సాక్షి, హుజూరాబాద్: హుజూరాబాద్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక.. యావత్ తెలంగాణ ఎన్నికగా మారింది. ఈ క్రమంలో అధికార, విపక్షాలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మతకంగా తీసుకున్నాయి. గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి పార్టీలు. హుజూరాబాద్ ఎన్నిక టీఆర్‌ఎస్, బీజేపీ ఎలక్షన్‌గా మారింది. ఇప్పటికే టీఆర్‌ఎస్ తరఫున రంగంలోకి దిగిన హరీశ్‌రావు.. బీజేపీపై భారీ ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరఫున రంగంలోకి దిగిన మంత్రి హరీశ్‌రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు భారీ సవాల్ విసిరారు హరీశ్‌రావు. దళితబంధుకు కేంద్రం నుంచి నిధులు తెస్తే.. మోదీ ఫోటోకు పాలాభిషేకం చేస్తానన్నారు హరీశ్‌రావు. శనివారం ఎన్నికల ప్రచారంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘‘ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు ఇస్తాం. రైతుబంధుపై దుష్ప్రచారం చేసినట్లే.. దళితబంధుపై కూడా చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. దళితబంధు ఇచ్చి తీరుతాం. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వాలి.. దళితబంధుకు కేంద్రం నిధులు ఇస్తే మోదీకి పాలాభిషేకం చేస్తాం’’ అన్నారు మంత్రి హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment