకరించారు. దళిత మహిళలు సీఎం కేసీఆర్‌కు బొట్టుపెట్టి, మంగళ హారతులతో స్వాగతం పలికారు. దళితవాడలో తొలుత కొండపురం నర్సమ్మ ఇంటివద్ద సీఎం కేసీఆర్ ఆగారు. తనకు పింఛన్ ఇప్పించాలని ఆమె కోరగా.. వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. వాడలో కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లను చూసి ఆయన చలించిపోయారు. అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దళితబంధు పథకం కింద రూ.10 లక్షలు ఇస్తే ఎలా ఖర్చుచేస్తారని సీఎం ప్రశ్నించగా.. కొందరు ఇల్లు కట్టుకుంటామని, పాత ఇండ్లు మరమ్మతు చేసుకుంటామని, భూమి అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం.. ఇల్లులేని వారికి ఇల్లు మంజూరు చేస్తానని, దళితబంధు డబ్బులను ఉపాధి కోసమే ఉపయోగించుకోవాలని సూచించారు. భోజనానికి రండి.. గజ్వేల్/మర్కూక్: వాసాలమర్రిలో పర్యటన ముగించుకున్న సీఎం తిరుగు ప్రయాణంలో.. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని కాశిరెడ్డిపల్లి వద్ద కాసేపు ఆగారు. ‘అంతా మంచిగున్నరా.. అంటూ పలకరించారు. గ్రామంలో పలు సమస్యలు తీర్చాలంటూ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సింగం సత్తయ్య, మల్లేశం వినతి పత్రం అందజేశారు. గ్రామంలోకి రావాలని కోరారు. అయితే.. గ్రామంలోని ముఖ్యులు 10వ తేదీ తర్వాత ఫామ్‌హౌస్‌లో భోజనానికి రావాలని సీఎం సూచించారు. గ్రామ అభివృద్ధిపై చర్చించుకుని, ప్రణాళికాబద్ధంగా ముందుకుపోదామన్నారు. సీఎం స్పందనతో గ్రామస్తుల్లో సంతోషం కనిపించింది. -
దళితబంధు సొమ్ముపై పూర్తి బాధ్యత మీదే: సీఎం కేసీఆర్
-
వాసాలమర్రిలోని దళితులకు తక్షణమే ‘దళితబంధు’
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు పర్యటిస్తున్నారు. దళితవాడలో కాలినడకన ఇంటింటికి వెళ్లి ‘దళితబంధు’ పథకం గురించి ఏ మేరకు అవగాహన ఉందో దళితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. ‘‘భారతదేశంలో ఏళ్లుగా అణచివేతకు గురైన జాతి దళిత జాతి. కొందరు మహాత్ములు ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయత్నించారు. వారిలో ముఖ్యులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. 60 ఏళ్ల క్రితం ఆయన దళితుల కోసం పోరాటం చేయగా విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు లభించాయి. ఆయన మార్గం చూపారు. కానీ పూర్తి స్థాయిలో దళితుల అభివృద్ధి జరగలేదు. గత ప్రభుత్వాలు సరైన దిశలో దళితుల అభివృద్ధి గురించి ఆలోచించకపోవడం వల్లనే వారు ఇంకా పేదలుగానే ఉన్నారు’’ అన్నారు. ‘‘20 ఏళ్లు పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఈ రోజు 24 గంటల కరెంటు ఇస్తున్నాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందిస్తున్నాం. గొల్ల, కురమలకు గొర్లు, గీత కార్మికులకు సాయం, సామాజిక వర్గాల వారిగా చేయూతనందిస్తున్నాం. ముసలి, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్నాం’’ అని కేసీఆర్ తెలిపారు. ఏడాది క్రితమే దళిత బంధు ప్రాంరభం కావాల్సి ఉండే.. ‘‘ఏడాది క్రితమే దళిత బంధు ప్రారంభం కావాల్సి ఉండే. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. అందుకే ఈ మధ్యనే దాన్ని ప్రారంభించాం. నెలల పాటు ఆలోచించి.. ఈ పథకాన్ని రూపొందించాం. దీన్ని విఫలం కానివ్వొద్దు. లబ్ధిదారులు దీన్ని వాడుకుని అభివృద్ధి చేసి చూపించాలి. దళితవాడలు ఐకమత్యంగా ఉండాలి. ఈర్ష్య , కోపం లేకుండా అందరం ప్రేమ భావనతో ఉండాలి. పథకాన్ని విజయవంతం చేయాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ మార్గంలో వెళ్లేటప్పుడు నేను వాసాలమర్రిని పరిశీలించాను. మీ ఊరు బలే గమ్మత్తుగా ఉంటది. ఈ ఊర్లో ఉన్నన్ని మట్టి గోడలు ఎక్కడా లేవు. ఒక్కటి కూడా ఇటుకల ఇళ్లు లేవు. గందరగోళంగా ఉంది ఊరి పరిస్థితి. ఎర్రవెల్లి కూడా ఇలానే ఉంటుండే. అందరం కూర్చుని ఆలోచించాం. ఊరు కూలగొట్టి.. కొత్తగా నిర్మిద్దాం అని చెప్పి వారిని ఒప్పించాను. టెంట్లు తెప్పించి ఊరును అందులో పెట్టా. ఆరు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక గృహప్రవేశాలు చేశాం. ఇక్కడ కూడా అలానే జరగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కేసీఆర్. వాసాలమర్రి బీసీలను కూడా ఆదుకుంటాం.. ‘‘ఇక్కడ దళిత వాడలో ఇళ్లు కూడా అలానే ఉన్నాయి. దీన్ని కూడా ఎర్రవెల్లి మాదిరిగానే అభివృద్ధి చేద్దాం. దళితులే కాదు.. ఊరంతా ఉన్న బీసీలు కూడా పేదలుగానే ఉన్నారు. వారిని కూడా ఆదుకుందాం. ఈ గ్రామంలో ప్రభుత్వ జాగా 612 ఎకరాలు ఉంది. దళితుల దగ్గర భూమి తక్కువ ఉంది. దీని గురించి ర్యాప్తు చేయమని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చాను. మరో 100 ఎకరాల భూమి తేలింది. దాన్ని దళితులకు ఇద్దాం. వాసాలమర్రిలో కొత్త చరిత్ర సృష్టించాలి’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘‘దళిత భూముల కమతాలను ఏకీకరణ చేద్దాం. దళిత బంధును పూర్తిగా నిరుపేదలకు తొలుత అందిస్తాం. మీ గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నాను కనుక వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు తక్షణమే దళిత బంధు అందిస్తాం. ఇవాళే జీవో విడుదల చేయిస్తాం. రేపట్నుంచే మీ అకౌంట్లలో రూ. 10 లక్షలు జమ చేస్తాం. దళిత బంధు సొమ్మును వృధా కానివ్వొద్దు’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. దళిత రక్షణ నిధి ఏర్పాటు.. ‘‘ప్రభుత్వం మీకిచ్చే దళిత బంధు సొమ్ములో రూ. 10 వేలు కట్ చేస్తుంది. దానికి ప్రభుత్వం తరఫున మరో 10 వేల రూపాయలు జమ చేస్తాం. ఆలేరు నియోజకవర్గంలో 15 వేల దళిత కుటుంబాలుంటే.. వారందరి నుంచి 10 వేల రూపాయలు కట్ చేసి.. ప్రభుత్వం మరో 10 వేల రూపాయలు జమ చేసి మొత్తం 30 కోట్ల రూపాయలతో దళిత రక్షణ నిధి ఏర్పాటు చేస్తాం. అనారోగ్యం, ప్రమాదాలు జరిగినప్పుడు అయ్యే ఆస్పత్రి ఖర్చులకు వినియోగించేలా దళిత రక్షణ నిధి నుంచి సొమ్ము తీసుకుంటాం. దీని మీద పూర్తి పెత్తనం దళితులదే’’ అన్నారు కేసీఆర్. దళిత బంధుతో పాటు మిగతా అన్ని పథకాలు వర్తిస్తాయి.. ‘‘దళితబంధు ఇచ్చాక ఓ కార్డు ఇస్తాం. దాని ద్వారా మీకిచ్చిన డబ్బును పర్యవేక్షిస్తాం. అలా కాకుండా డబ్బును వృధా చేస్తే.. జనాలు నన్ను తిడతారు. వాసాలమర్రే ఆలేరు నియోజకవర్గానికి ఆదర్శం కావాలి. దళితబంధును సద్వినియోగం చేసే బాధ్యత అక్కచెళ్లమ్మల్లదే. కుటుంబం అంతా కలిసి నిర్ణయం తీసుకుని పట్టు పట్టి.. జట్టు కట్టి.. గెలిచి చూపాలి. మీరే నా అతిపెద్ద ఆయుధం. పది లక్షల రూపాయాల్లో పది పైసలు కూడా వృధా చేయవద్దు. దీని నుంచి సంపాదించిన సొమ్ముతో అభివృద్ధి చెందాలి. నిదానంగా ఆలోచించి.. మంచి ప్రణాళికతో ముందడుగు వేయాలి. వందకు వంద శాతం విజయవంతం చేసి చూపించాలి. దళిత బంధు ఇచ్చామని మిగతా పథకాలను ఆపం. ఇది అదనపు సదుపాయం’’ అన్నారు కేసీఆర్. -
Dalita Bandhu: రూ.లక్ష కోట్లయినా సరే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లైనా, అనేక విజయాలు సాధించినా దళిత జాతి మాత్రం వెనుకబడే ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లోనే వారి కోసం అద్భుతమైన తెలంగాణ దళిత బంధు పథకం తీసుకొచ్చామని తెలిపారు. ‘రూ.లక్ష కోట్లయినా సరే ఖర్చు చేస్తాం. ఆరు నూరైనా దళిత బంధు అమలు చేసి తీరతాం. రాష్ట్రంలో సుమారు 16 – 17 లక్షల దళిత కుటుం బాలు ఉంటే అందులో అర్హత కలిగిన కుటుంబాలు దాదాపు 12 – 13 లక్షల వరకు ఉన్నాయి. వారం దరికీ ఇంటికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. వచ్చే సంవత్సరం నుంచి పెద్దమొత్తంలో డబ్బులు మంజూరు చేసి అమలు చేస్తాం.’ అని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా హాలియాలో సోమవారం నిర్వహించిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రగతి సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రగతి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారివి ఎన్నడూ చేసిన ముఖాలు కావు ‘దళితబంధుపై కొంతమంది అపోహలతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. అయితదా.. పోతదా.. అంటున్నారు. వారివి చేసిన ముఖాలు కావు కాబట్టి, ఎన్నడూ చేయలేదు కాబట్టే అలా మాట్లాడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులను వారి ఖర్మకు వారిని వదిలేశారు తప్ప.. ఎవరూ ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు. పుట్టగతులుండవనే అవాకులు, చెవాకులు దళిత బంధు పథకం తీసుకురావడంతో కేసీఆర్ చెబితే మొండిగా చేస్తారని ఇప్పుడు అందరికీ గుండెదడ మొదలైంది. కొంతమందికి బ్లడ్ ప్రెషర్ వస్తోంది. దళిత బంధు అమలైతే రాజకీయంగా వారికి పుట్టగతులు ఉండవనే భయంతో అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికే గీత కార్మికులను, చేనేత కార్మికులను ఆదుకున్నాం. గీత కార్మికుల పన్ను మాఫీ చేశాం. ఇలా అనేక వర్గాల సంక్షేమం చేపడుతున్నాం. నేనే తెచ్చా .. నేనే పర్యవేక్షిస్తా ఇప్పుడు దళిత వర్గాల కోసం ఈ కార్యక్రమం తెచ్చాం. వాస్తవానికి ఈ పథకం పెట్టమని నాకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. ఎవరూ డిమాండ్ చేయలేదు. తెలంగాణ తెచ్చిన వాడిగా, తెలంగాణ బిడ్డగా నేనే మేథోమథనం చేసి దీనికి రూపకల్పన చేశా. దీనిని నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. తెలంగాణ దళితజాతి భారత దళిత జాతికే ఆదర్శంగా నిలిచేలా చేసి చూపిస్తా. చెప్పినవన్నీ చేసి చూపిస్తున్నాం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఊరికీ నీళ్లు ఇస్తామని చెప్పాం. 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తామన్నాం. రేషన్ కార్డులు, 24 గంటల కరెంటు ఇస్తామని కూడా చెప్పాం. ఏయే మాటలు చెప్పామో అవన్నీ ఆచరించి చూపిస్తున్నాం. గతంలోనూ తెలంగాణ తెస్తామంటే ఎవరూ నమ్మలేదు. అంతా ఇంట్లో పడుకున్నారు. సమైక్య పాలకులు సంచులు మోశారు. కానీ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, నేను చావు అంచులవరకు వెళ్లి తెలంగాణ తెచ్చి చూపించాం..’ అని కేసీఆర్ చెప్పారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గురించి సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్. పక్కన మంత్రి జగదీశ్‌రెడ్డి కృష్ణా నీళ్లలో ఇబ్బంది జరగొచ్చు ‘రాబోయే రోజుల్లో కృష్ణా నీళ్లలో ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే పాలేరు రిజర్వాయర్ నుంచి పెద్దదేవులపల్లి చెరువు వరకు అనుసంధానం చేసి గోదావరి నీటిని తీసుకువచ్చే సర్వే జరుగుతోంది. అది పూర్తయితే రాష్ట్రంలో నాగార్జునసాగర్ ఆయకట్టు సేఫ్‌గా (సురక్షితంగా) ఉంటుంది. గతంలో నీళ్లను మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఆపేస్తే, నేనే వచ్చి 50 వేల మంది ఆయకట్టు రైతాంగంతో కలిసి సాగర్ కట్టపై దండోరా మోగించా. ఏది ఏమైనా కృష్ణా నుంచి మన వాటా తీసుకొని ఖచ్చితంగా సాగర్ ఆయకట్టులో రెండు పంటలు పండించుకునే ఏర్పాటు చేస్తాం. అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఆస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. 7 మెడికల్ కళాశాలలను ఇటీవల మంజూరు చేశాం. అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం..’ అని సీఎం తెలిపారు. సాగర్ ప్రజలు నా మాట నమ్మారు ‘సాగర్ నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతులు. ప్రతిపక్షాల కుక్కిడి పురాణాలు, చెప్పుడు మాటలు వినిపించుకోలేదు. ఎమ్మెల్యేగా భగత్‌ను గెలిపించాలని కోరా. ప్రజలు నా మాట నమ్మి అద్భుతమైన తీర్పును, ఫలితాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికీ తీసిపోని విధంగా నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. ప్రజల దీవెన ఉన్నంత కాలం అదే పద్ధతిలో ముందుకుపోతాం. జానారెడ్డికి గుణపాఠం చెప్పారు రాష్ట్రం ఏర్పడిన మొదట్లో అసెంబ్లీలో చర్చ సందర్భంగా.. రెండేళ్లలో 24 గంటల కరెంటు ఇస్తానంటే ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డి ఎగతాళి చేశారు. రెండేళ్లు కాదు 20 ఏళ్లయినా చేయలేరన్నారు. రెండేళ్లలో చేస్తే తాను గులాబీ కండువా కప్పుకొని టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తానన్నారు. మొన్నటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని పోటీచేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. హాలియా పట్టణం ఉండాల్సినంత గొప్పగా లేదు. రోడ్లు, డ్రైనేజీలు సరిగ్గా లేవు. సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయాలన్న దానిపై మంత్రి, కలెక్టర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో చర్చించి నిర్ణయిస్తారు. నేను హైదరాబాద్‌లో సమీక్షిస్తా. అవసరమైతే మరోసారి సాగర్‌కు వస్తా..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లాలో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ‘జిల్లాలో దాదాపు 15 ఎత్తిపోతల పథకాలను వచ్చే సంవత్సరంన్నర కాలంలో పూర్తి చేస్తా. నెల్లికల్లు లిఫ్ట్‌తో పాటు కుంకుడు చెట్టుతండా లిఫ్ట్ మంజూరు చేశాం. నెల్లికల్లు ద్వారా గరిష్ట స్థాయిలో ఆయకట్టుకు నీరిస్తాం. అలాగే గుర్రంపోడు తండా లిఫ్ట్‌ను సర్వే చేసి మంజూరు చేస్తాం. జిల్లాలో ఎత్తిపోతల పథకాలు ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో విద్యుత్తు అవసరాలు తీర్చేందుకు దేశంలోనే నంబర్ వన్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం. 4 వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంటు దామరచర్లలో రావడం జిల్లా ప్రజలకు గర్వకారణం. పోడు భూముల సమస్య పరిష్కారానికి సిద్ధం భగత్‌ను గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని మాట ఇచ్చా. అందులో భాగంగానే ఇప్పుడు నియోజకవర్గానికి వచ్చా. ఎన్నికల సమయంలో పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చా. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. 2005 కటాఫ్ మేరకు సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం. నందికొండలో ఎన్ఎస్పీ క్వార్టర్లలో నివాసం ఉంటున్న వారికి, ఖాళీ స్థలాల్లో సొంతగా ఇళ్లు కట్టుకున్నవారికి రెగ్యులరైజేషన్ చేసి హక్కు పత్రాలు ఇస్తాం. నందికొండలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. హాలియాలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తాం. రెడ్డి కళ్యాణ మండపానికి భూమిని కేటాయిస్తాం. బంజారా భవనం నిర్మిస్తాం..’ అని సీఎం హామీ ఇచ్చారు. నల్లగొండలో పెద్ద ఎత్తున హరితహారం చేపట్టాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం ప్రసంగానికి అడ్డుతగిలిన మహిళ తిరుమలగిరి (నాగార్జునసాగర్): సమావేశంలో సీఎం ప్రసంగిస్తుండగా సమ్మక్క సారక్కల వన దేవతల పూజారి నాగపురి లక్ష్మీ అడ్డుతగిలారు. పెద్దవూర మండలం పొట్టిచెల్మ క్రాస్‌రోడ్డు సమ్మక్క సారక్క దేవస్థానం వద్ద తాము గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నామని తెలిపారు. అయితే అటవీ అధికారులు తమ గుడిసెలను కూల్చివేసి, కరెంట్ సరఫరా రాకుండా అడ్డుకుంటున్నారంటూ ముఖ్యమంత్రికి చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆమెను స్టేజీ మీదకు తీసుకురావాలని సీఎం ఆదేశించినా.. పోలీసులు ఆమెను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. అలాగే.. కుంకుడుచెట్టు తండాకు చెందిన ఓ గిరిజన రైతు కుంకుడుచెట్టు తండా లిప్టును ప్రారంభించాలని కోరారు. నిధులు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కేసీఆర్ చెప్పారు. ఒక్కసారి చెప్పానంటే 100% అమలు కేసీఆర్ ఒక్కసారి చెప్పారంటే వంద శాతం దానిని అమలు చేసి తీరుతారని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను చెప్పిన పనులన్నీ జరిగాయి. అవి ప్రజల ముందున్నాయి. దళిత బంధు పథకాన్ని కూడా ఆరునూరైనా అమలు చేస్తాం. వచ్చే బడ్జెట్లో మరిన్ని నిధులు ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు వచ్చేలా బడ్జెట్లో పెట్టిన రూ.1,000 కోట్లకు మరో రూ.200 కోట్లు కలిపి అమలు చేస్తాం. వచ్చే బడ్జెట్లో అధిక నిధులను కేటాయించి ప్రతి ఏటా దశల వారీగా అమలు చేస్తాం. సాగర్ అభివృద్ధికి రూ.150 కోట్లు నాగార్జునసాగర్, హాలియా అభివృద్ధికి ఒక్కో దానికి రూ.15 కోట్ల చొప్పున ఇస్తున్నాం. వాటికి అదనంగా రూ.120 కోట్లు ఇస్తాం. మొత్తంగా రూ.150 కోట్లతో సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. కేంద్రానిది వ్యతిరేక వైఖరి.. ఆంధ్రా దాదాగిరీ కేంద్ర ప్రభుత్వం అవలంబించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావచ్చు. ఆంధ్రావాళ్లు చేస్తున్న దాదాగిరీ కావచ్చు. కృష్ణా నీళ్లపై వారు అక్రమ ప్రాజెక్టులు ఎలా కడుతున్నారో ప్రజలంతా చూస్తున్నారు. -
అత్యవసర విచారణ చేపట్టలేం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ‘దళిత బంధు’ పథకంపై ధాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించలేమని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ స్పష్టం చేశారు. లిస్ట్ ప్రకారమే విచారణ జరుపుతామని, అప్పటి వరకు ఆగాలని పిటిషనర్‌కు సూచించారు. కాగా హుజురాబాద్‌లో ‘దళిత బంధు’ పైలెట్ ప్రాజెక్టును నిలుపుదల చేయాలంటూ జనవాహిని పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఉప ఎన్నిక నేపథ్యంలో హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వం, ఈసీతో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తదితరులను పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చారు. అదే విధంగా అత్యవసరంగా తమ పిటిషన్‌ను విచారించాలని కోరారు. అయితే, సోమవారం ఈ పిటిషన్ విచారణకు రాగా.. హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యే పదవికి గంగుల రాజీనామా చేయాలి
సాక్షి, కరీంనగర్‌టౌన్: కరీంనగర్ ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, వెంటనే గంగుల కమలాకర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఇందిరా చౌక్ వద్ద పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే రాజీనామా చేస్తే నగర అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు విడుదల అవుతాయని, 10 వేల దళిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున దళిత బంధు సాయం అందుతుందని పేర్కొన్నారు. గొర్రెలు, బర్రెలు, దళిత బంధు, కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, నిధులు రావాలంటే ఉప ఎన్నిక రావాలన్నారు. హుజురాబాద్‌లో ఉప ఎన్నిక ఉంది కాబట్టే అక్కడ ఇవన్నీ వస్తున్నాయని తెలిపారు. ఉపఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి స్థానిక ప్రజాప్రతినిధులకు ఫోన్ చేస్తారని, టీఆర్ఎస్ నాయకులకు విలువ పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు వైద్యుల అంజన్‌కుమార్, ఎస్ఏ.మోసిన్, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పరి రవి, చర్ల పద్మ, అబ్దుల్ రెహమాన్, మామిడి సత్యనారాయణరెడ్డి, కొమ్ము సునీల్, కమ్రుద్దీన్, కొరవి అరుణ్ కుమార్, కొలిపాక సందీప్, బోనాల శ్రీనివాస్, సయ్యద్ అఖిల్, లింగంపల్లి బాబు, కుర్ర పోచయ్య, ఇర్ఫాన్, సలీమొద్దీన్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, దండి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు రాగానే దళిత బంధు తెచ్చారు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఎన్నికలు రాగానే దళిత బంధు అంటూ సీఎం కేసీఆర్ కొత్త పథకాన్ని తెచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఏడేళ్లలో కేసీఆర్ ఎప్పుడైనా దళిత, గిరిజన నేతలతో సమావేశం పెట్టి ఏమి చేద్దాం అని అడిగారా అని ఆయన నిలదీశారు. దళిత బంధు అమలు చేస్తా.. ఎవడు ఆపుతాడో చూస్తా అన్న సీఎం ఈ పథకాన్ని 119 నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఇందిరాభవన్‌లో జరిగిన పోడు భూముల పోరాట కమిటీ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. దళిత, గిరిజనులకు కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ప్రగతి భవన్ అమ్ముతావో, సెక్రటేరియట్ అమ్ముతావో చెబితే తాము మద్దతు ఇస్తామని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అన్ని గూడేలు తిరుగుతామని, ఆగస్టు 9న ఇంద్రవెల్లిలో దండు కట్టి దండోరా వేస్తామన్నారు. దళిత దండు కార్యక్రమంలో తమకు రూ.10 లక్షలు ఇవ్వాలని, కాంగ్రెస్ కార్యకర్తలు మండలాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. దీంతో టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో చావు డప్పులు మోగాలన్నారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి మాట్లాడుతూ.. కేసీఆర్ దళిత గిరిజనులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన చట్టాలను అమలయ్యేలా మళ్లీ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. గిరిజనులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, ఆదిలాబాద్ నుండి ఖమ్మం జిల్లా వరకు పోడు భూములపై పోరాటం చేస్తామన్నారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. దళిత, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని, హరితహారం పేరుతో కేసీఆర్ గిరిజనుల భూములు గుంజుకుంటున్నారని ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు, చదువులు లేవని ధ్వజమెత్తారు. రైతు బంధు, దళిత బంధులు ఎన్నికల హామీలేనని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, ఎస్టీ సెల్ అధ్యక్షులు జగన్ లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘దళిత బంధు’ అంతటా అమలుచేయాలి: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ గిరిజనులను అనాథలుగా చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్వించారు. భూములపై హక్కులు లేకుండా చేస్తోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. హుజురాబాద్ నియోజకవర్గానికే పరిమితం చేయకుండా రాష్ట్రమంతా దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ఏకవాక్య తీర్మానం చేయాలని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
దళిత బంధు: నెలలో ప్రతిఫలం ఉండే వాటికే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న దళిత బంధు పథకం కింద ఎలాంటి యూనిట్లు ప్రారంభిస్తే సత్ఫలితాలు వస్తాయనే అంశంపై ఎస్సీ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల రెండో వారంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఆలోగా యూనిట్లను ఖరారు కోసం చర్యలు వేగవంతం చేసింది. ఎలాంటి యూనిట్ ప్రారంభించినా నెల రోజుల నుంచే రాబడి వచ్చే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో దాదాపు 47 రకాల యూనిట్లతో ప్రాథమిక జాబితాను రూపొందించింది. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా... మరిన్ని మార్పులు చేయాలని సూచించడంతో ఒకట్రెండు రోజుల్లో తుది జాబితాను ప్రభుత్వానికి సమర్పించనుంది. సత్వర ఆదాయం వచ్చే వాటికి ప్రాధాన్యత... దళిత బంధు కింద ఒక్కో లబ్ధిదారుకు రూ. 10 లక్షల ఆర్థిక సాయాన్ని నేరుగా ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. దీంతో లబ్ధిదారులు ప్రారంభించే యూనిట్లకు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టును సమర్పించాల్సి ఉంటుంది. యూనిట్ విలువ రూ. 10 లక్షలకు సరిపడా ఉండాలి. అయితే క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రాధాన్యతా రంగాలు, ప్రజలకు ఎక్కువ ఉపయోగపడే యూనిట్లను ఉదహరిస్తూ ఎస్సీ కార్పొరేషన్ ఒక జాబితాను తయారు చేసింది. ఇందులో 47 రకాల యూనిట్లు ఉన్నాయి. వ్యవసాయ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, జనరల్ స్టోర్స్, హార్డ్‌వేర్ షాప్స్, వైద్యం, గ్రోసరీస్, భవన నిర్మాణం, ప్లాస్టిక్ యూనిట్లు, స్టీల్, సిమెంట్ స్టోర్స్, ఆహారోత్పత్తి యూనిట్లు, హోటల్, రవాణా రంగాలకు చెందిన యూనిట్లు ఇందులో ఉన్నాయి. సాధారణ యూనిట్లకు భిన్నంగా ఈ యూనిట్లను పూర్తి సౌకర్యాలతో నెలకొల్పేలా ఎస్సీ కార్పొరేషన్ పథకాలను రూపొందించింది. ఉదాహరణకు ఇటుక బట్టీ ఏర్పాటు చేస్తే అందుకు తగినట్లుగా రవాణా సౌకర్యం కింద ట్రాలీని కూడా ఈ యూనిట్‌తో జత చేశారు. మొత్తంగా ప్రభుత్వం సాయం చేసే రూ. 10 లక్షలతో యూనిట్‌ను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ తుది జాబితాకు ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఆయా వివరాలను వెబ్సైట్లో నమోదు చేసి లబ్ధిదారులు యూనిట్లను ఎంపిక చేసుకొని ప్రాజెక్టు రిపోర్ట్ సమర్పించేలా దరఖాస్తు ప్రక్రియ సాగుతుంది. -
‘దళితబంధు’ చట్టవిరుద్ధం.. హైకోర్టులో పిల్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకాన్ని అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. జనవాహినీ పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీల కార్యదర్శులు బి.సంగీత, కాసాని రత్నమాల, ఎ.ఆనంద్‌లు ఈ పిల్ దాఖలు చేశారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు టీఆర్ఎస్ పార్టీ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఈ వ్యవహారాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరారు. ఈ పిల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, సీఎం కేసీఆర్, కేంద్ర ఎన్నికల కమిషన్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. ఆ నియోజకవర్గాల్లో మాత్రమే అమలు చేయాలి... రాష్ట్ర వ్యాప్తంగా 16 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయని, అక్కడ దళిత బంధు అమలు చేయకుండా జనరల్ నియోజకవర్గం హుజూరాబాద్‌లో అమలు చేయడం చట్టవిరుద్ధమని సామాజిక కార్యకర్త అక్కల సురేష్‌కుమార్ మరో పిల్ దాఖలు చేశారు. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 లక్షలు బదిలీ చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. ఈ రెండు పిల్లు వచ్చేవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
CM KCR: దళితబంధు ఆగదు
అన్ని వర్గాలకూ లబ్ధి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే కొద్దీ వరుసగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ వస్తున్నాం. అన్ని వర్గాలకు ప్రయోజనం కలిగేలా చూస్తున్నాం. డైలాగ్‌లు చాలా చెప్పొచ్చు. కానీ వాటిని అమలు చేసి చూపడంలోనే మా నిబద్ధత ఉంది. ఇక్కడి నుంచి దేశాలు కూడా నేర్చుకుని వెళ్తాయి. వారి సంగతి తెలుసు.. తెలంగాణపై అనేక మంది ఉల్టాపల్టాగా మాట్లాడారు. ఉద్యమ సమయంలో ఎవరెవరు ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు. ఉద్యమం చివరలో వచ్చినవారు కూడా మేమే తెలంగాణ తెచ్చామని మాట్లాడుతున్నారు. జానా మాట తప్పారు.. నాకు అబద్ధాలు చెప్పడం, గోల్మాల్ చేత కాదు. నన్ను చంపినా అబద్ధాలు ఒప్పుకోను. దేశంలో ఎక్కడా జరగని ఆవిష్కరణలు ఇక్కడ జరుగుతున్నాయి. రెండేళ్లలో వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ ఇస్తామన్నాం. అదే జరిగితే గులాబీ కండువా కప్పుకుంటానని నాటి ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. మాటతప్పి ఇటీవల నాగార్జునసాగర్ ఎన్నికల్లో పోటీ చేశారు. అదేకాదు కాళేశ్వరం, రైతు బంధు.. ఇలా అనేక విషయాల్లో అనుమానాలు వ్యక్తమైనా అమలు చేసి చూపించాం. – ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘‘ఏనుగు పోతుంటే చిన్న చిన్న జంతువులు అరుస్తాయి. ఏనుగులు వాటిని పట్టించుకోవు. అలాగే మేం కూడా చిల్లర అరుపులను పట్టించుకోకుండా కలగన్న తెలంగాణ సాధన దిశగా ముందుకు సాగుతాం. చిల్లర పంచాయితీలు పట్టించుకోకుండా, పిచ్చి పనులు చేయకుండా అందరి సంక్షేమం, ఆర్థిక బలోపేతం, సంపద పెం చడం, దానిని పంచడం తదితరాల్లో తలమునకలై ఉన్నాం. ఇందులో భాగంగానే దళితబంధును మహాయజ్ఞంలా చేపట్టాం’’ అని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్లో చేరారు. పెద్దిరెడ్డికి సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. కరోనా మూలంగా ఆలస్యం.. ‘‘తరతరాలుగా వివక్షకు గురైన దళిత జాతి కోసం ఎంతో ఆలోచించి గత ఏడాది బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాం. ఏడాది ముందే రావాల్సిన ‘దళిత బంధు’ కరోనా మూలంగా ఆలస్యమైంది. అనువంశిక ఆస్తులు లేకుండా విద్య, వివక్ష, పేదరికాన్ని ఎదుర్కొంటూ.. కాళ్లు, చేతులతో మాత్రమే బతుకుతున్న దళిత కుటుంబాలు లక్షలాదిగా ఉన్నాయి. అలాంటి వారికోసం ఏదో ఒకచోట ‘దళిత బంధు’ ప్రారంభిస్తామంటే కొందరు బాంబులు పడినట్టు భయపడుతున్నారు. విడతల వారీగా ఈ పథకాన్ని వంద శాతం అమలు చేస్తాం. దళితులు 19 శాతం దాకా ఉన్నారు మనిషి చంద్రుడి మీదికి వెళ్లినా దళితులు ఇప్పటికీ కఠిన పేదరికంలో ఉండటం మంచిది కాదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నిరుపేదలు దళితులే. గతంలో వారికి దోచిపెట్టామని ఇతరులు అసూయపడేంత ప్రచారం చేశారు. రాష్ట్రంలో దళితులు 15శాతం ఉన్నారనుకుంటే.. వాస్తవంగా 18 నుంచి 19శాతం వరకు ఉన్నట్టు తేలింది. వారికోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామంటే విపక్ష నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నా దగ్గర ఇలాంటివి రెండు మూడు పథకాలు ఉన్నాయి. అవి అమలైతే ప్రతిపక్షాల పని ఖతమైతుందని గతంలోనే అసెంబ్లీ వేదికగా చెప్పిన. ‘దళిత బీమా’కు కొంత సమయం పడుతుంది రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు కూడా రూ.5లక్షల బీమా సదుపాయం వస్తుంది. అదే తరహాలో దళితులకు కూడా బీమా అమలు చేస్తాం. ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున 3 వేల మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించి.. ఏడాది పాటు రైతుల వివరాలను సేకరించాకే రైతు బీమా అమలు చేశాం. వారం పదిరోజుల్లోనే బాధిత కుటుంబానికి పరిహారం అందేలా ఒక వ్యవస్థను రూపొందించాలని చేనేత శాఖను ఆదేశించాం. అదే తరహాలో ఎస్సీ సంక్షేమ శాఖకు కూడా దళితబీమా సదుపాయం కల్పించేందుకు కొంత సమయం పడుతుంది. ఎక్కడా లేనిస్థాయిలో సంక్షేమ పథకాలు తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. కరోనా సమయంలోనూ వ్యవసాయ రంగం జీఎస్డీపీకి 17శాతం సమకూర్చడంతో నిలదొక్కుకున్నాం. ఆర్థికంగా వెనుకబడి, సామాజిక వివక్ష ఎదుర్కొంటూ, ప్రతిఫలాలు అందుకోలేని వారి కోసం పకడ్బందీగా కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. గీత, చేనేత, మత్స్య, రజక, నాయీ బ్రాహ్మణ తదితర రంగాలకు చెందిన వారికోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఎంబీసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాం.’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. పెద్దిరెడ్డి, మరికొందరు నేతలు.. మాజీ మంత్రి పెద్దిరెడ్డితోపాటు టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ స్వర్గం రవి, హుజూరాబాద్ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ పి.కిషన్‌రెడ్డి, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న కోటి తదితరులు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, పాడి కౌశిక్‌రెడ్డి, కశ్యప్‌రెడ్డి, వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ నన్ను పిసినారి అన్నారు కొత్తలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అయోమయం నెలకొన్న స్థితిలో వెయ్యి రూపాయలు సామాజిక పింఛన్‌గా ఇచ్చాం. సీఎం కార్ల రంగు మార్చడానికి కూడా ఎంతో ఆలోచించాం. అప్పటి గవర్నర్ నరసింహన్ ఈ విషయాన్ని ప్రస్తావించి.. నన్ను పిసినారి అని కూడా అన్నారు. ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ జాగ్రత్తగా పాలన చేస్తున్నాం కాబట్టే ఈ రోజు దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగాం. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలను చూసి మహారాష్ట్రలోని 45 గ్రామాలు తమను తెలంగాణలో విలీనం చేయాలని తీర్మానించాయి కూడా. తెలంగాణ మరో కాశ్మీర్ తెలంగాణలో ఆకలిచావులు, ఆత్మహత్యలు లేవని పార్లమెంటు వేదికగా కేంద్రమంత్రి ప్రకటించారు. ఎరువులు, విత్తనాలు దొరక్క చిన్నాభిన్నమైన రైతాంగాన్ని ఆదుకునేందుకు రైతుబంధు, ఉచిత విద్యుత్, బీమాతో పాటు అనేక వసతులు కల్పించాం. కోటి ఎకరాల్లో 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి రావడంతో పాఠశాలలు, కాలేజీలను కూడా గోదాములుగా మార్చాం. పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ కాశ్మీర్ ఖండం అవుతుంది. బట్టకు పొట్టకు చావుండదు. చిల్లర వాదనలకు అతీతంగా అన్ని వర్గాల కోసం జరుగుతున్న ప్రస్థానాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. వారికి కామన్సెన్స్ ఎక్కువ. ఈ ప్రస్థానాన్ని ప్రజలు కాపాడుకుంటారు తల్లిదండ్రులకు సేవ చేయాలి ప్రభుత్వ ఉద్యోగులు కొందరు లక్ష రూపాయల జీతం వచ్చినా తల్లిదండ్రులను చూసుకోవడం లేదు. తల్లిదండ్రులు దేవుళ్లతో సమానం. ప్రపంచంలో తల్లిదండ్రులను తప్ప దేన్నయినా కొనుక్కోగలం. మనలోనూ అలాంటి వారు ఉంటే మారాలి. తల్లిదండ్రులకు సేవ చేయనోడు దేశాన్ని బాగు చేస్తాడా? -
‘ఈటల ఆక్రమించిన భూముల్లో జెండాలు పాతుతాం’
హైదరాబాద్: మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ దళితులకు క్షమాపణ చెప్పాలని.. సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ.. ఇప్పటికైన ఈటల దళితుల నుంచి అక్రమంగా లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేయాలని లేకుంటే ఆ భూముల్లో జెండాలు పాతుతామని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగా దళిత బంధు పథకానికి మద్దతుగా ప్రచారం చేస్తామని తెలిపారు. ఈటల చేస్తున్న మోసాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు. కాగా, హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీన ర్యాలీలు, ప్రచారాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
‘దళిత బంధు’ కాదు.. ఎన్నికల బంధు
సాక్షి, వర్ధన్నపేట(వరంగల్): దళిత సాధికారత పేరుతో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందేందుకు దళిత బంధు పథకం అంటూ దళితులను మరోసారి మోసం చేసేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని, అది దళిత బంధు కాదని ఎన్నికల బంధు అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు దుయ్యబట్టారు. మంగళవారం వర్ధన్నపేట పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కనీసం దళిత రిజర్వేషన్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయాలని, తదుపరి రాష్ట్రంలో ఉన్న దళితులందరికి వర్తింప చేసి తమ చిత్త శుద్ది చాటుకోవాలని అన్నారు. పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో కాకుండా దళిత రిజర్వేషన్ నియోజకవర్గంలో చేపట్టే విధంగా మంత్రులు చొరవ తీసుకోవాలని హితవు పలికారు. ఎన్నిక ముందే సీఎం కేసీఆర్‌కు పథకాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. అధికారులు సైతం పార్టీ కార్యకర్తలుగా పని చేస్తున్నారని ఆరోపించారు. సమ్మెట సుధీర్, బంగారు సదానందం, బెజ్జం పాపారావు పాల్గొన్నారు. ‘కోడ్’ కు ముందే పది లక్షలు పంపిణీ చేయాలి రాయపర్తి: ఎలక్షన్ కోడ్ రాకముందే హుజురాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందించి ఎన్నికలకు వెళ్లాలని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నయా మోసానికి కేసీఆర్ శ్రీకారం దుగ్గొండి: హుజూరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నయా మోసానికి శ్రీకారం చుట్టారని బీఎస్పీ నాయకుడు గజ్జి దయాకర్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఎస్సీ ఓట్లు కొల్లగొట్టడానికి దళిత బంధు పథకం తీసుకువచ్చారన్నారు, ఏడేళ్లుగా గుర్తుకు రాని ఎస్సీలు ఇప్పుడు గుర్తుకు రావడానికి ప్రజలు గమనించాలన్నారు. మోసాలు, మాయలతోనే ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని ఏనాటికయినా ప్రజలు గుర్తించి తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. -
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరెస్ట్
సాక్షి, నల్లగొండ: మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన ‘దళిత బంధు’ పథకాన్ని మునుగోడు నియోజకవర్గ దళితులకు కూడా వర్తింప చేయాలని కోరుతూ.. రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి బుధవారం మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యలపై రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల అరెస్ట్‌ను ఖండించారు. అధికారం అడ్డుపెట్టుకుని అక్రమ నిర్బంధాలు సరికాదని సూచించారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ మొత్తం అమలు చేయాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇక ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగం అడ్డుకుని రభస చేశారని ఎమ్మార్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వో గిరిధర్ ఫిర్యాదుతో రాజగోపాల్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.